Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - మొదటి పరిచయం
#8
పవన్ తెచ్చిన సర్టిఫికెట్స్ చూసాక, పవన్ చదువు మీద నమ్మకం కుదిరింది ఆనందరావు కి. వాళ్ళ అమ్మానాన్నలతో కూడా మాట్లాడాక, వాళ్ళకి ఇష్టమేనని తెలిసి సంతోషించాడు ఆనందరావు. పవన్ కి అభ్యంతరం చెప్పడానికి, రంగు తప్ప ఇంకేమి కారణాలు లేనందున, వాళ్ళ ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నాడు. 



"మరి, నీ పెళ్ళి ఎప్పుడు? నువ్వూ కూడా ఎవరినైనా చూసుకున్నావా? చెప్పు. నీ పెళ్ళి కూడా చేయించేద్దాం" అని జాగృతి తో అన్నాడు ఆనందరావు. 



"నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు బాబాయ్. పెళ్లంటే భయం" అంది జాగృతి. 



"అలాగే అంటావ్. జరిగే సమయం వస్తే, ఎవరు వద్దన్నా ఆగదు" అన్నాడు నవ్వుతూ. జాగృతి వివరాల్ని, సమర్థ్ వాళ్ళకి పంపిన విషయాన్ని చెప్పలేదు ఆనందరావు. 



జాగృతి ఫోటో చూసిన రాధ, "పిల్ల తెల్లగా ఉంది. కానీ, 40 ఏళ్ళు దానిలా ఉంది. స్టైల్ లేదు. వద్దని చెప్పేస్తాను" అంది సమర్థ్ తో. 



"అందరు పెళ్లికూతుర్ల ఫొటోలలాగా లేదు అమ్మాయి ఫోటో. పెళ్ళి అంటే ఇష్టం లేకుండా, బలవంతంగా తీయించుకున్నట్టు ఉంది. అందుకే, నీకలా అనిపించింది ఏమో అమ్మా. 40 ఏళ్ళు దాటినదానిలా ఏమిలేదు. సింపుల్గా ఉంది. అయినా, వెళ్లి చూస్తే తెలుస్తుందిగా ఎలా ఉంటుందో" అన్నాడు సమర్థ్. 



సమర్థ్ కి, అమ్మాయిని నచ్చిందన్న విషయం అర్ధం అయ్యి, పెళ్లిచూపులు పెట్టించమని జాగృతి వాళ్ళకి కబురుచేసింది రాధ. 



పెళ్ళి చూపులలో, జాగృతిని చూసిన సమర్థ్, "ఫోటో లో పెద్దదానిలా కనపడింది అన్నావు కానీ, డైరెక్టుగా చూస్తే 20 ఏళ్లలోపు పిల్లలా ఉంది. అవునా? నాకు అమ్మాయి నచ్చింది" అని చెప్పాడు రాధ తో. 



అందంగా, స్టైల్ గా ఉండే అమ్మాయి కోడలిగా రావాలి అనుకుంది కానీ, ఇంత సింపుల్గా ఉండే అమ్మాయి, సమర్థ్ కి నచ్చుతుంది అనుకోలేదు రాధ. 



చంద్రిక, పవన్ ప్రేమించి, పెళ్లిచేసుకున్నారు. ఆనందరావు కి, పవన్ నచ్చకపోయినా పవన్, చంద్రిక పెళ్ళి జరిగిపోయింది. 



జాగృతిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు సమర్థ్. రాధకి, జాగృతి నచ్చకపోయినా, సమర్థ్, జాగృతి పెళ్ళి జరిగిపోయింది. జాగృతి ఇష్టా, అయిష్టాలని ఎవ్వరూ పట్టించుకోలేదు. 



సమర్థ్, జాగృతిల పెళ్ళిలో, సమర్థ్ ని చూసిన ఆనందరావు, 'నల్లగా, పళ్ళ మధ్యలో గ్యాప్ తో, పొట్టతో ఉన్న అబ్బాయికంటే, నా అల్లుడే బాగున్నాడు' అని తృప్తిపడ్డాడు. 



చంద్రిక పెళ్ళి ఫోటోలని చూసిన రాధ, " అమ్మాయి నల్లగా ఉందని వద్దనుకున్నాం మేము. అంతకంటే నల్లగా ఉన్న అల్లుడు వచ్చాడు మీ బాబాయికి. ప్రేమ పెళ్ళి అంట కదా. మరి, మా సంబంధం ఎందుకు కావాల్సి వచ్చిందో వాళ్ళకి?" అంది. 



సమర్థ్ వాళ్ళ సంబంధం, ముందు చంద్రిక కి వచ్చిందని, చంద్రిక నల్లగా ఉందన్న కారణం చెప్పి, వాళ్ళు తనని చూసారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయింది జాగృతి. 



'గురివిందగింజ, తనకున్న నలుపుని ఎరుగక, తాను చాలా అందంగా ఉన్నాననుకున్నట్టు, మనషులు కూడా తమలోనున్న లోపాలనెరుగక, పక్కవాళ్ళలో తప్పులు ఎంచుతూ బతికేస్తారు. ' అనుకుంది జాగృతి. 
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - దుబారా ఖర్చులు - by k3vv3 - 07-10-2025, 09:45 AM



Users browsing this thread: 1 Guest(s)