Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
కామ
[Image: k.jpg] 
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



పృథశ్రవస మహారాజు ఋగ్వేద ధర్మాలను క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా పాటించేవాడు. అతని ఏలుబడిలో పదునెక్కిన భూసారం పుష్టికరమైన పంటలను ప్రసాదించేది. యజ్ఞ యాగాదులనుండి ఆవిర్భవించిన దట్టమైన పొగలు ప్రకృతి ని, పుడమినిని, గగనాన్ని ఆవరించేవి. దాని ప్రభావం తో వాతావరణం పవిత్రమై సారవంతంగా ప్రకాసించేది.



పృథశ్రవస మహారాజు ఋగ్వేద ధర్మం పాటించగ వచ్చిన ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. ఫలితాల్లో వచ్చిన కష్టసుఖాలను తనే భరించేవాడు. ధర్మార్థ కామ మోక్ష మార్గాలను నియమ బద్ధంగా ప్రజల చేత అనుసరింపచేసేవాడు.



 పృథశ్రవస మహారాజు ధర్మాన్ని అయినా ముందు తను అనుసరించేవాడు. ఆపై మంచి ఫలితం ఉన్న ధర్మాన్ని ప్రజలను అనుసరించమనేవాడు. అందుకే అతని రాజ్యం లో అధిక శాతం మంది మనుషులు అతనంటే మహా యిష్టపడేవారు. 



 పృథశ్రవస మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అతని నడివయస్సులో అతనికి
మంచి శుభ ముహూర్తాన సంతానం కలిగింది. 



పృథశ్రవస మహారాజు లేక లేక పుట్టిన ఆడ సంతానానికి మహర్షుల, జ్యోతిష్యుల ఆదేశానుసారం కామ అని పేరు పెట్టాడు. 



 కామ నామకరణ మహోత్సవానికి అనేకమంది రాజులు,సామంత రాజులు అతిథులుగా వచ్చారు. అందులో ప్రతిష్టాన పురానికి చెందిన మహా భౌముడు అతని భార్య సుపుష్ట కూడా వచ్చారు.వారితో పాటు వారి కుమారుడు ఆయుతానీకుడు కూడా వచ్చాడు.



అతను తన ఆటపాటల నైపుణ్యం తో అందరిని ఆనందింపచేసాడు. ఋగ్వేద మూలాలలోని గణిత శోభను అందరికి తెలియచేసాడు.ఋగ్వేదంలోని 10552 మంత్రముల మాటున ఉన్న గణిత శోభను తెలియచేసాడు. ఆయా మంత్రాల మాటున ఉన్న ఉదాత్తానుదాత్తాది స్వరాల మాటున ఉన్న గణిత తేజాన్ని అందరికి ఎరుక పరిచాడు. ఋక్కులలోని పదబంధ గణితాన్ని వివరించాడు. ఋక్కులు సూక్తాలుగ విభజించబడిన శాస్త్రీయ విధాన్నాన్ని వివరించాడు.



 పృథశ్రవసుడు కాల ధర్మానుసారం ధర్మార్థకామమోక్ష మార్గాలని అనుసరిస్తూ" కామ" ని పెంచి పెద్ద చేయసాగాడు.." కామ" నాటి ప్రతిభావంతులైన మహర్షులు,పండితులు పామరులు అందరి దగ్గర సమస్త విద్యలను అభ్యసించింది.



" కామ" అమలిన కామ సంచారిణి మంచి పేరు తెచ్చుకుంది. ధర్మం అయినా, అర్థం అయినా, కామమైన, మోక్షమైన అతి సర్వత్ర వర్జయేత్ అనే స్వభావం గల కామ మాటలను మహర్షులు సహితం ప్రశంసించేవారు.



 కామ ఋగ్వేదం లోని ఋక్కులు గురించి,10 మండలాల గురించి 1028 సూక్తముల గురించి మహర్షులతో ఎక్కువగా చర్చించేది. అగ్ని దేవునితో మొదలు పెట్టి అగ్ని దేవునితో ముగిసే ఋగ్వేదం మూలాలను గురించి కామ అనునిత్యం ఆలోచించేది. ఆత్మ చైతన్య స్వరూపమే అగ్ని. అగ్నే పరమాత్మను కలుస్తుంది అని కామ ఋగ్వేదం లోని అగ్ని గురించి చేసే చర్చలు మహా మహా మహర్షులను కూడ ఆలోచింపచేసేవి. అగ్ని ప్రయాణంలోనే అమలిన కామం ఉంటుందనే కామ మాటలను మహర్షులు, బ్రహ్మర్షులు సహితం ఆమోదించేవారు.



 కామ అంతఃపురంలో కంటే హాలికుల పొలాలో ఎక్కువగా సంచరించేది. శ్రమైక జీవన సిద్దాంతానికి అగ్ర పీఠం వేసేది. స్వేదం చిందేలా కష్టపడే పవిత్ర హృదయాలలో ప్రశాంతంగా జనించే కామమే నిజమైన కామం అనేది. కామ పథాన సంచరించి మోక్ష మార్గాన్ని చేరవచ్చనేది. కామిగాక మోక్ష కామి కాడు అన్న భావనలోని ఆంతర్యాన్ని అందంగా వివరించి చెప్పేది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - అమృత వర్షం - by k3vv3 - 10-09-2025, 01:51 PM



Users browsing this thread: 1 Guest(s)