Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేదు. ఆవిడ ఉద్యోగం చెయ్యదు. పల్లెటూళ్ళో ఆస్తి ఎందుకు, అమ్మి పారేసి తల్లిని తమతో ఉండమంటుంది. ఆవిడ మనస్తత్వం తెలిసిన మురారి రెండోసారి తల్లిని కదిలించే ప్రయత్నం చెయ్యలేదు. భార్య మాట వ్యతిరేకించినది అదొక్కటి, తల్లి మాట విన్నదీ పల్లెటూరులో ఆస్తి అమ్మకుండా ఉండటం. మొత్తం తగలేసి అందరూ వీధిని పడ్డప్పుడు ఆదుకునేది ఈ ఆస్తేనని సూరమ్మ కూడా కఠినంగా ఉండిపోయింది.



తెల్లవారుతుండగా, ఒక జులపాల వాడితో తూలుకుంటూ గదిలోకి వెళ్తున్న మనవరాల్ని నిర్వేదంగా చూసింది ఆవిడ, ' అయిపోయింది ఈ కుటుంబం పరువు, ప్రతిష్ఠ! అసలు కుటుంబమే కూలి పోయాక ఇంకా ఏమిటి' అనుకున్నది.






ఆరోజు మురారి చక్కగా గడ్డం గీసుకుని, తలారా స్నానం చేసి, తెల్లని లాల్చీ పైజామా వేసుకుని, తల్లి చక్కగా అలంకరించి పూజ చేసిన దేవుడి ఫోటోకి దణ్ణం పెట్టుకుని, తల్లి చేసిన పులిహోర, చక్కెరపొంగలి, దద్ద్యోజనం ఎంతో ఆబగా తిన్నాడు...ఎన్నాళ్ల నుండో తిండి లేని వాడి లా తింటున్న కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయింది. ఇక్కడ ఈ ర్రాక్షసుల మధ్య అతన్ని వదిలి, తన ఆత్మాభిమానం నిలుపుకున్న తన మీద తనకే అసహ్యం వేసింది సూరమ్మకి. దాంతో పాటు ఏవో తీర్మానాలు మనసునిండా సుడులు తిరగసాగాయి!



ఇద్దరూ ఒక సుందర నందనవనం లాంటి ఉద్యానవనానికి వెళ్లారు. ఊరవతల తనకోసం ఏర్పాటు చేసుకున్న ఏకాంత మందిరం. అక్కడికి వెళ్తూనే మురారి మరో మనిషై పోయాడు. అక్కడ చిన్న సరసులో నడయాడుతున్న బాతులతో కబుర్లు చెప్పాడు, చెట్టు మీద తన రాగాలాపన తో సందడి చేస్తున్న కోయిలతో గొంతు కలిపి కృష్ణ రావు గారి పాట పాడాడు. తల్లి కళ్లల్లో మెరుస్తున్న ఆనందం అతనికెంతో తృప్తినిచ్చింది.



తల్లి ఒళ్ళో తలపెట్టుకుని అడిగి అడిగి చెప్పించుకున్నాడు, తండ్రి, తాత మామ్మలతో గడచిన తన బాల్యాన్ని. తాను ఎత్తుకు మోసిన చిన్నారి వాగ్దేవి కబుర్లు... ఇల్లాలయి, ఇద్దరు బంగారు తల్లుల తల్లి అయ్యి భర్తతో అందమైన, ఆనందమైన జీవితం గడుపుతున్న చెల్లెలి గురించి వింటూ పులకించిపోయాడు!



"ఇంత అభిమానమున్న నేను చెల్లిని చూసేందుకు ఎందుకు వెళ్లనని కదా నీ సందేహం? వద్దమ్మా నా నీడ కూడా దాని మీద పడకూడదు. నా పెళ్ళాం రాక్షసి దాని పెళ్లికి ఎన్ని అవరోధాలు తెచ్చిపెట్టింది... బావ మంచిముత్యం కనుక దాని మాటలు, అది సృష్టించిన ఉత్తరాలు నమ్మలేదు." 
కొడుకు మాటలతో అంతా గుర్తు వచ్చింది, ఈర్శ్యతో వాగ్దేవి మీద, కామేశ్వరి కల్పించిన నిందలు!



అసలు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు మురారి. అన్నీ విని సూరమ్మ, "బాబీ నేను నిన్నొక్క వరం అడుగుతాను ఇస్తావా నాన్నా" అన్నది.
కరిగిపోయాడు కొడుకు, " అమ్మా! చెప్పమ్మా ఏదైనా సరే చేస్తాను. నేను ఎప్పుడూ నీ దగ్గరనించీ తీసుకోవడమే కానీ ఇవ్వలేదు" అన్నాడు.



తన కోరిక చెప్పింది సూరమ్మ.



" అమ్మా! నేనే అడుగుదామనుకున్నాను. నువ్వే ఇచ్చావు నాకా వరం. నేను ఉద్యోగం రిజైన్ చేసాను. ఆ రాక్షసి కుటుంబానికి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళ పేరు మీద మార్చి అన్నీ రెడీ చేసేసాను. నువ్వు ఇప్పుడు ఇలా అడగకపోతే నేను రిశీకేశ్ లో స్వామీజీ దగ్గరకి వెళ్లిపోయేవాణ్ణి! నా రోజులు ఇంక రెండు నెలలు మహా అయితే" 



కొడుకు నోరు మూసింది సూరమ్మ. 
"నువ్వు నా మాట పూర్తిగా వింటే అన్నీ చక్కబడతాయి. నీకేం తక్కువని చావాలి? మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టు" అని రకరకాలుగా జీవితం పట్ల ఆశ కలిగించింది.!



ముందు కొడుకుని తీసుకుని తమ ఊరు వెళ్లి, కొన్నాళ్ళు ఉన్న మందులు వాడుతూ, అప్పుడు పట్నం తీసుకెళ్లి మెరుగైన వైద్యం, మంచి ఆహారం, విశ్రాంతి తో మురారి అనుకున్న దానికంటే ముందే హై బీపీ, షుగర్, అల్సర్. అన్నీ తగ్గించుకున్నాడు. అక్కడ్నించీ అల్లుడి సహకారంతో అన్ని పుణ్యక్షేత్రాలూ తిప్పింది.



అసలు తన ఉనికి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లి సాంగత్యంలో ఆధ్యాత్మిక జీవనం అలవరచుకున్నాడు. ఎంతో ప్రశాంతత!



గుడిలో నిరంతరం కీర్తనలు పాడే అనుపమ విధి వంచితురాలు. తాను కూడా కీర్తనలు మళ్లీ సాధన చేసి పాడేవాడు. ఆ నేపథ్యంలో ఇద్దరికీ మంచి స్నేహం కలిసింది.



ఉత్తమ ఆభిరుచులు కలిగిన అనుపమ వైపు సహజంగానే ఆకర్షింపబడ్డాడు మురారి. భర్తను కోల్పోయిన అనుపమకు కూడా తన బాధను మురారి సాంగత్యం సేదదేరుస్తున్నట్లుగా ఉన్నది. వాళ్లిద్దరూ తమది స్నేహమే అనుకుంటున్నా, సూరమ్మ ఆలోచనలు వాళ్ళని ఒకటి చేస్తే....దెబ్బతిన్న పక్షులు రెండూ సాంత్వన చెందుతాయేమో అనుకుంటున్నది! రాగల కాలమే తీర్పు చెప్పాలి!
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - భలే స్నేహితులు - by k3vv3 - 20-09-2025, 02:49 PM



Users browsing this thread: 1 Guest(s)