Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
లేడిగాడు - దవులూరి కృష్ణ మనోహర్ రావు
[Image: l.jpg]
అతని పేరు "లేడు" వాళ్ళింటి పేరు కర్రి.ద్రాక్షారం ఆకులోరి వీధిలో ఓ సందులో ఉంటాది వాళ్ళిల్లు. అతనికా పేరు ఎలా వచ్చిందంటే - అతని కంటే ముందు పుట్టినోళ్ళను పుట్టినట్టు యములోళ్ళు తీసుకుపోతుంటే, వాళ్ళమ్మ పుట్టినోడు ఇక్కడ లేడు అనుకొని యములాళ్ళు వెళ్ళిపోతారని ఆ పేరు పెట్టింది. అలానే యములాళ్ళు వాడు ' లేడు ' అనుకొని వెళ్ళిపోయేవారు.

అలా బతికి బట్ట్కట్టిళ్ళే అబద్దం, పెంటయ్య వగైరాలు. మా ప్రాంతంలో ఒకడు పుట్టింది అబద్దమైతే మరొకడ్ని పెంట మీద పారేసి తిరిగి తెచ్చుకున్నారు. పెంటయ్య పేరు పెట్టి.

కానీ వాడికైదేళ్ళప్పుడు కోటి పల్లి శివరాత్రి స్నానాలకెడితే అక్కడ యములాళ్ళు కాడు కనబడ్డాడు. ఆ పేరెట్టి తమని బురిడ కొట్టించేసిందని వాడినొదిలేసి వాళ్ళమ్న్ను పెనాల్టీగా వాళ్ళనాన్నను గోదాట్లో ముంచేసి తీసుకు పోయారు యములాళ్ళు.

వాడికెనకాల ఎనిమిదెకరాల మాగాణి, గుడి ఎదుట పెద్ద కొట్టు ఉండటం వలన చుట్టాల్లో వాడ్నెవరు పెంచుకోవాలో తేల్చుకోలేక అందరూ కల్సి పెంచేరు.

ఆ ఆస్తే లేకపోతే ఏదో అనాధాశ్రమంలో చేర్చేసి చేతులు దులుపేసుకొనేవారు. కానీ నిజంగా అనాధని చూసినట్టే చూసారు. అందరూ లేడిగా అని పిలిచేవారు. మొదట్లో వింతగా అనిపించినా అందరికీ అలానే అలవాటైపోయింది. లేడిగాడికి ముగ్గురు పినతల్లులు. ముగ్గురు మేనత్తలు ఉన్నారు. వాడింట్లో ఒకరి తర్వాత ఒకరు రెండేసి నెలలు మకాం వేసి వాడి బాగోగులు చూసేటట్లు వాడి ఆస్తిమీదొచ్చేది సమానంగా పంచుకొనేటట్లు ఒప్పందానికొచ్చారు. గుడి దెగ్గర ఉన్న వాడి కొట్టు వెచ్చా కోమట్ల చేతిలో ఉంది. లేడు తండ్రి ఎవర్నో పట్టుకుని పెద్ద కమెనీకి హోల్ సేల్ రైట్ పొందాడు. ఆ కంపెనీ సరుకులు ఆ కొట్లో పెట్టి నడుపుతూ ఆ పని తన వలన కాదని వెచ్చా వారి కొట్టుకు నెలనెలా అద్దె ఇచ్చేటట్లు ఆ కంపెనీ సరుకుల మీద లాభంలో ప్[అదో వంతు వెచ్చా వారిచ్చేట్లు అగ్రిమెంటు చేసుకున్నాడు. వాడి చదువు మీద ఎవరూ శ్రద్ధ పెట్టలేదు, అయినా పదో తరగతి వరకు చదివాడు హై కాలేజ్లో అందరూ చిన్నప్పట్నుంచీ లేడిగాదు అని పిలుస్తూంటే లేడిలా పరిగెత్తాలనుకొని అన్ని పనులూ తొందరగా చేసేవాడు. లేడిగాడికి పద్దెనిమిదేళ్ళు వచ్చాక మేనత్తలు మా పిల్లను చేసుకో మా పిల్లను నీకోసమే కన్నాం. అంటూంటే ఆపీడ పడలేక స్నేహితుడు మాచర్రావు ద్వారా వెంకట్టయ పాలెం తోతొఋఈ అమ్మాయిని చేసుకున్నాడు. లేడుగాడు అంత తెలివి తక్కువ వాడేం కాదు. తన చుట్టల చూపంతా తన ఆస్తి మీదే ఉందని తెలుసు. పెళ్ళి అయ్యాక చుట్టాలనందరినీ తరిమేసాడు.

అనుకొన్న పని అనుకొన్నట్టు తొందరగా చేసేయడమే కాని వెనక్కి చూసే ప్రశ్నే ఉండేది కాదు.మాట తొందర, మనసు మాణిక్యం. అందరూ లేడు అంటున్నారని ఉన్నాననిపించుకోవాలని ఎక్కడలేని సందడి పుట్టించేవాడు. కలకత్తాలో కొన్నాళ్ళుండి వచ్చిన సేత్ తో స్నేహం చేసి బెంగాలి పంచె కట్టు నేర్చుకున్నాడు. పంచె కొసలు లాల్చీ జేబులో దూర్చే నేర్పు సంపాదించాడు.

తెల్లగా సన్నగా పొడువుగా పొడుగాటి ముక్కుతో నోట్లో సిగరెట్టు బెంగాలి పంచెకట్టు లాల్చీతో ద్రాక్షరం సెంటర్లో లేడిగాడు హడావుడిగా తిరుగుతూంటే ఫేమిలీ లేడీస్ కూడా సినిమాకు పోతూ మొగుడు చూడకుండా వెనక్కి తిరిగి వాడ్ని చూసేవారు.

పెళ్ళయిన అయిదేళ్ళలో ఇద్దరు కూతుర్లని కని పెద్ద కూతురుకు పదిహేడు వచ్చేటటప్పటికి పిచ్చికుక్క కరిచి లేడిగాడి భార్య చనిపోయింది. ఆమె సంవత్సరీకం వెళ్ళే లోపలే ఒకే పందిరిలో ఇద్దతు కూతుళ్ళూవీరమ్మ, సత్తెమ్మలకు పెళ్ళిళ్ళు చేసేసేడు. వీరమ్మకు 18ఏళ్ళు, సత్తెమ్మకు 16 ఏళ్ళు. వీరమ్మను తోటపేట, సత్తెమను వెలంపాలెం ఇచ్చాడు.

ఇద్దరికీ చెరో రెండెకరాలూ రాసేసేడు. చెరో పదివేల బాంక్ లో వాళ్ళ పేరు మీద వేశాడు. భార్య నగలు చెరో ఇరవై కాసులు ఇచ్చేశాడు.కాపురాలకు పంపించే ముందు పరోక్షంగా ఆడదిక్కులేని ఇల్లు కనక తరచు రావద్దని చూడాలనిపిఒస్తే తానే వస్తానని చెప్పివేశాడు.

వాళ్ళు తమతో వచ్చి ఉండమని బలవంతం చేశారు వాళ్ళు రమ్మంటున్నది తన డబ్బు దక్కించుకొందామనే కానీ తనమీది ప్రీతితో కాదు అనుకొన్నాడు డబ్బు మీదున్న ప్రీతి, మనిషి మీదుండదని సోయంగా గ్రహించినవాడతను. వెచ్చాషావుకార్లు బేంక్ లో వేసిన డబ్బు అంతా తీసి ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు. నెల్నెలా కొట్టు అద్దె వస్తుంది. కౌలుకిచ్చిన భూమి మీద శిస్తు వస్తుంది. లేడిగాడి పని దర్జాగా నడిచిపోతుంది. వెచ్చావారిచ్చే 10శాతం ఎలాగూ వస్తుంది.

రెండుపూట్లకు ప్రొద్దుటే తనే వండుకొని భోజనం చేసేసి పదిగంటలకు ద్రాక్షారం రాగానే ముందు గుడిలోకెళ్ళి భీమేశ్వరుని దర్శించుకొంటాడు.పేరుపేరునా పంతుళ్ళను పలకరించి వస్తాడు. పదకొండింటికి సెంటరుకొస్తాడు. లేడిగాడు రాగానే సెంటర్లో సందడి పెరిగిపోతుంది. వచ్చిందొకడైనా పాతికమందొచ్చినట్లుంటుంది. బ్రాకెట్ ఆడేవాళ్ళతో ఓపింగు, క్లోసింగు నెంబర్ల గురించి దీరీలు తీస్తాడు. రాజకీయలలో ఇంట్రెస్టు ఉన్నవాళ్ళతో వాతో వాటి విషయం చర్చిస్తాడు. రాజకీయ పాఠాలు నేర్పుతాడు.

సినిమాల విషయానికొస్తే సాంఘికాలలో నాగేశ్వరరావు అభిమాని. పౌరాణికాలలో రామారావు అభిమాని. వాళ్ళ మీద ఈగ వాలనీయడు. మధ్యాన్నం రెండు గంటల వరకు అదే కాలక్షేపం. దునే నారాయణ గారి షోడాకొట్టు వద్ద ఒక ఆర్టోస్ వింటో కొని అదేదో విస్కిలాగా అరగంట తాగేవాడు. చవకఅని డక్కన్ సిగరెట్లు కాల్చేవాడు. మరో విధమైన ఖర్చు చేసేవాడు కాడు. మాఘమాసం, కార్తీక మాసాల్లో గుడి చాలా హడావుడిగా ఉంటుంది. అందువలన మధ్యాన్నం రెండు వరకు గుడిలోనే ఉండేవాడు. అందర్నీ క్యూలలో నిలబెట్టడం, భక్తులు అవసరాలేమన్న ఉంటే కనుక్కొని సహాయం చెయ్యడం అతని డ్యూటీ. అక్కడ డ్యూటీ చేసే ఉద్యోగులంతా అధికారంతో డ్యూటీ చేస్తుంటే, లేడిగాడు ఆత్మీయంగా చేసేవాడు.

మధ్యాన్నం రెండు గంటలకు తన సొంత బిజినెస్ ప్రారంభించేవాడు. సెంటర్ లో టీ త్రాగి బేగ్ పట్టుకొని బయలుదేరేవాడు. మొత్తం బజారంతా అతని బిజినెస్ ఏరియానే. అతనిది రోజువారీ వడ్డీవ్యాపారం. అంటే వంద రూపాయలు కావాలంటే 90 రూపాయలిస్తాడు. రోజు రోజూ పదేసి చొప్పున పదిరోజులు కట్టాలి. ఇబ్బందుల వలన బడ్డీ కొట్టు వాళ్ళు, జంగిడీ షావుకార్లు షోడాబళ్ళ వాళ్ళు సరిగ్గా కట్టక పోయినా పెద్ద ఇబ్బంది పెట్టేవాడు కాదు. అందరూ కొంచెం ముందో వెనకో కట్టేవారు. కష్టసుఖాలు తెలిసున్న మనసున్న మనిషి అని అందరూ అతని వద్దే డబ్బు తీసుకునేవారు. ఎవరైనా ఇబ్బందితో కట్టలేకపోతే ఉదారంగా వదిలేసేవాడు కానీ, రాద్దాంతం చేసేవాడు కాడు. ఎవరిదగ్గరా ఆ మాట మాత్రం అనొద్దని మాట మాత్రం తీసుకునేవాడు.

అసలల్లంటి చిల్లర వ్యాపారం చేయాల్సిన అవసరం లేడిగాడ్కి లెదు. లేడిగాడు సెంటర్లో ప్రతి ఒక్కరినీ పలకరించడానికి, వాళ్ళ బాగోగులు కనుక్కోడానికి అవసరమైతే, సహాయం చేయడానికి ఈ వ్యాపరం ఎన్నుకొన్నాడు.

ఎవర్నీ పేరుపెట్టి పిలిచేవాడు కాడు. బావా, అన్నయా, తమ్ముడూ, మావయ్యా, చెల్లీమ్మా, అంటూ వరసలు కలుపుకొని కబుర్లు చెప్పుకోవడానికి బిజినెస్ బాగుండేది. తనకంటే చిన్నావిడను కూడా అక్కయ్యా అని పిలిచినా, పెద్దవాడిని తమ్ముడూ అని పిలిచినా నవ్వుకునేవారే కానీ, కోపగించుకునేవారు కాదు.

లేడి గాడికో చిన్న సరదా ఉండేది. జేబుల్లోంచి రూపాయి తియ్యాలన్నా జేబులో ఉన్న మొత్తం డబ్బు దొంతర తీసేవాడు. అందులో సగం వడ్డీ వ్యాపారం తాలూకు పద్దులే. నైసుగా వంద రూపయల నోట్ల సైజులో కత్తిరించి వంద నోట్ల మధ్య పెట్టేవాడు. అందరూ ఆ బొత్తి అంతా డబ్బే అనుకోవాలని తాపత్రయం అతనిది. సాయంత్రం అయిదింటికి బిజినెస్ అయిపోయేది.

హై కాలేజీకి జూనియర్ కాలేజీకి పెద్ద గ్రౌండు ఉంది. అయిదింటి నుంచి పిల్లలు ఆ గ్రౌండులో రకరకాల ఆటలు ఆడేవారు.

లేడిగాడు అయిదింటికి అక్కడ ప్రత్యక్షమైపోయేవాడు. ఎంతదూరం వెళ్ళినా నడకే దేవుడిచ్చిన బండి ఉండగా ఇంకో బండి ఎందుకురా అనేవాడు.

వయస్సైపోవస్తున్నా కుర్రోళ్ళలొ కుర్రోడై సలహాలిస్తూ వాళ్ళతో ఆటలాడేవాడు. సరదాగా ఉంటుందని వాళ్ళు కూడా లేడిగాడ్ని తమ టీంలలో ఆడనిచ్చేవారు.


ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - యుగధర్మం - by k3vv3 - 09-09-2025, 01:55 PM



Users browsing this thread: 1 Guest(s)