Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - మొదటి పరిచయం
#6
కూతుర్ని పడుకోబెట్టి, వంటచెయ్యడానికి వెళ్ళింది జాగృతి. రాధ కూడా వెనకాలే, వంటిట్లోకి వచ్చి, "ఎన్ని సామానులో? ఇకముందు నువ్వు ఒక్క చెంచా కొన్నా నాకు తెలియకుండా కొనడానికి వీల్లేదు" అని గట్టిగా అరిచి చెప్పింది రాధ. ఆవిడ అరుపుకి, తుళ్ళిపడింది జాగృతి.



జాగృతి తీసిన కూరల్ని వెనక్కి పెట్టించి, వేరే కూరలు తీసింది రాధ. ఒక అగ్గిపుల్లతో, 3 స్టవ్ లు వెలిగించి, "చూడు, ఇలా పొదుపు చెయ్యాలి. దుబారా ఖర్చులు చెయ్యకూడదు" అంది నెమ్మదిగా. 'ఈవిడేంటి? ఇంతలోనే గొంతు మార్చేసింది?' అనుకుంది జాగృతి. 



అప్పుడే, సమర్థ్ వంటిటి వైపు రావడం చూసి, 'ఓహ్. అందుకా ఈవిడ అగ్గిపుల్లతో పొదుపు పాఠాలు నేర్పుతోంది' అనుకుంది జాగృతి. 



" రోజు నుండి నా కొడుకుకి నేను వండిపెడతాను. నీ వంట తిని సన్నగా అయిపోయాడు" అంది రాధ కొడుకుని చూస్తూ. 



'పోనిలే. ఈవిడ వల్ల వంటపని తగ్గుతుంది.' అని సంతోషింది జాగృతి. 



అప్పటికే, స్టవ్ లు కొంతసేపటి నుండి వెలుగుతూ ఉండడం తో, వంటిల్లంతా గ్యాస్ వాసన వచ్చింది. జాగృతి కి, రాధ మాటలకి వచ్చిన తల నొప్పి, గ్యాస్ వాసన వల్ల ఇంకొంచెం పెరిగింది.



 'ఈవిడ దుబారా ఖర్చులు అని నన్ను తిడుతోంది. ఇంతసేపు గ్యాస్ పోయినా పర్వాలేదనుకుంటా.' అనుకుంది జాగృతి. 



"నా కూతురు, ఎంత బాగా వంట చేస్తుందో. నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క పని కూడా నేను చేయించలేదు. ఇప్పుడు ఎంత కష్టపడుతోందో పాపం." రాధ, తన కూతురి గొప్పలు చెప్తూనే ఉంది. 



'ఈవిడ, కూతురికి ఏమీ నేర్పకుండా అత్తగారి ఇంటికి పంపచ్చు. కోడలు కొంచెం నేర్చుకుని వచ్చినా తిట్లు తప్పవు' అనుకుంది జాగృతి. 



"హోటల్స్ కి వెళ్తారు కదా మీరు?" జాగృతిని అడిగింది రాధ. ఏం సమాధానం చెప్పలేదు జాగృతి. సమాధానం చెప్పినా రాధ వినదు. అనాల్సినవి, అనేస్తుంది. 



"మీలా ప్రతి వారం హోటల్ కి వెళ్ళరు వాళ్ళు. ఎదో వారానికి ఒక్కసారో, రెండు సార్లో వెళ్తారు. వారం అంతా కష్టపడుతుంది కదా, అందుకు వాళ్ళ ఆయన హోటల్స్ కి తీసుకుని వెళ్తాడు. నువ్వేం వెళ్ళక్కరలేదు." అంది. 



రోజంతా, కూతురి గురించి ఎదో ఒకటి చెప్తూ, జాగృతిని తిడుతూ గడిపింది రాధ. 
 
రోజు రాత్రి, జాగృతి మొహం చూసి, "ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి. ఏమైంది నీకు? రోజు ఇలా ఉన్నావ్?" అని అడిగాడు సమర్థ్. అత్తగారు ఉదయం తిడుతున్న విషయం చెప్పాలనుకుంది, కానీ, సమర్థ్ ఏమంటాడో అని చెప్పలేకపోయింది జాగృతి. 



"అమ్మ నీకు చాలా నేర్పానని చెప్పింది. ఏం నేర్పింది?" అని అడిగాడు.



"ముందు నేనొకటి అడుగుతాను. దానికి సమాధానం చెప్పండి. అప్పుడు చెప్తాను" అంది జాగృతి. సరే నన్నాడు సమర్థ్.



"ఒకరు, ప్రతి వారం హోటల్ కి వెళ్లి తింటారు. ఒకరు, వారానికి ఒక్కటి, రెండుసార్లు హోటల్ కి వెళ్లి తింటారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ సార్లు హోటల్ కి వెళ్తున్నట్టు? " అని నవ్వుతూ అడిగింది జాగృతి.



"రెండో వాళ్ళేగా. ఇంతకీ అమ్మ ఏం చెప్పిందో చెప్పు" కుతూహలంగా అడిగాడు సమర్థ్.



"మీ అక్క గురించి చాలా చెప్పారు. ఆవిడలా నన్ను ఉండద్దు అన్నారు. ఆవిడ ఇంట్లో ఉన్నవి, మన ఇంట్లో ఉంటే, వాటిని దుబారా ఖర్చు అన్నారు. ఆవిడలా కిట్టిపార్టీలు పెట్టకూడదని, ఆవిడలా బట్టల్ని ఒక్కసారి వాడి, వదిలెయ్యకూడదని, ఆవిడలా బట్టలకి అనవసరంగా డబ్బులు వేస్ట్ చెయ్యకూడదని, వాళ్ళలా ప్రతివారం హోటల్ కి వెళ్లకూడదని చెప్పారు. వదిన గురించి చెప్తూ, నాకు ఎన్నో విషయాలు నేర్పించారు" అంది జాగృతి నవ్వుతూ. 



నవ్వులో, బాధ కనపడింది సమర్థ్ కి. జాగృతి, తనకి కనపకుండా కళ్ళు తుడుచుకోవడం చూసాడు సమర్థ్.
జరిగినదంతా అర్ధం అయ్యింది సమర్థ్ కి. రాధ, జాగృతి తో మాట్లాడేతీరు, ప్రవర్తిస్తున్న విధానాన్ని చూసాడు సమర్థ్. 



'కూతురికి, కోడలికి పోలిక పెట్టిందన్నమాట అమ్మ. ఇంట్లో ఉండే కూతురు గొప్ప. బాగా చదువుకుని, సంపాదించగలిగి ఉండి, ఉద్యోగం చేయొద్దంటే, మానేసిన కోడలు గొప్ప కాదు. కూతురికి అన్నీ సంతోషాలు ఉండాలి. కోడలికి ఉండకూడదు.జాగృతి, విషయాన్ని దాచి, అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నానని చెప్పింది' అనుకున్నాడు. 



"దుబారా ఖర్చులు పెడుతున్నావ్ అని అమ్మ అనడం విన్నాను. బాధపడకు. నువ్వేం పెట్టటం లేదు. ఒక చెంచా కూడా ఆవిడకి తెలియకుండా కొనద్దు అని చెప్పింది కదా. రేపు బయటకి వెళ్తున్నప్పుడు, ఒక చెంచా కొనుక్కుని వస్తాను అని చెప్పిరా. ఏమంటుందో చూద్దాం" అన్నాడు. 



'ఆవిడ నా మీద అరవడం సమర్థ్ విన్నాడన్నమాట. అయినా ఏం లాభం? అమ్మకి ఏమీ చెప్పడు. ' అనుకుంది జాగృతి. 



ఎన్ని తిట్లు తిన్నా, ఎవరి గురించి చెడు చెప్పలేదు జాగృతి. 
జాగృతి మీద ఉన్న ఇష్టం, ఇంకా పెరిగింది సమర్థ్ కి.
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - కార్ పేరు 'రమణి' - by k3vv3 - 01-10-2025, 04:16 PM



Users browsing this thread: