Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - మొదటి పరిచయం
#4
"నీ కోసమే కొనుక్కుని ఉంటావ్. కొన్నది నీకు ఇష్టమైన ఎర్ర కారేనా?" అడిగాడు మాణిక్యాలరావు. ఆశ్చర్యంగా, భర్తని చూసింది జాగృతి. 'తన కోసం ఎర్ర కార్ కొనుక్కుంటూ, నా కోసం కొన్నాను అని ఎందుకు చెప్పాడు ?' జాగృతి కి వాళ్ళ సంభాషణ అర్ధం కాలేదు. 



"నాకు తెలుసు. వీడు మన కోసం కొనలేదు. వాళ్ళ ఆవిడ కోసం కొన్నాడు. రోజు ఆవిడ పుట్టినరోజు కూడా కదా. అందుకే పెళ్ళాం, బెల్లం అన్నారు " అంది రాధ. 



'కార్ కొనమని నేనేమి అడగలేదు కదా? ఈవిడ నన్ను ఎందుకు అంటున్నారు?' అని బాధపడింది జాగృతి. 



సమర్థ్ పక్కనే జాగృతి కూర్చుని ఉందని, అంతా వింటోందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇంకేం అనేస్తారో అన్న భయంతో, "పూజ చేయించటానికి తీసుకుని వెళ్తున్నాను. ఇంక ఉంటాను" అని ఫోన్ పెట్టేసాడు సమర్థ్. 



పూజ చేయించిన తరువాత, హోటల్ కి వెళ్లారు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఏమి మాట్లాడుకోలేదు. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకుని, తిని వచ్చారు. 



తనకి ఇష్టమైన కార్ కొన్న ఆనందం సమర్థ్ కి, పుట్టినరోజున గిఫ్ట్ వచ్చిన ఆనందం జాగృతి కి కాసేపు కూడా మిగలలేదు. 



మర్నాడు, ఉదయం ఇద్దరూ కొత్త కార్ లో ఆఫీస్ లకి వెళ్లారు. ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు, కార్ వెనక రాసి ఉన్నది చూసింది జాగృతి. 



ఇంగ్లీష్ లో రమణి అని రాసి ఉంది. 'ఆర్', 'ఎమ్' పెద్ద అక్షరాల్లో, మిగిలినవి అన్నీ చిన్న అక్షరాల్లో ఉన్నాయి. జాగృతి కి విషయం మొత్తం అర్ధం అయ్యింది. రమణి అని ఎందుకు కార్ మీద రాసుందో కూడా తెలిసింది. 



కార్ లో కూర్చుని, "ఇంతకీ కార్ ఎవరి కోసం కొన్నానని చెప్పారు?" అని సమర్థ్ ని అడిగింది జాగృతి. 



"నీ కోసమే. " అన్నాడు సమర్థ్. 'ఈయనకి నారదముని అని పేరు పెట్టాల్సింది. అనవసరంగా సమర్థ్ అని పెట్టారు. ' అని మనసులో తిట్టుకుంది. 
 
" రోజు అత్తయ్యతో, మావయ్యతో మాట్లాడారా?" అని అడిగింది. అవునని చెప్పాడు సమర్థ్. 



"అవునూ. రమణి ఎవరు? " అని అడిగింది జాగృతి. రమణి ఎవరో తనకి తెలిసినా, సమర్థ్ ఏంచెప్తాడో అని అడిగింది. 



"వెనక ఉన్న స్టిక్కర్ చూసేసావా? రమణి, నా పాత ఫ్రెండ్ పేరు. కార్ కి పెట్టుకున్నాను?" అన్నాడు జాగృతిని ఏడిపిస్తూ. 



"ఓహ్. మీ పాత ఫ్రెండ్ పేరు రమణి. అంటే రాధ + మాణిక్యాలరావు. అంతేగా" అంది జాగృతి. 



జాగృతి ని దగ్గరకి తీసుకుని, కళ్ళలోకి చూస్తూ, "అవును. కొత్త ఫ్రెండ్ పేరుని కార్ మీద రాయక్కరలేదు. తనని చూసిన మొదటి రోజే, నా గుండెల్లో రాసుకున్నాను తన పేరుని". అన్నాడు సమర్థ్. 



" సినిమాలో డైలాగు ఇది?" అంది జాగృతి కోపంగా. 



కొన్ని నెలల తరువాత, 'రమణి' అని పేరుగల కారు ''మణి' దగ్గరికి వెళ్ళిపోయింది
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - by k3vv3 - 24-09-2025, 08:59 AM



Users browsing this thread: 1 Guest(s)