Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - మొదటి పరిచయం
#5
దుబారా ఖర్చులు
అత్తగారి కథలు - పార్ట్ 2
రచన: L. V. జయ
[font="var(--ricos-font-family,unset)", serif][Image: d.jpg][/font]

సమర్థ్ కి కూతురు పుట్టాక, కొత్త ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కొత్త ఇంటికి మొదటి సారి వచ్చిన సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ, వస్తూనే ఇల్లంతా తిరిగి చూసి, "ఇంత పెద్ద ఇల్లు ఎందుకురా? దుబారా ఖర్చు. ముందున్న ఇంట్లోనే ఉండచ్చు కదా" అంది.



" సింగల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పుడు సరిపోదు కదమ్మా. అందుకని, రెండు 2 బెడ్ రూమ్ లు ఉన్న ఇల్లు తీసుకున్నాను" అన్నాడు సమర్థ్. 



"మీ ఆవిడ అడిగిందా ఇల్లు తీసుకోమని." అంది కోడలు జాగృతిని చూస్తూ. లేదని చెప్పాడు సమర్థ్. 



"బాగా వెనకేసుకొస్తున్నావ్ మీ ఆవిడని. ఇంటినిండా అక్కరలేని వస్తువులే ఉన్నాయి. దుబారా ఖర్చులు." అంది జాగృతిని కోపంగా చూస్తూ, కొడుకుతో నెమ్మదిగా, "కూతురు కూడా వచ్చింది కదా ఇప్పుడు. ఇంకా ఖర్చు పెరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి." అని చెప్పింది రాధ. 



"నువ్వు వచ్చావు కదా. అన్నీ దగ్గరుండి నేర్పించు" అని రాధ కి చెప్పి వెళ్ళిపోయాడు సమర్థ్.



సమర్థ్, బయటకి వెళ్ళగానే, తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలు పెట్టింది రాధ. 



"నా కూతురి ఇంట్లో, కర్టెన్స్, బెడ్ పక్కన మాట్స్ ఉన్నాయని, నువ్వు కూడా కొనేసి ఉంటావ్. నా కూతురుకి, నీకు పోలికా?" అంది జాగృతి తో. జాగృతి, రాధ ని చూసి, ఊరుకుంది. 



'అవసరమైన వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు తప్ప ఇంకేమి లేవు ఇంట్లో. అయినా అత్తగారు ఎందుకు ఎప్పుడూ తిడుతూ ఉంటారో' అనుకుంది జాగృతి.



జాగృతి అంటే ముందు నుండి ఇష్టం లేదు రాధ కి. జాగృతిని, ఎప్పుడూ ఎదో ఒకదానికి తిడుతూనే ఉంటుంది. జాగృతి కి కూతురు పుట్టాక, తన కొడుకు, తనకి దూరం అయిపోతాడు అనిపించి, జాగృతి మీద ఇంకా కోపం పెరిగిపోయింది రాధకి.



"లేచాక కాలు కిందపెట్టలేదేమో సుకుమారి. బెడ్ పక్కన మాట్స్ వేసుకుంది. నా కూతుర్ని, నేను కాలు కిందపెట్టకుండా పెంచాను. అది ఏదైనా కొనుకుంటుంది. నీకు ఎందుకు?" అంది రాధ.



'నిజంగానే ఈవిడ కర్టెన్స్, మాట్స్ గురించే తిడుతున్నారా? లేక వాళ్ళ కూతురిలా నేను ఉండకూడదు అంటున్నారా?' అర్ధం కాలేదు జాగృతి కి. 



"నీలాగ, బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్లిపోదు నా కూతురు. ఇంట్లోనే ఉంటూ, భర్తని, పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది. కాబట్టి, దాని భర్త, దానికి కావాల్సినవి కొంటాడు. నీకెందుకు ఇవన్నీ?" అంది రాధ.



'ఈవిడ వెళ్ళనిస్తే కదా బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్ళడానికి. ఎప్పుడో మాన్పించింది కదా. ఇంకా తిడుతోందేంటి ఈవిడ? ' అని అనుకుంది జాగృతి.



జాగృతి, పెద్ద IT కంపెనీ లో ఉద్యోగం చేసేది. కంపెనీ వాళ్ళు, జాగృతి తెలివితేటల్ని చూసి, అమెరికా పంపారు. అక్కడ, కొన్నాళ్ళు చేసి వచ్చింది. పెళ్లి అయ్యాక కూడా మళ్ళీ పంపిస్తామన్నారు. విషయం తెలిసినప్పటినుండి, జాగృతిని ఉద్యోగం మానెయ్యమని తిడుతూనే ఉంది రాధ. జాగృతి కి ప్రెగ్నన్సీ వచ్చాక, ఆఫీస్ కి వెళ్లనివ్వకుండా చేసి, వేరే ఊళ్ళో వున్న, వాళ్ళ అమ్మ ఇంటికి పంపేసింది రాధ. జాగృతి కి, ఉద్యోగం మానెయ్యాల్సి వచ్చింది. 



" లోకంలో ఉన్నావ్? నేను చెప్పేది వింటున్నావా? " అత్తగారి మాటలకి, ఆలోచన నుండి బయటకి వచ్చింది జాగృతి. 



"నా కూతురు ఇంట్లో, రేపు కిట్టి పార్టీ ఉంది. ఫ్రెండ్స్ అందరిని పిలిచి, భోజనం పెడుతోంది. ఇద్దరు పిల్లలతో చేసుకోగలదో లేదో? నేను వెళ్తాను సాయానికి. అవునూ, నీకేమైనా కిట్టి పార్టీ లాంటి అలవాట్లు ఉన్నాయా?" అని అడిగింది రాధ. లేదని చెప్పింది జాగృతి. 



"అలాంటివేమీ పెట్టుకోకు. దుబారా ఖర్చు." అంది రాధ. 



' కూతురికి అలాంటి అలవాట్లు ఉంటే దుబారా ఖర్చు కాదనుకుంటా' అనుకుంది జాగృతి.



"దాని ఫ్రెండ్స్ అందరూ రకరకాల బట్టలు వేసుకుని వస్తారు. నా కూతురు అందరికంటే, స్పెషల్గా ఉండాలని, పట్టు లంగా, జాకెట్టు కుట్టించి తెచ్చాను. బుట్ట చేతులు కూడా పెట్టించాను. చిన్నప్పుడు ఎప్పుడో వేసుకునేది ఇలాంటివి. మళ్ళీ వేసుకునే అవకాశం వస్తుందో రాదో."అంటూ లంగా, జాకెట్టు చూసి మురిసిపోయింది రాధ. "అయినా, అది ఏం వేసుకున్నా అందంగా ఉంటుంది. నీలా కాదు." అంది. 



ఆవిడ మాటల్ని తట్టుకోలేక, కూతుర్ని తీసుకుని తన రూమ్ లోపలికి వెళ్ళిపోయింది జాగృతి. 



"నువ్వు అనవసరంగా ఎక్కువ బట్టలు కొనకు. దుబారా ఖర్చు" అని వెనకనుంచి అంటున్న అత్తగారి మాటలు వినపడ్డాయి జాగృతి కి. 



'ఈవిడ ఏమీ మారలేదు. కూతురి గురించి గొప్పగా చెప్తూ, కోడలిని తిట్టాలి. అదే ఈవిడ లక్ష్యం.' అనుకుంది జాగృతి. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - కార్ పేరు 'రమణి' - by k3vv3 - 01-10-2025, 04:15 PM



Users browsing this thread: 1 Guest(s)