13-04-2026, 10:57 AM
(This post was last modified: 13-04-2026, 11:48 AM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
వారం రోజులకి గోపీ, జఫర్ ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఒకే రూములో సర్దుకుపోయారు. జఫర్ జోలికి ఎంత తక్కువ వెళితే అంత మంచిదని అర్ధమైంది గోపీకి, ఒకరోజు నీకు మీసాలు రావా అని అడిగితే కొట్టినంత పని చేసాడు. వాడు మంచి మెకానిక్ అని అర్ధమైంది, టాటా మోటార్స్ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ విభాగంలో రాజారావు నియమించాడు. పర్సనల్ గా ఏదో ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాడని తెలిసింది గోపీకి.
మనవడికి బండి కొనిచ్చాడు రావు. జఫర్,గోపి ఇద్దరు కలిసి వచ్చి వెళ్తున్నారు. ఇద్దరు బండి మీద ఇంటి వరకు వచ్చి అక్కడ నుంచి రావు గారి కారులో ఆఫీసుకి వెళతారు. సాయంత్రం మళ్ళీ కారులో ఇంటి వరకు వచ్చి రావు గారిని డ్రాప్ చేసి ఇక్కడనుంచి బండి మీద ఇంటికి వెళతారు. ఈ మధ్య అమృత కూడా తరచూ వీళ్లతోనే ఆఫీసుకి వెళుతుంది. దానికి కారణం కూడా ఉంది, ఇంతవరకు తమ పిల్లల్లో ఎవ్వరు రాజారావుకి దెగ్గర కాలేదు, కాస్తో కూస్తో అమృత పక్కన ఉండేది. ఏదో ఒకరోజు తనని తాను నిరూపించుకుని తాతయ్యకి వారసురాలిగా కంపెనీని, ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న కోరిక అమృతది. ఇప్పుడు ఎవ్వరు ఊహించనట్టుగా గోపి తాతయ్య పక్కన చేరాడు. గోపీని ఎవ్వరు పట్టించుకోకపోయినా కనీసం వాళ్ళిద్దరి మధ్యా సంబంధం ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అన్న అనుమానంతో అమృత కూడా వీళ్ళకి దెగ్గరగా ఉంటుంది.
***
శుక్రవారం తల స్నానం చేసి బైటికి వచ్చాడు గోపి. ఎప్పటిలానే జఫర్ ముందే రెడీ అయ్యి కూర్చున్నాడు. జఫర్ ఎన్ని సార్లు చెప్పినా గోపీ పట్టించుకోడు. బాత్రూంలోనే బట్టలు వేసుకుని రమ్మంటే నవ్వుతాడు. మంచి మూడ్‌లో ఉంటే ఉన్న టవల్ కూడా విప్పి డ్రాయర్ మీదే రెడీ అవుతాడు. ఈ ఘోరాలన్నీ చూడలేక జఫర్ మొహం కప్పుకుని బైటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే గోపీని చచ్చేలా కొడతాడు జఫర్. గోపీకి కూడా వాడేం చేసినా నవ్వులాటగానే ఉంటుంది. జఫర్ కోపంతో కూడుకున్న మొహం, వాడి పీల గొంతు, వాడి ప్రవర్తనా.. ముందు వింతగా అనిపించినా తరువాత మొదలైన స్నేహంతో చూస్తే అవన్నీ పిల్లతనంగా కనిపించి నవ్వుకుంటాడు.
గోపీ రెడీ అవుతుంటే చూస్తున్నాడు జఫర్. ఏంటి ఇవ్వాళ హుషారుగా ఉన్నావ్ అని అడిగితే ఇవ్వాళ నా పుట్టినరోజురా అని పాట పాడుతూనే చెప్పాడు గోపీ. ఓహ్హ్ అంటూనే లేచి చెయ్యి ఇచ్చాడు జఫర్. ఇద్దరి చేతులు కలుసుకున్నాయి. గోపీ ఆపకుండా చేతిని పిసుకుతుంటే ఎడమ చేత్తో కడుపులో ఒక్కటి గుద్దాడు. దేనికిరా గాడిదా అని తిడితే వెనక్కి తిరిగి వాడి ఎర్రని పెదాలతో నవ్వుకుని పక్కకి వచ్చేశాడు. ఇద్దరు కలిసి ఆఫీసుకి బైలుదేరారు. ఒక్కనిమిషం ఆగు అంటే ఆగాడు గోపి.. జఫర్ వచ్చి నోరు తెరువు అంటే తెరిచాడు, జఫర్ తన చేతిలో ఉన్న చెక్కరని గోపీ నోట్లో పోసి హ్యాపీ బర్తడే అని ముందుకు నడుస్తుంటే గోపీకి ఎమోషనల్ అనిపించింది. జఫర్ వెనక నడుస్తూ వాడి భుజాలు రెండు పట్టుకుని నొక్కి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని ఇంకా దెగ్గరికి వస్తుంటే గోపి డొక్కలో గుద్దాడు జఫర్. గాడిదా.. అమ్మా.. అని గోపి వెనక నడుస్తుంటే జఫర్ సిగ్గు పడుతూ వేగంగా కిందకి వెళ్ళిపోయాడు.
తాతయ్య దెగ్గరికి వచ్చాక ఆయన వెళదామా అని అడిగితే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని ఇంట్లోకి వెళ్ళాడు. పైన అమ్మ గది తలుపు మీద కొడితే అది తీసే ఉంది. కమిన్ అంది జనని. ఆమె అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంది, అద్దంలో చిన్న కొడుకుని చూసి వెనక్కి తిరిగి చూసింది. ఓ క్షణం కొడుకు వంక చూసి ఏంటి అని కళ్ళు ఎగరేస్తే ఏమి లేదన్నాడు. జనని మళ్ళీ అద్దం వైపు తిరిగి మేకప్ లో మునిగిపోతుంటే గోపి బైటికి వచ్చేశాడు. జగపతిరావు కూడా అప్పుడే స్నానం చేసి వచ్చాడు. జనని గోపి వచ్చిన సంగతి చెప్పింది. ఏంటటా ? aని అడిగితే ఏమి చెప్పలేదు, డబ్బులు ఏమైనా కావాలేమో అంది. ఇచ్చావా అంటే లేదు వెళ్ళిపోయాడు అంది. ఇద్దరు రెడీ అవ్వడంలో మునిగిపోయారు.
అమ్మ దెగ్గర నుంచి పెద్దనాన్న కూతురు రమ్య అక్క గదికి వెళితే గోపిని చూసి పలకరించింది. మాట్లాడాక వెళ్లిపోతుంటే గోపీ.. అని పిలిచింది, వెనక్కి తిరిగి చూసాడు. నాకు గుర్తులేదనుకున్నావా అని నవ్వుతూ దెగ్గరికి వచ్చి వాటేసుకుంటూ హ్యాపీ బర్తడే అంది. థాంక్స్ అన్నాడు గట్టిగా పట్టుకున్నాడు. నీకో చిన్న గిఫ్ట్ అని టేబుల్ దెగ్గరికి వెళ్లి బాక్స్ తెచ్చి ఇచ్చింది. తెరిచి చూస్తే వాచ్ ఉంది. థాంక్స్ అక్కా అని చేతికి పెట్టుకున్నాడు. బాగుంది అంటే బుగ్గ గిల్లింది. గోపి వాచ్ చూసుకుంటూ నవ్వుతూ బైటికి వస్తుంటే అప్పటికే జఫర్ చెప్పేసినట్టున్నాడు. తాతయ్య, అమృత ఇద్దరూ విషెస్ చెప్పారు. ముగ్గురిని ఆఫీసులో దించేసాక అటు ఇటు తిరుగుతుంటే ప్రీతి కనిపించింది. ఏమైందండీ ప్రీతీ గారు, ఆ రిసెప్షన్ టేబుల్ వదిలి రారు కదా ఏమైంది అని అడిగాడు. ప్రీతీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే ఆమె మొహంలో కంగారు చూసి స్వర్ణకి ఓ సారి హాస్పిటల్‌కి వెళ్లి రమ్మని మెసేజ్ పెట్టాడు.
అలా రావుని వదిలాడో లేదో, ఆయన నుంచి ఫోను రాగానే మళ్ళీ లోపలికి వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు గోపి. చెప్పరా.. అంటే ఏముంది చెప్పడానికి అన్నాడు.
ఏమిచ్చింది మీ అమ్మ, వాచ్ బాగుంది.
ఇది రమ్యక్క ఇచ్చింది
రావుకి అర్ధమైంది, సరే ఏం కావాలో అడుగు ఇస్తాను
డెబ్భై లక్షలు కావాలి
ఎందుకురా !
విష్ణు అన్న బర్తడేకి మూడు కోట్ల కారు ఇచ్చావ్. అమృతకి కోటిన్నర పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిచ్చావ్. పవన్ గాడికి కోటి రూపాయల కారు. రఘు అన్నకు కూడా.. అని లిస్ట్ చదువుతుంటే సరే అన్నాడు రావు. కానీ కాష్ ఎందుకు అంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా అన్నాడు. గోపీతో కష్టమని తెలిసి చెక్ రాసి ఇచ్చేసాడు. అలానే రేపటి నుంచి పర్సనల్ సేకరేటరీ బాధ్యతలు కూడా నీవే అంటే చెక్ ఇచ్చిన ఆనందంలో సరే అన్నాడు
జఫర్ ఎలా ఉన్నాడు ?
వాడికేం.. ఎక్కడున్నా బతికేస్తాడు.
వాడి గురించి నీతో మాట్లాడాలి.. తను అబ్బాయి..
సాయంత్రం చెప్పు. చాలా పనులున్నాయి అని లేచాడు గోపి. చెప్పేది వినరా అంటే సాయంత్రం వింటాలే.. అయినా వాడి గురించి భయపడాల్సిన పనిలేదు, నాకు బెస్ట్ ఫ్రెండులా అయిపోయాడులే.. అదీ కాకా మంచి మెకానిక్ అని కూడా విన్నాను. నువ్వేం కంగారుపడకు.. వాడిని నేను చూసుకుంటాలే అని చెక్కు చూసుకుంటూ సంతోషంగా బైటికి పరిగెత్తాడు.
వీడొకడు.. అన్నిటికి తొందర ఎక్కువే.. వాడు అబ్బాయి కాదని చెపుదామనుకుంటే వినిపించుకోకుండా పోయాడు. అయినా ప్రస్తుతానికి ఇద్దరికీ అదే మంచిదిలే.. ఒకే గదిలో ఉంటున్నారు. ఏదైనా తప్పు జరిగితే పైకి పోయాక రెహ్మాన్ గాడు నా తాట తీస్తాడు. తరువాత జఫర్ గురించి నిజం తెలిసిన రోజున మనవడు మొహం ఎర్రిపువ్వులా పెడతాడేమో అనుకుని నవ్వుకుంటూ పొద్దున ప్రీతీ ఇచ్చిన ఫైల్స్ చేతిలోకి తీసుకున్నాడు రాజారావు .


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)