Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - శిఖండి
"ఇక విచిత్ర స్త్రీల విషయానికి వస్తే వీరు శాస్త్రీయ 
 విజ్ఞానం ను, కాల గమన విజ్ఞానం ను అతిగా అవహేళన చేసి సరస్వతీ మాత శాపానికి గురయ్యారు. విదూరథుడు అందిస్తుండగా నువ్వు ప్రయోగించిన శర స్పర్శ వలన వారికి శాప విమోచనం కలిగింది. ఇకపై వీరు మీ రాజ్యాలలోనే ఉంటారు. వారిని ఆదరించండి. " అని సంప్రియ విదూరథులతో బ్రహ్మ దేవుడు అన్నాడు. 



ఇరువురు " చిత్తం విధాత" అని అనడంతో బ్రహ్మ దేవుడు అదృశ్యం అయ్యాడు. 



 "సంప్రియ.. నువ్వు పుట్టింట ప్రదర్శించే సమర విద్యల నైపుణ్యం కనులార చూడాలి అనీ, నీకు సారథిగా కొంత కాలం ఉండాలి అనీ చంద్ర వంశ రాజు విదూరథుడు నీ చెంతకు మారు వేషంలో వచ్చాడు. అంతేగానీ మరో ఉద్దేశంతో నీ చెంతకు రాలేదు. " అని సంప్రియ తో విదూరథుడు అన్నాడు. 



"మీ ఉద్దేశం ఏమైన మనమందరం విధాత రాతను అనుసరించక తప్పదు" అని సంప్రియ విదూరథునితో, స్త్రీలతో మగథ కు చేరుకుని జరిగినదంతా తండ్రికి చెప్పింది. 
మగథ రాజు విదూరథుని సముచితంగా సత్కరించాడు. స్త్రీలకు తగిన పదవులు ఇచ్చాడు. మహర్షుల ద్వారా శుభాంగి కురు మహారాజు లకు సంప్రియ విదూరథుల వివాహాది విషయాల వర్తమానం పంపించాడు.
 
శుభాంగి కురు మహారాజు, మగథ మహారాజు, మహర్షులు, దేవర్షులు, దేవతలు, ప్రజల సమక్షంలో సంప్రియ విదూరథుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 
 దేవతలకు రాక్షసులకు జరిగిన అనేక యుద్దాల లో అనేక పర్యాయాలు సంప్రియ విదూరథులు దేవతలకు సహాయపడ్డారు.
 
ఒకనాడు ఉద్యానవనం లో సంచరిస్తూ ఏదో ఆలోచిస్తున్న విదూరథుని దగ్గరకు సంప్రియ వచ్చింది. భర్త ముఖం చూసి, " ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" అని సంప్రియ అడిగింది. 



విదూరథుడు ధర్మపత్ని సంప్రియ మాటలను విని, "ఏం లేదు దేవి. మీ తండ్రి గారు నాకు అనేకానేక కానుకలను ఇచ్చారు. అందులో జాపత్రి రథం కూడా ఉంది. రథాన్ని నడిపే సామర్థ్యం నాకైతే ఉంది కానీ అందరికీ లేదు. అందుకే అసలు అశ్వములు లేకుండా రథాన్ని ఎలా నడపాలి? అని ఆలోచిస్తున్నాను " అని సంప్రియ తో విదూరథుడు అన్నాడు. 



"జాపత్రి రథం ను అశ్వములు లేకుండా నడుపుట. !!! అంటే అనశ్వములతో జాపత్రి రథం నడుచుట. బాగుంది బాగుంది మీ సరిక్రొత్త ఆలోచన. " అని సంప్రియ, భర్త విదూరథుని సమాలోచన ను ప్రశంసించింది. 



సంప్రియ విదూరథుల సుపుత్రుడు అనశ్వుడు. 



 శుభం భూయాత్
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - అమృత - by k3vv3 - 26-11-2025, 12:25 PM



Users browsing this thread: