Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#27
స్థితప్రజ్ఞస్య కా భాషా….
 
[Image: v.jpg]
రచన: వసుంధర
కురు పాండవ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగస్థితి గురించి బోధిస్తాడు.
అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిన సందర్భంలో ఇలా అడుగుతాడు.
'స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్'
స్థిత ప్రజ్ఞుడైన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు.
కథలో స్థిత ప్రజ్ఞులైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో, సాధారణ వ్యక్తులు సైతం స్థిత ప్రజ్ఞులుగా ఎలా మారవచ్చో ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చాలా చక్కగా వివరించారు.
చిప్పలోకి ముడుచుకుని ఉన్న తాబేలుని చంపడానికి కొందరు పైనుంచీ కర్రలతో కొడుతున్నారు. దారిలో వెడుతున్న సాధువు దృశ్యం చూసి, “తాబేలుని తిరగేసి కొడితే సులభంగా చస్తుంది. అది మీకు తెలియకుండా చేసి తాబేలు ప్రాణాలు కాపాడిన దేవుడు ఎంత గొప్పవాడో కదా!” అని వెళ్లిపోయాడు.
సాధువు దేవుణ్ణి మెచ్చుకున్నాడా, లేక తాబేలు చావుకి కారకుడయ్యేడా అన్నది విడమర్చి చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం నాది సాధువు పరిస్థితి. నా భార్య వసుధ తాబేలు. ఆమె చావుని కోరేవారు కొందరున్నారు. వారి కోరికను సఫలం చేసే చిట్కా నాకు తెలుసు.
వసుధకీ నాకూ పెళ్లై నాలుగేళ్లయింది. మాకింకా పిల్లలు లేరు. కారణం జాగ్రత్తపడడం కాదు. వసుధ శరీరం మాతృత్వానికి అనుకూలంగా లేదన్న విషయం మాకు పెళ్లయిన రెండేళ్లకే తెలిసింది. మూడేళ్ల చికిత్స, లక్షల్లో ఖర్చు. రెండూ చేస్తే ఆమె శరీర పరిస్థితి గర్భధారణకు సానుకూలం కావచ్చన్నారు. సత్ఫలితానికి గ్యారంటీ ఇవ్వలేదు.
పురుడు మగువకు పునర్జన్మ అంటారు. కానీ వసుధకి అది జన్మవిముక్తి కావచ్చని డాక్టర్ల భయం. అద్దె గర్భం సూచించారు కానీ దానికీ లక్షలు ఖర్చవుతుంది. పైగా వసుధకి అదిష్టం లేదు. మా బిడ్డని తనే నవమాసాలూ మోసి కంటానంటుంది.



మనకి పిల్లలొద్దుఅని నేను గట్టిగా అంటే వసుధ వింటుంది. కానీ అనను. అనకపోతే వసుధ కూడా నన్ను తప్పు పట్టదు.
నేను మళ్లీ మా అమ్మానాన్నలకి దగ్గరవడానికి మాకు పిల్లలు అవసరమని తనకి తెలుసు. అదీకాక తనవల్లే- నేనూ, మావాళ్లూ విడిపోయామని తనలో అపరాధభావం కూడా ఉంది. పిల్లల వంకతో మావాళ్లు నన్ను రెండో పెళ్లికి బలవంతపెట్టే అవకాశముందన్న భయం కూడా ఆమెలో ఉంది. పైకి అనదు- నేను నొచ్చుకుంటానని!



రెండో పెళ్లి విషయంలో ఆమెది భయం కాదనీ, నిజమేననీ నాకు తెలుసు. కానీ ఆమెకి చెప్పలేదు- ఎలా చెప్పాలో తెలియక!
మాది ప్రేమ పెళ్లి. దాని భవిష్యత్తు ఇప్పుడు వసుధ మాతృత్వంతో ముడిపడింది. తను రిస్కు తీసుకుంటానంటోంది. ఒప్పుకుంటే నేనామెను ఆత్మహత్యకు ప్రోత్సహించినట్లే! ఇంకా చెప్పాలంటే అది హత్య కూడా!



నేను స్వార్థపరుణ్ణి కావచ్చు కానీ దుర్మార్గుణ్ణి కాను. ఇక హంతకుణ్ణి కావడమంటే- ఆలోచనే తట్టుకోలేను.
అందుకే మధ్యేమార్గంగా మా అమ్మమ్మని ఎన్నుకున్నాను.
-----
మనిషికి ఎంతో కొంత స్వార్థముండడం సహజం. స్వార్థం ఎంతో ఉన్నవాళ్లు దుర్మార్గులు. కొంతే ఉన్నవాళ్లు సామాన్యులు. లేనివాళ్లు స్థితప్రజ్ఞులు.
సమాజంలోనైనా సామాన్యులదే మెజారిటీ. స్థితప్రజ్ఞులది మైనారిటీ. దుర్మార్గుల సంఖ్య మైనారిటీ చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, దుర్మార్గులుగా మారే సందర్భాలు సామాన్యులకి కూడా తరచుగా ఏర్పడుతుంటాయి.
అలా మా ఇంట్లో నేను సామాన్యుణ్ణి. మా అమ్మమ్మ స్థితప్రజ్ఞుల కోవలోకి వస్తుంది. అమ్మమ్మకు చిన్నతనంలోనే భర్త పోయాడు. అప్పటికామెకు ఇద్దరు కూతుళ్లూ, కొడుకూ.
ఇరవై ఎకరాల పొలముంది. మంచి మనసు. జాలిగుండె. అందర్నీ ఇట్టే నమ్మేస్తుంది. ఎవరి గురించీ పొల్లుమాటనదు.
తనపై నింద వేసినవారిని కూడా తప్పు పట్టదు. వీలైనంతలో సాయం చేస్తుంది. ప్రాణం పోతున్నా దేహీ అనదు.
ఇలా చెప్పుకుంటారు ఆమె గురించి. ఆమెతో సాన్నిహిత్యముంటే అది నిజమేననిపిస్తుంది.
కూతుళ్లు పెళ్లవగానే అత్తారింటికి వెళ్లిపోయారు. కొడుకు చదువయ్యేక పెళ్లి చేసుకుని
ఇల్లరికం వెళ్లిపోయాడు. తను మాత్రం డెబ్బై నిండినా పిల్లల వద్దకు వెళ్లదు. స్వగ్రామంలోనే ఉంటోంది.
అమ్మమ్మది పెద్ద చెయ్యి. అయినవాళ్లకి పెట్టుపోతల్లో లోటు రానీదు. తన భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించదు. ఇప్పటికి తనకి మిగిలింది ఇల్లూ, నాలుగెకరాల పొలమే ఐనా, అవే తనకి ఎక్కువంటుంది.
ఒంటరిదయ్యేక, అమ్మమ్మ దైవధ్యానంలో పడింది. నిత్యం ఆంజనేయస్వామి ఉపాసన చేసేది. ఫలితంగానేమో ఆమెకి అపూర్వశక్తి వచ్చిందంటారు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడెక్కడి విశేషాలో చూసి చెప్పగలదు. భవిష్యత్తులోకీ తొంగిచూడగలదు. చాలామంది ఆమె వద్దకు వచ్చి ప్రశ్నలడిగి లబ్ది పొందిన విశేషాల్లో కొన్నింటికి నేనూ ప్రత్యక్షసాక్షిని.
కొందరికి నిధులు, లంకెబిందెల ఆచూకీ చెప్పింది. కొందరికి అరుదైన పత్రాలు ఎక్కడున్నాయో చెప్పింది. కొందరికి వ్యాపారం లాభసాటో చెప్పింది. కొందరికి దొంగల్ని పట్టిచ్చింది. కొందరిళ్లలో అపార్థాలు పోగొట్టింది. ఐతే ఎదుటివారికి తనవల్ల లక్షల్లో లాభమొచ్చినా సరే, తను మాత్రం నామమాత్రంగా నూటొక్క రూపాయలే తీసుకునేది.
అదేంటి అమ్మమ్మా!’ అని నేనంటే, ‘స్వామి నాకు చెబుతున్నాడు. అందుకాయన నన్నేమడగడం లేదు. ఆయన చెప్పిందే చెప్పే నేనెలా అడుగుతాను? తీసుకునే నూటొక్క రూపాయలూ కూడా నాక్కాదు. ఇచ్చినవాళ్ల పేరున అర్చన జరిపిస్తానుఅంది అమ్మమ్మ.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - మరో వందేళ్ళు - by k3vv3 - 05-09-2025, 10:28 PM



Users browsing this thread: 1 Guest(s)