Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#32
వసుధ వదిన పద్మ తండ్రికి కూతురు, తర్వాత కొడుకు, తర్వాత పద్మ. అంతా పెళ్లిళ్లై కాపురాలు చేసుకుంటున్నారు. ఆయన రెండేళ్ల క్రితం చనిపోయాడు. పోయేముందు తను కొన్న స్థలాల్లో రెండింటిని చెరో ఆడపిల్ల పేరిటా వ్రాసి, కాగితాలు పోస్టులో పంపేట్ట. ఇటీవల స్థలాల ధర బాగా పెరగడంతో పద్మ అక్క వాటిని అమ్మబోతూ, విషయం చెల్లికి చెప్పింది. అంతవరకూ పద్మకి స్థలం గురించి తెలియదు. తండ్రి పంపేడంటున్న కాగితాలు పద్మకి అందలేదు. అక్క మాటమీద స్థలాన్ని చెల్లికివ్వడానికి అన్నగారు ఒప్పుకోవడం లేదు. రెణ్ణెల్లుగా వాళ్లింట్లో విషయమై గొడవలౌతున్నాయి.
మా అమ్మమ్మని ప్రశ్న అడుగుదాం. పని జరిగిందీ, మీవాళ్లకి లాభం. మనకీ ఆమె సలహామీద ధైర్యంఅన్నాను.
వసుధ కళ్లలో తడి. “మీకు నామీదే కాదు. మావాళ్లమీద కూడా ఎంత కన్సర్న్ అండీఅంది.
గతుక్కుమన్నాను. నా ఆలోచనే వేరు. గత అనుభవాల్ని బట్టి అమ్మమ్మ కాగితాల ఆచూకీ చెప్పగలదనే నా నమ్మకం. ఐతే మెడికల్ సైన్సుకే కొరుకుపడని సమస్య వసుధది. ఐనా తన మనుమరాలు వేణి భవిష్యత్తు బాగుండాలని, తప్పక వసుధని తల్లి కమ్మని ప్రోత్సహిస్తుంది అమ్మమ్మ. అన్నగారి విషయంలో జరిగిన అద్భుతమే తన విషయంలోనూ జరుగుతుందని వసుధ నమ్ముతుంది. నా నిజాయితీని కూడా నమ్ముతుంది.
మీ వాళ్లకి ఫోన్ చెయ్యిఅన్నాను వసుధతో.
-----
అంతా అనుకున్నట్లే జరిగింది.
మీ ఇంటిపక్క విజయేశ్వరి అని ఒకావిడుంది. మీరింట్లో లేకపోతే, ఉత్తరాన్ని ఆమె తీసుకుంది. అదామె తన బీరువా లాకర్లో ఎడం పక్క మూలగా దాచి, తర్వాత విషయం మర్చిపోయింది. ఆమెకి మతిమరుపెక్కువ కదా! ఐనా ఫరవాలేదు. కవరింకా పెట్టినచోటే ఉంది. వెళ్లి తెచ్చుకోండిఅంది అమ్మమ్మ వసుధ అన్నా వదినెలతో.
తమ ఇంటిపక్క విజయేశ్వరి గురించి ఖచ్చితంగా అన్ని వివరాలు చెప్పడంతో వసుధ అన్నావదినెల అశ్చర్యానికి అంతు లేదు.
పద్మ వెంటనే విజయేశ్వరికి ఫోన్ చేస్తే అమ్మమ్మ చెప్పింది నిజమేనని తేలింది. కాగితాలు దొరికాయి.
వసుధ అన్నావదినెలు అమ్మమ్మకు సాష్టాంగపడిపోయారు.
అబద్ధమెందుకూ క్షణంలో నేనే షాక్ తిన్నాను.
పద్మకి క్షణంలో వచ్చిన లాభం లక్షల్లో ఉండొచ్చు. కానీ అమ్మమ్మ వాళ్ల దగ్గర నూటొక్క రూపాయలు మాత్రమే తీసుకుంది.
ఎలాగూ వచ్చాం కదా అన్నట్లు మా సమస్య కూడా అమ్మమ్మకి చెప్పాను. వేణికి అమ్మమ్మగా- తనేం చెబుతుందని ఊహించానో, ఇంచుమించు అదే చెప్పింది అమ్మమ్మ.
నీకు మహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుడుతుంది. అత్తవారి ఆదరణ లభిస్తుంది. ఐతే నీ పురుడు హాస్పిటల్లో కాదు. ఇక్కడే ఊళ్లో నా ఇంట్లో పోస్తానుఅంది అమ్మమ్మ.
అమ్మమ్మ పట్ల అరాధనాభావంతో చూస్తున్న వసుధ కళ్లలో సంతోషంతో కూడిన మెరుపు కనిపించింది.
అర్థమైపోయింది నాకు. అమ్మమ్మలో స్వార్థం దుర్మార్గం స్థాయి కూడా దాటిపోతోంది.
అమ్మమ్మా! నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ, పురుడు మంచి హాస్పిటల్లో పోయడం మంచిదేమో!” అన్నాను.
అమ్మమ్మ నవ్వి, “డాక్టర్లు వాళ్లు చెప్పాల్సింది చెప్పారుకదా! వాళ్లకి తెలిసినంతవరకూ వాళ్లు చెప్పింది నిజమే! కానీ లోకంలో విజ్ఞానానికి అందని విశేషాలు చాలా ఉన్నాయి. అవి చర్చలతో అర్థం కావు. స్వామి నాకు చెప్పాడు- వసుధకి ఇక్కడ పురుడు పొయ్యమనీ, అందుకు మనూరి మంత్రసాని ఎల్లాయమ్మ సాయం తీసుకోమనీ. పురుడు పొయ్యడంలో తనకి తెలిసిన ఒడుపులు- పేరుపడ్డ వైద్యులకి కూడా తెలియవని పేరు. నీకు తెలుసో తెలియదో, అప్పుడప్పుడు పట్నంనుంచి తనకోసం కబురొస్తుంటుంది. తనకి అనుభవమే తప్ప, శిక్షణ లేదు. వయసుమీద పడ్డప్పట్నించీ మంత్రసాని పని మానేసింది కానీ, నేను చెప్పిన కేసులు మాత్రం కాదనదు. మా ఆధ్వర్యంలో వసుధ పండంటి బిడ్డని ఎత్తుకోవడం గ్యారంటీ. అదే గ్యారంటీ ఇచ్చే డాక్టరుంటే మాత్రం వసుధ పట్నంలోనే పురుడు పోసుకోవచ్చుఅంది.
అమ్మమ్మ ఇచ్చే గ్యారంటీ మేలు చేసేది వసుధకా, వేణికా అన్నది నాకు అనుమానమే! కానీ పట్నంలో అలాంటి గ్యారంటీ ఇచ్చే డాక్టర్లు, హాస్పిటల్సు లేవు.
అక్కడున్న గ్యారంటీ- ఖర్చుకే!
మా ఇద్దరి ఓటూ అమ్మమ్మకే పడింది…..
-----
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - స్థితప్రజ్ఞస్య కా భాషా…. - by k3vv3 - 13-09-2025, 04:59 PM



Users browsing this thread: 1 Guest(s)