Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం-2
#13
శక్తి ఆగమనం..2
[Image: S.jpg]
*"" ఆరోజు ఇందు కాలేజ్ జాయినింగ్.... 
ఆమెకు చిన్నప్పటి నుంచి
ప్రతి చిన్న విషయానికి
భయం చాలా సున్నిత మనస్కురాలు 
ఇప్పటికే చాలా సార్లు
తెలియని ప్రమాదాలు 
ఆమెను వెంటాడాయి
 
*"""ఆమె ప్రాణం పట్టుకు పోవాలి అని ఓ చీకటి నీడ 
వెంటాడుతూ ఉంది అందుకే ఆమె
వంటరిగా ఉండాలి అంటే 
చచ్చేంత భయ పడుతుంది.
 
అందుకు చాలా కారణాలు ఉన్నాయి
 
ఎన్నో సమయాల్లో ఆమెను
ఎవరో వెంటాడి నట్టు 
తన పక్కనే ఉన్నట్టు 
అనిపించేది తనని
చంపడానికి చూసినట్టు ఆ సమయం లో ఆమె భయం తో పరుగులు పెట్టీ కింద పడి
దెబ్బలు తగిలించు కునేది.
కానీ తననీ
వెంటాడిన అదృశ్య శక్తి 
ఎప్పుడు నేరుగా ఆమెను
ఎటాక్ చేసేది కాదు.
****
అమే ప్రమాదం కలిగే ప్రదేశం లో ఉన్నప్పుడు భయపెట్టి ఆమె అంతట ఆమె ప్రమాదం లో
పడేట్టు చేసేది
అదంతా  
ఆమె భ్రమే కావచ్చు.
 
 ఎదీ ఏమైనా కానీ
ఆమె ప్రమాదం లో పడేది. 
అందుకే ఇంట్లో వాళ్ళు 
ఇందు నీ జాగర్తగా 
చూసుకుంటూ
ఉండే వారు ముఖ్యం గా
భూషణ్ కూతురు నీ
అపురూపం గా అదృష్ట లక్ష్మి గా చూసుకుంటూ ఉండే
వారు
ఆమె అమాయక్త్వం ప్రతి చిన్న విషయానికి భయపడే గుణం
చూసి బైట పడక పోయినా ఆయన
చాలా భాధ పడేవారు.
****
ఆమె ముందు గంభీరం గా 
ఉన్నట్టు ధైర్యం చెబుతూ
మనం దృఢం గా ఉండాలి 
అసలే మనకి శత్రువులు
ఉన్నారు అని జాగర్తలు
తీసుకోవాలి అంటూ,
కాలేజ్ నుంచి ఇప్పుడు 
కాలేజ్ వరకు ఆయనే
స్వయంగా తీసుకు వెళ్లి
తీసుకు రావాలి అని ఫిక్స్ అయ్యారు. 
అలాగే ఇంటర్ పూర్తి చేసింది ఇప్పుడు 
ఇంజినీరింగ్ చేయాలి అనుకుంటుంది.
 
*"""
ఈరోజే కొత్త కాలేజ్ కి ఆమె
వెళ్తుంది అంతలో
ఆమె తండ్రి కి ఒక విషయం
తెలిసింది.
 
అదే కాలేజ్ లో
శివరాం కొడుకు నీ జాయిన్ చేస్తున్నాడు అని 
అంతా తనతో పోటీ అని
అర్థం చేసుకుని కూతుర్ని
దగ్గరకు
పిలిచి వివరం గా చెప్పారు 
చూడు ఇందు నువ్వు 
చేరబోతున్న కాలేజ్ లో
ఆ శివారం కొడుకు కూడా
ఉంటాడు.
 
వాడు కావాలనే నువ్వు
చేరుతున్న కాలేజ్ లో జాయిన్ అయ్యాడు 
 
నీతో ఏమన్నా వేషాలు వేస్తే 
చెప్పు ప్రాణం తీసేస్తాను.... 
అయినా అంత వరకు
రాదులే....
వాడు నీ నీడను కూడా
చూడటానికి భయపడేలా
వార్నింగ్ ఇస్తాను.
 
నువ్వేం కంగారు పడక
కాకుంటే జాగర్త గా ఉండు. 
నువ్వు
వాడ్ని కళ్ళతో కూడా
చూడకు మాట్లాడే ప్రయత్నం చేయకుండా నీ మట్టుక నువ్వు జాగర్తగా ఉండలి నీకసలే అన్నిటికీ భయం. 
వాడేమన్న నీతో వేషాలు వేస్తే మాత్రం నేను వాడి అంతు
చూస్తాను నువ్వు మాత్రం 
వాడి మొహం చూడటానికి 
కూడా వీల్లేదు వాళ్ళు మనకు
బద్ర శత్రువులు అర్థం
అవుతుందా అని విషయం చెప్పాడు.
 
*""" ఇందు నాన్న మాటలు విని అర్థం అయింది నాన్న గారు 
నేను అసలు అక్కడి
అబ్బాయిలతో మాట్లాడను ఎవరి వంకా చూడను నా చదువు నేను చదువుకుని ఉంటాను 
మీరన్నట్టు ఆ అబ్బాయి నాతో ఏమన్నా బ్యాడ్ బిహేవ్ చేస్తే
వెంటనే మీకు చెప్తాను అని 
ఎంతో వినయం గా సమాధానం ఇచ్చింది.
 
*"" భూషణ్ చాలా సంతోష పడ్డారు నా కూతురు అంటే ఇలా ఉండాలి ఎంతో పద్ధతిగా....
నీ వినయం తెలివి సంస్కారం ఆ నడమంత్రపు సిరి తలకెక్కిన 
శివరాం కొడుక్కి ఉండదు 
అందుకే జాగర్త చెప్పాను
ఇంక వెళదామా అని
అడిగారు ఇందు సరే నాన్న గారు అని బుక్స్ పట్టుకుని 
నిలుచుంది.
 
*"" భూషణ్ వంట గదిలో ఉన్న అతడి భార్య నీ ఎవే అని గట్టిగా ఒక కేకే పెట్టీ పిలిచాడు 
 
*"ఆవిడ కూతురు కోసం లంచ్ బాక్స్ కట్టి గబగబా వచ్చి
వస్తున్న అండి ఇదిగో 
అమ్మాయి లంచ్ రెడీ చేస్తున్న
అని అంటూ ఉంటే ఆయన
ఆవిడ పై కేకలు వేసి
ఇంట్లో ఇంటిడు పనివాళ్ళు ఉన్నారు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ బుద్ధులు మార్చుకోవా 
నువ్వెందుకు వంట చేయడం
అని అరిచి అమ్మాయి కి 
ఆలస్యం అవుతుంది అని 
అరిచారు.
 
ఆవిడ విసుక్కుంటూ
ఎంత మంది పనివాళ్ళు
ఉంటే ఎంటి నా కూతురుకి
నేనే వండి పెట్టాలి అదే నాకు
తృప్తి. అని చెబుతూ ఇందు 
తల నిమిరింది.
 
*"""సర్లే మేం వెళుతున్నాం
అని అక్కడి నుండి కదిలారు.
ఆయన వెనుక నలుగురు 
కుర్రాళ్ళు ఉన్నారు భూషణ్ చుట్టు మనుషులు ఎప్పుడు ఉంటారు అంతా అయన్ని అన్నా అని పిలుస్తూ ఇంట్లో వారికి కాపలా ఉంటు చాలా పనులు ఇంకా పొలిటికల్ లీడర్స్ కి ఉపయోగ
పడే పనులు చేస్తూ 
ఉంటారు భూషణ్ 
వ్యపరాలన్నిటి కి పెద్ద ఎత్తున వర్కర్స్ నీ ఏర్పాటు 
చేసుకున్నాడు అయినా కూడా
తన చుట్టూ మనుషులు
కంపల్ సరి ఉండాలి.
 
ఆ విషయం ఇంట్లో అందరికి తెలుసు అందుకే ఎవరికి కొత్త అనిపించదు
ఇంటి నిండా వస్తాదులు
కనిపిస్తూ ఉంటారు ఇందు
మాత్రం చిరాకు పడుతూ
అమ్మ వంక చూసి అమ్మా నేను
వెళ్లి వస్తాను....
 దేవి మాత ఆ అబ్బాయి నా కంట పడకుండా చూడు
లేదంటే నాకసలే టెన్షన్ అది చలాధు అని ఇంకో కొత్త టెన్షన్ అనుకుని బైటకు వెళ్లి కార్
ఎక్కింది.
 
*""" అమ్మాయి వెళ్తుంటే
ఆవిడ నవ్వుతూ
సాగనంపింది. 
కార్ లో భూషణ్ ఆయన 
కూతురు ఇంకో నలుగురు
కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళు
కాలేజ్ కి పయనం అయ్యారు. ఇందు కి తన తండ్రి నీ
అడగాలి అనిపిస్తుంది
వీళ్లంతా మనతో ఎందుకు 
నాన్న గారు అని కానీ అంత 
ధైర్యం ఆమేకెక్కడిధి
అందుకే లోలోపల తిట్టుకుంటూ సైలంట్ గా కూర్చుని ఉంది.
 
*"""
*"" మరో వైపు శివరాం కొడుకు
సిద్దు అతడికి ఎలాంటి భయం ఉండదు,
కోరి ప్రమాదాల తో ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉంటాడు చాలా మొండి ఎవ్వరి మాట వినడు ఎదైనా కావాలి అనుకుంటే ఎంత వరకు అయినా వెళ్తాడు. 
 
కానీ అప్పుడప్పుడు ఎదో వెలుగు
నిండిన రూపం అతడి కళ్ళ ముందుకి వచ్చి మాయం 
అవుతూ ఉంటుంది. 
 
*"" ఆ లైట్ అతడికి ఎదురైన
సమయం లో అతడికి 
చెప్పలేని నీరసం వచ్చేస్తుంది అస్సలు కదల్లేని స్థితిలో ఉండిపోతాడు
కొన్ని నిముషాలు గడిస్తే
 బెటర్ అవుతాడు 
ఎదైనా ఫుడ్ తినగానే 
పోయిన ఎనర్జీ వచ్చేస్తుంది మునుపటి కంటే ఎక్కువ శక్తి వంతుడు లా అయిపోతాడు
కానీ ఆ కాంతి అతడికి
ఎందుకు ఎదురవుతుంది 
అసలు ఎంటా రూపం అనేది 
అంతు పట్టని ప్రశ్న. 
 
కానీ సిద్దు ఆ విషయం 
పెద్దగా పట్టించు కోలేదు
ఇంట్లో వాళ్ళకి చెప్పినా అర్థం కాలేదు
 కాకుంటే దాని వలన అతడికి ఎలాంటి హాని జరగడం లేదు
కావున వాళ్ళు భయపడటం లేదు. శివరాం మాత్రం కొడుకు కోసం పూజలు హోమాలు చేయిస్తూ ఉంటాడు కొడుకు 
కుడి చేతి పై త్రిశూలం ఆకారం తో ఒక మచ్చ పుట్టినప్పటి నుంచి
ఉంది 
అది చూసి అతడు
మహర్జాతకుడు అవుతాడు
అని పండితులు చెప్పారు
కాని సిద్దు కి ఆ గుర్తు
కనిపించడం ఇష్టం లేదు 
అందుకే అది కవర్ అయ్యేట్టు 
వాచ్ పెట్టుకుంటు
ఉంటాడు. 
 
ఈరోజు అతడి కాలేజ్ 
జాయినింగ్.
 
శివరాం సిద్దు నీ పిలిచి
విషయం చెప్పాడు
రేయ్ సిద్దు నువ్వు ఇవ్వల 
కాలేజ్ కి పోతున్నావు
ఆ భూషణం కూతురుని
అక్కడే జాయిన్ చేశాడట 
వాడికి మనతోనే అంతా పోటీ 
ఎంత పోటీ పడిన వాడి లేకి బుద్ధి ఎక్కడికి పోతుంది
నువ్వు మాత్రం వాడి కూతురు కంటే గొప్పగా ఉండాలి 
చదువులో ఇంకా రేంజ్ లో
మంచి కాష్ట్లి కార్ తీసుకు పో అక్కడి ఫ్రెండ్స్ కి మంచిగా కర్చు చెయ్యి..... 
నీకు ఎంత కావాలి అన్నా
తీసుకో... నీ ఎకౌంట్ లో డబ్బు ఉంటుంది
కావలసినంత గొడవ చెయ్
ఎక్కడా తగ్గకు అక్కడ
నిన్నెవరు ఏమి అనరు
ఈ శివరాం కొడుకు అంటే అందరూ భయ పడాలి నువ్వు 
మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలి 
వాడి కూతురు కంటే నువ్వే గొప్ప అని అంతా అనుకోవాలి
చదువు లో హోదా లో నిన్ను
ఎవరు దాటలేరు అని
నువ్వు ఫ్రువ్ చేయి అని ఫుల్ ఫ్రీడమ్ ఇంకా కావలసినంత
డబ్బు ఇచ్చి పంపించాడు
శివరాం. 
 
సిద్దు హ్యాపీ గా థాంక్స్ డాడ్ అని బైటకు వెళ్ళిపోయాడు.
 
*"" అయన భార్య కొడుక్కి
మంచి మాటలు చెప్పాల్సింది పోయి ఇలా రెచ్చకొడితే వాడు చెడిపోతాడు అండి
వాడికి అసలే తిక్క మొండి
ఎవరేం చెప్పినా వినడు
ఇప్పుడు మీరు ఆ అమ్మాయి కంటే తక్కువేం కాదు అని చెప్పడం కోసం ఇలా డబ్బు ఇచ్చి కార్ అని అక్కరలేని ఆడంబరాలు 
అందిస్తే ఎలా అని అడ్డుకో
బోయింది అయన నవ్వుతూ 
మనం లేని వాళ్ళం కాదు 
కోట్లు ఉన్నాయి
వాడు ఎంత కర్చు చేసినా
తరగని అంత సంపాదించాను
కర్చు చేయని నాకేం దిగులు
లేదు ఆ భూషణం కూతురు ముందు నా కొడుకు రాజా అనిపించు కోవాలి అంతే
అని సీరియస్ గా 
విషయం తేల్చి చెప్పారు
ఆవిడ ఇంకేం చేస్తాం అని ఊరుకుంది.
 
*""సిద్దు మంచి స్పోట్స్ కార్ తీసుకుని ఎంతో స్టైల్ గా
కాలేజ్ వైపు వెళుతూ డాడ్
చెప్పిన ఆ భూషణ్ కూతురు 
ఎలా ఉంటుందో ఏమో గానీ 
నాకు మరింత ఫ్రీడమ్ దొరికింది థాంక్స్ అనుకుని కాలేజ్ చేరుకున్నాడు.
*""
*" మొదటి రోజు కాలేజ్ లో
అడుగు పెట్టిన ఇందు 
నాన్న గారు బై అని కార్ దిగి 
చెప్పి ముందుకు కదిలింది.
 
ఆయన ఇంకో మారు జాగర్త
చెప్పి కార్ స్టార్ట్ 
చేయమన్నారు. ఆమె ముందుకు వెళ్ళిన ఎనిమిది సెకన్లు 
తేడాలో అక్కడికి ఓ రెడ్ కాలర్ స్పొట్స్ కార్ వచ్చి ఆగింది.
 
*"" కార్ లో ఉన్న భూషణ్ ఆ కార్ వంక చూసారు 
ఇందు అక్కడి అమ్మాయిల
మధ్య చేరి ముందుకు వెళ్లిపోయింది.
 
ఆ రెడ్ కార్ దిగిన వ్యక్తి నీ
చూసిన భూషణ్ కి ఎక్కడ లేని మంట రేగింది
కార్లో ఉన్న కుర్రాళ్ళు అన్నా....
గా శివరాం కొడుకు అన్నా...
ఓ తెగ స్టైల్ కొడుతుండు చుసినావా.... 
అబ్బో .. బచ్చగాని లెక్క
ఉంటాడు అనుకుంటే 
హీరో లెక్కున్నాడు 
అని ఒకడు నోరు జారితే
మిగిలిన వాళ్ళు
హే ఉర్కోవై ఎం ధిమాక్ గట్ల తిరిగింద ఎంది
అన్న ముంగట గట్లా వాగుడెంది అని కంట్రోల్ చేశారు
 
*" భూషణ్ మాత్రం సిద్దు నీ మిర్రి మిర్రీ చూస్తూ ఉంటే
డ్రైవర్ కార్ స్టార్ట్ చేసాడు
ఆ కార్ కి సిద్దు అడ్డం వచ్చి
వాళ్ళని కాస్త టెన్షన్ పెట్టాడు
డ్రైవర్ కంగారుగా సడన్ బ్రేక్
వేసి ఆపాడు 
అంతే బూషన్ తల అదిరింది అక్కడ కుర్రాళ్ళు కంగారు 
పడ్డారు.
 
సిద్దు ఎంతో మర్యాద గా కార్ డ్రైవర్ కి సారి అని చెబుతూ
ఉంటే అతడి వెనుక సీట్ లో ఉన్న భూషణ్ బుసలు కొడుతు కార్ దిగబోయాడు 
ఆ కుర్రాళ్ళు కంగారుగా
అన్నా అన్నా మన ఇందుఅమ్మ
గీ దినమే కాలేజ్ లో జాయిన్ అయ్యింది  
లొల్లి  వద్దు అన్నా 
ఇడిసెయ్ గా బచ్చా గాని సంగతి మేం చూసుకుంటాం లే
అని అపారు. 
*"" 
సిద్దు వాళ్ళని సరిగా చూడలేదు అక్కడ వాళ్ళని పట్టించు 
కోకుండా కాలేజ్ లోపలికి వెళ్ళిపోయాడు.
 
*" భూషణ్ కోపం పెంచుకోక
ముందే డ్రైవర్ కార్ స్టార్ట్ 
చేసాడు
వాళ్ళు కొంత దూరం వెళ్లేంత
వరకు భూషణ్ అదే మూడ్ లో ఉన్నాడు. 
కొంత సమయం గడిచింది
భూషణ్ కి,,,
 మేయర్ సరోజ కాల్ చేసింది 
అతడు నార్మల్ మూడ్ కి వస్తూ చెప్పండి అమ్మ మీ ఫోన్ కొరకే చూస్తున్న అని వినయం గా అంటే ఆవిడ ఎదో ఇంపార్టెంట్ 
విషయం
మాట్లాడాలి ఆఫిస్ కి రండి
అని చెప్పి ఫోన్ పెట్టేసింది
 
*" భూషణ్ కి ఏమి అర్ధం కాలేదు ఈవిడ నేను అడిగిన కాంట్రాక్ట్ విషయం వదిలేసి ఇంకేదో ఇంపార్టెంట్ అని పిలుస్తుంది
ఎంటి విషయం అనుకుని
అటుగా పయనం
అయ్యాడు.
 
*"" సిద్దు కాలేజ్ లో ఎంటర్
అవుతూ ఉంటే అతడి స్టైల్ ఇంకా రెక్లెస్ చూసి కొందరు
ఆకర్షితులు అయ్యారు
అలాగే ఫ్రెండ్స్ అయ్యారు 
నలుగురు కుర్రాళ్ళు అతడి
చుట్టు చేరి ఏ గ్రూప్ అని అడుగుతూ క్లాస్ రూం
చేరుకునే పనిలో పడ్డారు. 
 
*""ఇందు... కూడా ఎంతో వినయం ఇంకా అందం గా అక్కడి
అందరినీ ఆకర్షిస్తూ ఉంది 
ఆమెతో కూడా నలుగురు అమ్మాయిలు చేరారు 
వాళ్ళు క్లాస్ కి వెళుతూ ఉంటే
వారి వెనకే సిద్దు అతడి ఫ్రెండ్స్ తో నడుస్తూ ఉన్నాడు. 
 
*""చుట్టు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సిద్దు చుట్టు చూస్తూ అక్కడ ఉన్న అమ్మాయిల
అందాన్ని గమనిస్తూ హు.... 
పర్లేదు కాలేజ్ లో కలర్స్ ఎక్కువగానే ఉన్నాయి
ఇంతకీ ఈ చితాకొక రంగుల
మధ్య ఆ భూషణ్ కూతురు
ఎక్కడ ఉంది ఎలా ఉందో
చూడాలి ఒకసారి కనిపిస్తే 
థాంక్స్ చెప్పాలి నీ వల్లే నాకు చాలా ఫ్రీడమ్ దొరికింది అని
అనుకున్నాడు
 
*' అంతలో అతడి ఎదురుగా నడుస్తున్న అమ్మాయిలు కనిపించారు వాళ్ళ
మధ్య ఒక అమ్మాయి మెరూన్ కలర్ సల్వార్ వేసుకుని 
వెనుక నుంచే 
ఎంతో అందం గా కనిపిస్తూ పొడువాటి జడ అందమైన 
నడుం మీద గా దిగి అటూ
ఇటూ కదులతు ఉంది
అమే నడకే అతడ్ని 
ఆకర్షించింది.... 
అబ్బా ఎం నడుస్తుంది
ఆ నడుం ఇంకా బాగుంది 
సిమ్రాన్ లా అందం అంతా
నడుం లోనే ఉంది
చాలా అందగత్తె అయి ఉంటుంది ఈ భామ అనుకుంటూ
అమే వెనకే నడవాలి అనిపించినట్టు నడుస్తూ 
ఉన్నాడు. 
 

 

 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం-2 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM



Users browsing this thread: 1 Guest(s)