08-11-2025, 10:03 AM
అలా అమ్మమ్మగారి ధర్మమా అని బడిలోకి, మా అమ్మగారి (టీచర్) ఒడిలోకి చేరాను. ఆవిడ చెప్పేవన్నీ వెంటనే అప్పజేప్పేసేవాణ్ణని, నేనంటే ముద్దు! అందుకే అలా ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాళ్ళు. అలాగని అనుకునేవాణ్ణి. అదే అన్నానో రోజు గొప్పగా, ఆ కాలేజ్లోనే వేరే తరగతిలో చదివే మా చిన్నక్కతో.
అసలు నాకలా అన్నీ అంత త్వరగా ఒంటబట్టేయడానికి కారణం, మా అమ్మమ్మ. ఆవిడ శిక్షణ. క్రమశిక్షణ.
రోజూ సాయంత్రం పూట చల్లబడ్డాక, మేమంతా ఆటలు ఆడుకుని ఇంటికి చేరాక, నూతి దగ్గర స్నానాలు చెయ్యడమో, కాళ్ళూ చేతులు మొహం కడుక్కోవడమో చేశాక, ఏడు-ఏడున్నరకల్లా భోజనాలు చేసేసేవాళ్ళం.
అప్పుడు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలం మేమందరం, పెద్ద డాబా మీదకి వెళ్ళిపోయేవాళ్ళం.
అలా పెద్ద డాబా మీదకి చేరేసరికి, మా అమ్మమ్మగారు ఒకరి తరవాత ఒకరి చేత పద్యాలు, పాటలు, ఎక్కాలు, కథలు, చెప్పించేవాళ్ళు. అలా నాకు అన్నీ వేగంగా వచ్చేశాయి.
మా అమ్మమ్మగారు కొన్నాళ్ళు మా మాతామహులు పోయిన కొత్తల్లో, సంగీతం పాఠాలు చెప్పేవారుట. అయినా, మా చిన్నక్కని మాకు తెలిసిన బంధువులు ఒకాయన దగ్గరకి గాత్రం నేర్చుకోమని (అతనికి ఆ ఆర్జన కొంత ఆదరువుగా ఉంటుందని), ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక గంట పంపించేది.
అప్పట్లో మాకు, బడి, ఉదయం 7 నుండి 11 వరకు; తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు రెండు పూటలా ఉండేది.
అలాగే ఆ తరవాత అక్కడి సంగీత కాలేజీలోనే మా పెద్దక్కయ్య వీణ, మా చిన్నక్కయ్య గాత్రం నేర్చుకున్నారు.
నిద్రలొచ్చే టైముకి క్రింద గదుల్లోకి వెళిపోయేవాళ్ళం. వేసంకాలం అయితే, డాబా మీదే పడకలు. ఆ పక్కలు వెయ్యడంలాటి భారీ పనులన్నీ మా పెద్దమామయ్య, చిన్న మామయ్య చేసేవాళ్ళు. వాళ్ళు అప్పటికే హైకాలేజీ! మా నాన్నగారి పెళ్ళికి మా పెద్దమామయ్యకి రెండేళ్ళే. చిన్నమామయ్యయితే పుట్టనేలేదు.
మా మాతామహులు పోయేటప్పటికి మా పెద్దమామయ్య నాలుగో క్లాసు, చిన్న మామయ్య రెండు చదువుతున్నాడు కాబోలు. అప్పటికి మా పెద్దక్కని ఇంకా బడిలో వెయ్యలేదు. మా అన్నకి అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయిట. ఆసమయంలో మా అమ్మమ్మగారు పడే బాధలు చూడలేక, పిల్లల చదువులకి, వారి అభివృద్ధికి, అన్ని విధాల బాగుంటుందని తలచి, మా స్వస్థలం విజయనగరంలో మా స్వంతయింట్లో ఉండమని ఆమెని సంరక్షకురాల్ని చేశారు. అలా మా అమ్మమ్మగారిల్లే మాయింటికి వచ్చేసింది. మాకు ఇప్పటికీ రెండిళ్ళు లేవు. ఒకటే!
అదే మాయిల్లు. అదే మా అమ్మమ్మగారిల్లు.
అలా మేమంతా కలిసే పెరిగాం. ఒకటిగా. గుండమ్మ కథ వరకే కాదు. ఆ తరవాత కూడా.
అలా ‘జగదేకవీరుని కథ’ సినిమా తరవాత ఓరోజు సాయంత్రం, మా అమ్మగారు (మా టీచర్) మాయింటికి వచ్చారు.
అప్పుడు మా అమ్మమ్మగారు, మా అమ్మగారితో, “అదేంటే విడ్డూరం! శాంక్షన్ అయి ఇన్నాళ్ళయినా, ఇంకా ఒకటో తరగతి పిల్లలకీ, రెండో తరగతి పిల్లలకీ బెంచీల్లేవా? ఉత్తి నేలమీద కూర్చుంటున్నారా! ‘వీడు నీ ఒళ్ళో కూచుంటున్నాడని’ వీడి చిన్నక్క చెప్పేవరకు నాకు బెంచీల్లేవని తెలీలేదు. ఎన్నాళ్ళిలా? నన్నొచ్చి అడగమంటావా మీ హెడ్మాష్టర్ని?” అని నిలదీశారు.
అమ్మమ్మ కూడా మా వీధి బడి ఫర్నీచర్ కోసం, బీరువాలకోసం కొంత విరాళం ఇచ్చారని మా చిన్నక్కకి తెలుసు. అందుకే మా అమ్మమ్మకి ఇంకా బెంచీల్లేవని పితూరీ చేసిందేమో! అనుకున్నాను.
ఆమె బెదిరిపోయింది. “లేదు దొడ్డమ్మగారూ, తయారయిపోయాయి. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తాయి. అయినా వీడికి నా దగ్గర చదువయిపోయింది. నా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఒక్క క్షణం నిలకడగా ఉండడు. వీణ్ణి రెండో క్లాసుకి ప్రమోట్ చేసేస్తున్నాను. అది చెప్దామనే వచ్చాను.” అన్నారావిడ.
మా అమ్మమ్మగారు, “అంటే ఈ బడుద్ధాయిని భరించలేక నీ ఒళ్లోంచి తోసేస్తున్నావన్నమాట!” అన్నారు.
మా అమ్మగారు “ఎంత మాట, ఎంత మాట” అని భలేగా, సున్నితంగా, సుకుమారంగా, చప్పుడవకుండా లెంపలేసుకున్నారు.
“సర్లే!” అన్నారు.
అలా నాకు చేరిన సంవత్సరమే, ఒకటవ తరగతి నుండి ప్రమోషన్ వచ్చి, రెండవతరగతి పరీక్షలు రాశాను.
గుండమ్మ కథకల్లా మూడవ తరగతి.
అలా గుండమ్మ కథకల్లా, రెండో తరగతిలో ఉండడానికి బదులు, మూడవ తరగతికి వచ్చేశాను. (ఆ రోజుల్లో నాలాటి అల్లరివాళ్ళకందరికీ అదే శిక్ష!)
ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర్రావు అనుకుంటాను కారులో సర్రుమని వచ్చి ఒక ఇంటిముందు ఆగుతాడు. ఆ దృశ్యం నా మనసులో ఎలాటి ముద్ర వేసిందంటే, చెప్తే మీరు నవ్వుతారు.
ఇంటికొచ్చాక మా అమ్మమ్మతో, “నేను పేద్దవాణ్ణయ్యాక ఒక పేద్ద బంగళా కట్టిస్తాను. అందులో బోల్డన్ని గదులు, పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి.” అని ఇంకా చాలా చాలా వర్ణించానుట.
నాకు బాగా గుర్తుండిపోయింది మాత్రం,
“మనింట్లో వాళ్ళందరూ క్రింది భాగంలోనే ఉంటారు. అక్కడా పనివాళ్ళుంటారు కానీ, అందరికంటే ఎక్కువమంది పనివాళ్ళు పై అంతస్తులో, మా అమ్మమ్మకి అంటే నీకు, సపర్యలు చెయ్యటానికి ఉంటారు. ఆ మొత్తం అంతస్తంతా నీ ఒక్కర్తికోసమే.
బంగళా మెయిన్ గేటు నుంచి నువ్వుండే అంతస్తు వరకు, అక్కడనుంచి రెండో వైపు గేటు వరకు, అలా గుఱ్ఱపునాడా ఆకారంలో వెడల్పయిన పెద్ద రోడ్డు, వంతెనలా వేయిస్తాను.
ఎందుకంటే, నువ్వు బయటనుండి కారులో వస్తే, సర్రుమని సరాసరి పై అంతస్తులోని నీ గది గుమ్మంవరకు నీ డ్రైవరు నీ కారుని సునాయాసంగా తీసుకువెళిపోవాలి. పనివాళ్ళు కారు తలుపు తీస్తే, నువ్వు కారు దిగి సరసరా నీ రూములోకి వెళిపోవాలి. అందుకు.”
ఆరోజు కూడా మా అమ్మమ్మగారు, పాపం, నేను కట్టిన గాలిమేడలో తేలిపోయారు. కారులో ఆమె అంతస్తులోకి వెళిపోయారు. ఎప్పుడూలాగే నన్నామె ముద్దులతో ముంచెత్తేశారు.
నా ఊహకి, ఆమె మళ్ళీ “నే చచ్చిపోతానురా నాన్నా!” అని ఆనందంతో మురిసిపోయారు. కన్నీళ్లు కార్చేశారు.
అలా ఎన్నో సినిమాలు, నాటకాలు, సంగీత కచేరీలు వగైరాలు జరుగుతుండగా, మా పెద్దమామయ్య విజయనగరంలో చదువు చాలించి, ఉద్యోగం దొరికిందని, సంపాదన కోసం మధ్య ప్రదేశ్ వెళ్ళాడు. అది కూడా ఎక్కడ? సరిగ్గా మా నాన్నగారు పని చేస్తున్న ఊరికి దగ్గరలోనే.
మా చిన్నమామయ్యకి విశాఖపట్నం గవర్నమెంట్ పోలిటెక్నిక్ కాలేజీలో సీటొచ్చి హాస్టల్లో చేరాడు.
అప్పటికి విజయనగరంలో మా అమ్మమ్మగారి సంరక్షణలో మా స్వంతింట్లో నేను 5, పెద్ద తమ్ముడు 3, రెండో చెల్లి 1 వ తరగతి, మాయింటిదగ్గర పురపాలక ప్రాథమిక పాఠశాలలో; మా చిన్నక్క బ్రాంచి కాలేజీలో, అన్న పెద్ద కాలేజీలో (రెండూ హై స్కూళ్ళే, పేరుకు మాత్రం కాలేజీలు) చదువుతూ, మా పెద్దక్క ప్రయివేట్‌గా మెట్రిక్కి ప్రిపేర్ అవుతూ మిగిలిపోయాం.
--: oo(O)oo :--
మరికొన్నాళ్ళకి మా అమ్మమ్మగారు, “పెద్దాడు వెళ్ళిన ఊరు ఒట్టి అడవి ఊరు. ఒక హోటల్ లేదు. పాడూ లేదు. ఏ వస్తువుకావాలన్నా పొరుగునున్న పట్నంనుంచే తెచ్చుకోవాలి. వీడికి సరయిన తిండయినా లేకపోతే ఎలాగా! వాడి ఆరోగ్యం పాడయిపోతుంది. వాడి దగ్గరకి వెళిపోతాను.” అన్నారు.
ఏం చేస్తాం! మేమంతా ఆమెను చుట్టేసుకుని బావురుమన్నాం. “నువ్వు లేకపోతే మేమెలావుంటాం!” అని బెంబేలుపడిపోయాం!
అప్పుడావిడ “నేను కూడా మీలాగే ఇదంతా నడుపుతున్నది, నడిపిస్తున్నది, నేనేనని ఇన్నాళ్ళూ భ్రమలో ఉన్నానర్రా! నడిపేది, నడిపించేది పైవాడు! నాలాగే మీరూ నడవండి.” అని బుజ్జగించారు.
అలా భారంగా కొన్నిరోజులు గడిచాయి. మాకు వేసవి సెలవులు ఇచ్చారు.
అప్పుడు మొదటిసారి మా అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్లాం. అక్కడ మా అమ్మమ్మా, పెద్దమాఁవయ్యే ఉన్నది. మాఁవయ్య ఉదయం సైకిలుమీద ఆఫీసుకి వెళ్తే, తిరిగి ఏ రాత్రికో కాని వచ్చేవాడు కాడు.
అమ్మమ్మావాళ్ళింటికి ఉత్తరం వైపు నడకదారిలో రెండు కిలోమీటర్ల పైన నడచుకుని వెళ్తే, అక్కడొక హైకాలేజీ ఉండేది. దక్షిణం వైపు ఒక కిలోమీటరు నడిస్తే కాని హైవేకి చేరం. అక్కడకి వెళ్తే కాని దుకాణాలు కనిపించవు. అవి కూడా ఓ రెండో మూడో ఉండేవి. అంతే! వాటిలో మనకి కావలసిన వస్తువులు సమయానికి దొరికాయా అదృష్టం! లేకపోతే పట్నం పోవాల్సిందే.
మా అమ్మమ్మగారింట్లో నాలుగురోజులుండి, మా వాళ్ళంతా మా నాన్నగారి దగ్గరకి వెళిపోయారు. నేను మాత్రం మా అమ్మమ్మగారి దగ్గరే ఉండిపోయాను.
ఒకరోజు, నడచుకుంటూవెళ్ళి, ఆ పల్లెటూర్లో హైకాలేజీ ఎక్కడుందో కనుక్కుని, అక్కడకి వెళ్ళాను. అక్కడ హెడ్మాష్టారు, మరొక వ్యక్తి మాత్రమే, అతని గదిలో కూర్చునివున్నారు.
నేను మాష్టారితో, నిర్భయంగా, “ఐ యాం తెలుగు మీడియం ఫిఫ్త్ పాస్” అని ఇంగ్లీషులో మొదలెట్టి వచ్చీరాని హిందీ, ఎక్కువగా తెలుగు, అక్కడక్కడ ఇంగ్లీషు ముక్కలు జోడించి నాక్కావలసినది అడిగేశాను.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)