Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - శిఖండి
అమృత
[Image: am.jpg]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



హస్తినాపురమును రాజధానిగా చేసుకుని సువిశాల రాజ్యాన్ని పరిపాలించే విదూరథుని కుమారుడు అనశ్వుడు. అశ్వం కంటే అత్యంత వేగంగా పరిగెత్తగల సామర్థ్యం అనశ్వునికి పుట్టుకతోనే వచ్చింది. అతని కాళ్ళకున్న సామర్థ్యం వర్ణనాతీతం అని జ్యోతిష్య పండితులు, ఋషులు, మహర్షులు, జీవ శాస్త్ర వేత్తలు అనశ్వుని కాళ్ళను పరిశీలించి ఘంటాపథంగా చెప్పారు. 



అనశ్వుడు బుడిబుడి అడుగులు వేసే వయస్సులోనే వేగంగా అశ్వము మీద వెళుతున్న తన తండ్రి విదూరథుని దాటుకుంటూ నడిచాడు అని కొందరు ప్రజలు అనశ్వుని నడక గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ కాలం గడిపేవారు. ఆ కథలు "నిజమేనా!" అని మరి కొందరు ప్రజలు ఋషులను, మహర్షులను అడుగుతుండేవారు. అప్పుడు వారు కథలను కథలు గానే చూడాలి. కథల్లో కల్పనతో పాటు నిజం కూడా ఉంటుంది "అని చిరు నవ్వు తో అనేవారు. 



తన తండ్రి కురు మహారాజు కీర్తిని మరింత పెంచే రీతిలో విదూరథుడు హస్తినాపురమును పరిపాలించే విధానం ను అనశ్వుడు పిన్న వయస్సు నుండి అతి శ్రద్ద తో గమనించేవాడు. విదూరథుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిసినప్పుడు ఎంత మహదానంద పడేవాడో అనశ్వుడు ప్రత్యక్షంగా గమనించి, "మహదానందం పొందాలంటే నిజమైన రాజు ప్రజలను అనుక్షణం సంతోష పెట్టాలి " అని అనుకునేవాడు. 



విదూరథుడు తన భార్య నుండి సంక్రమించిన జాపత్రి రథం లో సంచరిస్తూ దేవాసుర యుద్దం లో అనేక పర్యాయాలు దేవతలకు సహాయ పడ్డాడు. దానితో దేవేంద్రుడు మహదానంద పడ్డాడు. అనంతరం దేవేంద్రుడు పంచ భూతములను పిలిచి, "పంచ భూతములారా! మీరు దేవరథుని రాజ్యంలో సంచరించండి. అయితే విధి నియమానుసారం మీ వలన ఏదన్నా దేవరథుని రాజ్యానికి అపాయం జరగ బోతుంటే ఆ విషయాన్ని ముందుగానే దేవరథుని చెవిలో వేయండి. దేవతలకు అతను చేస్తున్న సహాయం అమూల్యమైనది. అనితరసాధ్యం అయినది." అని అన్నాడు. 



అందుకు పంచ భూతములు " సరే అలాగే" అని అన్నారు.
 
దేవరథుని కాలం లో హస్తినాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించింది. అన్నార్తులు రోజురోజుకూ తగ్గ సాగారు. ప్రజలందరు మూడు పూటల కడుపునిండా భోజనం చేస్తూ, హాయిగా జీవించ సాగారు. 



దేవరథుడు తను మాత్రమే సమర్థవంతంగా నడప గల జాపత్రి రథం ను చూసి " అశ్వములు లేకుండా దీనిని ఎలా నడపాలి?" అని అనేకానేక సశాస్త్రీయ కోణాలలో ఆలోచించసాగాడు. 
విదూరథుడు తన ఆలోచనలను తన కుమారుడు అనశ్వునకు కూడా పంచే వాడు. క్రమ క్రమంగా అనశ్వుని ఆలోచనలు కూడా తండ్రి ఆలోచనల వైపుకు మళ్ళాయి. 



మగథను సంప్రియ సోదరుడు సంవదనుడు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె అమృత. ఆమె సమస్త విద్యలను సప్త మహర్షుల దగ్గర అభ్యసించింది. 



బంగారు ఇసుకను అన్నం చేసిన సతీ అనసూయ గురించి తెలుసుకుంది. త్రిమూర్తులనే పసిపిల్లలను చేసిన ఆ తల్లి అనసూయ మార్గమే తన మార్గం కావాలనుకుంది. నియమ నిష్టలతో భగవంతుని పూజించి అష్టాక్షరీ మహా మంత్ర, పంచాక్షరీ మహా మంత్ర మూలాలను తెలుసుకుంది. మంత్రాలలోని బీజాక్షరాలను ఎలా సృష్టించాలో తెలుసుకుంది. 



అమృత సమర విద్యలందు కూడా సవ్యసాచిణి అని అనిపించుకుంది.. తండ్రి ద్వారా జాపత్రి రథం గురించి తెలుసుకుంది. అటుపిమ్మట జాపత్రి రథ నిర్మాణం లోని మెళకువలు సమస్తం అభ్యసించింది. ఈ విషయం తెలిసిన సంప్రియ విదూరథులు మిక్కిలి సంతోషించారు. అమృత తమ కోడలు అయితే బాగుంటుందని అనుకున్నారు. 



సంప్రియ, సోదరుడు సంవదనునికి ప్రత్యేక లేఖను వ్రాసింది. అందులో అమృతను ప్రత్యేకంగా అభినందించింది. అలాగే విదూరథుడు సంవదనుని అమృతను ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక లేఖను వ్రాసాడు.. రెండు లేఖలను రెండు చిలకమ్మలు సంవదనునికి అందించాయి. 



సంవదనుడు రెండు లేఖలను చదివి మిక్కిలి ఆనందించాడు. బుల్లి బుల్లి మాటలను మాట్లాడే రెండు చిలకమ్మలను సంవదనుడు, అమృతలు మిక్కిలి గౌరవించారు. చిలకమ్మ లకు కావలసిన ఆహారం అందించారు. అవి విశ్రమించడానికి చిన్న బంగారు పందిరి మంచాన్ని ఏర్పాటు చేసారు. చిలకమ్మలు బంగారు పందిరి మంచం పై కొద్ది సేపు ముచ్చట్లాడుకున్నాయి. వాటి ముచ్చట్లలో అనశ్వుని చిత్రపటం గీయాలి అనే మాటలు దొర్లాయి. 



రెండు చిలకమ్మలు అనశ్వుని చిత్ర పటమును గీచి అమృత కు చూపించాయి. ఇంకా అనశ్వుని గురించి అనేక విషయాలను అమృతకు చెప్పాయి. అనంతరం రెండు చిలుకమ్మలు పందిరి మంచం మీద శయనించినప్పుడు పందిరి మంచం నెమ్మదిగా వలయాకారంలో తిరగసాగింది. 



అది చూసి చిలుకమ్మలు ముందుగా కొంచెం భయపడినప్పటికీ ఆ తర్వాత ఎగిరెగిరి ఆనంద పడ్డాయి. 
 మరుసటి రోజు రెండు చిలుకమ్మలు సంవదనుని దగ్గర, అమృత దగ్గర సెలవు తీసుకుని అనశ్వుని దగ్గరకు వెళ్ళాయి. జరిగిన విషయాలన్నిటినీ పూస గుచ్చినట్లు చెప్పాయి. పందిరి మంచం గురించి కూడా చెప్పాయి. చిలకమ్మలు పందిరి మంచం గురించి చెప్పేటప్పుడు అనశ్వునికి సరికొత్త ఆలోచన వచ్చింది. 
వెంటనే అనశ్వుడు శాస్త్ర నైపుణ్యం ఉన్నవారిని పిలిచి తన మనసులోని మాటను చెప్పాడు. వారు అనశ్వుడు చెప్పినట్లుగా యంత్రమును తయారు చేసి ఇచ్చారు. ఆ యంత్రమును అనశ్వుడు జాపత్రి రథం కు అమర్చాడు. యంత్రమును అమర్చగానే అశ్వములు లేకుండానే జాపత్రి రథం ముందుకు నడిచింది. అది చూసి అనశ్వుని తలిదండ్రులు సంప్రియ విదూరథుడు మిక్కిలి సంతోషించారు. 



ఒక శుభ ముహూర్తాన అమృత అనశ్వుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆపై అనశ్వుడు హస్తినాపుర రాజుగా సింహాసనం అధిష్టించాడు. ఆ పుణ్య దంపతుల సుపుత్రుడు పరీక్షితుడు.(ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు వేరు).
 
 శుభం భూయాత్ 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా - by k3vv3 - 18-10-2025, 10:01 AM



Users browsing this thread: 1 Guest(s)