28-10-2025, 06:20 PM
మేము తిని తన వెంట రాగా బైక్ మీద హమీద్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాను. నా కోసమే అన్నట్లు బయట ఎదురు చూస్తూ ఉన్నాడు.
నన్ను చూడగానే "సర్ వెళదామా, నూర్ అక్కడికే వస్తాను అని చెప్పింది, డైరెక్ట్ గా"
"తనకి ఎందుకు చెప్పావు? "
"తనది ఆ డిపార్ట్మెంట్, రానియ్యండి ముందు ముందు ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మాయిలకు ధైర్యంగా ఉంటుంది" అంటూ బైక్ మీద నా వెనుక రాసాగాడు.
"తను ఎవరు"
"హమీద్ అని సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ వ్యక్తి"
"మరి నూర్ అంటున్నాడు , ఆవిడ ఎవరు?"
"చూస్తావుగా , కొద్దీ సేపు అగు" అన్నాను కొద్దిగా స్పీడ్ పెంచుతూ.
మేము కాలేజీ గేట్ లోకి ఎంటర్ అయ్యే సరికి 9 అవుతూ ఉంది. అప్పుడే కొన్ని కాలేజీ బస్సులు గేట్ లోకి ఎంటర్ అయ్యి పార్కింగ్ లో ఆగగా స్టూడెంట్స్ అందులొంచి దిగ సాగారు.
నా బైక్ వాళ్ళ ముందుకు నుంచి కొద్దీ దూరం పోనించాను అక్కడ ఉన్న పోడియం వైపు.
కాలేజీ U షేప్ లో ఉంది. 4 అంతస్తుల బిల్డింగ్ , ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ లో మిగిలినవి అన్నీ క్లాసురూంస్ , లాబ్స్.
ఆఫీస్ ముందు ఓ రెండు హై ఎండ్ బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి , వాటి పక్కన ఓ జీప్ పార్క్ చేసి ఉంది వాటి మీద కొందరు స్టూడెంట్స్ కూచొని ఉన్నారు, నా బైక్ వాళ్ళ దగ్గరకు రాగానే, " అసిఫ్ తేరా ఛోక్రి బాడీ గార్డ్ కో లాయారే" అన్నాడు ఒకడు జీప్ లో కుచోన్న వాడిని చూస్తూ. బైక్ ని వాళ్ళ పక్క న ఆపి జాను బైక్ లొంచి కిందకు దిగగానే , ఎటువంటి మాటా మంతీ లేకుండా ఫుల్ ఫోర్స్ గా ఓ రౌండ్ హాఫ్ కిక్ ని బైక్ మీద కూచొని కామెంట్ చేరిన వాడి మొహం మీదకు విసిరాను. ఇలాంటిది ఎదో జరుగుతుంది అని కొద్దిగా గట్టిగా ఉంటె షూస్ వేసుకొని వచ్చాను , నేను కొట్టిన ఫోర్స్ కి షూస్ గట్టిదనానికి వాడి ముక్కు మొహం రెండు ఏకం అవుతూ ఉండగా, బైక్ మీద నుంచి కిందకు పడిపోయాడు, వాడికి ఓ నిమిషం పాటు ఎం అర్తం కాలేదు. జాను ని కొద్దిగా దూరం నిలబడమని చెప్పాను. వాడి మొహానికి పడ్డ షాట్ సౌండ్ కి , వద్దు కింద పడ్డప్పుడు వాడితో పాటు కింద పడిన బైక్ సౌండ్ స్టూడెంట్స్ అందరినీ ఆకర్షించింది.
బుస్స్ లొంచి దిగి క్లాస్ రూమ్స్ కి వెళుతున్న వాళ్ళు , ఇంకా క్లాస్ లు జరగలేదు అని కారిడార్ లో ఉన్న వాళ్ళు అందరికి ఆ సీన్ 70MM లో కనబడ్డది. మనం ఒక్కరే చుస్తే తృప్తి ఏముంది అంది తమ ఫ్రెండ్స్ ని కూడా జత చేశారు వాళ్లతో పాటు.
వాళ్ళు కాలేజీ లో చేరింది మొదలు ఇంతవరకు వాళ్ళను కాలేజీ లో ఎదిరించే వాళ్ళే లేరు , ఈరోజు ఎవడో ఒకడో వచ్చి తన ఫ్రెండ్ ని కొట్టడం లో ఆ బైక్ మీద, జీప్ లోనా కుచోన్న వాళ్ళకి పిచ్చెక్కినట్లు అయ్యింది. అరెస్టు నా వైపు రాసాగారు.
వచ్చిన వాణ్ని వచ్చినట్లు విరగ దీయడం మొదలు పెట్టాను , కానీ దాదాపు 10 మంది దాకా ఉన్నారు. నా వెనుక బైక్ మీద ఉన్న హమీద్ లోపలి ఎంటర్ కాగానే సీన్ మొత్తం అర్తం అయ్యినట్లు ఉంది. బైక్ ని గేట్ లోనే వదిలి గేట్ ఎంట్రన్స్ లో ఓ కిందకు వేలాడుతూ ఉన్న ఓ చెట్టు కొమ్మను గట్టిగా పట్టి విరిచి బేతాళుడు మాదిరి దానిని భుజం మీద వేసుకొని వచ్చి నా మీద దాడి చేస్తున్న వాళ్ళ నడుముల మీద ఆ కొమ్మతో బాధ సాగాడు.
హామీదు కొద్దిగా భీముడి సైజులో ఉంటాడు. తన చేతుల్లోని చెట్టు కొమ్మ దెబ్బలకు బండ మీద కొట్టిన పెంకుల్లా చెల్లా చెదురు అయ్యారు. నా చేతికి దొరికిన 4 కి ముక్కు మొహానికి అతుక్కొని పోయి ముక్కు లొంచి కారే రక్తం వాళ్ళ షర్ట్స్ ని తడుముతూ ఉంటె, అది చూసి భయపడి పోయారు. వాళ్ళ లీడర్ లాగా ఉన్న వాడు , కొద్దిగా వెనక ఉన్నాడు రొప్పుతూ నా దగ్గరకు వచ్చి , "నేను ఎవరో తెలుసా, నా మీదకే వస్తావా, ఆ పిల్లను ఎం చేస్తానో చూడు , నిన్ను నరికి పోగులు పెట్టక పొతే నా పేరు అసిఫ్ కాదు" అంటూ ఎటాక్ చేసాడు.
వాడికి కోసమే ఎదురు చూస్తున్నట్లు లాగి లాగి బాది వదిలాను, మిగిలిన వాళ్ళను హమీద్ ఫుట్బాల్ ఆడుకొన్నాడు. హమీద్ దెబ్బకు , నడుములు జారిపోయి కొందరు , చేతులు వీరిగి కొందరు , నా దెబ్బకి ముక్కులు మొహాలు ఏకం కాగా అందరు ఒక చోట చేరి వాళ్ళ బాస్ కోసం ఎదురు చూడ సాగారు.
వాడి కోటా వాడికి ఇచ్చి, వాళ్ళ మీదకు తోస్తూ కింద పడ్డ వాడి ఫోన్ వాడికి ఇచ్చి, "నీకు ఇష్టం వచ్చిన వాడికి ఫోన్ చేసి వాళ్ళను రమ్మని చెప్పు నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు వచ్చే వరకు" వాళ్లకు చెప్పు , శివా రెడ్డి వచ్చి మిమ్మల్ని తన్నాడు అని , పేరు మాత్రం మరిచి పోకు రే" అన్నాను .


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)