28-10-2025, 06:21 PM
వాడు కూడా లోపల కూచోగానే , ప్రిన్సిపాల్ మరో ఇద్దరి స్టాఫ్ తో వచ్చి మీరు లోపలి రండి అంటూ నన్ను జానునీ లోపలకు రమ్మాన్నాడు.
"మీరు ఇక్కడే ఉండండి, నేను రెండు నిమిషాలు మాట్లాడి వస్తాను" అంటూ వాళ్ళ వెనుక లోపలి కి వెళ్లాను.
"మీ అమ్మాయికి జరిగిన దానికి మేము సారీ చెప్తున్నాము , వాళ్ళు చాలా పలుకు బడి ఉన్న వ్యక్తులు మేము ఏమీ చేయలేకున్నాము, మీరు హేండిల్ చేస్తాము అన్నారుగా , మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు చెయ్యండి , కాలేజీ తరపున వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్స్ అన్నీ మీకు పంపమంటే పంపుతాము" అన్నాడు ఓ చేతిలోని ఫైల్ చూపిస్తూ.
"ప్రస్తుతానికి ఈ ఫైల్ తో ఏంపని లేదు , ఒక వేల అవసరం అయితే అప్పుడు మా హమీద్ వస్తాడు లెండి , వాళ్ళను మేము హేండిల్ చేస్తాము, ఇలాంటి వాళ్ళు ముందు ముందు పుట్టకుండా హేండిల్ చెయ్యండి చాలు, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే , పెద్ద చిన్నా అని తేడాలేకుండా ఆక్షన్ తీసుకోండి , షీ మాడం నెంబర్ ఇచ్చి వెళుతుంది , తను ఎవ్వరి మాటా వినే రకం కాదు , కాబట్టి ఏదైనా ఇలాంటి సమస్య ఉంటె ఆమెకు చెప్పండి , తను సాల్వ్ చేస్తుంది" అంటూ అక్కడ నుంచి బయటకు వచ్చాను జాను తో పాటు.
నూర్ కి సైగ చేసి లోపలి వెళ్ళమని చెప్పాను ప్రిన్సిపాల్ రూమ్ వైపు చెయ్యి చూపుతూ. తను వెళ్లి వాళ్లకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చి వచ్చింది.
"నువ్వు కాలేజీ కి వేళ్ళు , నేను ఇంటికి వెళతాను , వాళ్ళని నూర్ అత్తారింటికి తీసుకొని వెళుతుంది , కొద్దిగా మర్యాదలు చేసిన తరువాత వదిలి పెడుతుంది" అన్నాను జాను వైపు చూస్తూ.
"ఇంత జరిగానే ఈరోజు నేను క్లాస్ లు వినే మూడ్ లో లేను , నేను కూడా ఇంటికి వస్తా పద" అంటూ రెడీ అయ్యింది.
"థాంక్స్ హమీద్ నువ్వు ఆఫీస్ కి వేళ్ళు నేను జానునీ ఇంట్లో దింపి వెళతాను" అన్నాను హమీద్ వైపు చూస్తూ.
"నీతో వచ్చే ఛాన్స్ నీ మరదలు కొట్టేసింది బావా, ఇంకో సారి నా లక్ ట్రై చేస్తా" అంటూ నూర్ జీపు ఎక్కింది. టైట్ టర్న్ తీసుకొని కొద్దిగా ఉన్న సందులొంచి జీప్ వెళ్లగా , వాళ్ళను ఎక్కించిన వ్యాన్ వెనక్కి రివర్స్ చేసుకుంది u తీసుకోలేక , వాటి వెనుక మేము బయలు దేరాము.
కాలేజీ లొంచి బయటకు వచ్చాక కొద్దిగా సర్దుకొని నాకు అనుకోని కూచొని తన రెండు చేతులు నా నడుం చుట్టూ వేసి. "వీళ్ళు నీకు ఎలా తెలుసు తన పేరు నూర్ అంటుంది , నిన్ను ఏమో బావా అంటుంది, ఇన్నాళ్లు కాలేజీ వాళ్ళు , ఎం చేయలేని వాళ్ళను ఒక్క దెబ్బతో ఎలా మేనేజ్ చేసావు, ఇంతకూ ఎవ్వరు నువ్వు" అంటూ నా చేవిలో ప్రశ్నలు కురిపించ సాగింది.
"అంతా, తెలిసిన వాళ్ళు లే" అన్నాను బైక్ ని మలుపు తిప్పుతూ.
"అప్పుడే ఇంటికి వద్దు , నాకు సమాధానం కావాలి నా బుర్ర వేడెక్కుతుంది ఏదైనా రెస్టారెంట్ కి వెళదాం" అంది నా భుజం మీద తన గడ్డం ఆన్చు తూ.
మరో పది నిమిషాలు బైక్ ని ముందుకు పోనించి ఓ రెస్టారెంట్ ముందు ఆపి లోపలి కి వెళ్లాను తనతో.
ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసాక "ఇప్పుడు చెప్పు" అన్నాను తన వైపు చూస్తూ.
"నేను ఏంటి చెప్పేది, అడిగింది నేను చెప్పాల్సింది నువ్వు"
"ఎం కావాలో అడుగు" అన్నాను వచ్చిన కాఫీ ని సిప్ చేస్తూ.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)