Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#28
చిత్రంగా అనిపించింది. డబ్బుకోసం కాకపోతే, ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? పేరు కోసమా అనుకుంటే- అమ్మమ్మ తన గురించి ప్రచారం చేసుకోదు. ఆమెవల్ల లబ్ది పొందినవారే ఆమెకు ప్రచారకులు. అలా ఆమెవద్దకు వచ్చివెళ్లేవాళ్ల సంఖ్య చెప్పుకోతగ్గదే ఐనా-
మీడియాలోకి ఎక్కేటంత గుర్తింపు ఆమెకి లేదు.
హేతువాదిని కాబట్టి అమ్మమ్మ అపూర్వశక్తిని కొట్టిపారెయ్యాలి. అలా చెయ్యను. అలాగని ఆమె అపూర్వశక్తిని నమ్మనూ లేను.
కొందరికి ఎదుటివాళ్ల ఆలోచనల్ని చదివే నేర్పు ఉంటుంది. తెలిసిన విశేషాల్ని సమకూర్చి- జరిగిన పాత విశేషాల్నీ, జరుగబోయే కొత్త విశేషాల్నీ ఊహించే ప్రతిభ ఉంటుంది.
అలాంటివాళ్లు చెప్పింది నిజమైతే అది కాకతాళీయం. జనం అలా అనుకుందుకు ఇష్టపడరు. వారి శక్తిని గౌరవిస్తారు.
వాళ్లు చెప్పింది నిజం కాకపోతే- జనం వారి శక్తిని శంకించడానికి ఇష్టపడరు. అలాంటివి మర్చిపోయే ప్రయత్నం చేస్తారు.
అలాంటి ప్రతిభావంతుల్లో కొందరు జ్యోతిష్కులుగా స్థిరపడతారు. కొందరు బాబాలౌతారు.
అమ్మమ్మ తను బాబాని అనదు. తనది జ్యోతిష్కమనదు. ఆమె వద్దకొచ్చేవారు ప్రశ్నతో వస్తారు. జవాబు అందుకుని వెడతారు.
అమ్మమ్మ జవాబు తప్పు అయిన సందర్భం ఒక్కటీ నాకు తెలియదు. ఐనా నేనామె శక్తిని ఒప్పుకోను.
ఇక అమ్మమ్మతో నా అనుబంధం విషయానికొస్తే- పిల్లలెవరికైనా అమ్మమ్మలంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కానీ ఆమె మనవలు, మనవరాళ్లలో- ఆమెకు నేను, నాకు ఆమె మరింత ప్రత్యేకం.
అమ్మమ్మ నీతులు చెబితే కథల్లా ఉండేవి. కథలు చెబితే ప్రవచనాల్లా ఉండేవి. పాట పాడితే లలితగీతంలా ఉండేది. తెలిసినవాళ్ల గురించే చెప్పినా- వాళ్ల గురించి అంతవరకూ తెలియనివెన్నో తెలిసేవి. ఆమె కళ్లతో చూస్తే ప్రపంచంలో అంతా మంచివాళ్లే. ఎవరిలోనైనా చెడు కనిపిస్తే- అది మనలోపం!
అమ్మమ్మా! నువ్వో సూతమహర్షివిఅన్నానోసారి.
దానికామె నవ్వి, “నువ్వు నాకు శౌనకుడివి. ఐతే నువ్వొక్కడివే శౌనకుడివిఅని, “నువ్వు
చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అంది.
మామూలుగా అందనుకున్నాను కానీ- స్వార్థాన్ని అదుపు చేసుకోవడం ఎంత కష్టమో-
వసుధతో పెళ్లయినాకే తెలిసింది.
-----
పెళ్లంటే నూరేళ్లపంట కావచ్చు. కానీ ప్రేమ నూరేళ్లపంట కాదు.
పెళ్లికి ప్రాతిపదిక ప్రేమ ఐతే అప్పుడు పెళ్లీ నూరేళ్లపంట కాదు.
చేదు నిజాన్ని నేను వసుధని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక గ్రహించాను.
అదీ వసుధ కాదు- నేను మాత్రమే గ్రహించాను.
పాపం, వసుధ ఇంకా ప్రేమనీ, పెళ్లినీ కూడా నూరేళ్లపంట అనే అనుకుంటోంది.
నేను మాత్రం నా మనసులో ఏముందో బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాను. నిజానికి వసుధకి ప్రేమపై నమ్మకం లేదు. ప్రేమించానంటూ నేనే తన వెంటబడ్డాను. అలాగని నాదీ ప్రేమ అనుకోను.
నేను ఆఫీసులో చేరిన రెండేళ్లకు నాకు పెర్సనల్ అసిస్టెంటుగా చేరేదాకా వసుధ ఎవరో కూడా నాకు తెలియదు.
ఆఫీసుకి ఇంచుమించు వళ్లంతా కప్పిన చుడీదార్లో వచ్చేది.
బాపు-రమణల సినిమాల్లో హీరోయిన్లలా మేకప్ లేని అందం. కళ్లలో- అందాన్ని రెట్టింపు చేసే అమాయకత్వం.
ఆఫీసులో ఆమెకి డ్యూటీ తప్ప మరేం పట్టేదికాదు. ఐతే పలకరించినవారికి ఆహ్లాదకరమైన చిరునవ్వుతో బదులిచ్చేది.
పియ్యే కావడంవల్ల నాతో సన్నిహితంగా ఉండేదామె. అప్పుడు నాలో మగాడికి మనసు చలించేది. ఐతే అది ప్రేమ కాదు.
మనసు మంచిది, వయసు చెడ్డది అన్నాడు సినీకవి. కానీ చెడ్డతనంలో మనసు వయసుకేమీ తీసిపోదని- వయసులో ఉన్న మగాడిగా నాకు తెలుసు. మగాడికి వసుధ కావాలనిపించింది.
పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు కాబట్టి ఆమెపై నాకున్నది మోహమే కానీ, ప్రేమ కాదు. అదీకాక అప్పటికే నా మేనమామ వెంకట్రావు కూతురు వేణిని నాకు అనుకుంటున్నారు. ఏడాదిలో తన డిగ్రీ పూర్తి కాగానే, నిశ్చితార్థం- వెంటనే పెళ్లి అని లోపాయికారీ కబురు. అందుకు నేను అభ్యంతరం చెప్పనూ లేదు.
వేణి కురూపి కాదు కానీ అందగత్తె కూడా కాదు. నాకైతే ఆకర్షణీయంగా అనిపించదు. ఐతే నా మేనమామ ఎంత డబ్బైనా ఇచ్చి వరుణ్ణి కొనగల ఆస్తిపరుడు. డబ్బు నాకు చేదు కాదు.
రూపం విషయానికొస్తే, మేమూ కాస్త ఉన్నవాళ్లమే ఐనా. ‘అందం కొరుక్కు తింటామా?’ అంది అమ్మ. ఇక్కడ సమస్య ఏంటంటే, వసుధది కొరుక్కు తినాలనిపించే అందం కావడం.
అంటే వేణిని పెళ్లాడే ముందు నాకు వసుధపై ఉన్న మోహం తీరాలి. ఆలోచన తప్పని నాకు అనిపించలేదు.
పెళ్లికిముందు మగాడు ఎలా తిరిగినా, పెళ్లయ్యేక మాత్రం భార్యకే కట్టుబడి ఉంటే- మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చెయ్యొచ్చట. అందుకని పెళ్లికిముందు ఎలాగో తిరగడమే నియమంగా పెట్టుకునే మగాళ్లున్నారు.
వాళ్లని ఆదర్శంగా తీసుకున్నాను.
వసుధ ఉద్యోగిని. వయసులో ఉంది. ఆపైన నేనామెకు బాస్.
ప్రయత్నిస్తే లొంగుతుందనే నమ్మకం. మా సంబంధాన్ని రహస్యంగా ఉంచితే అది తప్పుగా భావించదనీ నాకు నమ్మకమే.
నిజానికి నాది ఆశ. దాన్ని నమ్మకంగా భ్రమిస్తున్నానని అనుమానముంది. ఐనా నా ఆలోచన మారలేదు కానీ ఇతరత్రా ఏమాత్రం చనువివ్వని ఆమెకు నా మనసులో ఉద్దేశ్యం తెలియజేసేదెలా?
అందులోనూ- ఆమె ఎప్పటికప్పుడు నన్నెక్కడుంచాలో అక్కడే ఉంచుతోంది.
కాలేజి రోజుల్లో మురళి అనే మిత్రుడుండేవాడు. అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేవాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - మరో వందేళ్ళు - by k3vv3 - 05-09-2025, 10:30 PM



Users browsing this thread: 1 Guest(s)