Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#35
దత్తత
[Image: d.jpg]
రచన : బివిడి ప్రసాదరావు



"రేపు సండేగా.. నాకు బయట పని ఉంది. నీ బైక్ కావాలి" అన్నాను.
"సరే.. పెట్రోల్ మాత్రం కొట్టించుకో." చెప్పాడు కిరణ్.
తర్వాత.. ఇద్దరం.. నేల మీద పక్కలు వేసుకున్నాం. పడుకున్నాం.
కిరణ్.. నా ఆఫీస్మేట్.. రూమ్మేట్.
***
ఇద్దరం కేంటిన్ నుండి బయటకి వచ్చాం.
రూం వద్దకి చేరాం.
నేను బైక్ దిగేక.. "నువ్వు రూంలోకి వెళ్లు.. నీ బైక్ తీసుకు వెళ్తా.. రాత్రి చెప్పాగా" చెప్పాను.
"లంచ్ టైంకి వచ్చేస్తావా." అడిగాడు కిరణ్.
"సాధ్యపడితే వచ్చేస్తా. లేటైతే ఫోన్ చేస్తా." చెప్పాను.
"సరే. నువ్వు నా బైక్ తీసుకెళ్లు." కిరణ్ చెప్పాడు.
నేను బైకు పుచ్చుకున్నాను.. స్టార్ట్ చేశాను.
కిరణ్ రూం వైపు కదిలిపోయాడు.
నేను.. నా పనికై కదిలాను.
దార్లో.. బైక్ లో పెట్రోల్ పోయించాను.
నేను ఆఫీస్ లో చేరిన రోజునే.. కిరణ్ నన్ను కోరి కలిశాడు. అతడి రూంలో..
షేరింగ్ పేమెంట్ తో.. నాకు వసతి చూపించాడు.
కిరణ్ చాలా చొరవైన వాడు. చురుకైన వాడు. నాకు ఇట్టే నచ్చేశాడు.
నేను.. కిరణ్ తో కలిసి.. అతడి బైక్ మీదే.. ఆఫీస్ కి వెళ్లడం.. తిళ్లకి వెళ్లడం..
రూంకి రావడం.. సదా సవ్యంగా సాగిపోతున్నాయి.
నేను ఉద్యోగ రీత్యా ఊరు రాగానే.. కొత్త ప్లేస్.. అనే భావం రాకుండా పోయింది
కిరణ్ మూలంగా.
కిరణ్ ది రాజమండ్రి. తండ్రి, తల్లి, చెల్లి ఉన్నారట. తండ్రి క్లాత్ షాప్ రన్ చేస్తున్నాడట.
కిరణ్ తొలుతగా కాకినాడలో జాబ్ చేసేవాడట. ట్రాన్స్ఫర్ మీద గుంటూరుకి వచ్చి ఏడాదవుతుందట. ఒక కొలీగ్ పరిచయంతో.. ఇప్పుడు మేము ఉంటున్న రూంలోకి షేరింగ్ చెల్లించి చేరాడట. కొలీగ్ ట్రాన్స్ఫర్ కావడం.. ప్లేస్ లోకి నేను రావడంతో.. అతడి ప్లేస్ లోకి.. కిరణ్.. నన్ను ఆహ్వానించుకున్నాడట.
నేను విజయవాడ నుండి ఇక్కడకి వచ్చాను.
నాకు తల్లిదండ్రులు.. తోబుట్టువులు లేరు.
మాది కొత్తపేటట. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు ఒక బస్సు ప్రమాదంలో చనిపోయారట. నన్ను అమ్మమ్మ చేరతీసి.. తను ఉంటున్న బుర్లంకకి నన్ను తీసుకు వచ్చేసిందట.



అమ్మమ్మ మూడిళ్లల్లో ఉదయం పూట పని మనిషిగా తిరుగుతూ.. మిగతా సమయంలో కూలి పనులు చేస్తూ.. నన్ను పెంచింది. చదివించింది.
నేను డిగ్రీ పట్టా పొందిన రోజునే.. అమ్మమ్మ గుండె పోటుతో.. సడన్ గా మరణించింది.
అమ్మమ్మ ఉన్నన్నాళ్లు నా కోసమే తపించింది.. శ్రమించింది. నన్ను చాలా ఇదిగా సాకింది.



నా చిన్నప్పుడు.. అమ్మమ్మ పని చేస్తున్న ఒక ఇంటి వారు.. నన్ను దత్తతకి అడిగారట. వాళ్లకి సంతాన యోగ్యత లేదని.. అమ్మమ్మ నా పట్ల పడుతూన్న అవస్థలని గమనించి.. నన్ను తమకి ఇచ్చేస్తే.. పెంచుకుంటామని ప్రాధేయపడ్డారట.
అమ్మమ్మ ససేమిరా అనేసిందట. తను పస్తులు ఉండైనా.. నన్ను పెంచి పెద్ద చేసుకుంటానని.. నా కాళ్ల మీద నేను నిలబడిన రోజున.. నా నీడన చక్కగా తను బతుకుతానని.. అమ్మమ్మ గట్టిగా చెప్పేసిందట.



పాపం అమ్మమ్మ.. నన్ను నిలబెట్టేసి.. తను పోయింది.
నేనే ఆమె తపనని తీర్చలేకపోయాను. అందుకు నేను చాలా చింతిస్తున్నాను.
అమ్మమ్మ పేరున ఏమైనా చేయాలి. ఆమె నా చెంత పొందాలనుకున్న స్వేద..
ఆమె లాంటి వారికి చవి చూపాలి. తద్వారా.. ఆమె పట్ల నా కర్తవ్యం సక్రమంగా నిర్వహించి పెట్టాలి.



అందుకై.. నేను ఆలోచన చేశాను. ఒక నిర్ణయానికి వచ్చేశాను. పని మీదే వెళ్తున్నాను.
ఎడతెరిపి లేని హారన్ ధ్వనితో తేరుకున్నాను.
వెనక్కి చూశాను. లారీ..
బైక్ ని.. రోడ్డు అంచుకి చేర్చాను.
నన్ను దాటుకొని.. లారీ వెళ్లి పోయింది.
నేను స్తిమితమై.. నేను వెళ్ల తలచిన చోటు వైపుకి.. స్థిరంగా బైక్ ని నడిపాను.
కొంత సేపటికి చోటుని చేరుకున్నాను.



బైక్ ని బయట.. ఒక పక్కన నిలిపి.. అక్కడ ఆఫీస్ రూం లోకి నడిచాను.
అక్కడ నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
అక్కడ అతను.. గుమస్తాట. నన్ను కూర్చోమన్నాడు.
నేను గుమస్తా ఎదుట.. కుర్చీలో కూర్చున్నాను.



"ఏం కావాలి" గుమస్తా మెల్లిగా అడిగాడు.
"మీ ఆశ్రమము నుండి.. ఒక పెద్దావిడ పోషణ బాధ్యతని.. నేను తీసుకో తలిచాను." నికరంగా చెప్పాను.
"అంటే.. సరిగ్గా చెప్పండి" గుమస్తా అడిగాడు.
వెంటనే ఏమి చెప్పాలో.. ఎలా చెప్పాలో.. నాకు అర్ధం కాలేదు.
"అదే.. ధన సహాయం చేస్తారా.. ఎంత.. ఎలా చేయాలనుకుంటున్నారు."
గుమస్తా అప్పుడే అడిగాడు.
"అదేమీ.. అలానేమీ కాదు. నాతో పాటు ఉంచుకుంటూ.. ఆవిడని నా అమ్మమ్మ మాదిరిగా పోషించుకుంటా." చెప్పాను.



గుమస్తా ఏమీ అనడం లేదు. నన్నే చూస్తున్నాడు.
"పద్ధతి చెప్పితే.. ఒక పెద్దావిడని చేర తీస్తాను." చెప్పాను.
కొంత సంభాషణ తర్వాత.. గుమస్తా నన్ను ఒక హాలు లోకి తీసుకు వెళ్లాడు.
అక్కడ.. పది.. పదిహేను మంది.. పెద్దవారు ఉన్నారు.
అక్కడ.. ఒక పక్కన.. వంట పనులు జరుగుతున్నాయి.
"ఆడవాళ్లు నలుగురే ఉన్నారు. వాళ్లలో ఒక్కరే ఒంటరి వారు. మిగతా ముగ్గురుకి భర్తలు ఉన్నారు." చెప్పాడు గుమస్తా.



నేను అటే చూస్తున్నాను.
" పసుపు రంగు చీరలో ఉన్న ఆవిడే.. ఒంటరిది." గుమస్తా చెప్పాడు.
ఆవిడని చూశాను.
ఆవిడని గుమస్తా పిలిచాడు.
ఆవిడ మా వద్దకి వచ్చింది.
"నీకు వసతి.. వేరే చోటున కల్పిస్తే.. వెళ్లగలవా" ఆవిడని అడిగాడు గుమస్తా.
ఆవిడ ఆయోమయమవుతుంది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - స్థితప్రజ్ఞస్య కా భాషా…. - by k3vv3 - 20-09-2025, 09:44 AM



Users browsing this thread: 1 Guest(s)