Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Comedy హాస్య కథలు - సుట్టకోసం

రంగమ్మ వ్యాధి

[img=1x1]file:///C:/Users/user/AppData/Local/Temp/msohtmlclip1/01/clip_image003.gif[/img][Image: R.jpg]

---జ్యోతి మువ్వల
 
ఇంటిలోకి అడుగుపెట్టిన వెంటనే పక్కనున్న పెరటిలో బట్టలు ఉతుకుతూ అటుగా తిరిగి ముసుగు వేసుకున్న వ్యక్తిని చూసి ఎవరబ్బా? ఈ కొత్త వ్యక్తి అని అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది రంగమ్మ.
కొంపదీసి అమ్మగారు కొత్త పనివాడిని పెట్టేసుకున్నారా ఏంటి? అని ఆలోచిస్తూ 
అయ్యో అయ్యో ఒక రెండు రోజులు రాకపోతే అప్పుడే కొత్తపని వాడిని పట్టేసుకుంటారా అమ్మగారు
అంటూ శోకాలు పెట్టుకుని ఇంటిలోకి వచ్చింది రంగమ్మ!
అప్పుడే పూజ ముగించుకొని పూజ గదిలో నుంచి బయటకు వస్తున్న భాగ్యం 
"అబ్బా! ఏంటే తెల్లారు నీ గోల" ముందు ఆ శోకాలు ఆపు 
వారం రోజుల నుంచి అడ్రస్ లేకుండా పోయావు. ఒక కబురు లేదు కాకరకాయ లేదు" అని మండిపడింది.
"ఎన్నిసార్లు సెలవులు పడతావు. నేను చేసుకోలేక నిన్ను పెట్టుకున్నాను. నువ్వేమో వారంలో రెండు రోజులు రావు. ఇప్పుడు ఏకంగా వారం రోజులు డుమ్మా కొట్టావు.
 ఇలా అయితే నాకు కుదరదు అని గట్టిగా చెప్పింది భాగ్యం."
"ఏం సేయను అమ్మ! రాత్రులు నిద్ర పట్టదు. ఒక్కోపాలి రేతిరంతా కళ్ళు నిలబడి పోతాయి. కాలు చేతులు ఒకటే సొలుపులు. ఆరోగ్యం బాగోలేక రాలేకపోతున్నాను గానీ కావాలని మానేతున్నానా? అర్థం చేసుకోండి అమ్మగారు అని అంది రంగమ్మ."
 
"బాగుందే సంబరం అలాంటప్పుడు ఎందుకు నీకీ పని, చక్కగా ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యం చూసుకో రాదు.నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావ్ అంటూ మొఖం తిప్పుకుంది భాగ్యం".
 
"ఇల్లు గడవాలంటే ఏదో పని చేసుకో పోతే ఎలా అమ్మగారు. నేను పడుకుంటే నాలుగు మెతుకులు పెట్టే నాధుడే లేడు. నా మొగుడు సక్కగుంటే నాకెందుకీ పాటులు. ఆ తాగుబోతు సచ్చినోడు తాగి ఎక్కడ పడిపోతాడో... ఎటో, కాయకష్టం చేసుకోకపోతే మా బతుకులు సాగేదేంట చెప్పండి. అస్సలు ఒంట్లో బాగోక ఇంటి దగ్గరే పడుకొని ఉంటే మా చెల్లెలు డాక్టర్ దగ్గరికి తోలుకొని పోయింది.డాక్టర్ బోలెడు టెస్ట్ల రాశాడు.
 
 రిపోర్ట్స్ అన్ని చూసి చక్కెర వ్యాధి అని చెప్పాడు. రక్తంలో ఏవో తగ్గిపోయాయి అంట. నాలుగురోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాడు. అందుకే రాలేకపోయాను అమ్మ" అని దీనంగా మొహం పెట్టి చెప్పింది రంగమ్మ.
 భాగ్యం మాత్రం ఏమాత్రం కనికరించలేదు. "ఏవో సాకులు చెబుతావులే. నీ మాటలు ఎప్పుడు నమ్మాలి! అని నిష్టూరంగా మాట్లాడింది భాగ్యం."
 
"ఈ ఒక్క పాలి క్షమించండి అమ్మా!" అని బతిమాలుతుంది రంగమ్మ. బయటనుండి భాగ్యం, రంగమ్మ సంభాషణంతా వింటున్నాడు దుర్గారావు.
"సర్లే! ఇదే ఆఖరి సారి. మళ్లీ సెలవు పెట్టావ్ అనుకో ఊరుకునేది లేదు అని గదామాయించింది భాగ్యం.
 
భాగ్యం మాటలకి చిన్నబుచ్చుకున్న ఎట్లాగోల కరుణించారు అంతే చాలు అని మనసులో అనుకుని గబగబా పేరటిలోకి వెళ్ళింది రంగమ్మ. అంతలోనే అవును ఈ ముసుగు మనిషి ఎవడు? ఇందాక ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇక్కడే చూశాను. ఒక్క రెండు రోజులు పనికి రాకపోతే నా పనినే లాగేసుకుంటాడా? వీడి పని చెప్తాను చూడు ,ఈ రంగమ్మ పనిలోనే వేలు పెట్టాలి అంటే ఆడికి ఎన్ని గుండెలు ఉండాలా? అని చుట్టూ చూసింది. బన్నీలు వేసుకొని లింగి కట్టుకొని ముసుగులో బట్టలు ఉతుకుతున్న దుర్గారావుని వెనక నుండి వెళ్లి అమాంతం జబ్బ పైన చర్చింది రంగమ్మ.
 
 దెబ్బకి కళ్ళు వూడోచ్చినంత పనయింది దుర్గారావుకి. కోపంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు దుర్గారావు. దుర్గారావుని చూసిన రంగమ్మకి పై ప్రాణాలు పైనే పోయాయి. పట్టపగలే చుక్కలు కనిపించాయి. "అయ్యగారు మీరా... తప్పై పోనాది! క్షమించండి అని కాళ్ళ మీద పడింది. ఎవడో కొత్త పని వాడు అనుకున్నాను." అని గజగజ వణికి పోసాగింది.
 
 "ఆ నీకేం, నీకు కావలసిన అన్ని రోజులు సెలవులు పెట్టుకుంటావ్". "ఇక్కడ బలైపోయింది నేనే కదా!నువ్వు సెలవు పెట్టి నప్పుడల్లా నాతో సెలవు పెట్టించి మొత్తం ఇంట్లో పని చేయిస్తుంది మీ అమ్మగారు 
పైగా నా జబ్బ ఉడివచ్చేలా నన్నే కొడతావా ?" అని బావురుమన్నాడు దుర్గారావు.
 
దుర్గారావు పరిస్థితికి జాలిపడింది రంగమ్మ. ఊరుకొండి బాబు గారు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు.
"ఎప్పుడూ తెల్ల చొక్కా లాగు వేసుకొని రాజకీయ నాయకుడులాగా హుందాగా ఉండే మిమ్మల్ని ఈ బట్టల్లో చూసి పోల్చుకోలేక పోయాను అయ్యగారు అంది రంగమ్మ." అదా! ఏం చేయమంటావ్? మీ అమ్మగారికి తింటే ఆయాసం తినకపోతే నీరసం. మరి తప్పదు నాకు అందుకే ఎవరు గుర్తు పట్టకూడదని ఈ అవతారంలో పని చేసుకుంటున్నాను" అని వాపోయాడు దుర్గారావు.
 
క్షమించండి బాబు గారు! తప్పై పోయింది. షుగరు వ్యాధి వల్ల ముడుకులు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. మా అయ్యాకి ,అమ్మకి ఇదే జబ్బు ఉందంట. ఈ మధ్యే తెలిసింది. ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా రోగాలు మాత్రం వారసత్వంగా వస్తాయి అంట కదా! తెల్లారగట్ల లేవలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్లాను, అందుకే రాలేక పోయాను అని చెప్పింది రంగమ్మ.
 
 రంగమ్మ బాధను విన్న దుర్గారావు ఇంటి లోపలికి వెళ్లి ఒక మాత్రని తెచ్చి ఇదిగో రంగమ్మ అని ఇచ్చాడు.
అది చూసి రంగమ్మా !" ఏంటి బాబు ఇది? ఎందుకు" అని అడిగింది. రోజు ముడుకులు నొప్పులు ఒళ్ళు నొప్పులుతో బాధపడుతున్నాను అంటున్నావు కదా. ఈ మాత్ర వేసుకుంటే నీకు ముడుకులు నొప్పులు ఒళ్ళు నొప్పులు పోతాయి. చక్కగా రాత్రి పూట నిద్ర పడుతుంది. మనిషికి మంచి నిద్రే ఆరోగ్యం. శరీరానికి తగినంత నిద్ర, వ్యాయామం లేకపోతే అనారోగ్యమే వస్తుంది. వేల పట్టున తిండి కూడా చాలా అవసరం.
 
 ఇళ్ళల్లో పని చేసుకొని సమయానికి తినక పోవడం వల్లే నీకు ఈ వ్యాధి వచ్చి ఉంటాది. వేల తప్పి భోజనం చేయడం కొవ్వు పదార్థాలు, మాంసాహారాలు తినటం వల్ల నీకు వచ్చి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వంశ పరంగా కొన్ని అనారోగ్యాలు సంక్రమించిన తగిన జాగ్రత్తలు తీసుకొని అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ మాత్ర రంగమ్మ కి ఇచ్చాడు.
ఇంతలో భాగ్యం ఏంటి అక్కడ కబుర్లు పని అయిందా లేదా అని కేక వేసింది. టక్కున ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు.
 
అలా కొన్ని రోజులు పోయిన తర్వాత రంగమ్మ చాలా చలాకీగా పని చేసుకుంటుంది. ఈ మధ్య సెలవులు కూడా పెట్టడం లేదు. ఒకరోజు దుర్గారావు ఏంటి రంగమ్మ ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అని అడిగాడు. మీరు ఇచ్చిన మందు బాగా పని చేసింది బాబు గారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. అని చెప్పింది. ఆ మాట విని దుర్గారావు ఫక్కున నవ్వాడు. దుర్గారావు అలా నవ్వడం చూసి ఎందుకు నవ్వుతున్నాడో రంగమ్మ కి అర్థం కాలేదు.
ఎందుకు బాబు అలా నవ్వుతున్నావ్ అని అడిగింది.
మరేం లేదు రంగమ్మ... నేను నీకు ఇచ్చింది ఒళ్ళు నొప్పులు మాత్ర! అది వేసుకోగానే నీ ఒళ్ళు నొప్పులు తగ్గి పోయాయి.దానికి తోడు సమయానికి ఆహారం తీసుకుంటున్నట్లు ఉన్నావ్, మంచిగా పడుకుంటున్నావు అందుకే నీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన మనసు దేనినైతే ఆలోచిస్తుందో అదే మనకి తిరిగి వస్తుంది. మానసిక ఆరోగ్యం మనిషిని కుంగదీస్తుంది.
 
ఆ మాత్ర వేసుకోవడం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని భావిస్తున్నావు అందుకే నీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. అని చెప్పాడు. ఆ మాట విని రంగమ్మ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టింది. మన శరీరానికి మన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే శక్తి ఉంటుంది. ఈ మాత్రలు మన శరీరంలోని భాగాలకు తమ వంతు పని చేసుకునే శక్తిని కోల్పోతే పని చేసుకోవడానికి సాయంగా మాత్రమే నిలుస్తాయి. ఈ విషయం తెలియక చాలామంది మాత్రలు వేసుకోవడం వల్లే ఆరోగ్యం కుదుటపడిందని భావిస్తారు. నాచురల్గా శరీరం బాగు పడాల్సిన స్థితిని కోల్పోయి ఈ మందుల ఆధారంగానే శరీరభాగాలు పనిచేయడం మొదలుపెడతాయి. అందుకే ఎక్కువగా మందులు వాడకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో మోతాదులో తీసుకోవడం మంచిది అని చెప్పాడు.
అయ్యగారు మీరు చాలా గొప్పవారు అండి. ఈరోజు మీవల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి అని సంతోషపడింది. సర్లే మళ్లీ నా జబ్బా విరగకొట్టకుండా ఉంటే చాలు అన్నాడు దుర్గారావు. భాగ్యం, రంగమ్మ ఫక్కున నవ్వారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
హాస్య కథలు - సుట్టకోసం - by k3vv3 - 15-06-2024, 02:58 PM
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - బాబోయ్ ఫోనొచ్చింది - by k3vv3 - 17-06-2024, 04:41 PM
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - బాబోయ్ ఫోనొచ్చింది - by k3vv3 - 17-06-2024, 04:42 PM
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - బాబోయ్ ఫోనొచ్చింది - by k3vv3 - 17-06-2024, 04:43 PM
RE: హాస్య కథలు - బాబోయ్ ఫోనొచ్చింది - by sri7869 - 17-06-2024, 05:49 PM
RE: హాస్య కథలు - బాబోయ్ ఫోనొచ్చింది - by k3vv3 - 28-06-2024, 05:03 PM
RE: హాస్య కథలు - బాబోయ్ ఫోనొచ్చింది - by TheCaptain1983 - 01-07-2024, 02:36 AM
RE: హాస్య కథలు - దొంగ గారి పెళ్ళి - by sri7869 - 29-06-2024, 01:32 PM
RE: హాస్య కథలు - దొంగ గారి పెళ్ళి - by k3vv3 - 03-07-2024, 05:10 PM
RE: హాస్య కథలు - కథల్లేవూ - by sri7869 - 04-07-2024, 12:28 AM
RE: హాస్య కథలు - బ్లెస్ మై రిక్షావాలా..! - by k3vv3 - 12-07-2024, 11:54 AM
RE: హాస్య కథలు - బ్లెస్ మై రిక్షావాలా..! - by sri7869 - 13-07-2024, 04:45 PM
RE: హాస్య కథలు - పూర్ణారావు - పూతరేకులు - by k3vv3 - 24-07-2024, 09:36 PM
RE: హాస్య కథలు - పూర్ణారావు - పూతరేకులు - by TheCaptain1983 - 25-07-2024, 05:44 AM
RE: హాస్య కథలు - పూర్ణారావు - పూతరేకులు - by sri7869 - 25-07-2024, 11:16 AM
RE: హాస్య కథలు - పూర్ణారావు - పూతరేకులు - by Uday - 29-07-2024, 06:33 PM
RE: హాస్య కథలు - పూర్ణారావు - పూతరేకులు - by k3vv3 - 16-08-2024, 01:54 PM
RE: హాస్య కథలు - తోటకూర - by sri7869 - 17-08-2024, 10:30 AM
RE: హాస్య కథలు - బాబాయి గారి భోషాణం - by k3vv3 - 24-08-2024, 02:08 PM
RE: హాస్య కథలు - బాబాయి గారి భోషాణం - by sri7869 - 24-08-2024, 05:13 PM
RE: హాస్య కథలు - బాబాయి గారి భోషాణం - by k3vv3 - 31-08-2024, 10:09 AM
RE: హాస్య కథలు - కోతి అప్పడాల కర్ర - by sri7869 - 31-08-2024, 12:07 PM
RE: హాస్య కథలు - కోతి అప్పడాల కర్ర - by k3vv3 - 13-09-2024, 01:10 PM
RE: హాస్య కథలు - తోటకూర - by sri7869 - 13-09-2024, 02:57 PM
RE: హాస్య కథలు - తోటకూర - by k3vv3 - 23-09-2024, 02:58 PM
RE: హాస్య కథలు - తార్మార్ తక్కడమార్ - by sri7869 - 24-09-2024, 07:05 AM
RE: హాస్య కథలు - తార్మార్ తక్కడమార్ - by k3vv3 - 04-10-2024, 01:39 PM
RE: హాస్య కథలు - ఆదివారం అగచాట్లు - by sri7869 - 04-10-2024, 09:13 PM
RE: హాస్య కథలు - ఆదివారం అగచాట్లు - by k3vv3 - 14-10-2024, 06:33 PM
RE: హాస్య కథలు - తారుమారు మారుతారు - by sri7869 - 16-10-2024, 11:41 AM
RE: హాస్య కథలు - తారుమారు మారుతారు - by k3vv3 - 18-10-2024, 12:14 PM
RE: హాస్య కథలు - తారుమారు మారుతారు - by k3vv3 - 18-10-2024, 12:16 PM
RE: హాస్య కథలు - వామన రావు - విమానయానం - by sri7869 - 18-10-2024, 01:09 PM
RE: హాస్య కథలు - వామన రావు - విమానయానం - by k3vv3 - 29-10-2024, 12:35 PM
RE: హాస్య కథలు - సినిమా సుబ్బారావు - by sri7869 - 29-10-2024, 03:39 PM
RE: హాస్య కథలు - సినిమా సుబ్బారావు - by k3vv3 - 12-11-2024, 02:38 PM
RE: హాస్య కథలు - *కఱ్ఱిసోమూ---లాయర్ పిట్ట* - by sri7869 - 12-11-2024, 05:20 PM
RE: హాస్య కథలు - *కఱ్ఱిసోమూ---లాయర్ పిట్ట* - by k3vv3 - 26-11-2024, 01:18 PM
RE: హాస్య కథలు - మైకాసుర కాలనీ - by sri7869 - 26-11-2024, 03:21 PM
RE: హాస్య కథలు - మైకాసుర కాలనీ - by k3vv3 - 09-12-2024, 02:32 PM
RE: హాస్య కథలు - గుట్టు రట్టు - by sri7869 - 11-12-2024, 03:29 AM
RE: హాస్య కథలు - గుట్టు రట్టు - by k3vv3 - 19-12-2024, 02:25 PM
RE: హాస్య కథలు - ఆ కొందరి వలన - by sri7869 - 19-12-2024, 04:55 PM
RE: హాస్య కథలు - ఆ కొందరి వలన - by k3vv3 - 27-12-2024, 09:40 AM
RE: హాస్య కథలు - ప్రమోద్-పెసరట్టు - by Uday - 28-12-2024, 12:39 PM
RE: హాస్య కథలు - ప్రమోద్-పెసరట్టు - by sri7869 - 29-12-2024, 04:38 PM
RE: హాస్య కథలు - ప్రమోద్-పెసరట్టు - by k3vv3 - 03-01-2025, 05:14 PM
RE: హాస్య కథలు - రాందాస్ ఫార్ములా - by sri7869 - 03-01-2025, 11:06 PM
RE: హాస్య కథలు - రాందాస్ ఫార్ములా - by Uday - 06-01-2025, 03:59 PM
RE: హాస్య కథలు - రాందాస్ ఫార్ములా - by k3vv3 - 18-01-2025, 07:39 PM
RE: హాస్య కథలు - చరవాణి తెచ్చిన తంటా - by sri7869 - 20-01-2025, 11:50 PM
RE: హాస్య కథలు - చరవాణి తెచ్చిన తంటా - by k3vv3 - 25-01-2025, 10:27 AM
RE: హాస్య కథలు - మాలావు యుద్ధం - by sri7869 - 25-01-2025, 07:50 PM
RE: హాస్య కథలు - మాలావు యుద్ధం - by k3vv3 - 03-02-2025, 12:51 PM
RE: హాస్య కథలు - రమణారావూ-రాశిఫలాలూ - by k3vv3 - 09-02-2025, 07:31 AM
RE: హాస్య కథలు - రమణారావూ-రాశిఫలాలూ - by k3vv3 - 09-02-2025, 07:34 AM
RE: హాస్య కథలు - రమణారావూ-తిండి పిచ్చి - by k3vv3 - 22-02-2025, 01:16 PM
RE: హాస్య కథలు - రమణారావూ-తిండి పిచ్చి - by TheCaptain1983 - 23-02-2025, 02:33 AM
RE: హాస్య కథలు - రెండు పేటల గొలుసు - by k3vv3 - 07-03-2025, 08:32 AM
RE: హాస్య కథలు - రెండు పేటల గొలుసు - by k3vv3 - 07-03-2025, 08:33 AM
RE: హాస్య కథలు - దొందూ దొందే - by k3vv3 - 14-03-2025, 09:43 AM
RE: హాస్య కథలు - కొంప ముంచిన వెనుక పక్క - by Uday - 14-03-2025, 01:26 PM
RE: హాస్య కథలు - కొంప ముంచిన వెనుక పక్క - by k3vv3 - 25-03-2025, 01:11 PM
RE: హాస్య కథలు - ఏమండి - by k3vv3 - 01-04-2025, 05:31 PM
RE: హాస్య కథలు - తాతయ్యా నాకు భయం - by k3vv3 - 09-04-2025, 08:37 AM
RE: హాస్య కథలు - దీపావళి మామగారు - by k3vv3 - 15-04-2025, 01:36 PM
RE: హాస్య కథలు - Thread Modes Comedy హాస్య కథలు - దీపావళి మజా - by k3vv3 - 22-04-2025, 01:42 PM
RE: హాస్య కథలు - బాంబు పేలింది - by k3vv3 - 28-04-2025, 02:39 PM
RE: హాస్య కథలు - బాంబు పేలింది - by k3vv3 - 28-04-2025, 02:41 PM
RE: హాస్య కథలు - బాంబు పేలింది - by k3vv3 - 28-04-2025, 02:42 PM
RE: హాస్య కథలు - మళ్లీ వచ్చే దీపావళి - by k3vv3 - 03-05-2025, 05:00 PM
RE: హాస్య కథలు - ఆంతర్యం - by k3vv3 - 10-05-2025, 09:12 AM
RE: హాస్య కథలు - దీపావళి విడుదల - by k3vv3 - 17-05-2025, 04:32 PM
RE: హాస్య కథలు - దీపావళి విడుదల - by k3vv3 - 17-05-2025, 04:37 PM
RE: హాస్య కథలు - వంటాయన - by k3vv3 - 22-05-2025, 02:40 PM
RE: హాస్య కథలు - మద్యప్రదేశ్ (కామెడీ కథ) - by k3vv3 - 08-06-2025, 11:48 PM
RE: హాస్య కథలు - కామెడీ దెయ్యాలు - by k3vv3 - 21-06-2025, 01:58 PM
RE: హాస్య కథలు - కామెడీ దెయ్యాలు - by k3vv3 - 21-06-2025, 01:59 PM
RE: హాస్య కథలు - కామెడీ దెయ్యాలు - by k3vv3 - 21-06-2025, 02:01 PM
RE: హాస్య కథలు - బుచ్చిబాబు ఆరోగ్యం - by k3vv3 - 28-07-2025, 04:22 PM
RE: హాస్య కథలు - బుచ్చిబాబు ఆరోగ్యం - by k3vv3 - 28-07-2025, 04:24 PM
RE: హాస్య కథలు - బుచ్చిబాబు ఆరోగ్యం - by k3vv3 - 28-07-2025, 04:25 PM
RE: హాస్య కథలు - బుచ్చిబాబు ఆరోగ్యం - by TheCaptain1983 - 29-07-2025, 08:28 AM
RE: హాస్య కథలు - బుచ్చిబాబు ఆరోగ్యం - by k3vv3 - 29-07-2025, 11:35 AM
RE: హాస్య కథలు - అప్పు తీర్చిన అప్పారావు! - by k3vv3 - 02-08-2025, 01:13 PM
RE: హాస్య కథలు - అప్పు తీర్చిన అప్పారావు! - by k3vv3 - 02-08-2025, 01:15 PM
RE: హాస్య కథలు - అప్పు తీర్చిన అప్పారావు! - by k3vv3 - 02-08-2025, 01:16 PM
RE: హాస్య కథలు - నయన విన్యాసం - by k3vv3 - 07-08-2025, 04:41 PM
RE: హాస్య కథలు - నయన విన్యాసం - by k3vv3 - 07-08-2025, 04:42 PM
RE: హాస్య కథలు - నయన విన్యాసం - by k3vv3 - 07-08-2025, 04:45 PM
RE: హాస్య కథలు - దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా - by k3vv3 - 20-08-2025, 06:31 PM
RE: హాస్య కథలు - ఐ హేట్ మై రూమ్మేట్ - by k3vv3 - 27-08-2025, 10:22 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM
RE: హాస్య కథలు - ఫేస్ బుక్ రాజా -వాట్సప్ రాణీ - by k3vv3 - 09-09-2025, 02:02 PM
RE: హాస్య కథలు - పాపం తెలుగు ఉపాధ్యాయుడు, తెలుగు భాష - by k3vv3 - 16-09-2025, 01:49 PM
RE: హాస్య కథలు - మన ఔదార్యం - by k3vv3 - 21-09-2025, 01:10 PM
RE: హాస్య కథలు - కాయ్.. కాయ్ - by k3vv3 - 26-09-2025, 10:05 AM
RE: హాస్య కథలు - చాదస్తం - by k3vv3 - 03-10-2025, 09:36 AM
RE: హాస్య కథలు - దిల్ పసంద్ - by k3vv3 - 10-10-2025, 09:36 AM
RE: హాస్య కథలు - ఇంకెంత సేపు - by k3vv3 - 16-10-2025, 06:22 PM
RE: హాస్య కథలు - దొంగలు బాబోయ్ - by k3vv3 - 22-10-2025, 02:29 PM
RE: హాస్య కథలు - దొంగలు బాబోయ్ - by k3vv3 - 22-10-2025, 02:34 PM
RE: హాస్య కథలు - భూలోకవాసుల స్వర్గలోక ఆవాసము - by k3vv3 - 28-10-2025, 02:10 PM
RE: హాస్య కథలు - ఇట్లు, నీ తమ్ముడు! - by k3vv3 - 03-11-2025, 09:48 AM
RE: హాస్య కథలు - ఇట్లు, నీ తమ్ముడు! - by k3vv3 - 03-11-2025, 09:55 AM
RE: హాస్య కథలు - ఈ కథ నేను రాసినది... కాదు - by k3vv3 - 09-11-2025, 06:24 PM
RE: హాస్య కథలు - భామనే... సత్య... బామ్మ నే - by k3vv3 - 14-11-2025, 09:05 AM
RE: హాస్య కథలు - ఇట్లు, నీ తమ్ముడు! - by k3vv3 - 20-11-2025, 12:47 PM
RE: హాస్య కథలు - ఇట్లు, నీ తమ్ముడు! - by k3vv3 - 20-11-2025, 12:49 PM
RE: హాస్య కథలు - ఈ కథ నేను రాసినది... కాదు - by k3vv3 - 28-11-2025, 04:30 PM
RE: హాస్య కథలు - దెయ్యాల పొరుగు - by k3vv3 - 13-12-2025, 02:45 PM
RE: హాస్య కథలు - ఇంకెంత సేపు - by k3vv3 - 20-12-2025, 01:33 PM
RE: హాస్య కథలు - పొడుపు కధ తెచ్చిన జడుపు - by k3vv3 - 29-12-2025, 09:36 AM
RE: హాస్య కథలు - పన్నీర్ గోల్మాల్ పెళ్లి!!! - by k3vv3 - 06-01-2026, 12:53 PM
RE: హాస్య కథలు - పన్నీర్ గోల్మాల్ పెళ్లి!!! - by k3vv3 - 06-01-2026, 12:56 PM
RE: హాస్య కథలు - దొందూదొందే - by k3vv3 - 18-01-2026, 03:00 PM
RE: హాస్య కథలు - ధనియాలు రాజు హార్ట్ స్టొరీ - by k3vv3 - 01-02-2026, 04:11 PM
RE: హాస్య కథలు - ఎవరూ తక్కువ కాదు! - by k3vv3 - 10-02-2026, 11:56 AM
RE: హాస్య కథలు - అను"మౌ"నం - by k3vv3 - 16-02-2026, 05:54 PM
RE: హాస్య కథలు - అహా ఏమి రుచి - by vdsp1980 - 17-02-2026, 05:44 PM
RE: హాస్య కథలు - అహా ఏమి రుచి - by k3vv3 - 17-02-2026, 06:43 PM
RE: హాస్య కథలు - అహా ఏమి రుచి - by k3vv3 - 21-02-2026, 09:11 AM
RE: హాస్య కథలు - భీమారావు తిండి - by k3vv3 - 02-03-2026, 06:10 PM
RE: హాస్య కథలు - ప్యార్ ''ఖ/కరోనా" - by k3vv3 - 17-03-2026, 01:46 PM
RE: హాస్య కథలు - రంగమ్మ వ్యాధి - by k3vv3 - 19-03-2026, 10:04 AM
RE: హాస్య కథలు - రంగమ్మ వ్యాధి - by k3vv3 - 26-03-2026, 05:32 PM
RE: హాస్య కథలు - రంగమ్మ వ్యాధి - by k3vv3 - 26-03-2026, 05:37 PM
RE: హాస్య కథలు - రంగమ్మ వ్యాధి - by k3vv3 - 26-03-2026, 05:42 PM
RE: హాస్య కథలు - మంత్ర తంత్రాల మాయల మరాఠీ - by k3vv3 - 29-03-2026, 06:31 PM
RE: హాస్య కథలు - ఆనవాయితీతో ఆబ్దికం - by k3vv3 - 06-04-2026, 04:40 PM
RE: హాస్య కథలు - ఆనవాయితీతో ఆబ్దికం - by k3vv3 - 06-04-2026, 04:41 PM
RE: హాస్య కథలు - పాత చింతకాయపచ్చడి లాంటి కథ - by k3vv3 - 13-04-2026, 09:32 AM
RE: హాస్య కథలు - పాత చింతకాయపచ్చడి లాంటి కథ - by k3vv3 - 13-04-2026, 09:33 AM
RE: హాస్య కథలు - పాత చింతకాయపచ్చడి లాంటి కథ - by k3vv3 - 13-04-2026, 09:34 AM
RE: హాస్య కథలు - ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు! - by k3vv3 - 24-04-2026, 09:01 AM
RE: హాస్య కథలు - కనురెప్ప - by k3vv3 - 02-05-2026, 02:49 PM
RE: హాస్య కథలు - కనురెప్ప - by k3vv3 - 02-05-2026, 02:50 PM
RE: హాస్య కథలు - నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి! - by k3vv3 - 11-05-2026, 09:53 AM
RE: హాస్య కథలు - నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి! - by k3vv3 - 11-05-2026, 09:54 AM
RE: హాస్య కథలు - చేతిలో చెయ్యేసి చెప్పు బావ - by k3vv3 - 19-05-2026, 10:50 AM
RE: హాస్య కథలు - కాంతారావుకి అవార్డు వచ్చిందండహో! - by k3vv3 - 28-05-2026, 07:42 AM
RE: హాస్య కథలు - తినగ తినగ వేము - by k3vv3 - 06-06-2026, 10:40 PM
RE: హాస్య కథలు - - - by k3vv3 - 19-06-2026, 10:04 PM
RE: హాస్య కథలు - అర మార్కులోడు - by k3vv3 - 19-06-2026, 10:05 PM
RE: హాస్య కథలు - అర మార్కులోడు - by k3vv3 - 19-06-2026, 10:06 PM
RE: హాస్య కథలు - అర మార్కులోడు - by k3vv3 - 19-06-2026, 10:08 PM
RE: హాస్య కథలు - ఎప్పుడో, యెవరో, యేతావునో.. - by k3vv3 - 28-06-2026, 12:41 PM
RE: హాస్య కథలు - కమరావతీరాగం - by k3vv3 - 07-07-2026, 04:45 PM
RE: హాస్య కథలు - జడివాన - by k3vv3 - 15-07-2026, 10:12 PM
RE: హాస్య కథలు - జడివాన - by k3vv3 - 15-07-2026, 10:13 PM
RE: హాస్య కథలు - చెన్నమ్మ సర్కిల్ - by k3vv3 - 24-07-2026, 10:44 AM
RE: హాస్య కథలు - ఇదేమి ఊరురా నాయనా - by readersp - 24-07-2026, 11:27 AM
RE: హాస్య కథలు - ఇదేమి ఊరురా నాయనా - by k3vv3 - 02-08-2026, 04:05 PM
RE: హాస్య కథలు - వంకాయ మహత్యం - by k3vv3 - 09-08-2026, 01:57 PM
RE: హాస్య కథలు - బధ్ధకస్తుడు - by k3vv3 - 14-08-2026, 10:21 AM
RE: హాస్య కథలు - బధ్ధకస్తుడు - by k3vv3 - 14-08-2026, 10:24 AM
RE: హాస్య కథలు - గోవిందరావు - వాలుజడ - by k3vv3 - 23-08-2026, 05:06 PM
RE: హాస్య కథలు - మిత్రవ్యాఖ్య - by k3vv3 - 30-08-2026, 02:05 PM
RE: హాస్య కథలు - నామకరణం - by k3vv3 - 09-09-2026, 02:14 PM
RE: హాస్య కథలు - డామిడ్ కథ నిలువుకు తిరిగింది - by k3vv3 - 18-09-2026, 04:21 PM
RE: హాస్య కథలు - ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది. - by k3vv3 - 02-10-2026, 12:23 PM
RE: హాస్య కథలు - వైఫ్ – వై...ఫై - by k3vv3 - 11-10-2026, 01:26 PM
RE: హాస్య కథలు - సుట్టకోసం - by parinda35 - 17-10-2026, 06:44 AM
RE: హాస్య కథలు - సుట్టకోసం - by k3vv3 - 26-10-2026, 01:57 PM
RE: హాస్య కథలు - సుట్టకోసం - by k3vv3 - Yesterday, 01:40 PM



Users browsing this thread: 1 Guest(s)