02-11-2025, 05:27 PM
ఇరుగు పొరుగు
![[Image: i.jpg]](https://i.ibb.co/vCMQkLSH/i.jpg)
రచన: కిరణ్ విభావరి
పక్కింటి వాళ్ళతో తగాదాలు పెంచుకుంటే పెరుగుతాయి.
మాటకు మాట జవాబుగా వస్తుంది.
ఒకరు ఒక మెట్టు దిగితే అవతలి వారు మరో మెట్టు దిగుతారు.
పోరు నష్టం, పొందు లాభం అని తెలియజెప్పే ఈ కథను డైనమిక్ రైటర్ కిరణ్ విభావరి గారు రచించారు.
కథ ప్రారంభిద్దాం.
"ఏం పోయే కాలం వచ్చిందర్రా ? మాస్కులు అవీ మా ఇంటి ముందు పడేస్తున్నారు. మేం జబ్బు పట్టి పోవాలనా? పాడు మనుషులు .. పాడు బుద్దులు." అమ్మమ్మ ఎవరిని తిడుతుందా అని బయటకి వచ్చి చూసాను. పక్కింటి ఉమాదేవి గారు మాస్కులు మా బాల్కనీలో పడేశారు. అది చూసిన మా అమ్మమ్మ వాళ్ళను ఏకబీకిన తిడుతోంది. వాళ్ళూ కూడా ఘాటైన సమాధానాలు ఇస్తూ ఏదో అంటున్నారు.
రేప్పొద్దున ఇలాగే మాస్కులతో, ఉమ్ములతో, నోటి తుంపరులతో యుద్దాలు జరుగుతాయేమో నాకు భవిష్యత్తు లీలగా కనిపించింది. అమ్మమ్మ ఆవేశపడుతూ గుండెలు పట్టుకుని కుర్చీలో కూలబడింది. నీళ్ళ చెంబు అందిస్తూ, "ఎందుకే అంతలా ఆవేశ పడతావ్? మెల్లిగా నేను రాము గారికి చెప్పేవాడిని కదా !" అంటూ ఆవిడ పక్కకు కుర్చీ లాక్కుని కూర్చుని చెప్పాను. నా చిన్నతనంలోనే మా తల్లి తండ్రి ఇద్దరూ ఒక యాక్సిడెంటులో చనిపోతే, నన్నూ తమ్ముడిని కంటికి రెప్పలా పెంచింది.
"మామూలుగా చెబితే వినే రకాలా అన్నయ్య " మోహన్ అమ్మమ్మకి సపోర్ట్ చేస్తూ అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. మా ఆవిడ ఒక గ్లాసులో సోడా పట్టుకు వచ్చింది. "నీకెందుకు రేఖ ఈ శ్రమ. మోహన్ కి చెబితే తెచ్చేవాడు కదా" అంటూ అమ్మమ్మ రేఖ చేతిలోని గ్లాసు పుచ్చుకుంది. రేఖ నిండు గర్భిణి కావడం మూలాన అమ్మమ్మ తనను జాగ్రత్తగా ఉండమని పదే పదే చెబుతూ ఉంటుంది.
"అన్నయ్య..ఓనరు రెంట్ అడిగాడు. కరెంట్ బిల్లు కూడా కట్టాలి " మోహన్ బిల్లు ఎంతైందో చెప్పాడు.
"హ్మ్మ్...సరే" అంటూ తలాడించాను. కానీ మనసులో ఏదో గుబులు. ఎలా కట్టాలి? మాది ప్రవేటు కాలేజ్. ఫీజులు వసూలు చెయ్యలేనిది, డబ్బులు ఎక్కడనుండి తేవాలి అని మా మేనేజ్మెంట్ ఈ నెల సాలరీ ఇవ్వలేదు. వచ్చే నెల కూడా ఇస్తారనే నమ్మకం లేదు. తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాలేదు. నా ఒక్కడి సంపాదన మీద నా కుటుంబం అంతా ఆధార పడి ఉంది. సేవింగ్స్ కూడా పెద్దగా లేవు. ఇప్పుడెలా రా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చున్నాను.
"అన్నిటికీ ఆ రామయ్య తండ్రి ఉన్నాడురా. ఆయన చూసుకుంటాడు లే. " నా మనసుని గ్రహించి , అమ్మమ్మ సముదాయించింది. నవ్వి ఊరుకున్నాను.
*****
వంటింట్లోంచి ఏదో పెద్ద శబ్దం వస్తే, పరుగున అందరం అటు వెళ్ళాం. రేఖకు పురిటి నొప్పులు మొదలైనట్టు ఉన్నాయి. కింద నేల మీద కాళ్ళు బార్లా చాపి కూర్చుని , నొప్పితో విలవిల లాడుతోంది. నాకు కాళ్లూ చేతులూ ఆడక," మోహన్ తొందరగా వెళ్లి ఓ ఆటో పిలుచుకుని రా' అంటూ వాడిని పురమాయించారు. "వరండాలో తీసుకుని పోదాం. గాలి ఆడుతుంది" అని అమ్మమ్మ చెప్పగానే, మెల్లగా రేఖను వరండాలోకి తీసుకుని వచ్చాం. నొప్పులకు తాళలేక రేఖ అరుస్తుంటే, నాకు కళ్ళు నిండుకున్నాయి.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)