26-11-2025, 12:24 PM
జాపత్రి రథం లో ఉన్నవారు శత్రువుకు అంత సులభం గా కనపడరు. ఒకవేళ ఏదన్నా శక్తి వలన కనపడినా మసకమసకగా కనపడతారు. రకరకాల స్వభావాలతో కనపడతారు. జాపత్రి రథంలో ఉన్న ఇలాంటి అనేక ప్రత్యేకతన్నీ సంప్రియకు బాగా తెలుసు. సంప్రియ తయారు చేసిన ఆయుధాలను చూసి మగథ రాజు మహదానంద పడ్డాడు. కుమార్తె మేథో సామర్థ్యాన్ని పలు రీతులలో ప్రశంసించాడు. కుమార్తె కు పలు బహుమతులను ఇచ్చాడు.
సంప్రియ తయారు చేసిన ఆయుధాల గురించి విదూరథూనికి తెలిసింది. జాపత్రి రథం నడిపే సమర్థుడైన రథ సారథి నిమిత్తం సంప్రియ అన్వేషణ చేస్తుందన్న విషయం కూడా విదూరథునికి తెలిసింది.
విదూరథుడు మహర్షులందరిని పిలిచి, " మహర్షోత్తములారా! మగధ రాజ కుమార్తె సంప్రియ జాపత్రి రథం తయారు చేసినట్లు నాకు తెలిసింది. జాపత్రి రథం గురించి వేదాలలో నేనూ చదివాను. సమర రంగాన దాని వలన కలిగే ప్రయోజనాలు గురించి కూడా నాకు బాగా తెలుసు. వేద పురాణేతిహాసాది గ్రంథాలలో ఊహలు ఎక్కువ. సశాస్త్రీయత తక్కువ అని కొందరు అంటారు. నిజమే. అయితే ఆ ఊహలలో కొన్ని ఊహలు ప్రయోగ శాలలో విజయవంతమైతే వాటి ప్రయోజనాలు అసంఖ్యాకం అన్నది అక్షర సత్యం.
సంప్రియ వేద పురాణేతి హాసాదుల సహాయం తో రెండు ఆయుధాలను స్వంతంగా తయారుచేసి, తన రాజ్యాన్ని మహా శక్తివంతం చేసుకుంది. జాపత్రి రథం ను సమర రంగాన ఒడుపుగా నడపగల సారథి నిమిత్తం ఆమె అన్వేషణ సాగిస్తుందన్న వార్త మాకు తెలిసింది. " అని అన్నాడు.
విదూరథుని మాటలను విన్న మహర్షులు, "రాజా..
ఎలాంటి రథాన్ని అయినా సరే అధిరోహించి ఆహవ రంగాన నిలవడమే కాదు ఎలాంటి రథమునైన సరే కడకు త్రిమూర్తుల, త్రిమాతల రథాలనైన సరే ఒడుపుగా కడు నైపుణ్యం తో నడపగల సామర్థ్యం మీకు ఉంది కదా?" అని రాజుతో అన్నారు.
మహర్షుల మాటలను విన్న విదూరథుడు, "ఉంది. త్రిమూర్తుల, త్రిమాతల రథాలను నడిపిన అనుభవం కూడా నాకు పుష్కలంగా ఉంది. అమ్మ సరస్వతీ మాత హంసవాహినియై తన రథమును అధిరోహించగా, ఆ తల్లికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆమె అధిరోహించిన రథమును నడిపిన నాటి జ్ఞాపకాలను నేను ఇప్పటికీ అసలు మరువలేను.
అందుకే తల్లిదండ్రుల అనుమతి తో, మీ సహాయ సహకారాలతో మారు వేషంలో సంప్రియ రథ సారథి గా కొంతకాలం ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం లో మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.
"మీది ప్రశస్తమైన ఆలోచన రాజ.. సంప్రియ సమర తేజమే కాదు సరస్వతీ మాత తేజం కూడా పుష్కలంగా ఉన్న మహిళామణి. " అని రాజు విదూరథునితో మహర్షులు అన్నారు.
విదూరథుడు తల్లిదండ్రుల, మహర్షుల ఆశీస్సులు తీసుకుని మారు వేషంలో మగథ కు వెళ్ళాడు. హితులతో, సన్నిహితుల తో కురు మహారాజు హస్తినాపుర రాజ కార్యాలను చక్క దిద్ద సాగాడు. వివిధ భంగిమల్లో రథమును నడిపే విదూరథుని సారథ్య నైపుణ్యం ను చూసిన సంప్రియ మారు వేషంలో ఉన్న విదూరథునికి జాపత్రి రథం నడిపే బాధ్యతలను అప్పగించింది.
జాపత్రి రథం సంప్రియ అధిరోహించగానే మారు వేషంలో ఉన్న విదూరథుడు జాపత్రి రథాన్ని జన నాశకాసురి వనానికి తీసుకు వెళ్ళాడు. ఆ వనంలో అందరూ స్త్రీలే ఉన్నారు. వారి వస్త్రధారణ చిత్రాతి చిత్రంగా ఉంది. కొందరు బాహువుల నిగారింపు కనపడే వస్త్రాలను ధరించారు. మరికొందరు ఊరువుల నిగారింపు కనపడే వస్త్రాలను ధరించారు.
ఇంకొందరు ఉదర నిగారింపు కనపడే వస్త్రాలను ధరించారు. ఉదర నిగారింపు కనపడే వస్త్రాలను ధరించిన స్త్రీల నాభి మూడవ కన్ను ఆకారంలో ఉంది.
అలాగే కొందరు స్త్రీలకు కన్ను మీద కన్నుతో నాలుగు కళ్ళు కలిగి ఏకాదశ రంధ్రాలతో ఉన్నారు. ఇలా రకరకాల ఆకారాలతో ఉన్న ఆ స్త్రీలు అందరూ కలిసి పెద్ద గా పాడితే కొండ గుహల పెచ్చులు రాలిపోతున్నాయి. వారంతా జాపత్రి రథంలో ఉన్న సంప్రియ, విదూరథులను సరిగా చూడలేక పోయారు. జాపత్రి రథం ను అదేదో అసురాసుర రథం అనుకుని రథం మీద కు పెద్ద పెద్ద రాళ్ళను వేసారు.
సంప్రియ ఆ రాళ్ళన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. కడకు ఆ స్త్రీలందరిని సమరంలో ఓడించి బంధించింది.
అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సంప్రియ, విదూరథుని ఆశీర్వదించాడు. బ్రహ్మ దేవుని ముందు విదూరథుడు తన స్వస్వరూపాన్ని ధరించాడు.
అనంతరం బ్రహ్మ దేవుడు, "సంప్రియ.. నువ్వూ విదూరథుడు భార్యాభర్తలు అవ్వాలి. ఇది మీ కర్మానుసార ఫలింతంగా మీకు సంప్రాప్తించిన తలరాత. విదూరథునికి నువ్వన్నా, నీ మేథోసంపద అన్నా మహాయిష్టం. మీరు ఇరువురు ఏకం అయితే అసుర సంహార విషయంలో దేవతలకు కూడా మీరు సహాయ పడగలరు. " అని అన్నాడు.
"బ్రహ్మ దేవ, ! మీ మాట జీవ కాల గమన జ్ఞానం. దానిని అధిగమించడం ఎవరికి సాధ్యం కాదు." అని సంప్రియ బ్రహ్మ దేవునికి నమస్కరిస్తూ అంది.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)