Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - నేను నా అమ్మమ్మ
#62
అమ్మమ్మ కథలు - 3
తొందరపాటు

రచన : సుధావిశ్వం

 
అందరూ చిరంజీవి టైం మిషన్ తో కనెక్ట్ అయ్యారుగా..

  
అమ్మమ్మా! కథ చెప్పు మేము రెడీ అంటూ మా చిన్న చెల్లి వచ్చి అమ్మమ్మ వొళ్ళో పడుకుంది.

   "
సరే విఘ్నేశ్వర ప్రార్ధన చెబుతారా మరి" అంది అమ్మమ్మ.
వెంటనే గబగబా చెప్పేసి కూర్చున్నాం కథ వినడానికి ఆతృతగా...

                ### 3 ###

తొందరపాటు : కథ

  
అమ్మమ్మ కథ మొదలు పెట్టింది. 
         "
ఎవరో ఏదో చెప్పగానే, ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతో అనర్ధం జరుగుతుంది. ఆ తర్వాత తప్పు చేశామని బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆ తప్పును సరిదిద్దలేము. అందుకే ఏదో ఒకటి చూడగానే , ఎవరో చెబితే వినగానే ఒక నిర్ధారణకు రాకూడదు అని తెలిపే కథ ఇది. వినండి మరి!"

    
ఒక ఊరిలో ఒక రైతు వున్నాడు. అతనికి లేక లేక ఒక కొడుకు ఎన్నో ఏళ్లకు పుట్టాడు. ఎంతో అపురూపంగా పెంచు కుంటున్నాడు.
  
ఆ ఊరికి పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. అందువల్ల ఆ ఊళ్ళోకి పాములు ఎక్కువగా వచ్చేవి. తను ఇంట్లో లేనప్పుడు పాములు వస్తే బాబును కరుస్తాయి అని ఆలోచించి, ఒక ముంగిసను తెచ్చి పెంచుకో సాగాడు. దానికి బలం కోసం కావాల్సిన తిండి పెట్టేవాడు. అంతా బాగానే వుంది.

  
ఒకరోజు అతను పొలానికి వెళ్ళాడు. అతని భార్య బయట ఏదో పనిలో ఉంది. ఆ సమయంలో ఒక నల్ల త్రాచు ఇంటిలోకి ప్రవేశించింది. నెమ్మదిగా బాబు ఉన్న ఉయ్యాల పైకి పాకబోతోంది. అప్పుడు ముంగిస ఆ పామును చూసింది.
  
వెంటనే ముంగిస పాము పైకి దూకి లాగింది. పాము , ముంగిసల మధ్య భీకర పోరాటం జరిగింది. చివరికి ముంగిస పామును కొరికి చంపేసింది.  దాని నోరంతా రక్తసిక్తం అయ్యింది.

  
అదే సమయంలో పొలం నుంచి  రైతు రాగా ముంగిస ఎదురు వెళ్లి ఏదో చెప్పడానికి శబ్దం చేసింది. అది చూసిన రైతు ముంగిస తన కుమారుని పొట్టన బెట్టుకుంది అనే నిర్ణయానికి వచ్చాడు.
"
నీకు తిండి పెట్టి ప్రేమగా పెంచితే, నా కొడుకునే చంపుతావా?" అంటూ ఆగ్రహంతో పెద్ద దుడ్డు కర్ర తీసుకుని ముంగిసను చావబాదుతాడు.
  
దానికి విషయం వివరించి చెప్పడానికి నోరు లేదు. పాపం అది మరణిస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తాడు రైతు. అక్కడ తన పిల్లవాడు హాయిగా వున్నాడు ఉయ్యాలలో. పక్కన పాము ముక్కలై పడి ఉంది.
    
అది చూసి 'ముంగిసను తప్పుగా అనుకున్నాను. అది నా బాబును కాపాడితే, నేను దాన్ని చావగొట్టి, చంపాను!" అని కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు.

   "
ఎంత ఏడిస్తే ఏమి ప్రయోజనం? దాని ప్రాణాలు తేలేడుగా! ముందుగా ఒకసారి లోపలికి వచ్చి, చూసి ఉంటే బావుండేది. అలా ఏమీ ఆలోచించకుండా ఇలా నిర్ణయం తీసుకున్నాడు.  అందుకే తొందరపాటు పనికి రాదు. అర్ధమయ్యిందా పిల్లలూ!" అంది అమ్మమ్మ.

   
మాకైతే ఆ ముంగిస చనిపోయి నందుకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తుంటే అమ్మమ్మ
"
అలా ఏడువకూడదు. మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే, ఏమీ కాదు. ఈ కథ లోని నీతి తెలుసుకుని జీవితంలో అలా నడుచుకోవాలి!" అని వివరించింది.

  "
ఇక ఆలస్యం అయ్యింది పడుకోండి. రేపు మరో మంచి కథ చెప్పుకుందాం" అంటూ

"
రామా లాలి, మేఘశ్యామా లాలి, తామారాసా నయన దశరథ తనయ లాలి" అంటూ పాట పాడింది మేము పడుకోడానికి.

అలా నిద్రలోకి జారుకున్నాం...

కృష్ణార్పణమస్తు
?????
సుధావిశ్వం
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - అమ్మమ్మ కథలు :- 2 - by k3vv3 - 27-11-2025, 09:32 AM



Users browsing this thread: