11-01-2026, 12:35 PM
(10-01-2026, 09:53 PM)Rangudabba456 Wrote: Hai Anamika gaaru meeru 1 week ki oka update ichina ok Karni
Please konchem peddha update ivvandii
It'll
Mee Abhimanii
Rangudabba
ఒక అభిమానిగా మీ అభిప్రాయాన్ని చెప్పారు, చాలా సంతోషం.
అయితే ఇందులో వచ్చే సమస్య ఏమిటంటే, ఒక్కొక్కళ్లు ఒక్కో అభిప్రాయంలో వుంటారు. చాలా మంది రెగ్యులర్ అప్డేట్ లు కోరుకుంటారు. నేను వారానికొక అప్డేట్ ఇవ్వడం మొదలుపెడితే, అప్పుడు రెగ్యులర్ గా అప్డేట్ లు ఇవ్వమని అడుగుతారు.
నాకు కూడా వారానికొక అప్డేట్ ఇవ్వడం మైనస్ అవుతుంది ఎందుకంటే పాఠకులు కథతో టచ్ ని కోల్పోతారు. ఇక్కడ మీకొక విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను - మీరు అనుకుంటున్న చిన్న అప్డేట్, నిజానికి అయిదు పేజీల పైనుండే అప్డేట్. వీక్లీ లో సీరియల్స్ రాసే వాళ్ళు (పేరున్న రచయితలు) ఇచ్చే అప్డేట్ రెండు పేజీలకి కూడా మించదు. (కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి)
మీరు వేరేరకంగా అనుకోను అంటే మీకొక సలహా ఇవ్వగలను - మీరే వారానికి ఒకసారి మొత్తం అప్డేట్ లని ఒకేసారి చదువుకోవచ్చుకదా ! ఇది నా అభిప్రాయం మాత్రమే.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)