28-10-2025, 06:20 PM
"ఇంతకూ మీరు ఎం చేస్తూ ఉంటారు" అన్నాడు శంభు ప్రసాద్ అనబడే ప్రసాద్ అక్షరా వాళ్ళ అయన. ఆ మాటల్లో కొద్దిగా గర్వం తొంగి చూస్తుంది , ఎదుటి వారి మీద గౌరవం ఏమాత్రం కనబడ లేదు.
"ఎదో చిన్న ట్రావెల్ బిజినెస్ ఉంది లెండి"
"మీరు ఇంతకూ ముందు ఎదో software కంపెనీ లో పని చేసే వారు అని అన్నది అక్షరా, ఎక్కడ చేసే వారు ఏంటి?"
తన ఇంతకూ ముందు పని చేసే కంపెనీ పేరు చేప్తాడు శివా
"ఓ అదా ఇక్కడ లోకల్ కంపెనీ కదా, నేను MNC లో చేస్తాను , నాకు కాలేజీ ప్లేస్ మెంట్ లో జాబ్ వచ్చింది" అంటూ తన కాలేజీ గురించి తన జాబ్ గురించి , చెప్పాడు. తను ఓ IIT నుంచి వచ్చాడు, కొత్తగా పెట్టినా IIT లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అని చెప్పాడు. తన మాటల్లో ఆ పొగరు బాగా కనిపిస్తూ ఉంది. లేడీస్ మీద చిన్న చూపు కూడా చాలా ఉంది అనిపించింది తన మాటల్లో.
"జాను చదివి ఎం ఉద్ధరిస్తుంది , ఎలాగూ పెళ్లి చేసి పంపేది కదా , కాలేజీ మానమని చెప్పాను , తన ప్రాబ్లెమ్ నాకు చెప్పగానే, ఈ చిల్లర వ్యవహారాలూ చూడడానికి నాకు టైం ఉండదు, అందులోనా వాళ్లు లో క్లాస్ వెధవలు వాళ్లతో ఎవరు గొడవలు పెట్టుకొంటారు చెప్పండి, సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇమ్మని చెప్పాను, వాళ్ళే చూసుకొంటారు మనకు ఎందుకు గొడవ. తను చెప్పింది , మీరు అక్కడే ఉన్నారు అని అక్కడ ఆ ఆఫీసర్స్ మీకు బాగా తెలుసు అని, నాకు ఇలాంటి వి అంటే చాలా చిరాకు , మీరు హెల్ప్ చేస్తాను అని చెప్పారు అంట కదా , థాంక్స్" అన్నాడు తనని ఎవరో వేట పడి తరుముతూ ఉన్నట్లు.
" ఎదో కొద్దిగా తెలుసు లెండి , నేను హెల్ప్ చేస్తాను లెండి"
"నీకు ఆఫీస్ కి టైం అవుతుంది , నేను వెళతాను, బాయ్" అంటూ అందరికీ బాయ్ చెప్పి తను వెళతాడు.
"నిన్ను చదువు మానమని చెప్పాడా , ఇంత చిన్న విషయానికి" జాను వైపు చూస్తూ.
"అందుకే అది కాలేజీ కి వెళ్లకుండా కూచుంది , అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము" అంది అక్షరా.
"ఇంట్లో వాళ్ళ చదువు పాడు అవుతుంది అంటే , వాళ్ళు అంటే చిరాకు అంటాడు ఏంటి , అయినా అమ్మాయిల చదువు అంటే అంత చులకన ఏంటి తనకు, ఇంతకూ ఎవరు చేశారు ఈ సంబంధం నీకు" అన్నాడు శివా అక్షరా వైపు చూస్తూ.
"అక్కా , నేను చెప్పానా మొదట నించి నాకు ఈయన నచ్చలేదు , పెళ్లి ముందు కూడా నేను వద్దు అని చెప్పా , అక్కే ఎం మాట్లాడ కుండా చేసుకుంది."
"సరేలే ఇప్పుడు అయిపోయిందిగా, మనమే సర్దుకొని పోవాలి, నీ చదువుకు ఎం ఇబ్బంది రాదులే ,నేను చూసుకుంటా , ఎంత కావలి అంటే అంత చదువుకో , ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా"
"థాంక్స్, మీరు మా ఉరికి వచ్చింది నాకు గుర్తు లేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎవరో దగ్గరి వారిని చూస్తూ ఉన్నట్లు ఉంది, ఇంతకీ నాకు జామ కాయలు అంటే ఇష్టం అని ఎవరు చెప్పారు , అక్క చెప్పిందా ? " అంది అక్షరా వైపు చూస్తూ.
"లేదులే ,నాకు తెలుసు మీ ఉరికి వచ్చినప్పుడు , నీకు ఏదైనా పని చెప్పినప్పుడు , జామ కాయలు ఇస్తే ఆ పని చేస్తా అని అడిగే దానివి, నాకు అది బాగా గుర్తు"
"అవునా ,నాకు ఆ విషయాలు ఏవీ గుర్తుకు లేవు"
"మీరు రండి తిందురు , అయన తిని వెళ్ళాడు , మీరు వస్తారు అని మేము ఆగాము" అంటూ అక్షరా టిఫన్ పెట్టింది టేబుల్ మీద.
"ముగ్గురు మాట్లాడుకొంటూ టిఫన్ చేసాము. ఇంతకు ఎం చేయబోతున్నార్ చెప్పలేదు కాలేజీ లో ?" అంది అక్షరా
"ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి ఇంకో చోట friends చెల్లికి ఎదురు అయ్యింది అది వేరే కాలేజీ , అదే బ్యాచ్ లోని కొందరు ఇక్కడి కాలేజీ లో జానునీ అలాగే ఇంకొందరిని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసింది, ఇప్పుడు వెళతాం గా సెట్ చేస్తాలే"
"మీకు ఎం ఇబ్బంది రాదుగా, తనకి హెల్ప్ చేయడం వలన, వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడం, మీ మీదకు దాడి చేయడం అలాంటివి , వాళ్ళు చూడడానికి పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళల్లా కనబడ్డారు"
" అవన్నీ నేను చూసు కొంటాలే, ఇబ్బంది అని అలా వదిలేస్తామా, మన పిల్ల ని అలా అల్లరి పెడుతూ ఉంటె"
"థాంక్స్ శివా" అంది అక్షరా
"థాంక్స్" వీటికి అంది జాను నవ్వుతు జామకాయలు బ్యాగ్ చూపిస్తూ.
"అవ్వి అయిపోయేంత వరకు దానికి ఏమీ దిగదు , కూచొని వాటిని అదే పనిగా తినడమే" అంది.
"ఎం పరవాలేదు , రోజు వాడిని ఇంటికి వచ్చి డెలివరీ చేయమని చెప్తాను , నువ్వు లాగించు" అన్నాను జాను వైపు చూస్తూ.
"ఇంక తినింది చాల్లే , సాయంత్రం వచ్చాక తిందువులే, కాలేజీ కి వేళ్ళు" అంది అక్షరా తిన్న కంచాలు సర్దుతూ.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)