03-07-2019, 06:59 PM
నేను హాల్ లోపలికి వచ్చే సరికి తను వాష్ రూమ్ కు వెళ్ళింది. నేను కిచెన్ లోకి వెళ్లి అమ్మ వండిన టిఫిన్ రెండు ప్లేట్స్ లో పెట్టుకొని హాల్ లో కి వచ్చాను. తను ఫ్రెష్ అయ్యి బాత్రుం లోంచి బయటకు వచ్చి , నా చేతిలో ప్లేట్ తీసుకొని టిఫిన్ తింటూ అంది
"మీ డాక్టర్ ఫ్రెండ్ రాత్రి చాలా సార్లు నాన్నను చూడడానికి వచ్చాడు"
"నాన్నను చూడడానికి వచ్చాడా , లేక నిన్ను చూడడానికి వచ్చాడా "
"నాకు అదే డౌట్ వచ్చింది , నన్ను చూడ దానికే వచ్చినట్లు ఉంది , నాతొ మాట్లాడాలని ఎదో ఒకటి కల్పించు కొని అడుగుతూ ఉన్నాడు. "
"బాగానే ఉన్నా డుగా , మరి లైన్ లో పెట్టక పోయావా"
"లైన్ లో పెట్టడం అంటే ?"
"నీకు కూడా నచ్చితే వాన్ని అడుగుతాను పెళ్లి చేసుకోమని. "
"హ్మ్ ఏమో నాకు తెలియడం లేదు ఎం చేయాలో" అంటూ ఇద్దరి ప్లేట్స్ కిచెన్ లో పెట్టి చెయ్యి కడుక్కొని వచ్చింది. నేను కూడా బాత్రుం కు వెళ్లి చెయ్యి కడుక్కొని వచ్చి దివాన్ మీద కుచోన్నాను.
తను వచ్చి నా పక్కన నన్ను అనుకోని కుచోంది.
"ఇంతకూ ఎ విషయం చెప్ప లేదు వాడు అంటే నీకు ఇష్టమేనా , చెప్పు"
"ఎం చెప్ప మంటావు , నీవు కానప్పుడు నాకు ఎవరన్నా ఒక్కటే "
"ఏయ్ , నీకు నేను ముందే చెప్పాను, ఇటూ వంటి ఫీలింగ్స్ నా మీద పెట్టు కోకు అని "
"చెప్పావు లే , కానీ కొన్ని ఫీలింగ్స్ మనం వద్దన్నా వస్తాయి ఎం చేస్తాం"
"పోనీ మీ అక్కను ఒప్పించు ఇద్దర్ని చేసుకుంటా "
"అది రాక్షసి , ఎం ఒప్పు కోదు "
"అందుకే అంటున్న , వీడు చాలా మంచి వాడు నాకు బాగా తెలుసు నిన్ను బాగా చూసుకుంటాడు"
"మరి నాన్నా వాళ్ళు ? "
"వాళ్ళను నేను వొప్పిస్తా లే , నీకు నచ్చినాడా అది చెప్పు"
"తనకు నేను నచ్చినట్లు ఉన్నా లే , నా సంగతి వదిలేయి"
"ఏయ్ , అలా అనక నాకు గిల్టీ గా ఉంటుంది జీవితమంతా "
"నువ్వు అలా ఎం మనసులో పెట్టుకోకు బావా నాకు నువ్వంటే చాలా ఇష్టం , ఊర్లో నా పరువు , మా నాన్న పరువు పోకుండా చూసావు అందుకే నువ్వంటే చాలా ఇష్టం , నీవు ఏది చెపితే అది వింటాను" అంది తన గొంతు లో ఆ మాటలు అంటున్నప్పుడు సన్నని వణుకు గ్రహించాను.