28-10-2025, 06:23 PM
"అక్కా ఎం వండుతున్నావు? నా కైతే చికెన్ తినాలని ఉంది" అంది ఇంట్లోకి రాగానే.
"చికెన్ తెప్పించాను బిర్యానీ చేస్తున్నా"
"ఐ లవ్ యు అక్కా , నాకు ఎం కావాలో నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు , అవును బావకు కూడా బిర్యానీ అంటే ఇష్టమేనా" అంది నా వైపు చూస్తూ.
"బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా" అన్నాను సంశయంగా.
"మా ఇంట్లో ఓ గురుడు ఉన్నాడులే" అంది జాను నిట్టూర్పు వదులుతూ.
"అమ్మా ఇంతకూ బిర్యాని నాకు ఇష్టం అని చేసావా , లేక ఈ బావకు ఇష్టం అని చేసావా?" అంది
"మీ ఇద్దరికీ ఇష్టం అని చేశాలే , ఇంతకీ మీరు వెళ్లిన పని ఎం అయ్యింది , వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారా ?
"వార్ణింగా, ఈయన గారిని నువ్వు ముందే ఎందుకు కలవ లేదు, ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ ఓ గంటలో తీర్చేసాడు, వాళ్ళని ఉతికి ఆరేసాడు"
"వాళ్ళు రేపు పొద్దున్న కాలేజీ లో నిన్ను ఏమైనా చేస్తారు ఏమో?"
"బావ కొట్టిన దెబ్బలికి ఓ 6 నెలలు కాలేజీ కి రాలేరులే, ఒక వేళా అలాంటిది ఏదైనా జరిగితే బావని బాడీ గార్డ్ గా పెట్టుకుంటాలే"
"ఏయ్ , ఏంటి ఆ మాటలు ఆయన్ని బాడీ గార్డ్ గా పెట్టుకోవడం ఏంటి?"
"పోనీ బాయ్ ఫ్రెండ్ గా రమ్మంటాలే, అప్పుడు వాళ్ళు నా చుట్టూ పక్కల కూడా ఉండరు"
"నీకు పిచ్చి పట్టింది ,ఆయన్ని బాయ్ ఫ్రెండ్ అనడం ఏంటి"
"పోనీ నీ బాయ్ ఫ్రెండ్ గా రమ్మంటాలే" అంది
ఆ మాటలు అక్షరాలకు ఎక్కడో తాకి నట్లు ఉన్నాయి, చీర చెంగును మొహానికి అడ్డం పెట్టుకొని వచ్చే ఏడుపుని ఆపుకొంటూ వంట ఇంట్లోకి పరిగెత్తింది.
"నీ వాగుడుతో జనాల్ని బాగానే ఏడిపిస్తావుగా" అన్నాను తను లోపలి కి వెళ్లడం చూసి.
"నీకు తెలీదు , కొన్నీ విషయాలు ఏడిస్తేనే బయటకు వస్తాయి, తను ఏడ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో నీకు ఎం తెలుసు" అంది జాను తన గొంతు కూడా ఆ మాటలు అంటూ ఉంటె బొంగురు పోయింది.
"వెళ్లి ఓదార్చు, పాపం ఏడిపించావుగా"
"నా కంటే నువ్వే వేళ్ళు, అది కరిగి ముద్ద అయ్యి మాములుగా రావాలి ఆంటే నువ్వు లోపలి వెళ్లి సమాధాయించు, నేను రూమ్ లోకి వెళుతున్నా" అంటూ తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది.
కిచెన్ లొంచి ఎక్కి ఎక్కి ఏడవడం తెలుస్తూనే ఉంది. అక్కడ నుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళాను.
నా నీడ కిచెన్ ఎంట్రన్స్ లో కనబడగానే ఏడుపు ఆపుకొంటూ అటు వైపు తిరిగింది.
"సారీ అక్షరా" అన్నాను తన దగ్గరికి జరుగుతూ.
అటువైపు తిరిగింది నా వైపు తిరిగి నా మొహం చూసి ఏడుపు కంట్రోల్ చేసుకోలేక ఏడవ సాగింది.
తను ఏడవడం చూడలేక పోయాను, తనని నా కౌగిట్లోకి తీసుకొని, " సారీ , అంతా నా వల్లే జరిగింది" అన్నాను తన తలా మీద చెయ్యి వేసి తడుముతూ.
తన ఏడుపుతో , తన శరీరం అంతా కంపిస్తూ ఉండగా అలాగే కౌగిట్లో గట్టిగా పట్టుకొని నా కేసి అదుము కొన్నాను. తన రెండు చేతులతో నన్ను చుట్టేసుకొని నా షర్ట్ ని తడిపేస్తూ అలాగే ఉండి పోయింది ఓ 10 నిమిషాల పాటు.
ఇద్దరం కిచెన్ లో అలాగే నిలబడి పోయాము ఒకరి కౌగిట్లో ఒకరం, ఎన్నో సంవత్సరాల బాధ అంతా తన ఏడుపు రూపం లో బయటకు వచ్చేసి నా షర్ట్ ని తడిపేసింది.
"నా బిర్యానీ ఏమైందో" అన్న జాను మాట వినపడి ఇద్దరం కౌగిట్లో నుంచి వేరు పడ్డాము.
"సారీ, బిర్యానీ మాడి పోతుంది అని డిస్టర్బ్ చేసాను , కావలి అంటే తిన్న తరువాత కంటిన్యూ చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు" అంది కిచెన్ లోకి వస్తూ.
"నువ్వు చూస్తూ ఉండు నేను మొహం కడుక్కొని వస్తాను" అంటూ అక్షరా తన రూమ్ వైపు వెళ్ళింది.
"అయ్యో, నీ షర్ట్ చూడు ఎలా అయ్యిందో, ఇప్పుడు ఎలా" అంది జాను నా షర్ట్ వైపు చూసి.
"ఆరి పోతుంది లే, కొద్దీ సేపు ఉంటె" అన్నాను.
"విప్పి ఇవ్వు , డ్రైయర్ లో వేస్తా , నువ్వు బిర్యానీ తినే లోపల ఆరిపోతుంది , కావాలంటే నా టీ షర్ట్ ఉంది వేసుకో , లేదంటే టవల్ ఇస్తా మీద వేసుకో, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవ్వరు లేరులే"
"ఉందనీ ఎం ఇబ్బంది లేదులే"
"నీకు కాదు ఇబ్బంది , నాకు ఇబ్బంది, నువ్వు విప్పుతావా , నన్ను విప్పమంటావా"
"ఏంటి నువ్వు విప్పేది" అంటూ వచ్చింది అక్షరా
"బావను షర్ట్ విప్పమని చెప్తున్నా, డ్రై చేస్తా , చూడు షర్ట్ అంతా ఎలా తడిచి పోయిందో" అంటూ నా ఛాతీ వైపు చూపించింది.
"అయ్యో సారీ " అంటూ వచ్చి చేత్తో షర్ట్ మీద తుడవ సాగింది.
"అక్కా ఎం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, అది పలక కాదు చేత్తో చదవగానే రాసింది పోవడానికి , తన షర్ట్ మొత్తం తడిచి పోయింది నువ్వు చేత్తో తుడిస్తే ఆరి పోదు , డ్రైయర్ లో వేయాలి విప్పమని చెప్పు" అంది అక్షరా చేసే పని ని వారిస్తూ.
"అయ్యో , జాను చెప్పేది నిజమే , మీరు షర్ట్ విప్పండి" అంటూ తనే గుండీలు తీయడం మొదలు పెట్టింది.
"తను విప్పు తాడులే , నువ్వు బిర్యానీ సంగతి చూడు,బావ సంగతి నేను చూసుకుంటా నువ్వు తిండి సంగతి చూడు" అంది నన్ను కిచెన్ లొంచి బయటకు లాక్కెళ్లి,
"ఇంతకూ ఎం కావలి, టవల్ ఇవ్వనా లేక టీ షర్ట్ ఇవ్వనా" అంది జాను.
"టీ షర్ట్ వద్దులే , టవల్ ఇవ్వు" అన్నాను
"నా సైజులు నీ కంటే చిన్నవనా" అంది నా ఏద వైపు చూసి తన ఎద వైపు చూసు కొంటూ.
"నీవి పెద్దవి అని ఒప్పు కొంటున్నా , వెళ్లి టవల్ తీసుకొని రా" అన్నాను తనతో ఆర్గుమెంట్ ఎందుకు అని.
వెళ్లి ఓ టవల్ తీసుకొని వచ్చింది, టవల్ ని వంటి మీద వేసుకొని షర్ట్ ని తీసి తన చేతికి ఇచ్చాను.
"ఇప్పుడే వస్తా బావా" అంటూ టీ షర్ట్ తీసుకొని లోనకు వెళ్ళింది.
కిచెన్ లొంచి అక్షరా వచ్చింది , "జాను వాగుడు కాయ అన్నీ మాట్లాడేస్తుంది, నిన్నేం ఇబ్బంది పెట్టలేదుగా"
"నన్ను ఎం ఇబ్బంది పెడుతుంది, అలా ఎం కాదులే ఆక్టివ్ గా ఉంది"
"మీరు ఇంకా క్లోజ్ కాలేదు , అయితే తెలుస్తుంది దాని అల్లరి"
"అది అల్లరి అనుకుంటే అల్లరి ,కాదు అనుకుంటే కాదు, నా గురించి ఎం వర్రీ కాదు, తనతో నాకు ఎం ఇబ్బంది లేదు"
"బిర్యానీ అయిపొయింది మీరు కూచోండి , పెట్టేస్తా" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
"ప్లేట్స్ ఎక్కడ" అంటూ నేను కూడా కిచెన్ లోకి వెళ్ళాను టవల్ పూర్తిగా కప్పుకొని
"అయ్యో మీరు ఎందుకు , కూచోండి నేను తెస్తా" అంది ప్లేట్స్ ఉన్న డ్రా చూపిస్తూ.
ముగ్గురికీ ప్లేట్స్ తీసుకొని టేబుల్ మీదకు తెచ్చాను అప్పుడే జాను లోపల నుంచి వచ్చింది.
"అక్కా మన ఇంట్లో మగవాళ్ళు ప్లేట్స్ ముట్టుకోవడం నువ్వు ఎప్పుడైనా చూసావా, బావ గారు మీరు మా ఇంటిని పావనం చేశారు ఈరోజు ప్లేస్ తెచ్చి టేబుల్ మీద పెట్టి, ఉన్నాడు ఆ మహానుభావుడు, తినేప్పుడు కంచం ముట్టుకోవడం తప్ప ఎప్పుడైనా పెళ్ళానికి హెల్ప్ చేద్దాం అని ఆలోచన కూడా రాదు గురుడికి" అంది జాను నన్ను చూసి.
"నువ్వు వచ్చి తిను ఫస్ట్ , ఆకలి అన్నవుగా?" అన్నాను
"బిర్యాని కదా ఆ స్మెల్ కి ఆకలి పెరిగింది" అంటూ వచ్చి కూచుంది.
"మీరు తినండి , నేను తరువాత తింటా" అంది అక్షరా.
"అక్కా , ఈ బావా ఆ బావ లాగా కాదులే , వచ్చి కూచో, అందరం కలిసి తిందాము" అంటూ అక్షరా చెయ్యి పట్టుకొని నా పక్కన కూచో పెట్టింది.
భోజనం చేస్తూ ఊర్లో విషయాలు అడుగుతూ ఉంటె 3 వంతుల సమాదానాలు జాను చెపుతూ ఉంటె , ఒక వంతు సమాదానాలు అక్షరా చెప్పా సాగింది.
వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత, వాళ్ళ ఇంట్లో కస్టాలు ప్రారంభం అయ్యాయి, డబ్బుల విషయం లో కాదు, బంధువుల విషయం లో ప్రతి ఒక్కరు ఆ ఇంటి మీద పెత్తనం చెలాయించి వాళ్ళ డబ్బులు లాగేయాలి అని. కానీ అప్పటికే అక్షరా డిగ్రీ లో ఉంది, వాళ్ళ అమ్మ సాయంతో నెగ్గుకుని వచ్చారు ఎవరి ఆసరా లేకుండా. పెళ్లి విషయం లో మాత్రం వాళ్ళ అమ్మ వైపు వాళ్ళు హెల్ప్ చేశారు ఈ సంబంధం.
తిన్న తరువాత అక్షరా ప్లేట్స్ తీస్తూ ఉంటె నేను సింక్ దగ్గర చేతులు కడుగుతూ ఉంటె టవల్ జారి పోయింది వంటి మీద నుంచి. జీన్స్ మీద ఉన్నాను. చెయ్యి కడుక్కొని వెనక్కి తిరిగే సరికి జాను నా బాడీ వైపు చూస్తుంది.
"ఇలా బాడీ పెట్టుకొని షర్ట్ విప్పడానికి ఎందుకు అంతలా సిగ్గు పడ్డావు ఎదో కొండ అంత పొట్ట ఉన్న వాడిలా, నువ్వు సినిమాలో ఏదైనా హీరో రొల్స్ వేస్తున్నావా ఏంటి ఇలా మైంటైన్ చేస్తున్నావు, ఉంటె ముందే చెప్పు షాక్ ఇవ్వ కుండా" అంది.
ఈ లోపు కిచెన్ లొంచి అక్షరా వచ్చి తనతో పాటు నా బాడీని స్కానింగ్ చేసింది నేను కింద పడ్డ టవల్ తీసి కప్పుకునే లోపల. "అక్కా నీకు తెలుసా, బావ ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ అమ్మాయి ఫిక్స్ అయ్యింది అంట తన పేరు శాంతి, ఇంట్లో అత్తమ్మ ఒక్కరే ఉంటారు అంట, మనల్ని ఎప్పుడు తీసుకొని వెళతారో అడుగు" అంది అక్కడ వాతావరణం ఈజ్ చేయడానికి.
కానీ జాను అనుకోకుండానే శాంతి గురించి చెప్పింది , ఓ నిమిషం అక్షర మొహం లో దిగులు కనిపించి మాయం అయ్యింది.
"నిన్ననేగా కలిసింది, ఈరోజు నీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేశారు, తనకు తీరిక దొరక గానే తీసుకొని వెళతాడులే, నువ్వు తనని విసిగించకు"
"నేనేం విసిగించను లే, ఇన్ని రోజులు మాయం అయిపోయాడుగా , ఇప్పుడు దానికి compensation అడుగుతున్నా" అంది జాను.
"జీవితం లో కొన్నింటికి మాత్రమే రీప్లేస్ మెంట్ ఉంటుంది , అన్నింటికి ఉండదు, నువ్వు పెద్ద పదాలు వాడి ఇబ్బంది పెట్టొద్దు" అంది అక్షరా.
"మీరు ఎప్పుడు రెడీ ఆంటే అప్పుడు తీసుకొని వెళతా , కావాలంటే రేపు లంచ్ కి రండి , శాంతి ని కూడా రమ్మంటాను, అమ్మ ఇంట్లోనే ఉంటుంది, పొద్దున్నే వస్తే ఫ్యాక్టరీ కి వెళ్లి అక్కడ నుంచి ఇంటికి వెళదాం, ఓకే నా"
"నేను ఓకే బావా, అక్కా నీకు ఎం పని లేదుగా, మీ ఆయనకు ఎదో ఒకటి చెప్పుకో, రేపు వెళుతున్నాము అంతే" అంది జాను.
"సరే రేపు 8.30 కి కారు తీసుకొని వస్తాను , రెడీ గా ఉండండి"
"తప్పకుండా , నాకు రాత్రికి నిద్ర కూడా పట్టదు ఏమో" అంది జాను.
"సరే నేను వెళతాను" అంటూ వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని బైక్ ని ఫ్యాక్టరీ వైపు తిప్పాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)