Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#38
అమ్మమ్మ గారి ఇల్లు
[Image: a.jpg]
రచన: మయూఖ



నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి అమ్మ చెప్పింది మావయ్య ఫోన్ చేశాడని, అమ్మమ్మగారిల్లు అమ్మేస్తున్నట్టు చెప్పాడని.. నేను ఒక్క క్షణం షాక్ తిన్నాను. ఇంటితో తన అనుబంధం జ్ఞాపకాలు ఏమీ లేకుండా చేసేస్తాడా? 



అమ్మమ్మతో, తాతయ్యతో తను గడిపిన మధుర క్షణాలు ఇప్పటికీ తన దగ్గర పదిలంగా ఉన్నాయి అనుకుంటూ ఆలోచనల నుంచి బయటపడి,



"ఎందుకు అమ్ముతున్నాడు? ఇల్లు అమ్మకపోతే మావయ్యకి గడవదా! ఎప్పుడు ఫోన్ చేశాడమ్మా?" అంటూ కోపంగా అన్నాను.



"మీనా! స్థిమితపడు. నీకు ఇంటితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. అయినా మావయ్య అక్కడ ఉండటం లేదు కదా! అందుకని అమ్మేస్తున్నాడేమో" అంది అమ్మ నాకు నచ్చచెప్పుతున్నట్లుగా.



నా ఆలోచనలు అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి.



***
మేము హైదరాబాదులో ఉండేవాళ్లం. నాన్న .జి. ఆఫీసులో పనిచేసేవారు. ఎప్పుడూ క్యాంపులకి ఎక్కువ వెళ్లేవారు. నేను, అమ్మ, చెల్లి ఉండేవాళ్ళం. వేసవికాలం వచ్చిందంటే నాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఎప్పుడెప్పుడు అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోదామా అని ఉండేది. అప్పుడు నేను ఐదో క్లాసు చదువుతున్నాను. చెల్లి రాధా మూడో క్లాసు చదువుతోంది. మాకు పరీక్షలు అయిపోయిన వెంటనే అమ్మ, చెల్లితో కలిసి అమ్మమ్మగారి ఊరు బయలుదేరే వాళ్ళం.



హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకి బస్సు ఎక్కితే మర్నాడు తెల్లవారుజామున రావులపాలెంలో దిగేవాళ్ళం. కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉండేది మా అమ్మమ్మ గారి ఊరు. చాలా పల్లెటూరు.



తాతయ్య సైకిల్ మీద మా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. నాకు ఇష్టమని గుర్రబ్బండి తీసుకువచ్చేవారు. రావులపాలెంలో రిక్షాలు ఉన్నా ఎక్కే వాళ్ళం కాదు. 



ఎందుకంటే గుర్రపు బండి అంటే నాకు ఇష్టమని తాతయ్య ముందు రోజే గుర్రపు బండి తాతతో చెప్పేవారు.
"రేపు మా మనవరాలు హైదరాబాద్ నుంచి వస్తోంది బండి కట్టాలి" అని. 



రోజుల్లో హైదరాబాద్ అంటే అంత గొప్ప. నాకు గుర్రాన్ని అదిలించడం అంటే ఇష్టంగా ఉండేది. చెర్నాకోల్ నేనే తీసుకునేదాన్ని. 



ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ, పిన్నులు మాకు ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించేవారు. నేను గలగల లాడుతూ మాట్లాడేదాన్ని.



అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దది. అటు 3 గదులు, ఇటు మూడు గదులు మధ్యలో పెద్ద పెద్ద హాళ్లు ఉండేవి. వంటిల్లు వెనకవైపు ఉండేది. ముందు పెద్ద ఖాళీ స్థలం ఉండేది, దానిలో పువ్వుల మొక్కలు అందంగా గాలికి ఊగుతూ స్వాగతం పలుకుతున్నట్టు ఉండేవి.



మా అమ్మ పెద్దది. అమ్మ తర్వాత ఇద్దరు పిన్నులు, ఒక మావయ్య ఉన్నారు. అందరూ మమ్మల్ని గారంగా చూసేవారు. 



తాతయ్యకి పొలం ఉండేది రెండు ఆవులు కూడా ఉండేవి. సంవత్సరమే వాటికి చిన్న తువ్వాయి పుట్టిందట. తెల్లగా ఎంత ముద్దుగా ఉండేదో. దాంతో ఆడుకునేదాన్ని.



తాతయ్య మేము ఊరికి వచ్చామంటే ముంజి కాయలు, పనస పళ్ళు తోట నుంచి తెప్పించేవారు. ముంజి కాయలు తాతయ్యే స్వయంగా కొట్టి మాకు స్పూన్ తో తీసి ఇచ్చేవారు. ముంజులని ఒళ్ళు పేలకుండా ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసేవాళ్ళం.



పనస పళ్ళు కోసి తొనలు తీసి ఇచ్చేవారు. తోట నుంచి మల్లెపూలు తెప్పించేది అమ్మమ్మ. పెద్ద పిన్ని లక్ష్మి నాకు, చెల్లికి పువ్వుల జడలు కుట్టేది. అమ్మమ్మ ఇంటికి దగ్గరలో కాలువ ప్రవహించేది. సాయంత్రాలు రోజు చిన్న పిన్ని రాజీ మమ్మల్ని కాలువకి తీసుకు వెళ్ళేది. 



అమ్మమ్మ "రాజి! పిల్లలు జాగ్రత్త! చెంబు తీసుకువెళ్ళు. గట్టుమీదనే స్నానం చేయించు" అని జాగ్రత్తలు చెప్పేది.



అమ్మమ్మ పొద్దుటే మడి కట్టుకుని దేవుడికి పూజ చేసి, హారతి ఇచ్చేది. గంట శబ్దానికి నేను లేచే దాన్ని. గబగబా హారతి అందుకుంటుంటే అమ్మ కోప్పడేది."పాచి మొహంతో ఏమిటి అని. కానీ అమ్మమ్మ "పోనీలే చిన్నపిల్ల" అనేది. రాత్రుళ్లు నేను, చెల్లి అమ్మమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. రామాయణం, భారతం కథలు కథలుగా చెప్పేది. వింటూ పడుకునే వాళ్ళం.



రావులపాలెం లో టూరింగ్ టాకీస్ ఉండేది. తాతయ్య గుర్రం బండి తెప్పిస్తే మేము అందరం సినిమాకు వెళ్లేవాళ్ళం. మధ్యలో తినడానికి జంతికలు, చేగోడీలు అమ్మమ్మ పొట్లం కట్టి ఇచ్చేది. తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లేవాళ్ళం. అక్కడ బోరింగ్ దగ్గర స్నానాలు చేసేవాళ్ళం.



తాతయ్య మామిడికాయలు కోస్తే అమ్మమ్మ ఆవకాయ పెట్టేది. ఎన్నని చెప్పను? ఎన్నో జ్ఞాపకాలు. రాత్రి నులక మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి పడుకునే వాళ్ళ౦. ఆరుబయట చల్లగాలికి ఎయిర్ కూలర్లు అవసరం ఉండేవి కావు. మేము హైదరాబాద్ వచ్చేస్తుంటే మాకు బట్టలు, తినుబండారాలు, కూరగాయలు, బస్తా బియ్యం పంపేది. నేను వచ్చేటప్పుడు అమ్మమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని.



"ఏడవకు మీనా! మళ్లీ వద్దు గానిలే, దసరా సెలవులకు రండి" అనేది.



కానీ నాన్న వేసవికాలం లోనే పంపించేవారు. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అమ్మమ్మతో నా బంధం ఇంకా బలపడిపోయింది. పిన్నులు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మామయ్య కు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఆఫీసులో పనిచేసే తన కొలిగ్నే పెళ్లి చేసుకున్నాడు.
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - దత్తత - by k3vv3 - 25-09-2025, 01:54 PM



Users browsing this thread: 1 Guest(s)