Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
కరంభ
[Image: k.jpg]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



కళింగ రాజ కుమార్తె కరంభ యౌవనం లోకి అడుగుపెట్టే సరికే ఆమె పేరు ప్రతిష్టలు పదునాలుగు లోకాలు వ్యాపించాయి. యజ్ఞ యాగాది విషయాల ప్రసక్తి వచ్చినప్పుడు అందరూ కరంభ గురించే మాట్లాడుకునే వారు. ముఖ్యంగా కరంభ యజ్ఞ యాగాదులకు అవసరమైన నైవేద్యములను తయారు చేయడంలోనూ, తయారు చేయించడం లోనూ మంచి నైపుణ్యం కలదని త్రిమూర్తులు, త్రిమాతలు కరంభసహితం అనుకునేవారు. ఆమె చేతితో తయారు చేసి సమర్పించిన యజ్ఞ భరిత వేద నైవేద్యములను స్వీకరించడానికి దేవతలు పోటీ పడేవారు. వేద నైవేద్యం లు తయారు చేయడంలో కరంభకు సాటి కరంభయే అని అనుకునేవారు. 



 యజ్ఞ పురుషుడు నిరంతరం కరంభకు సంరక్షకుడు గా ఉండేవాడు. ఒక సారి కామంతో కళ్ళు మూసుకుపోయి అమానుషం గా కరంభ చెయ్యి పట్టుకున్న పరరాజ్య రాజకుమారుని యజ్ఞ పురుషుడు కాల్చి బూడిద చేసాడు. 



 గో సంరక్షణ నిమిత్తం, గో సంవృద్ధి నిమిత్తం కరంభ తయారు చేసిన వేద నైవేద్యములకు "కరంభ" అనియే త్రిమాతలు పేరు పెట్టారు. ఆపై కరంభ స్వహస్తాలతో తయారు చేసి సమర్పించిన నైవేద్యములను త్రిమాతలు మనసారా మహదానందంతో స్వీకరించారు. త్రిమాతల మార్గం లో త్రి మూర్తులు పయనించారు



 మంత్రాలతో, ఆయుర్వేద జ్ఞానంతో పవిత్రమైన పచ్చికను మేసిన గోవులు ఇచ్చే పాల నుండి వచ్చిన వెన్నతో కరంభ బార్లీ గింజలను వేయించేది. వేయించిన గింజలను పొడి పొడి చేసేది. పొడికి కరంభ "సక్తు" అని పేరు పెట్టింది. సక్తును హయ్యంగ వీనం అనే వెన్నలో కలిపి కరంభ యజ్ఞ దేవతలకు నైవేద్యం తయారు చేసేది. అలాగే బియ్యం పిండి, పెరుగుల తో కూడిన అనేక యజ్ఞ నైవేద్యాలను కూడా కరంభ తయారు చేసేది. తన వేద నైవేద్య జ్ఞానం ను కరంభ ఆడ మగ అనే తేడా లేకుండా ఆసక్తి ఉన్నవారందరికి నేర్పించేది. 



 దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, ఋషులు, పురోహితులు తదితర పండితులు, ఎవరు యజ్ఞ యాగాదులను చేయించడానికి సిద్ధమైన కరంభ తో లేదా ఆమె అనుచర గణం తో యజ్ఞ నైవేద్యాలను తయారు చేయించమని యజ్ఞం చేయాలనుకున్న వారికి చెప్పేవారు. 



 కరంభ తన అంతఃపురానికి సమీపంలో యజ్ఞ నైవేద్యాలను తయారు చేయడానికి, చేయించడానికి ఒక ఇందీవర వనాన్ని ఏర్పాటు చేయించింది. ఇందీవర వనం నడుమ వేద నైవేద్యాలను తయారు చేయడానికి కరంభ ప్రత్యేక మందిరాలను నిర్మింప చేసింది. 



 ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు కరంభ చేతి వేద నైవేద్యం స్వీకరించడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. జనం అత్యుత్సాహం తో నైవేద్యం కోసం తొక్కిసలాట దిశగా వెళితే కరంభ వారికి అసలు నైవేద్యం ఇచ్చేది కాదు. వారికి సహన మంత్ర తంతు జరిపిన పిమ్మట వేద నైవేద్యం ఇచ్చేది. 
 కరంభ చేతి వేద నైవేద్యం తింటే ప్రాణ శక్తి తేజోవంతమవుతుందని నాటివారు ఎక్కువ మంది నమ్మేవారు. తన దగ్గరకు నమ్మకంతో వచ్చిన వారందరికి నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకంను మాత్రం పెంచుకోకండి. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పేది. 



 రంభ సోదరుడు కరంభ ఒకసారి కరంభను ఇందీవర వనంలో చూసాడు. తొలిచూపులోనే కరంభను కరంభ వలచాడు. ఇద్దరి పేర్లు ఒకటేనని కరంభ గ్రహించాడు. 



 అశ్వం మీద పయనిస్తున్న కరంభను కరంభ అనుసరించాడు. తనను అనుసరిస్తున్న వానిని కరంభ గమనించింది. అశ్వం ను ఆపింది. తన సమీపం నకు వచ్చిన వ్యక్తిని మీరు ఎవరని ప్రశ్నించింది. అప్పుడు కరంభ "నేను రంభ సోదరుడుని. నా పేరు కూడ కరంభయే. తొలి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాను." అని అన్నాడు. 



 కరంభ మాటలను విన్న కరంభ, " నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. ప్రస్తుతం నా మనసు పెళ్ళి మీదకు వెళ్ళడం లేదు" అని అంది. 



 కరంభ మాటలను విన్న కరంభ రాక్షసుడు లా ప్రవర్తించాడు. కరంభ రాక్షసుడు లా ప్రవర్తించే కరంభ కు కరవాలంతోనే బుద్ది చెప్పింది. కామ పృథశ్రవసుల పుత్రుడు అక్రోధనుడు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. అప్పుడు జరిగిన యజ్ఞ యాగాదులకు కామ పృథశ్రవసుల కోరిక మేర కరంభయే యోగ శక్తితో బ్రహ్మ జ్ఞానం పెంచుకుని వేద నైవేద్యం లను తయారు చేసింది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - కామ - by k3vv3 - 16-09-2025, 02:01 PM



Users browsing this thread: