Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1
100.00%
వద్దు
0%
0
0%
Total
1 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ)
#11

"ఆ రోజు నీకొక ప్రత్యేకమైన రోజు కావాలి. నాక్కూడా. " అంది సుందరి.
ఆమె పక్కనే ఉన్న సీమ ఆ మాటలు విని ఆశ్చర్యంతో ఒక్క సారి తలెత్తి సుందరి వైపు చూసింది.
"ఎంత విశాల హృదయం దీనిది? మనసులో ఇంత సంఘర్షణ ఉన్నా దిలీప్ సంతోషం కోసమే తాపత్రయ పడుతోంది. దిలీప్ చాలా అదృష్టవంతుడు. కానీ ఇంకా ఆలస్యం చేస్తే అతను అన్నీ కోల్పోతాడు" అనుకుంది.
ఆ పోటీ పూర్తి కాగానే తనే చొరవ తీసుకుని ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురావాలి అనుకుంది సీమ.
పోటీ ఫైనల్ కి దిలీప్ స్నేహితులందరూ వచ్చారు. వాళ్ళ ఇళ్ళకి దిలీప్ వెళ్లకపోయినా వారంతా వేరేవిధంగా అతన్ని కలుసుకుంటూనే ఉన్నారు.
క్లిష్టమైన ఈ పోటీ కి మరింత శ్రద్దగా ప్రాక్టీస్ చేసిన దిలీప్ తన వంతు రాగానే పాటమొదలు పెట్టాడు. హఠాత్తుగా అతని ముందున్న మైక్ పని చేయటం మానేసింది. అతని పాట వినపడకపోవటం వలన న్యాయ నిర్ణేతలు ఏదో అంటున్నారు కానీ దిలీప్ కి వినబడటం లేదు. ఆ పరిస్థితిలో ఏంచెయ్యాలో అర్ధంగాక దిలీప్ సుందరి వైపు చూసి ఆమె తన స్టూడియో ఉద్యోగుల్ని పిలిచి ఏదో ఒక పరిష్కారం చేస్తుందని నమ్మకంగా చూస్తూ పాట కొనసాగించాడు. అతను తన పాట ఆపి నిర్ణేతల అనుమతితో మైక్ సరి చేసుకోవచ్చేమో గానీ వారు చెప్తున్న మాటలు కూడా వినపడక పోవటంతో అతనికి అలా చేయచ్చో లేదో కూడా తెలియదు. ఇలాగే పాడుతూ పోతే పోటీ ఏమవుతుందో అనే ఆదుర్దాతోనే అతను పాట కొనసాగిస్తుంటే సుందరి అక్కడే తన కుర్చీలో కూర్చుని నింపాదిగా చూస్తోంది. మిగతా వారు నిశ్శబ్దంగా ఉండాలి కనుక వాళ్ళు కూడా కదలకుండా ఆమె ఏదోఒకటి చేస్తుందని ఉత్కంఠ గా ఆమె వైపు చూస్తున్నారు తప్ప ఆమెతో మాటాడలేకపోయారు. దిలీప్ పాట అలాగే పూర్తయిపోయింది.
అంతవరకూ పని చేయని పరికరాలు అప్పుడు పనిచేయటంతో హఠాత్తుగా న్యాయ నిర్ణేతల మాటలు వినిపించాయి. "మీరు ఈ అంశం వరకూ అద్భుతంగా పాడాక ఈ ఆఖరి అంశంలో మీనుంచి మేమెంతో ఆశించాము. కానీ మీ పాట ఒక్క ముక్క కూడా మాకు వినిపించలేదు. మీ పరికరాలు సరిగా లేవని కొంత సమయం తీసుకుని సరి చేసుకోమని మేము చెప్తున్నా మీరు పాట ఆపకుండా కొనసాగించారు. క్షమించండి దిలీప్ గారూ! పోటీ నిబంధనల ప్రకారం మీకు సున్నా కంటే ఎక్కువ మార్కులు ఇవ్వలేము" అన్నాడు ముగ్గురిలో ముఖ్యమైన న్యాయ నిర్ణేత.
అంతవరకూ పనిచేయని పరికరాలు అతని పాట పూర్తి కాగానే ఎలా పనిచేసాయో అని సీమా మిగతా స్నేహితులూ ఆశ్చర్యంగా చూస్తుంటే సుందరి ముఖంలో అప్పుడు నెమ్మదిగా వికసించిన వికృతమైన చిరునవ్వు వారికి కనిపించింది.
"జన్మ దిన శుభాకాంక్షలు దిలీప్" అని పగలబడి నవ్వింది సుందరి.
ఎప్పుడూ చూడని ఆమె ముఖ కవళికలని నిర్ఘాంతపోయి చూస్తున్న దిలీప్ తో "పాటంటే నీకు ప్రాణమనీ అందులోనే నువ్వు అనిర్వచనీయమైన ఆనందం పొందుతావనీ నాకు తెలుసు. పోటీ మీద నీకు లేని ఆసక్తి ని నేనే కలిగించి ఇంత వరకూ వచ్చాక నీలాంటి వాడికి ఏం జరగాలో అదే చేసాను. ఇంతకాలం నాకు కలిగించిన క్షోభకి ఇది జవాబు. ఇక ఆనందంగా వెళ్ళు దిలీప్. నీకు నా శాశ్వతమైన వీడ్కోలు" అని సుందరి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది.
ఆమె మాటలు విని అక్కడ ఉన్న శ్రోతలతో పాటు దిలీప్ నిశ్చేష్టుడయ్యాడు
"సుందరీ. నీకు నామీద కోపం రావటానికి ఎన్నో విలువైన కారణాలు ఉన్నాయని అర్ధమయ్యింది. కానీ అందుకోసం కొన్ని రోజుల ప్రణాళిక వేసుకుని ఎన్నో రకాల ఏర్పాట్లతో ఈరోజు నా మనసు గాయం చేసేటంత కక్ష కలిగేలా నేను నీకు ఏం అపకారం చేసానా అని నేను చాలా బాధపడుతున్నాను. ఏమైనా తప్పు నావైపే ఉన్నపుడు వీలైతే నన్ను క్షమించు" అని చెప్పి అతను కూడా స్టూడియో నుంచి నెమ్మదిగా నడిచాడు.
సీమతో పాటు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల వయసు వచ్చినట్టు కుంగిపోయిన దిలీప్ బలహీనంగా నడుస్తుంటే వెళ్తుంటే అతని జబ్బని పట్టుకుని అతని వెనకే నిశ్శబ్దంగా నడిచిన పల్లవిని ఎవరూ గమనించలేదు.
ప్రతీకారం తీర్చుకున్న విజయ గర్వంతో ఇంటికి వచ్చిన సుందరి ఇంట్లో అడుగు పెడుతూ అనుకోకుండా చూస్తే అవుట్ హౌస్ లో దీపాలు కనపడలేదు. దిలీప్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడని అర్ధం అయ్యింది. అనుకున్నట్టు ప్రతీకారం తీర్చుకున్నాననే సంతృప్తి తో ఉన్న ఆమెకి దిలీప్ అలా సులువుగా వెళ్ళిపోవటం నచ్చలేదు. "ఇక్కడ కూడా ఇంకాస్త దులిపేసి ఉంటె పూర్తిగా తిక్క కుదిరేది కదా! ఇప్పుడు కూడా అతనికి పొగరే అన్న మాట. అవునులే ఆ పల్లవి ఉందిగా అది చూసుకుంటుంది వాడిని" అని కోపంగా అనుకుంది.
ఎన్నో ఏళ్ల క్షోభ మొత్తం ఉపశమనం కలిగాక ఆమె నెమ్మదిగా దిలీప్ గురించి మర్చిపోయి తన దైనందిన చర్యలో మునిగిపోయింది. దిలీప్ స్నేహితులు ఎప్పటిలాగే సుందరిని కలుస్తున్నారు గానీ ఇంతకు ముందులా దిలీప్ ప్రస్తావన ఆమె ముందు తీసుకురావటం లేదు. రెండు రోజులలో ఆమె దాదాపు దిలీప్ ని మరిచిపోయి ఏదో బరువు తీరిపోయినట్టు సంతోషంగా ఉన్నపుడు ఆమె ఊహించని విధంగా సీమ తో పాటు పల్లవి సుందరి దగ్గరికి వచ్చింది.
పల్లవి కనబడగానే పాత కోపాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అయినా దిలీప్ ఎంత ఏడుస్తున్నాడో తెలుస్తుందేమో అని మనసులో కసిగా అనుకుని "ఏమిటిలా వచ్చావు? తలుపులు మూసుకుని పని చేసుకోవటానికి ఏమయినా గదులు కావాలా ?" అని వెటకారంగా అంది సుందరి.
పల్లవి కోపం తెచ్చుకోకుండా చిన్న నవ్వు నవ్వి "అతనికి ఏమి అవసరమో ఆ ఏర్పాట్లు ముందుగానే చేశామండీ. పోటీ ఆఖరు రోజున వెళ్ళిపోవటం కూడా మేము ముందుగా అనుకున్నదే" అంది.
"ఆంటే మీరిద్దరూ వేరే పనులు కూడా పెట్టుకుని మధ్యలో కొన్నాళ్ళకి నన్ను వాడుకున్నారా?" అని అరిచింది సుందరి.
పల్లవి తన సహనం కోల్పోకుండా రెండు పెట్టెలు ఆమె ముందు పెట్టి "వీటిని దిలీప్ మీకిమ్మన్నాడు" అంది.
తన ఆవేశం పట్టించుకోకుండా పెట్టేలిస్తుందేమిటని ఆశ్చర్యంగా చూస్తుంటే "మీ ఇద్దరి దృక్పధంలో ఎన్ని తేడాలున్నా ఇద్దరికీ సమానంగా ఇష్టమైనది సంగీతం. అందుకే మీకోసం సేకరించిన ఈ సంపదంతా దిలీప్ మీకిమ్మన్నాడు. మిమ్మల్ని కలవకుండా ఇచ్చి వెళ్లిపోదామనుకున్నాను కానీ సీమ అడిగే ప్రతి ప్రశ్నకీ వివరాలు ఇవ్వలేకపోవటం వలన నేను మీ దగ్గరికి రాక తప్పలేదు" అంది పల్లవి.
ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న సుందరి తేరుకునే లోపల "ఇక వస్తానండి"అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
సుందరి కోపంతో సీమవైపు తిరిగి "మా ఇద్దరి మధ్య ఏమిష్టాలు ఉన్నాయో ఏమి లేవో కూడా ఆ మహానుభావుడు ఈవిడ గారికి చెప్పేసాడన్న మాట. నన్నిలా బజారులో పెట్టి ఏం సాధిద్దామనుకున్నాడు ? " అంది.
సీమ మొదటి సారి ఆమె వంక అసహ్యంగా చూసి "ఇద్దరి మధ్య ఎంతో సన్నిహితంగా తేల్చుకోవాల్సిన విషయానికి ఎవరెవరినో పిలిచి వాళ్ళందరి ముందూ అతన్ని అవమానించే ప్రయత్నంలో మీ మధ్య సన్నిహితమైన విషయాలన్నీ బైట పెట్టుకున్నది నువ్వా అతనా?" అంది.
"ఏమన్నావ్?" అని ఆగ్రహంతో వణికిపోతున్న సుందరితో "నన్ను తిట్టటం, నన్ను ఉద్యోగం లోంచి తీసెయ్యటం తర్వాత చేసుకోవచ్చు గానీ అతని ఆఖరి దశలో చూడాలనుకుంటే నీకింకా అతి కొంచెం సమయం ఉంది" అంది.
పిడుగు పడినట్టు వినపడిన ఆ మాటలతో నిశ్చేష్టురాలయిన సుందరి మీద ఏమాత్రం జాలి చూపించకుండా "నీకంతా చెప్పలేను గానీ ఓపికుంటే ఏ కాస్తా విను. పల్లవి అతని వైద్యం కోసం నియమించబడిన మనిషి. అతను దూరప్రదేశమని చెప్పి వెళ్ళినది సిద్దవైద్యం కోసం కేరళకి. విదేశాలకి కాదు. ఆమెని ఇక్కడికి తెచ్చుకున్నది కూడా నీతో గడిపే ఆ కాసిని రోజులూ తన ఊపిరి నిలుపుకోవటానికే. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు కనుక అతని ఆఖరి దశ కొంచెం త్వరగానే వచ్చేసింది. నే చెప్పేది అర్ధమవుతోందనుకుంటా" అంది.
ఏమాత్రం హెచ్చరిక లేకుండా పిడుగు లాంటి నిజం వింటున్న సుందరితో "ఒక మనిషికి మానసికంగా పూర్తిగా దాసోహం కావటం కన్నా గొప్పగా ప్రేమని ప్రకటించే పద్దతి ఇంకొకటి నీకు తెలుసా సుందరీ? మోకాళ్ళ మీద కూర్చుని ఒక గులాబీ పువ్వు ఇచ్చి చవకబారుగా ఐ లవ్ యు అంటేనే ప్రేమా? తల్లి చనిపోతే అతనికి స్వాంతన నీ దగ్గరే కావాలి. తన చివరి రోజులు సంతోషంగా గడపాలనుకుంటే అతనికి గుర్తొచ్చింది నువ్వు. ఇన్ని రోజులు కేరళలో తన పనులు తాను ఏర్పాటు చేసుకోగలిగిన వాడు నీ దగ్గర మాత్రం అన్నీ నీకే వదిలేయటంలో అతను చూపించిన దగ్గరితనం నీకు తెలియలేదా? ఆ మూడు ముక్కల చవకబారు మాటల కోసం ఎదురు చూస్తూ ఆ మాట చెప్పలేదని అతని మీద పగ పెంచుకున్నావు. ఎంతో సున్నితమైన దశలో అతని తోడుగా ఉండవలసినది అతనిని పని కట్టుకుని గాయపరిచావు. ఎప్పుడైనా తన స్వంతమంటూ ఉంటె అది నువ్వే అనే నమ్మకం ఎప్పుడైతే పోయిందో దానితోపాటే అతనికి బతకాలనే కోరికా నశించింది. ఇంకొన్ని రోజులు నడవాల్సిన వైద్యం ఆగిపోయింది. ఇప్పుడు అతని జీవితం గంటల్లో ఉంది సుందరీ" అంది సీమ.
సుందరి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే అతికష్టం మీద గొంతు పెకల్చుకుని "మనం ఎక్కడికి వెళ్ళాలి?" అంది.
....
వాళ్ళు వెళ్తున్న దారిలోనే సుందరి తన సిబ్బందికి ఫోన్ ఎన్నో సూచనలు ఇస్తూనే ఉంది.
వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళేటప్పటికి వందలమంది అతని గది బైట నిల్చున్నారు. లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడో అతనినుంచి సాయం పొందినవారితో పాటు అతని చిన్న నాటి స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. తనే అందరికంటే ఆఖరు!
"ఇంత వరకూ తన లాంటి రోగులకు తన అనుభవంతో వారికి అనుకూలమైన సలహాలిస్తూ వారికి మానసికంగా కొంచెం తెరిపినిస్తూ గడుపుతున్నతను రోగం విషమించటం వలనఇప్పుడే వాలిపోయాడు. ఇంక నిముషాలలోనే ఉందట" అని ఎవరో అంటున్నారు.
సుందరి కన్నీళ్లతో వింటుండగా ఆమె సూచనలు తీసుకుని అక్కడ కి వచ్చిన ఆమె బృందం తమ వాయిద్యాలు తీసుకున్నారు. ఆమె సూచించిన విధంగా అనుపత్రి అనుమతితో వాళ్ళు దిలీప్ పాడిన పాటలనే మళ్ళీ వాయిద్యాల సహకారంతో వినిపిస్తున్నారు. అతనికి ఎంతో ఇష్టమైన దేశ దేశాల పాటలు ముఖ్యంగా బెంగాల్, ఆఫ్రికా, అరబిక్ సంగీతాలు కూడా మంద్రంగా వినిపిస్తున్నారు.
కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి తీస్తున్న దిలీప్ కి ఇదంతా వినపడుతోందో లేదో సుందరికి తెలియటం లేదు. తన ఆర్ధిక పరిస్థితుల వలన సంగీతం పైన ప్రేమని మనసులోనే దాచుకుని కేవలం సుందరికి తప్ప చెప్పుకోని అతని అభిరుచులన్నిటికీ సరితూగేలా సేకరించిన సంగీతాన్ని అతనికి ఎలా అయినా వినిపించాలని ఆదుర్దా గా ఉన్న సుందరి అక్కడే ఉన్న పల్లవి వైపు దీనంగా చూస్తుంటే అర్ధం చేసుకున్న పల్లవి దిలీప్ చెవి వరకూ వెళ్లి నెమ్మదిగా ఏదో చెప్పింది. సుందరి అన్న మాట విని కాబోలు దిలీప్ భారంగా కళ్ళు తెరిచాడు. తన ఎదురుగా సుందరి ని బరువుగా మూసుకుపోతున్న కళ్ళతో చూసాడు. అనుకోకుండా ఆమె ని చూడగానే లోతుగా నీరసంగా సగం మూసుకుని ఉన్న అతని కళ్ళలో ఒక చిన్న మెరుపు లీలగా కనిపించింది. ముఖం లో మరేభావాలు తెలియకపోయినా గదిలో మంద్రంగా వినిపిస్తున్న సంగీతం అతను వింటున్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడలేని నిస్సహాయతతో పల్లవి వైపు తిరిగి చిన్నగా పెదవులు కదిపాడు. అంచెలంచెలుగా పోతున్న ఆఖరు ఊపిరితో శబ్దం బైటికి రాకుండా అతను చెప్పదలచిన విషయం సుందరికి మాత్రమే తెలిసింది.
"కథ ముగిసింది"
ఈసారి పూర్తిగా ముగిసిపోయింది.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ) - by k3vv3 - 04-11-2025, 06:36 PM
RE: అమలిన శృంగార కథలు - by satishmolleti - 11-11-2025, 10:20 AM
RE: అమలిన శృంగార కథలు - by k3vv3 - 14-11-2025, 09:15 AM
RE: అమలిన శృంగార కథలు - by k3vv3 - 14-11-2025, 04:58 PM
RE: అమలిన శృంగార కథలు - చీకటి - by k3vv3 - 20-11-2025, 12:54 PM
RE: అమలిన శృంగార కథలు - వంశీమోహనం - by k3vv3 - 29-11-2025, 02:50 PM
RE: అమలిన శృంగార కథలు - చిలిపి మాలతి - by k3vv3 - 13-12-2025, 02:49 PM
RE: అమలిన శృంగార కథలు - అనూఢ (శృంగార కథ) - by k3vv3 - 25-12-2025, 04:49 PM
RE: అమలిన శృంగార కథలు - అనూఢ (శృంగార కథ) - by k3vv3 - 25-12-2025, 04:51 PM
RE: అమలిన శృంగార కథలు - అనూఢ (శృంగార కథ) - by k3vv3 - 25-12-2025, 04:54 PM
RE: అమలిన శృంగార కథలు - అనూఢ (శృంగార కథ) - by k3vv3 - 25-12-2025, 04:55 PM
RE: అమలిన శృంగార కథలు - కథ ముగిసింది - by k3vv3 - 03-01-2026, 10:11 AM
RE: అమలిన శృంగార కథలు - శ్రీమతి డైరీ - by k3vv3 - 17-01-2026, 05:31 PM
RE: అమలిన శృంగార కథలు - ఫస్ట్ లవ్ - by k3vv3 - 26-01-2026, 02:27 PM
RE: అమలిన శృంగార కథలు - ఉప్పు-ఉసిరికాయ - by k3vv3 - 08-02-2026, 07:13 PM
RE: అమలిన శృంగార కథలు - పంతం పద్మజ - by k3vv3 - 15-02-2026, 08:06 PM
RE: అమలిన శృంగార కథలు - జగడం - by k3vv3 - 20-02-2026, 04:53 PM
RE: అమలిన శృంగార కథలు - తొమ్మిడిడ్లీలు రెండ్రుపాయలు - by k3vv3 - 27-02-2026, 02:16 PM
RE: అమలిన శృంగార కథలు - సుబ్బారావు శోభనం - by k3vv3 - 06-03-2026, 06:01 PM
RE: అమలిన శృంగార కథలు - కంచె - by k3vv3 - 18-03-2026, 02:22 PM
RE: అమలిన శృంగార కథలు - కంచె - by k3vv3 - 18-03-2026, 02:23 PM
RE: అమలిన శృంగార కథలు - శయనేషు రాణి - by k3vv3 - 24-03-2026, 09:58 AM
RE: అమలిన శృంగార కథలు - శ్రీనివాస్..ద సోల్జర్ - by k3vv3 - 31-03-2026, 09:57 PM
RE: అమలిన శృంగార కథలు - శ్రీనివాస్..ద సోల్జర్ - by k3vv3 - 31-03-2026, 10:00 PM
RE: అమలిన శృంగార కథలు - శ్రీనివాస్..ద సోల్జర్ - by k3vv3 - 31-03-2026, 10:01 PM
RE: అమలిన శృంగార కథలు - అమృత - by k3vv3 - 06-04-2026, 05:38 PM
RE: అమలిన శృంగార కథలు - అమృత 2 - by k3vv3 - 13-04-2026, 09:41 AM
RE: అమలిన శృంగార కథలు - అమృత 2 - by k3vv3 - 13-04-2026, 09:45 AM
RE: అమలిన శృంగార కథలు - కేకిసలు - by k3vv3 - 24-04-2026, 09:10 AM
RE: అమలిన శృంగార కథలు - పక్కింట్లో చెప్పా - by k3vv3 - 02-05-2026, 02:55 PM
RE: అమలిన శృంగార కథలు - ఎ రొమాంటిక్ జర్నీ - by k3vv3 - 11-05-2026, 10:09 AM
RE: అమలిన శృంగార కథలు - స్నానం - by k3vv3 - 19-05-2026, 11:00 AM
RE: అమలిన శృంగార కథలు - పెళ్ళైన కొత్తలో - by k3vv3 - 28-05-2026, 07:48 AM
RE: అమలిన శృంగార కథలు - పెళ్ళానికి ప్రేమతో - by k3vv3 - 07-06-2026, 01:34 PM
RE: అమలిన శృంగార కథలు - వంశీమోహనం - by k3vv3 - 22-06-2026, 10:25 AM
RE: అమలిన శృంగార కథలు - వంశీమోహనం - by k3vv3 - 22-06-2026, 10:26 AM
RE: అమలిన శృంగార కథలు - సుభద్రార్జునీయం - by k3vv3 - 02-07-2026, 12:10 PM
RE: అమలిన శృంగార కథలు - అందె ఉంగరం - by k3vv3 - 10-07-2026, 01:04 PM
RE: అమలిన శృంగార కథలు - ..హాయిగా ఆమని సాగే.. - by k3vv3 - 18-07-2026, 12:35 PM
RE: అమలిన శృంగార కథలు - మమతల వసంతం నవ్వింది - by k3vv3 - 28-07-2026, 10:39 AM
RE: అమలిన శృంగార కథలు - తానే నేనై - by k3vv3 - 03-08-2026, 05:46 PM
RE: అమలిన శృంగార కథలు - అందమైన తల్లి - by k3vv3 - 10-08-2026, 10:27 AM
RE: అమలిన శృంగార కథలు - గృహిణి - by k3vv3 - 15-08-2026, 12:45 PM
RE: అమలిన శృంగార కథలు - ఉప్పు-ఉసిరికాయ - by k3vv3 - 25-08-2026, 08:11 AM
RE: అమలిన శృంగార కథలు - గతమెంతో...వైభవమే! - by k3vv3 - 02-09-2026, 08:35 AM
RE: అమలిన శృంగార కథలు - ఆ రాత్రి - by k3vv3 - 10-09-2026, 01:17 PM
RE: అమలిన శృంగార కథలు - ఏ1 ఫార్ములా - by k3vv3 - 19-09-2026, 10:18 PM
RE: అమలిన శృంగార కథలు - మరో భారతానికి పునాది'(శృంగార కథ) - by k3vv3 - 04-10-2026, 01:59 PM
RE: అమలిన శృంగార కథలు - ధీర వనిత ప్రేమ కథ - by k3vv3 - 14-10-2026, 01:05 PM
RE: అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ) - by parinda35 - 17-10-2026, 06:46 AM
RE: అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ) - by k3vv3 - 26-10-2026, 02:10 PM
RE: అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ) - by k3vv3 - 05-11-2026, 01:51 PM
RE: అమలిన శృంగార కథలు - దయ్యం వలచిన రాత్రి(శృంగార కథ) - by k3vv3 - 05-11-2026, 01:54 PM



Users browsing this thread: