Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - మొదటి పరిచయం
#7
పెళ్ళి సంబంధంలో ట్విస్ట్
[Image: p.jpg]
(అత్తగారి కథలు - పార్ట్ 3)
రచన: L. V. జయ
 
సమర్థ్ కి పెళ్ళి చెయ్యాలి అని నిర్ణయించుకుంది వాళ్ళ అమ్మ రాధ. కొడుకు వివరాల్ని మాట్రిమోనీ లో ఇస్తూ, ఇంజనీరింగ్ చదివి, అందంగా, తెల్లగా, సన్నగా ఉండే అమ్మాయిని చూడమని చెప్పింది. కొడుకు, మంచి కాలేజీలో MBA చేసి, ఉద్యోగం చేస్తున్నా, ఇంజనీరింగ్ చదవలేదన్న బాధ ఉండిపోయింది రాధకి. వచ్చే కోడలు అయినా ఇంజనీర్ అయ్యి ఉండాలి అనుకుంది. 



"ఆనందరావు వాళ్ళ అమ్మాయి చంద్రిక కి, మీ అబ్బాయికి చదువు, ఉద్యోగం అన్నీ సరిపోతున్నాయి. ఫోటో, జాతకాలు పంపించమని వాళ్లతో చెప్పమంటారా?" అని మాట్రిమోనీ వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది రాధకి. 



"ఆనందరావుగారిని మా ఇంటికి రమ్మని చెప్పండి. కలిసినట్టు ఉంటుంది, ఇక్కడే మాట్లాడుకోవచ్చు" అని చెప్పింది రాధ. 



ఫోటో, జాతకం తీసుకుని రాధ ఇంటికి వెళ్ళాడు ఆనందరావు. చంద్రిక ఫోటో చూసిన రాధ, "అమ్మాయి తెల్లగా ఉంటుంది అని అన్నారు. ఫొటోలో చూస్తే అలా అనిపించటం లేదు" అని అనుమానంగా అడిగింది. 



"మా అమ్మాయి, నాలా చామనచాయగా ఉంటుంది అండి" అన్నాడు ఆనందరావు. 



"మీలా అంటే నలుపే అన్నమాట" అంది రాధ. 



తన కూతుర్ని, తనని నల్లగా ఉన్నారని రాధ అనడం నచ్చలేదు ఆనందరావుకి. కోపాన్ని అణచుకుంటూ, "మరి, మీ అబ్బాయి చామనఛాయగా ఉంటాడని అన్నారు. ఉంటాడా మరి?" అన్నాడు రాధతో. 



పెళ్ళి సంబంధం కోసం వచ్చిన అమ్మాయి తండ్రి, ఇలా అడగడం నచ్చలేదు రాధకి. "మేము తెల్లగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నాం. పుట్టే పిల్లలు తెల్లగా పుట్టాలి కదా. మాకు చామనచాయ పిల్ల వద్దు. మేము వేరే సంబంధం చూసుకుంటాం. " అని చెప్పింది. 



'వీళ్లు, వీళ్ల పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వచ్చే కోడలు, పుట్టబోయే మనవలు మాత్రం తెల్లగా ఉండాలి. వీళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదవకపోయినా, ఇంజనీరింగ్ చదివిన కోడలు కావాలి. ఏం మనుషుల్లో ?' అని మనసులో అనుకున్నాడు ఆనందరావు. 



లేచి, వెళ్ళిపోతూ, ఎదో గుర్తు వచ్చినట్టు ఆగాడు. 'అబ్బాయి MBA చేసాడు. మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఈవిడ ఆలోచనలు ఎలా ఉన్నా, అబ్బాయి మంచివాడేనేమో. సంబంధం ఎందుకు వదులుకోవడం? జాగృతి ని చూడమని చెప్దామ్' అనుకుని, "నా కజిన్ వాళ్ళ అమ్మాయి ఉంది. తెల్లగా ఉంటుంది. ఇంజనీరింగ్ చదివింది. మీరు చూస్తానంటే, తన వివరాలు పంపమంటాను" అన్నాడు రాధతో. సరేనంది రాధ. 



ఇది జరుగుతున్న సమయంలో, చంద్రిక తనతో పాటు పనిచేస్తున్న ఒక అబ్బాయిని తీసుకువచ్చి, జాగృతి కి పరిచయం చేసింది. "ఇతను పవన్. మా ఆఫీస్ లోనే చేస్తున్నాడు. నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. పెళ్ళి చేసుకుంటే, నన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అంటున్నాడు. నాకు కూడా తనంటే ఇష్టం. " అని చెప్పింది. 



జాగృతి, చంద్రిక చెన్నై లో ఉద్యోగం చేస్తున్నారు. 'చంద్రిక కి ఉద్యోగం వచ్చి, జాగృతితో పాటు ఉంటూ ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రేమ, పెళ్ళి అంటోంది ఏమిటి?' అనుకుంది జాగృతి. "పవన్ నీకు ముందునుండే తెలుసా?" అని చంద్రికని అడిగింది. 



"లేదు. ఆఫీస్ లో జాయిన్ అయ్యాకే పరిచయం అయ్యాడు. " అంది చంద్రిక. 



"బాబాయ్ కి, పిన్నికి విషయం చెప్పావా మరి?" అని అడిగింది జాగృతి. 



"నాన్నగారికి చెప్పాలంటే భయంగా ఉంది జాగృతి. నువ్వే చెప్పాలి. " అంది చంద్రిక. 



"నీ విషయం నువ్వు చెప్తేనే బాగుంటుంది చంద్రిక. నువ్వు బాబాయ్ తో చెప్తున్నప్పుడు, నేను నీతోనే ఉంటాను. చూద్దాం ఏమంటారో" అంది జాగృతి. 



చంద్రిక ప్రేమ విషయం తెలిసి, కోపంతో ఊగిపోయాడు ఆనందరావు. "ఇక్కడ నీ కోసం నేను సంబంధాలు చూస్తున్నాను. నల్లగా ఉంది అని అందరూ వద్దంటుంటే, నువ్వు అక్కడ ఉద్యోగానికని వెళ్లి, ఇలాంటి పనులు చేస్తావా? మంచి సంబంధాలు వస్తాయా ఇంక?" అంటూ అరిచాడు. 



"ఒకసారి పవన్ తో మాట్లాడండి బాబాయ్. చంద్రిక ఇష్టపడుతోంది కదా. " అని బతిమాలుకుంది జాగృతి. 



ఆనందరావు చెన్నై బయలుదేరి వెళ్లి, పవన్ ని కలిసాడు. "ఏం నచ్చింది అబ్బాయిలో నీకు?" అని కోపంగా అడిగాడు. 



ఆనందరావు ఎందుకు అలా అడిగాడో అర్ధం అయ్యింది చంద్రికకి. "రంగులో ఏముంది నాన్నగారు? నేను కూడా రంగు తక్కువే కదా. పవన్ చాలా మంచివాడు. ఒప్పుకోండి. ప్లీజ్" అని బతిమాలుకుంది చంద్రిక. 



కాసేపు అలోచించి, "మీ ఇంట్లోవాళ్ళకి తెలుసా విషయం?" అని పవన్ ని అడిగాడు ఆనందరావు. 



"తెలుసండి. వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకున్నారు" అని చెప్పాడు పవన్. 



"ఏం చదువుకున్నావ్ నువ్వు ? నీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకువచ్చి, రేపు నన్ను కలువు. అప్పడు ఆలోచిస్తాను. " అని అన్నాడు ఆనందరావు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - దుబారా ఖర్చులు - by k3vv3 - 07-10-2025, 09:43 AM



Users browsing this thread: 1 Guest(s)