Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
 వేద నైవేద్యం తయారు చేసేటప్పుడు కరంభ అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అక్రోధనుడు కళ్ళార చూసాడు. ఆమె రూపాన్ని మనసులో నిలుపుకున్నాడు. 



 కరంభ అగస్త్య వంశ పునాదులు కలదని పదుగురు చెప్పుకొనగ అక్రోధనుడు విన్నాడు. కరంభ తన రాజ్యం లో వేద నైవేద్యం లు తయారు చేయడమే కాక పాపాలు చేసే దోషులకు తనే శిక్ష విధిస్తుంది అని అక్రోధనుడు తన మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. 



 తన ఉమ్మడి కుటుంబం ను అడ్డం పెట్టుకుని బంధువులను మోసం చేస్తూ, బంధువుల మీద మితి మీరిన కామాన్ని ప్రదర్శించేవారిని, పరుల ధనాన్ని భయపెట్టి అపహరించేవారిని కరంభ అసలు సహించేది కాదు. వారికి కరంభ శిక్ష విధించేది. బాగా వేడిగా ఉన్న ఇసుకను మరింత వేడి చేసి, ఇసుక గుట్ట నడుమ దోషిని ఉంచి శిక్షించడం ను కరంభ శిక్ష అని అంటారు. 



 అసలు క్రోధమెరుగని అక్రోధనుని రాజ్యంలో విచ్చలవిడి తనం పెరిగిపోసాగింది. దుర్మార్గులను సహితం క్షమించి వదిలేసి వేదాంతం వల్లించే అక్రోధనుని రాజ్యంలో నానాటికి మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోసాగింది. మనం ఏం చేసిన అక్రోధన మహారాజు మనల్ని క్షమిస్తాడు అని మనసులో అనుకొని కొందరు మాయగాళ్ళు అక్రోధన మహారాజు ను మంచి మంచి మాటలతో మాయ చేసేవారు. చేతలను నిర్వీర్యం చేసేవారు. ఇది గమనించిన అక్రోధనుని తల్లి కామ కరంభను కోడలిని చేసుకుంటే బాగుంటుంది. ఆమె అక్రోధనుడికి భార్య అయితే అక్రోధనుడు తన ఆలోచనా సరళిని మార్చుకుంటాడు. రాజ్యం కూడా బాగుపడుతుంది అని అనుకున్న కామ అదే విషయాన్ని తన భర్త పృథశ్రవసునికి చెప్పింది. 



అనంతరం భార్యాభర్తలు ఇరువురూ కరంభ తలిదండ్రులను కలిసి తమ మనసులోని మాటను చెప్పారు. అందరి సమ్మతి మీద కరంభ అక్రోధనుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 
 కరంభ తన భార్య అయిన పిదప అక్రోధనుడు అవసరం వచ్చినప్పుడు చెడ్డవారి మీద క్రోధం చూపించడం నేర్చుకున్నాడు. చెడ్డ వారి మనసులోని మాయలను గమనించసాగాడు. 
 కరంభ రాజ్య పరిపాలన విషయంలో కూడా తన భర్త అక్రోధనునికి తగిన సూచనలు ఇచ్చింది. రాజ్య సంక్షేమం కోసం పలు యజ్ఞ యాగాదులను చేయించింది. శ్రేష్టమైన వేద నైవేద్యం లను దేవతలకు సమర్పించింది. 



 కరంభ అక్రోధనుల సుపుత్రుడు దేవతీతి. 



  సర్వే జనాః సుఖినోభవంతు 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - కామ - by k3vv3 - 16-09-2025, 02:06 PM



Users browsing this thread: 1 Guest(s)