26-02-2026, 10:01 AM
మర్నాడు ఉదయం మళ్లీ ఏదో చిన్న కూలీ పని దొరికింది — ఒక ట్రక్కు దిగడం, బాక్సులు ఎత్తడం. సాయంత్రం అయ్యాక చేతులు నొప్పిగా ఉన్నాయి కానీ డబ్బు వచ్చింది. నేను సైకిల్ దుకాణానికి వెళ్లాను. షాప్ దగ్గరికి చేరేసరికి నాన్న, మోహన్ రావు గారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి ముఖాలు కూడా సీరియస్‌గా ఉన్నాయి.
మోహన్ రావు గారు నా వైపు చూసి, నాన్నతో చెప్పారు:
“వాడెవడో నా కూతురికి లవ్ లెటర్ రాసాడు. ఒకసారి వార్నింగ్ ఇస్తాను. నువు నాతో రా.”
నాన్న నన్ను ఒక్కసారి చూసి, షాప్ కీలు నా చేతికి ఇచ్చాడు.
“నువు ఇక్కడే ఉండు. షాప్ చూసుకో. నేను వచ్చేస్తా” అని చెప్పి, మోహన్ రావు గారితో కలిసి వెళ్లిపోయాడు.
నేను షాప్‌లో ఒంటరిగా కూర్చున్నాను. సైకిల్ టైర్లు పంప్ చేస్తూ, మనసు ఆ లవ్ లెటర్ మీదే తిరిగింది. ఎవడు రాసాడు? ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది? నేను రాత్రి మేడ మీద చూసినప్పుడు ఆమె శాంతంగా చదువుకుంటోంది కదా... ఇప్పుడు ఏమైంది?
రాత్రి ఆలస్యంగా నాన్న వచ్చాడు. బట్టలు మార్చుకునీ, చాప మీద పడుకుంటూ చెప్పాడు:
“ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట. మేము తిట్టి వచ్చాము. వాడు కూడా అదే కాలేజీలో ఉన్నాడు.”
నేను ఏమీ అడగలేదు. నాన్న కళ్లు మూసుకున్నాడు. ఇంట్లో నిశ్శబ్దం.
ఆ అమ్మాయి ముఖం మళ్లీ గుర్తొచ్చింది. ఆమెకు లవ్ లెటర్ వచ్చింది. ఎవరో ఒకడు ఆమెను ఇష్టపడ్డాడు. ఆమె ఏమనుకుంది? భయపడిందా? నవ్విందా? లేదా... నిర్లక్ష్యం చేసిందా?
నేను బెడ్ మీద పడుకున్నాను. మందు బాటిల్ తీసుకోలేదు. ఇప్పుడు అవసరం లేదు అనిపించింది. బదులు మనసు ఆ టీవీఎస్ దగ్గర ఆగిపోయింది. ఆ ఇంటి ముందు. ఆ మేడ మీద. ఆ లైట్.
రేపు ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు నిద్ర పట్టడం లేదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)