Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#33
వసుధకి మూడో నెల. హాస్పిటలుకి తీసుకెడితే డాక్టర్లు బాగా తిట్టారు. వసుధ మాత్రం చాలా సంతోషంగా ఉంది.
చిప్పలోకి ముడుచుకుని ఉన్న తాబేలులా ఉంది వసుధ. అమ్మ, నాన్న, మామయ్య, అత్త, వేణి- అదృశ్యంగా ఉన్నారు ఆమె చుట్టూ. పెద్దదౌతున్న పొట్ట ఆమె మృత్యురహస్యంలా ఉంది. రహస్యం తెలిసీ, ఉపేక్షిస్తున్న వాళ్లం నేను, అమ్మమ్మ!
అపరాధభావం వేధిస్తుంటే, తప్పించుకునే దారి వెదుకుతుంటే- అప్పుడు తట్టింది నాకు! వేణికి నేనంటే ఇష్టం. ఇష్టమే ఆమె భర్త అకాలమరణానికి కారణమైంది. అంటే- మన అభీష్టం మంచిదైతే- దేవుడే దారి చూపిస్తాడు. వసుధ విషయంలోనూ ఏది మంచో ఏది చెడో నిర్ణయం దేవుడికే వదలడం మంచిది.
అదే చేశాను. వసుధకి ఐదో నెల రాగానే అమ్మమ్మ ఇంట్లో దిగవిడిచి వచ్చాను.
తర్వాత అంతా యాంటీక్లైమాక్స్-
అంతా అమ్మమ్మ చెప్పినట్లే జరిగింది.
వసుధకి సుఖప్రసవమై శ్రీమహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టింది.
చూడ్డానికి అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, వేణి కూడా వచ్చారు. పాపని ముద్దులాడారు.
వసుధని స్నేహభావంతో పలకరించారు.
అమ్మమ్మ ఇంట్లో ఉన్నందున వసుధ గురించి నాకు హాస్పిటలు ఖర్చులు కూడా లేవు. పురుడు పోసిన మంత్రసాని ఎల్లాయమ్మని కానుకలతో ముంచెత్తాలనుకున్నాను. కానీ అమ్మమ్మ, “తనిప్పుడు వెయ్యిన్నూట పదార్లు మించి ఒక్క పైసా తీసుకోదురాఅంది. మనిషికి ఎంతో కొంత స్వార్థముండడం సహజం. స్వార్థం ఎంతో ఉన్నవాళ్లు దుర్మార్గులు. కొంతే ఉన్నవాళ్లు సామాన్యులు. లేనివాళ్లు స్థితప్రజ్ఞులు.
సమాజంలో లబ్దప్రతిష్ఠులైన చాలామంది రాగద్వేషాలకు అతీతం కాదనడానికి ఎన్నో నిదర్శనాలున్నా- వారిని వేదికలపైస్థితప్రజ్ఞులుఅని పొగడ్డం రివాజు. నాకు తెలిసిన స్థితప్రజ్ఞుల జాబితా వెయ్యమంటే- ఇంతవరకూ నేను వెయ్యగల పేరు అమ్మమ్మది మాత్రమే. వసుధ పురుడు తర్వాత ఇప్పుడా జాబితాలో అమ్మమ్మకు తోడుగా ఎల్లాయమ్మ కూడా చేరింది!
నాకూ జాబితాలో చేరాలని ఉంది. అందుకు ఏం చెయ్యాలి?
నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అన్న అమ్మమ్మ మాటలు చెవుల్లో గింగురు మన్నాయి.….
------


 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - స్థితప్రజ్ఞస్య కా భాషా…. - by k3vv3 - 13-09-2025, 05:02 PM



Users browsing this thread: 1 Guest(s)