Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - ఉచితాలు - అనుభవాలు
మీరే నా పిల్లలు బాబు, మిమ్మల్ని కాలేజీకి తీసుకుని వెళ్ళటం, రావడం.. అంతే. నాకు ఆదేముడు మిమ్మల్నే పిల్లలుగా చూసుకుని సంతోషించమన్నాడు, కానీ ఒక రోజు మీరందరూ పెద్ద చదువులకి వెళ్ళిపోతారని, మళ్ళీ నేను- నా రిక్షా మిగిలిపోతామని అనుకోలేదు అన్నాడు.



రిక్షా లాగుతూవుంటే శ్రీధర్ దిగి తోస్తున్నాడు. 



కూర్చో బాబు! ఎంతసేపు అలా నడుస్తావు, నేను తొక్కగలను లే అంటూ శ్రీధర్ ని బలవంతంగా రిక్షాలో కూర్చోపెట్టి తను రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు వెంకన్న.



అదిగో గుడిసే మాది అంటూ దానిముందు నుంచి వెళ్తోవుండగా, మువ్వల చప్పుడు విని గుడిసె లోనుండి వెంకన్న భార్య బయటికి వచ్చి మొగుడి రిక్షా లో మనిషి ని చూసి, అమ్మయ్య.. రోజు నాలుగు మెతుకులు వండుకోవచ్చు అనుకుని భర్తకి సైగ చేసింది త్వరగా రమ్మని.



ఏమిటి అంటోంది మీ ఆవిడ? అన్నాడు శ్రీధర్. 



పిచ్చిది బాబు, నాలుగు రోజులనుంచి గిరాకి లేదు, పస్తులు వుంటున్నాము, రోజు గిరాకి దొరికింది అని త్వరగా రమ్మంటోంది అన్నాడు. 



ఆమాటతో వెంకన్న పరిస్థితి అర్థమైంది శ్రీధర్ కి. 



దిగండి బాబు, సర్పంచ్ గారి యిల్లు యిదే అన్నాడు.



ఒక మాదిరి పెద్ద బిల్డింగ్. రిక్షా చప్పుడు విని లోపలనుంచి సర్పంచ్ రమణ బయటకు వచ్చి, శ్రీధర్ గారా, రండి అంటూ లోపలికి రమ్మన్నాడు. 



శ్రీధర్ పర్స్ నుంచి అయిదు వందల నోట్ తీసి వెంకన్న చేతిలోపెట్టి, సాయంత్రం ఒకసారి వస్తే ఊరంతా తిరుగుదాం అన్నాడు. 



యింత డబ్బు వద్దు బాబు, ఒక యాభై రూపాయలు ఇవ్వండి. బియ్యం కొనుక్కుంటాం అన్నాడు వెంకన్న. 



డబ్బు నేను ఊరిలో వున్నన్ని రోజులు నన్ను తిప్పడానికి.. వుంచు అని లోపలకి వెళ్ళిపోయాడు సర్పంచ్ గారితో.



కోర్ట్ యిన్ని సంవత్సరాలకి పొలం మీదే అని, పొలం ఆక్రమించిన అతను అయిదు లక్షల రూపాయలతో మీ పొలం మీకు ఇమ్మని జడ్జిమెంట్ యిచ్చింది. యిరవై ఎకరాల పొలం మీరు యిక్కడ లేరు కదా అని నాయుడు ఆక్రమించేసాడు, మొత్తానికి మీ పొలం మీకు దక్కింది అన్నాడు సర్పంచ్ రమణ.



అంతా మీ సహాయం వల్లనే యిది జరిగింది, మీకు కృతజ్ఞతలు అన్నాడు శ్రీధర్.



మీరు గదిలో సామాను పెట్టుకుని స్నానం చెయ్యండి, ఏసీ కూడా వుంది. పూజారి గారి ఇంటినుంచి మీకు భోజనం వస్తుంది అన్నాడు రమణ.



సాయంత్రం సర్పంచ్ గారి కారులో వెంకన్నని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పొలం అప్పగించటానికి నాయడుగారు రెడీగా వున్నాడు. మాటకి మాట చెప్పుకోవాలి, అది పొలం కాదు పెద్ద తోట. కొబ్బరి, మామిడి, మొదలగు చెట్లు కొంత భాగం, కొంత భాగం పచ్చటి పైరుతో నిండి వుంది.



పంతులుగారి తాలూకా ఎవ్వరు లేకపోవడం తో నేను పొలాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. అయితే పొలం వలన నేను కూడా కొంత ఆస్తి సంపాదించుకున్నాను, అది ఒక్కటే తృప్తి, యిదిగో కుర్రాడు యిక్కడ కాపలా వుంటున్నాడు. అతను నమ్మకస్తుడు, మీరు ఉండమంటే వుంటాడు అన్నాడు నాయుడు ఒక బరువైన కవర్ చేతికి యిస్తో.



ఇదేమిటి? అన్నాడు శ్రీధర్, 



కోర్ట్ వారు యిన్నిరోజులు మీ పొలం నేను వుంచుకున్నందులకు అయిదు లక్షలు పెనాల్టీ మీకు ఇవ్వమన్నారు అన్నాడు నాయుడు.



బలేవారే, మీరు ఉద్దేశ్యం తో పొలం తీసుకున్నా చాలా అందంగా తీర్చిదిద్దారు. నేను కూడా యింత బాగా మైంటైన్ చెయ్యలేను. డబ్బు అక్కర్లేదు అంటూ కవర్ తిరిగి నాయుడు చేతిలోపెట్టేసాడు శ్రీధర్. 



నాయుడు అక్కడ నుంచి వెళ్ళగానే పొలం అంతా తిరిగి చూసారు. లోపల రెస్ట్ తీసుకోవడానికి రెండు గదుల బిల్డింగ్, అక్కడకి కొద్ది దూరంలో వాచ్మాన్ కి ఒక షెడ్డు కూడా వున్నాయి.



మీరు వుండేది అమెరికాలో, మరి పొలాన్ని ఎలా చూసుకోగలరు, అమ్మేసుకుంటారా? అని ఆడిగాడు సర్పంచ్ గారు శ్రీధర్ ని.



అదే ఆలోచిస్తున్నాను, ముందు రేపు రిజిస్ట్రార్ ఆఫీసులో పొలం మా నాన్నగారి పేరు మీదనుంచి నా పేరున మారిన తరువాత ఆలోచన చెయ్యాలి అన్నాడు. రాత్రి అంతా అదే ఆలోచన, శ్రీధర్ ఒకసారి అమెరికా ఫోన్ చేసి భార్య తో, కొడుకు తో మాట్లాడి పడుకున్నాడు.



సర్పంచ్ గారు ముందే మాట్లాడి వుండటం తో, రిజిస్టర్ ఆఫీస్ లో పని త్వరగానే అయ్యింది.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మంచితనం - by k3vv3 - 03-11-2025, 09:42 AM



Users browsing this thread: