Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#31
పెళ్లై ఏడాదైనా తిరిగిందో లేదో, వేణి భర్త కారు ప్రమాదంలో చనిపోయాడు.
మనసులో ఎంత కోపమున్నా, రక్తసంబంధంకదా! ఓదార్పుకి మామయ్యింటికి వెళ్లాను. అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని వసుధని మాత్రం తీసుకెళ్లలేదు.
ఆశ్చర్యంగా అక్కడ అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య అంతా నాపట్ల సుహృద్భావం చూపించారు. మామధ్య ఏమీ జరుగనట్లే మసిలారు.
మేమంతా మళ్లీ ఎప్పటిలా కలిసిపోగలమని ఆశ పుట్టింది నాలో.
ఐతే, వెళ్లేటప్పుడు అమ్మ నన్ను పక్కకు పిలిచి, “పిల్లలు పుట్టే యోగ్యత లేనిదానికి పెళ్లామయ్యే అర్హత లేదు. ఎలాగో అలా దరిద్రాన్ని వదిలించుకో. మనం మళ్లీ ఎప్పటిలా కలిసుండొచ్చుఅనడంతో నా భ్రమలన్నీ తొలగిపోయాయి.
అప్పుడు మాకు కాస్త దూరంలో అమ్మమ్మ ఉంది. తనా మాటలు విన్నట్లే ఉంది.
ఒక్కసారి నేను వీడితో మాట్లాడతాను. కాస్త పక్కకి వెడతావా?” అంది అమ్మతో.
అమ్మ అక్కణ్ణించి వెళ్లిపోయేక, “మీ అమ్మ చెప్పిందాన్నిబట్టి నీకేమర్థమయింది?” అంది అమ్మమ్మ నాతో.
ఒకసారి అమ్మ మాటలు విశ్లేషించుకున్నాను మనసులో.
అర్థం కావడానికేముంది- మేం మళ్లీ కలవాలంటే- వసుధకి పిల్లలు పుట్టాలి. లేదూ- వసుధని వదుల్చుకోవాలి. అదే అమ్మమ్మకి చెప్పాను.
అమ్మమ్మ తల అడ్డంగా ఊపింది, “ఇది సమయం కాదని డొంకతిరుగుడుగా చెప్పింది మీ అమ్మ. నాకలాంటి బాధ లేదు కాబట్టి సూటిగా చెబుతున్నా, వినుఅంది.
ఆమె చెప్పింది విని షాక్ తిన్నాను.
వేణి ఇప్పటికీ నన్నే ఇష్టపడుతోందిట. తండ్రి బలవంతంమీద పెళ్లి చేసుకుని అయిష్టంగా కాపురానికెళ్లింది. ఇప్పుడు భర్త పోతే పోయేడన్న దిగులు కూడా లేదు తనలో.
నేను వసుధని వదుల్చుకుంటే, వేణిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని మామయ్య ఉద్దేశ్యం. దానికి అమ్మ సపోర్టుంది.
మనం మళ్లీ ఎప్పటిలా కలిసుండొచ్చుఅన్న అమ్మ మాటల వెనుక ఇంత గూఢార్థముంది.
అమ్మలో అంత దుర్మార్గమా అని ఆశ్చర్యపడుతుంటే, “ఇంతకీ నీకు ఆశ్చర్యం కలిగిందా, కోపమొచ్చిందా?” అంది మనసు.
కిరీటం ఇట్టా పెట్టుకుంటావా, ఇట్టా పెట్టుకుంటావా?” అన్నరాజరాజ చోరసినిమాలో సరదా డైలాగులాంటిది కాదు ప్రశ్న!
నా వ్యక్తిత్వాన్ని సవాలు చేసే ప్రశ్న అది!
నాదాకా వచ్చేసరికి ఇబ్బందిగా ఫీలై, మనసుని పక్కకి తోసి, “ఇంతకీ నేనేం చెయ్యాలని నీ ఉద్దేశ్యం?” అన్నాను అమ్మమ్మతో.
మనుమరాలు జీవితం బాగుపడాలని అమ్మమ్మకీ ఉంటుంది. తనెంత మంచిదైనా తనదాకా వస్తే ఆలోచనలు వేరే వెడతాయి.
అమ్మమ్మ నా ప్రశ్నకి తడుముకోలేదు, “మనసు చిక్కబట్టుకుని ఇంటికెళ్లు. వసుధతో ఇక్కడ జరిగింది చెప్పు. ఇద్దరూ ఆలోచించుకుని నిర్ణయానికి రండిఅంది.
ఆశ్చర్యపోయాను.
నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!’ అని హెచ్చరించిన అమ్మమ్మ- ఇప్పుడు అమ్మ మాటల్లోని స్వార్థాన్ని నిరసించకుండా, ఆలోచించమని అంటుందేమిటి?
స్థితప్రజ్ఞుల కోవలోకి వస్తుందనుకున్న అమ్మమ్మలో ఇంత స్వార్థమా?
బాగా ఆలోచిస్తే అమ్మమ్మ నేననుకున్నంత గొప్పది కాదనిపించింది. ఆమె అపూర్వశక్తీ పూర్తిగా నిజం కాదనిపించింది.
తనకే గనుక అపూర్వశక్తి ఉంటే- నా పెళ్లికీ, వేణి పెళ్లికీ పర్యవసానాలు ముందే తెలిసేవి. ముందే హెచ్చరించేది!
విషయం స్ఫురించగానే వసుధని వదుల్చుకునే విషయంలో, అమ్మమ్మ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను.
స్వార్థం తెలివిని మింగేస్తుందంటారు. కానీ అది నా తెలివికి పదునెక్కించింది. నా మనసులో పథకం రూపు దిద్దుకుంది….
-----
ఇంటికెళ్లేక అమ్మమ్మ మాటలు మినహాయించి, మామయ్యింట్లో జరిగింది చెప్పాను. ముందు వసుధకి కలిగింది సంతోషం, “అంటే మీవాళ్లు మనవాళ్లయ్యే సమయం దగ్గర్లోనే ఉందిఅంది.
అది నీ ప్రాణాలకి రిస్కు. రిస్కు నాకిష్టం లేదుఅన్నాను మనస్ఫూర్తిగా కాకపోయినా.
నాకేమీ కాదు. మీరున్నారుఅంది వసుధ. అప్పుడు నాకామె గొర్రెలా కనిపించింది.
అద్దంలాంటి ఆమె ముఖంలో నేను కసాయి రూపంలో ప్రతిఫలించాను.
మాతృత్వంపైన కాంక్షో, నన్ను మావాళ్లతో కలపాలన్న అభీష్టమో, అసహాయతో చెప్పలేను.
ఆమె తన ప్రాణాలు రిస్కులో పడినా సరే, తల్లి కావడానికే నిశ్చయించుకుంది.
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఆమె తల్లి కావాలంటే నేనామోదించాలి. ఆమోదిస్తే- అది హత్యే అంది మనసు. కాదనడం ఆత్మవంచనే ఔతుంది. చివరికి నన్నెంతగానో నమ్మిన వసుధకి కూడా మనసులో ఏదో మూల చివుక్కుమనకుండా ఉండదు.
ముందే ఆలోచించుకున్న పథకం ప్రకారం- అప్పుడామెకు అమ్మమ్మ అపూర్వశక్తిని మరింత గొప్పగా వివరించి, “ఓసారి తన సలహా తీసుకుందాంఅన్నాను.
నాకైతే విషయంలో ఎవరి సలహా అక్కర్లేదు. నిర్ణయం ఐపోయిందిఅంది వసుధ దృఢంగా.
నీకోసం కాదు. నాకోసంఅన్నాను లౌక్యంగా.
ఏదో యథాలాపంగా అడగడం వేరు. విషయమై పనికట్టుకుని ఆమెవద్దకెళ్లడం బాగుండదుఅంది వసుధ.
అదీ ఆలోచించాను. మీ అన్నావదినెల్ని తీసుకెడదాంఅన్నాను ఠక్కున.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - స్థితప్రజ్ఞస్య కా భాషా…. - by k3vv3 - 13-09-2025, 04:57 PM



Users browsing this thread: 1 Guest(s)