21-11-2025, 09:18 AM
అనుకున్నదొక్కటి, అయినదొకటి
అత్తగారి కథలు - పార్ట్ 11
![[Image: A.jpg]](https://i.ibb.co/4wQWrvY8/A.jpg)
రచన: L. V. జయ
జాగృతిని అత్తగారింటి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది వాళ్ళ అమ్మా లత. "జాగృతి, మీ అత్తగారి తరపు వాళ్ళందరూ వేదాంత పండితులుట. మీ మావగారి తరపువాళ్ళు, బాగా
చదువుకున్నవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నవాళ్ళుట. వాళ్ళకి మర్యాద, మన్ననలు, పద్దతి, సంప్రదాయాలు చాలా ఎక్కువని మీ అత్తగారు చెప్పారు. అలాంటివాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్తున్నావు. జాగ్రత్తగా ఉండు. అందరితో ఆచితూచి మాట్లాడు" అంది లత.
సహజంగానే నెమ్మదస్తురాలైన జాగృతి, అత్తగారింట్లో అడుగుపెట్టిన రోజు, భయంతో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గడిపింది.
మర్నాడు ఉదయం, టీవీ లో సుప్రభాతం మొదలయ్యే సమయానికి లేచింది జాగృతి. అప్పటికే లేచున్న జాగృతి అత్తగారు రాధ, ఇంటి బయట ముగ్గులు వేస్తుంటే, మావగారు మాణిక్యాలరావు, ఇంటి బయట అరుగుమీద న్యూస్ పేపర్ చదువుతున్నాడు. సుప్రభాతం అయ్యే సమయానికి లేచాడు జాగృతి భర్త సమర్థ్. తరువాత వచ్చిన అన్నమయ్య పాటలు వింటూ, పాడుకుంటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు.
ఆ ఇంటి వాతావరణాన్ని, ఆ ఇంట్లో వాళ్ళ ప్రశాంతతని చూసి ఆనందపడింది జాగృతి. 'ఇలాంటి ఇంట్లోకి రావాలని కదా అనుకున్నాను. నా కోరిక తీరింది. వీళ్ళ గురించి, అమ్మ చెప్పిందంతా నిజమే. ' అని మనసులోనే భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంది.
కానీ కాసేపట్లో, రాధ అరిచిన అరుపుతో, ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది. "నీళ్లు రావటం లేదు. వెళ్ళి మోటర్ వెయ్యి. " అని వంటింట్లోంచి అరుచుకుంటూ బయటి వచ్చింది రాధ.
అరుగుమీద పడకకుర్చీలో, ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుతున్న మాణిక్యాలరావు తుళ్ళిపడి లేచి, పరిగెడుతూవెళ్ళి, మోటర్ వేసి వచ్చాడు. రాధ, మోటర్ వెయ్యమని సమర్థ్ కి చెప్పిందో, మాణిక్యాలరావుకి అర్ధంకాలేదు జాగృతికి.
రాధ, ఇంకా అరుస్తూనే ఉంది. "ఎంతసేపూ ఆ పేపర్ చదువుతూ కూర్చుంటాడు. ఎవరిని ఉద్దరించడానికో తెలియదు? ఇంతకీ ఏం చదువుతున్నావ్?" అంటూ మాణిక్యాలరావు చేతిలోనున్న పేపర్ ని లాక్కుని చూసింది రాధ. "అనుకున్నాను. ఇవే చూస్తూండుంటావ్. అందుకే నీకు వినపడలేదని. ఈ వయసులో, ఈ కోరికలేంటో. రేపటినుండి పేపర్ మాన్పించేస్తాను. తిక్క కుదురుతుంది." అని తలకొట్టుంది.
రాధ, మాణిక్యాలరావుని ఏకవచనంతో సంబోధించడం, ఆవిడ మాటతీరు, జాగృతిని ఆశ్చర్యానికి గురిచేశాయి. 'వేదాంత పండితుల కుటుంబం అన్నారు. మరి ఇలా మాట్లాడుతోందేమిటి ఈవిడ?' అనుకుంది.
ఏమీ పట్టనట్టు అన్నమయ్య పాటలు వింటున్న సమర్థ్ ని చూసి కోపం పెరిగిపోయింది రాధకి. "నా గురించి ఎవరికీ పట్టదు ఈ ఇంట్లో. ఈ మనిషితో ఇక ఉండలేను. తల పేలిపోతోంది. ఇక ఆ భక్తి ఛానల్ ఆపి, ఏదైనా సినిమా ఛానల్ పెట్టు. ఆ సినిమాలు చూస్తూ అయినా, నా బాధల్ని మర్చిపోతాను” అంది రాధ. సరేనంటూ, రాధ చెప్పినట్టు చేసాడు సమర్థ్.
ఫలహారం చేస్తూ, టీవిలో వస్తున్న సినిమా చూసారందరూ. రాధ పక్కనే వచ్చి కూర్చున్నాడు మాణిక్యాలరావు. సినిమా మొదలైన కాసేపటికి, దంపతులిద్దరూ, మాములుగా మాట్లాడుకున్నారు. సినిమా హీరోల గురించి, వాళ్ళ మధ్య చుట్టరికాలగురించి, హీరోలు వాళ్ళ కొడుకుల్ని సినిమాల్లోకి తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తున్నారన్న విషయాల గురించి మాట్లాడుకున్నారు. 'కొంతసేపటి క్రితమే భర్త మీద అరిచినావిడ, ఇప్పుడు ఏమీ జరగనట్టు మామూలుగానే మాట్లాడుతోందే!!' అనుకుంది జాగృతి.
మధ్యాహ్నం భోజనాల సమయానికి, ఇంకో మొదలయ్యింది. సినిమా మొదలవడంతోనే, మళ్ళీ సినిమాల గురించి చర్చ కూడా మొదలయ్యింది. ఈ సారి, హీరోల హెయిర్ స్టైల్స్ గురించి, హీరోయిన్లు వేసుకునే పొట్టి బట్టల గురించి, హీరో, హీరోయిన్ మధ్య సంబంధాలు గురించి మాట్లాడుకున్నారు ఇద్దరూ.
మాణిక్యాలరావు మాటతీరు కూడా నచ్చలేదు జాగృతికి. 'ఇదేమిటి? ఏ అంశం గురించి అయినా, ఎలాంటి అభ్యన్తరం లేకుండా, మాట్లాడుకుంటున్నారే!! మావగారిది చదువుకున్నవాళ్ళ, ఉన్నతాధికారుల కుటుంబం అన్నారు అమ్మ. వీళ్ళ గురించి అమ్మ చెప్పింది నిజమేనా?' అన్న అనుమానం వచ్చింది.
జాగృతికి సినిమాలు చూడడం అలవాటులేదు. సినిమా గురించి ఏమీ తెలియదు. ఒకేరోజు రెండు సినిమాలు చూడడంవల్ల, సినిమాల ఆగకుండా చర్చలు జరుగుతుండడంవల్ల, తలనొప్పి మొదలయ్యి, కాసేపు విశ్రమిద్దామనుకుని, తన రూంలోకి వెళ్ళింది.
జాగృతి వెనకే, సమర్థ్ వచ్చాడు కోపంగా. వీళ్ళ మధ్య ఎదో జరగబోతోందన్న కుతూహలంతో, రాధ, మాణిక్యాలరావుని పిలిచి, రూం బయట నుంచుంది. లోపల జరుగుతున్న సంభాషణని విన్నారు ఇద్దరూ.
"నిన్న నువ్వు వచ్చినప్పటినుండి చూస్తున్నాను. ఎవరితోనూ మాట్లాడలేదు నువ్వు. అక్కడ అందరం సరదాగా మాట్లాడుకుంటుంటే, నువ్వు ఒక్కదానివి ఇక్కడికి వచ్చేసావ్. నీకు పెద్దవాళ్ళంటే గౌరవం లేదా? మా ఇల్లు, మేమూ నీకు నచ్చలేదా?" జాగృతిని అడిగాడు సమర్థ్.
"అయ్యో. అలాంటిది ఏమీ లేదు. నాకు సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు లేదు. సినిమాల గురించి కూడా పెద్దగా ఏమీ తెలియదు. అందుకే, ఏమీ మాట్లాడలేకపోయాను. కొంచెం తలనొప్పిగా ఉంది. కాసేపు పడుకుంటాను. " అంది జాగృతి భయపడుతూ.
"సినిమాలు చూసే అలవాటు లేదా? ఏం?" అన్నాడు సమర్థ్ ఆశ్చర్యపోతూ.
"సినిమాలు చూస్తే, తలనొప్పి వచ్చేది చిన్నప్పటినుండి. " అంది జాగృతి.
"సినిమాలు చూస్తే, తలనొప్పి రావడం ఏమిటి? చోద్యం కాకపొతే? ఇలాంటిది దొరికింది ఏంటిరా నీకు? నీ బతుకులోని ఆనందాల్ని చంపెయ్యడానికి?" అంటూ తలుపుతోసుకుని లోపలకి వచ్చింది రాధ. మాణిక్యాలరావు కూడా రాధ వెనకనే వచ్చాడు. " డబ్బులు అయిపోతాయని చూసేవాళ్ళు కాదేమో. అయినా, ప్రతీవారం మనలా హాల్ కి వెళ్ళి, సినిమా చూసేంత డబ్బు, అదృష్టం అందరికీ ఉండదులే. " అంది గర్వంగా.
"మన ఇంటికి వచ్చాక, ఇక ఏ తలనొప్పి లేదు. అందరూ సినిమాలు చూడాల్సిందే. " అన్నాడు మాణిక్యాలరావు.
'సినిమాలు చూడకపోవడం తప్పన్నట్టు మాట్లాడుతుతున్నారేమిటి వీళ్ళు? సమర్థ్ బతుకులో ఆనందాల్ని చంపడానికి వచ్చానా? ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు?' ఆశ్చర్యపోతూ, "మీరు ప్రతివారం సినిమా చూస్తారా?" అడిగింది జాగృతి.
"అవును. నువ్వు అస్సలు సినిమాలు చూడవా అయితే?" అడిగాడు సమర్థ్.
"మంచిసినిమా అయితే చూస్తాను. " అని చెప్పింది జాగృతి.
"మేమేమైనా చెడ్డ సినిమాలు చూస్తామా? మేము చూసేవీ మంచి సినిమాలే. " అంది రాధ మూతితిప్పుతూ.
"ఇంతకీ నువ్వు ఎలాంటివి చూస్తావ్?" అడిగాడు సమర్థ్.
"శంకరాభరణం, స్వాతిముత్యం, స్వర్ణకమలం.." అంది జాగృతి.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)