Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
నేను మీకు ఒక ఉపాయం చెప్పి గండం గట్టేక్కిస్తాను అని చెవిలో ఏదో చెప్పింది మూర్తి కి.



రాత్రి అంతా కలత నిద్రతో గడిపి ఉదయమే స్నానం చేసి పనస పొట్టు ని సంచిలో పోసుకుని సుబ్బారావు ఇంటికి బయలుదేరుతున్న భర్తతో యింకా 8 గంటలు కూడా కాలేదు, టిఫిన్ తిని వెళ్ళండి అంది స్వప్న. 



సుబ్బారావు యింట్లో తింటాలే అన్న మూర్తి ని చూసి నవ్వుతో, బాగానే వుంది, రోజు తద్దినం పెడుతో టిఫిన్ లు తినరoడీ, ముందు నాలుగు మైసూర్ బజ్జిలు తిని వెళ్ళండి, పక్క వీధిలో వున్న మీ ఫ్రెండ్ ఇంటికి రెండు నిమిషాలలో వెళ్ళచ్చు అంది.



ఏమో అనుకున్నాడు గాని వేడి వేడి బజ్జిలు తింటో వుంటే హాయిగా అనిపించింది మూర్తికి.



తిండి పని కానిచ్చుకుని, సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు.



సంచితో మూర్తి ని చూసిన సుబ్బారావు మొహం చాటంత చేసుకుని పనస పొట్టు తెచ్చేసావు, నీకు అభ్యంతరం లేకపోతే రోజు మా యింట్లో భోజనం చెయ్యచ్చుగా అన్నాడు.



ఏమోరా, తద్దినం భోజనం అయిన వాళ్ళు తప్పా బయట వాళ్ళు తినకూడదు అంటారు, అందుట్లో మీ చెల్లెలు కి మహా పట్టింపు అని చెప్పి తిరిగి వచ్చేసాడు మూర్తి.



ఉదయమే స్వప్న యిచ్చిన కాఫీ తాగుతో, నిన్న సుబ్బారావు పనస పొట్టు బాగా లాగించి వుంటాడు, అందుకనే ఫోన్ కూడా చెయ్యలేదు అన్నాడు మూర్తి. 



వస్తారు లేండి స్నేహితుడి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు అంది స్వప్న నవ్వుతు. 



యిదిగో తోటలో ఏదో చప్పుడు అవుతోంది, గొడ్డో వచ్చిందేమో చూడు అన్నాడు మూర్తి పేపర్ అందుకుంటో.



ఏమండీ ఒకసారి అర్జెంటుగా యిటు రండి అని భార్య అరుపులు విని, మేకో, గొడ్డో వచ్చి వుంటుంది అని కర్ర తీసుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ పనస చెట్టుని పరిశీలన గా చూస్తున్న సుబ్బారావు, నవ్వుతున్న స్వప్నని చూసి, నువ్వు తోటలోకి ఎప్పుడు వచ్చావు రా? అన్నాడు మూర్తి.



ఒరేయ్ కర్ర యిటు యివ్వరా, ముందు నిన్ను నాలుగు వుతకాలి, చెట్టు కి వున్న కాయలు వున్నట్టే వున్నాయి, నాకు పనస పొట్టు ఎక్కడ నుంచి తెచ్చావురా అన్నాడు సుబ్బారావు.



సుబ్బారావు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి ముందు అలా కూర్చొని మీ చెల్లమ్మ యిచ్చే కాఫీ తాగు, తరువాత జరిగింది చెపుతానుఅన్నాడు మూర్తి.



ఒరేయ్ నువ్వు ఒకసారి నా వంక చూడరా, నాకు యిప్పుడు డబ్భై ఏళ్ళు, నీకు కూడా అంతే, వయసులో కూడా తండ్రి తద్దినం తండ్రికి యిష్టమైన కూరలతో పెట్టాలని నువ్వు అనుకోవడం నాకు చాలా ఆనందం వేసింది. అయితే నేను కడవంత పనసకాయని పొట్టు కొట్టి తీసుకుని రమ్మన్నావు, అది నా వల్ల అవుతుందా చెప్పు, అందుకనే రైతుబజార్ కి వెళ్లి మంచి పదునైన పనస కాయ కొట్టించి తీసుకుని యిచ్చాను, బాగుండలేదా అన్నాడు మూర్తి.



బాగుంది కానీ, కొద్దిగా మాగుడు వాసన వచ్చింది, అదికాక యింటికి వెళ్లిన తరువాత అనుకున్నాను, పాపం వాడి వల్ల ఏమవుతుంది అంత పనసకాయ కొట్టడం, నేనే బజార్ తీసుకొని వెళ్లి కొబ్బరి బొండాం కొట్టే వాడికి డబ్బిచ్చి కొట్టించు కుంటే బాగుండేది అని. కూర తిన్న తరువాత తెలిసింది నువ్వు ఏదో యిటువంటి పని చేసివుంటావని. అందుకే దొడ్డి దారిన వచ్చి పనస చెట్టు వంక చూస్తే, ఎక్కడ కాయలు అక్కడే వున్నాయి అన్నాడు సుబ్బారావు.



సారి రా నీ కోరిక తీర్చలేకపోయాను, రేపాదివారం మనమిద్దరం ఒక కాయను తీసుకొని వెళ్లి పొట్టు కొట్టించి మీ చెల్లెలు చేత పనస పొట్టు కూర, మామిడికాయ పప్పు వండించుకుని తిందాం. మా చెల్లెలు ని కూడా తీసుకుని ఉదయమే వచ్చేసేయి, టిఫిన్, భోజనం యిక్కడే అన్నాడు మూర్తి.



శుభం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - భిన్నత్వంలో ఏకత్వం - by k3vv3 - 14-09-2025, 01:45 PM



Users browsing this thread: