Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - శిఖండి
సంప్రియ
[Image: S.jpg]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



శుభాంగి కురుమహారాజుల కుమారుడు విదూరథుడు. ఎలాంటి రథాన్నైన ఎక్కి సమరం చేయడంలోనే కాదు ఎలాంటి రథాన్నైనా సరే ఒడుపుగా, అత్యంత వేగంగా, శత్రువులకు భయం కలిగించే విధంగా నడపడంలో కూడా భూలోకంలోనే కాదు సమస్త లోకాలలో విదూరథుని మించిన వారు మరొకరు లేరని సురులు సహితం అనుకుంటారు. 



సురులు సమరంలో అతని రథ సారథ్య సామర్థ్యాన్ని చూసి, "ఔరా ఔరౌరా విదూరథ.. నువ్వు తలచుకుంటే సైనికుల తలల మీద కూడా రథాన్ని నడపగలవురా" అని అనుకుంటారు. 

శ్రీ సూర్య నారాయణుని రథ సారథి అనూరుడు సహితం విదూరథుడు తనను మించిన రథ సారథి.. తన రథ సారథ్యంతో పగలును రాత్రిగా, రాత్రిని పగలుగ భ్రమింప చేయగలడు " అని తనకు తెలిసిన వారందరికి చెబుతుంటాడు. 

చంద్ర వంశ రాజులకు తన తండ్రి కురు మహారాజు వంశ కర్త అవుతాడని మహర్షులు చెప్పిన మాటలు విని విదూరథుడు అమితానంద పడ్డాడు. తన తండ్రి కురు మహారాజు స్థాయిలో తను కూడా ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే పలు మంచి పనులు చేయాలనే దృఢ నిర్ణయానికి వచ్చాడు. తండ్రి కురు మహారాజు విస్తరించిన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజోప కార్యాలు అనేకం చేయసాగాడు. 
 
అలాగే తండ్రి కురు మహారాజు పరాక్రమాన్ని పుణికి పుచ్చుకుని, తన రాజ్యం లో నలు మూలల తిరిగి, కండ బలం, గుండె బలం, దేశభక్తి, దండిగా ఉన్న అనేకమంది సమర వీరులను ఒక గణం గా మలచాడు.. గణానికి కురు గణం అని పేరు పెట్టాడు. 

కురులు నివసించడానికి, క్రొత్త క్రొత్త సమర విద్యలను అభ్యసించడానికి ఒక సువిశాల ప్రదేశాన్ని ఏర్పాటు చేసాడు. అక్కడే కురులు నివసించేవారు. 

ఎప్పటికప్పుడు నవీన సమర విద్యలను అభ్యసించే వారు. ప్రజలు వారు నివసించే ప్రాంతాన్ని క్రమక్రమంగా కురుల భూమి అని పిలవసాగారు.. 



కురుల భూమి లో ప్రతిరోజూ ఏదో ఒక యుద్ద క్రీడ జరుగుతుండేది. క్రీడను కురులు పవిత్రంగా మొదలు పెట్టేవారు. అతి పవిత్రంగా ముగించేవారు. 



క్రీడను వీక్షించడానికి విదూరథుడు, కురు మహా రాజు, అతని బంధు వర్గం వచ్చేవారు. వారి వారి పనులను అనుసరించి ప్రజలు కూడా అప్పుడప్పుడు క్రీడలను వీక్షించడానికి వచ్చేవారు. విదూరథుడు ప్రజలు సమర క్రీడలను వీక్షించే నిమిత్తం ప్రత్యేక సమర క్రీడలను కూడా ఏర్పాటు చేసేవాడు. 



సమర క్రీడల్లో అప్పుడప్పుడు తను కూడా పాల్లోనేవాడు. ఉత్సావంతులైన ప్రజలకు కూడా సమర క్రీడలలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చేవాడు. ప్రజలందరూ కురుల భూమి ని పవిత్రంగా చూసేవారు. కురుల భూమి నే క్రమక్రమంగా ప్రజలు కురుక్షేత్రం అనసాగారు.
 
మగథ రాజు కురుల కంటే కూడా తన సైన్యమే శక్తి వంతమైన సైన్యం అనే భావనతో ఉండేవాడు. తన సైన్యం తన కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా సంసిద్దంగా ఉంటుందనే నమ్మకం తో ఉండేవాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే కురులతో యుద్దానికి సిద్దం అన్నట్లు ఉండేవాడు. 



మగథ రాజ కుమార్తె సంప్రియ తండ్రి భావాలతో ఏకీభవించేది కాదు. ఆమె "సమయం, సందర్భం బట్టి సైన్య బలాబలాలు మారుతుంటాయి. నిరంతరం మన సైన్య బలమే గొప్పదని మిడిసిపడ కూడదు. మన సైన్యం లోని బలాలను, బలహీనతలను అనుక్షణం గమనిస్తూ ఉండాలి. ఆపై బలహీనతలను సరి చేసుకుంటూ ముందుకు సాగాలి.. అలా చేయకుంటే ఎవరికైనా పరాజయం తప్పదు" అనేది. 



మగథ రాజు ఒక్కొక్క సారి కుమార్తె సంప్రియ మాటలతో ఏకీభవించేవాడు. అయినా నమ్మకం నీరు కాకూడదు అని కుమార్తెతో అనేవాడు. నమ్మకం మంచిదే కాని నమ్మకం అతి కాకూడదు. పరుల బలాలను తక్కువగా అంచనా వేయకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. " అని తండ్రితో మగథ రాజ కుమార్తె సంప్రియ అనేది. 



సంప్రియ తండ్రి అనుమతి తో శత్రువులను సునాయాసంగా జయించడానికి రెండు ఆయుధాలను తయారు చేసింది. అందులో ఒకటి రాళ్ళను, బాణాలను, గదలను, వివిధ రకాల ఆయుధాలను ఏక కాలంలో ప్రయోగించే జ్యా (కాటాపుల్ట్.. యజుర్వేదం లో కాటాపుల్ట్ ను జ్యా అనే పేరుతో వాడటం జరిగింది)



రెండు జాపత్రి రథం. జాపత్రి రథంలో ఉన్న వారికి యుద్దరంగంలో రమారమి అయిదు వేల ఎకరాల విస్తీర్ణంలో శత్రువు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నీటిలో ఉన్నా, రాక్షస మాయలో ఉన్నా, దైవ మాయలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా కంటి ముందు కనపడతాడు. 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - అమృత - by k3vv3 - 18-10-2025, 10:18 AM



Users browsing this thread: