28-10-2025, 06:21 PM
ఈ లోపల ఆఫీస్ స్టాఫ్, కొందరు డిపార్మెంట్ హెడ్స్ , ప్రిన్సిపాల్ వచ్చారు. వాళ్ళు అక్కడకి రాగానే సైరెన్ మోగించు కొంటూ తన షీ టీమ్ ని మొత్తం అక్కడ దింపింది నూర్ ,మొదట తన జీప్ , దాని వెనుక ఓ వ్యాన్ పోకిరీలు వేసుకొని వెళ్ళేది. అవ్వి స్పీడ్ గా వచ్చి ఆఫీస్ లొంచి బయటకు వచ్చిన వాళ్ళ ఎదురుగా దిగగానే, నూర్ అందులొంచి ఫుల్ యూనిఫామ్ తో బయటకు వచ్చి , "ఏంటి బావా , నేను రాక ముందే ఆక్షన్ లోకి దిగి పోయాము , మాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వచ్చుగా" అంది వచ్చి చెయ్యి కలుపుతూ.
"నేను కొద్దిగా లేట్ ఆయింట్ నా ఛాన్స్ కూడా miss అయ్యేవాడిని లుక్కి గా , వెనుకే ఉన్నా అందుకే ఈ భాగ్యం దక్కింది" అన్నాడు హమీద్ తన చేతిలోని చెట్టు కొమ్మతో అక్కడ ఉన్న వాళ్ళ జీప్ మీద బాదుతూ.
నూర్ వెనుక దిగిన షీ టీం వాళ్లకు ఎం చేయాలో తెలుసు అన్నట్లు అక్కడ కింద పడిన వాళ్ళను తన్నుకొంటూ వెనుక ఉన్న వాన్ లోకి ఎక్కించారు.
పైనుంచి , కింద నుంచి స్టూడెంట్స్ అంతా చూస్తూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళే గుస గుసా మాట్లాడు కొంటూ.
ఈ లోపల ప్రిన్సిపాల్ తేరుకొని, "మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎవరు వాళ్ళను ఎందుకు కొడుతూ ఉన్నారు" అంటూ ముందుకు వచ్చాడు.
"ఇదిగో తను నా మరదలు , వీడు రెండు సంవత్సరాల నుంచి తనను ఏడిపిస్తూ ఉన్నాడు , తను మీకు కూడా కంప్లైంట్ చేసింది, తన దగ్గర మీకు ఇచ్చిన copies , మీతో కంప్లైంట్ చేసినప్పుడు తీసిన వీడియోలు ఉన్నాయి , మీరు ఎలాగూ వాళ్ళ మీద ఆక్షన్ తీసుకోలేక పోయారు , మా అమ్మయినా కాపాడు కోవడానికి మేము ఆక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, తను సిటీ షీ టీం ఇంచార్జ్, వాళ్ళ పని వాళ్ళను చేసుకోనీయండి, మీరు అడ్డం వచ్చారు అంటే , మొత్తం మీడియాకు సర్క్యూలేట్ చేస్తాము ఆ తరువాత మీ కాలేజీ పరువు ప్రతిష్ట అని మా మీద పడి ఏడవకుండా ముందే చెప్తున్నా, వాళ్ళను మాకు వదిలేయండి , ఏది ఏమైనా మేము పేస్ చేసుకొంటాము, మీరు ఇందులో కలగ చేసుకుంటే మాత్రం , అప్పుడు మీ అసమర్థతని కూడా ఇందులోకి లాగాల్సి వస్తుంది , మీరే డిసైడ్ చేసుకొండి" అందరికీ వినిపించేట్లు కొద్దిగా గట్టిగానే చెప్పాను.
ప్రిన్సిపాల్ కి ఎం చెప్పాలో అర్తం కాక డిపార్ట్ మెంట్ హెడ్స్ తో సీరియస్ గా డిస్కస్ చేసుకోవడానికి అన్నట్లు లోపలి కి వెళ్ళాడు . ఈ లోపల అసిఫ్ గాడు ఎవరికో ఫోన్ చేసినట్లు ఉన్నాడు వాళ్ళు విషయం విని వాడి ఫోన్ కట్ చేసినట్లు ఉన్నారు, బిక్కు మొహం వేసుకొని ఇంకో నెంబర్ కి డైల్ చేసాడు. అటువైపు నుంచి ఎం సమాధానం వచ్చిందో గానీ సంతోషం గా తల ఊపుతూ నా వైపు చూసాడు.
వాడు తల ఊపుడు ఆపిన రెండో నిమిషం లో హమీద్ ఫోన్ మోగింది, ఓ నిమిషం పాటు ఆ ఫోన్ అటెండ్ అయినా హమీద, అక్కడ జీపు పక్కన పెట్టిన కొమ్మను తీసుకొని వాడి వీపు మీద రెండు బాది, "వాడిని బాదుతుంది నేనే , వాడు మీతోనే నాకు ఫోన్ చేయించాడు, నీ కూతుర్ని వాడు మిగిలిన అమ్మాయిల్ని అల్లరి పెట్టినట్లు పెడితే , నీకు ఓకేనా అప్పుడు కూడా వాడిని అలానే సపోర్ట్ చేస్తావా? చెప్పు అలా అయితే నేను వాడిని కాపాడతా, వచ్చింది మా పెద్ద సారూ ఆ సారు మరదలని ఓ సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నాడు ఈ బద్మాష్ గాడు, మా సారు మంచి వాడు కాబట్టి కొట్టి వదిలాడు , అదే నా చెల్లికి జరిగి ఉంటె వీడికి తలకాయ మీ ఇంట్లో ఉండేది , పెట్టేయి ఫోన్ ఇంకో సారి ఇంటిలాంటి వాడికి హెల్ప్ చేయమని అడిగావా , నువ్వు ఉంటావు లోపల ఫస్ట్" అంటూ కాల్ కట్ చేసాడు.
"ఏమైంది హామీదు"
"ఈ నాకొడుకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసాడు , వాళ్ళు వీడికి హెల్ప్ చేయమని నాకు ఫోన్ చేశారు , ఇంకో సారి కాల్ వస్తే వాళ్ళను బొక్కలో వేస్తాను అని చెప్పాను."
"ఎరా , ఏమైంది నీ పలుకుబడి , మూసుకొని బండి ఎక్కుతావా లేక ఇంకో నాలుగు తగిలించి మంటావా" అంది నూర్ చేతిలోని వాడి మీద జుళిపిస్తూ.
"ఏయ్ ఎక్కించండి వాడిని" అని కమాండ్ చేయగానే షీ టీం మెంబెర్స్ వాడిని వాడి ఫ్రెండ్స్ దగ్గర కూచో బెట్టారు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)