28-08-2025, 02:25 PM
“”మరేం చేద్దాం టైమ్ లేదు” ఆయాసపడుతున్నాడు.
“సార్ కంగారు పడకండి, కన్నప్ప దగ్గర మంచి మందు ఉంది.”
పాము కాటుకి ఆయుర్వేద మందులు పనిచేయవు. ప్లీజ్ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళు .. రొప్పుతూ అన్నాడు.
సార్ ముందు మీ వేలుకి కట్టు కదతానుండండి.. అని రుమాలుతో కరిచిన వేలుకి కట్టు కట్టాడు. కరిచింది విషసర్పమని వీర్రాజుకి అర్ధం అయింది, “తన ఉద్యోగం పోయినట్టేనని అనుకున్నాడు.
గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు జీప్ తిప్పాడు. అక్కడ ఒక వేళ పాము మందు లేకపోతే ఏమిటి పరిస్థితి అసలే సౌకర్యాలు లేవని ఈ మధ్య పేపరోళ్ళు రాశారు.
పెద్ద కుదుపుతో జీప్ ఆగింది. దభేల్న ముందు అద్దానికి గుద్దుకున్నాడు రాజగోపాల్.
ఏం జరిగినది ముఖమ్ మాడ్చుకొని అడిగాడు.
సార్ బండి ప్రాబ్లం, దిగి చూస్తానుండండి. దేవుడా.. అరిగిపోయిన గేర్ల తో ఈ బండి ఇంతకాలం నడిపాను సమయం చూసుకొని ఇది ఇబ్బంది పెట్టింది ఏం చేయాలి .. బోనెట్ ఎత్తి చూశాడు, టార్చ్ వెళుతురులో.. అంతా పరిశీలించాడు, ఎప్పుడూ ఉన్నదే, కొత్తదేమీకాదు బాటరీ కూడా వీక్గా ఉంది ప్రస్తుతమ్ ఫర్వాలేదు, బోనెట్ దించాడు జీప్ లో రాజగోపాల్ కిరకిర లాడుతున్నాడు.
“అయ్యిందా”
సార్ ఓకే ,
సమయం ఉదయం నాలుగు గంటలు అయింది. ఎంత వేగంగా వెళ్లాలన్నా జీప్ 40 km కంటే వెళ్ళదు, ఎదురుగా కొంతమంది జనం నడుచుకొని వస్తున్నారు , వాళ్ళను చూసి వీర్రాజుకి గుండెలో రాయి పడింది, సార్ మీతో వారం రోజుల తిరుగుతుండడంలో, ఈరోజు శివరాత్రి అన్న సంగతి మారిచిపోయాను.. ప్రతీ శివరాత్రికి గుండ్లబ్రహ్మేశ్వరం ఆలయ ధర్శనానికి సాధారణ ప్రజలకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తారు, వీళ్ళను దాటుకొని వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. వీర్రాజుకి చెమటలు పడుతున్నాయి.
ఒక కాగితమ్ మీద అడ్రసు, మొబైల్ నెంబర్ రాసి వీర్రాజు చేతిలో పెట్టాడు.
మెల్లగా కళ్ళు మూతలు పడుతున్నాయి .. రాజా గోపాల్ కి.
** *
“ఎంతసేపయింది” నాడి పరిశీలిస్తున్నాడు కన్నప్ప.
“గంట దాటింది ” టైమ్ దాటిపోయిందని భయపడుతూ అన్నాడు వీరాజు.
నాలుగు రకాల ఆకుపసర్లు ఇచ్చి నూరమన్నాడు, తాను కూడా ఏవో మూలికలు నూరుతున్నాడు,రెండు కళ్ళలో రెండేసి చుక్కలు వేశాడు, నోట్లో మూలికలతో చేసిన పసరు మందు వేశాడు. అదేమిటో వీర్రాజుకు తెలియదు కానీ వాటిమీద ఎంతో నమ్మకం ఉంది.
మధ్య మధ్య లో నాడి పరిశీలిస్తున్నాడు, అంతా బానే ఉంది.
గంట గడిచింది .. మెల్లగా కళ్ళు తెరిచాడు. బ్రతికున్నందుకు ఆశ్చర్యంగా ఉందతనికి, లేవాలని చూశాడు, వారించి మరేం ఫర్వాలేదు అలా పడుకోండి, తర్వాత మాట్లాడదాం అంటూ ఇంకో గదిలోకి వెళ్ళి పోయాడు.
వీర్రాజుకి చాలా సంతోషంగా ఉంది.. అతని మాట ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే ఇంకో గంట పట్టేది. మెల్లగా భుజం పట్టి పైకి లేపాడు. ఇంతలో కన్నప్ప ఇద్దరికీ సుగంధి వేర్ల తో చేసిన టీ ఇచ్చాడు.
రెండు చేతులతో నమస్కరిస్తూ “నువ్వు నిజంగా అడవి దేవుడవు”. అన్నాడు రాజగోపాల్.
చిన్నగా నవ్వుతూ “ఇదే మీపట్నం వాళ్ళ మందులైతే, మూత్రపిండాలపై ప్రభావమ్ చూపుతాయి” అంటూ ఏదో చూర్ణం ఇచ్చి, మీరు రెండు పూటలా వేడి నీళ్ళతో రెండు నెలలు వేసుకోండి అన్నాడు కన్నప్ప.
ఇది దేనికి ఆశ్చర్యంగా అన్నాడు.
ఆరోజు క్రిందన కూర్చోమన్నది మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు ఎముకల సమస్యలు ఏవైనా ఉంటే క్రిందన కూర్చోలేరు .. మాదగ్గర అదోపరీక్ష, మీకు తుంటి నొప్పి మొదటి దశలో ఉంది ఈ మందు వాడితే తగ్గు తుంది. కళ్ళతో చూసి పరీక్ష చేయడం కూడా మా విధానం.
రాజగోపాల్ కి ఆశ్చర్యంగా ఉంది, తనకు “అవాస్కులర్ నెక్రొసిస్ ” స్టేజ్ వన్ అని ఎంత బాగా గ్రహించాడు. రాత్రి జరిగిందాని గురించి ఆడగకపోవడం కొంత హేపీగా ఉందతనికి.
* * *
ఆరోజు రాత్రి గెస్ట్ హౌస్ లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడు తున్నాడు రాజగోపాల్ .
“సార్ ఇక్కడ నాకు తెలియని ఎన్నో మూలికలు ఉన్నాయి, కన్నప్ప దగ్గర అనేక ఫార్ములాలు ఉన్నాయి, కరోనాలో పాపులర్ అయిన గోవిందయ్య మెడిసిన్ కూడా ఉంది, ఆయుర్వేదిక్ యాంటీ వెనమ్ ఫార్ములా కూడా ఉంది, అదిగానీ ఫార్మా కంపెనీలో పెడితే కోట్లు గడించొచ్చు .” ఆనందంగా చెప్పసాగాడు. బయట చిన్న అలికిడి అయ్యింది.చూస్తే ఎవరూ లేరు.
* * *
మరునాడు ఉదయం ఏమీ జరగనట్టు కన్నప్ప వద్దకు వెళ్ళాడు.
కన్నప్ప కూడా ఏమీ జరగనట్టు సాదరంగా ఆహ్వానించాడు.
“పుత్ర జీవక మూలికలు చూపినస్తానన్నావు.”
ఇక రెండు రోజుల్లో ఇక్కడ నుండి వెళ్ళి పోవచ్చు ఈలోగా ఇది కూడా తెలుసుకుంటే తాను వచ్చిన పని పూర్తైనట్టేనని భావించాడు.
“ అవి మూలికలు కాదు దొరా గింజలు., ఇక్కడ పెద్దగా అవసరం ఉండదు కొంతదూరంలో అవున్నాయి నడుచుకొని వెళ్ళాలి.. చూపిస్తాను పదండి. ”
ఇద్దరూ ఆశ్రమం వెనుక వైపు నుండి వెళ్ళడం ప్రారంభించారు. మెయిన్ రోడ్డుకి కలిపే దారది కొంత దూరం వెళ్ళిన తరువాత, పెద్ద పెద్ద ఆకులతో కుంకుడు కాయ పరిమాణంలో గుబురుగా కనిపించింది “పుత్రజీవక ”మొక్క. వాటి కాయలను ఎలా వాడలో చెప్పాడు.
“ఇది నీకు అవసరం దొరా ”
నాకు అవసరం అని నీకెలా తెలుసు. ఆశ్చర్యపోయాడు రాజగోపాల్.
గొంతు సవరించి మొదలు పెట్టాడు. “ఇక్కడ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది దొరా, మీరు ఇక్కడ అడుగు పెట్టిన దగ్గరనుండి, మొత్తం మాకు తెలుసు , అడుగడుగునా మిమ్మల్ని గమనిస్తూ మా వాళ్ళు ఉన్నారు, ఆ రాత్రి విడిది గదిలో మీరు కొంత మంది అల్లరి మూకతో చేసిన పనులు కూడా మాకు తెలుసు, అంతే కాదు కొంత మంది తో కలిసి మా ఆటవిక సంపదైన ఆయుర్వేద విధ్య ను అమ్మ చూశారు. అది జరగని పని. కొంచెం సేపు ఆగి.
పాము విషానికి విరుగుడు మందు మాఅయ్య నాతో చెప్పినప్పుడు, చెప్పిన మొదటి మాట “పాము కంటే మనిషే ప్రమాదం” నిన్ను చూస్తే అర్ధం అయింది దొరా.. నీ లాంటి మోసపూరితమైన మనిషితో ఇంత కంటే ఎక్కువ మాట్లాడను .. విషం చిమ్మే పామునైనా విషం నిండిన మనిషినయినా చంపకూడదు.. జాగ్రతగా విడిచిపెట్టాలి మళ్ళీ దగ్గరకు రాకుండా ..
తననేమీ అనకుండా మెయిన్ రోడ్డు వరకు తీసుకొచ్చాడు. . అందుకన్నమాట.
“చిన్న చినుకులు ప్రారంభమైయ్యాయి”
కన్నప్ప అక్కడే నిలబడిపోయాడు.
రాజగోపాల్ వెనక్కి చూడకుండా మెల్లగా మెయిన్ రోడ్డు దారి పట్టాడు. అవమాన పడడం, అవమానించడం తనకు క్రొత్త కాదు,ఇంత మంది గూఢాచారులు తనచుట్టూ ఉన్నారని అనుకోలేదు. ఉదయం నుండి వీర్రాజు ఎందుకు కనిపించలేదో అర్ధం అయింది.
అయినా ఏం నష్టం, ఇక్కడ కాక పోతే ఇంకో దగ్గర. “పులికి ఏ అడవైనా ఒకటే ”
క్రాఫ్ దిద్దుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు.
ఎదురుగా బృందానాయక్ ..
కాలేజీ నుండి తనతో పరిచయం. ప్రేమా, డబ్బూ పోటీలో .. డబ్బే గెలిచింది. తరువాత ఇద్దరూ ఒకేఉద్యోగం,ఒకేదగ్గర సంపాదించారు.నిజమే..తనని ఆశ పెట్టాడు, లోబర్చుకున్నాడు. అయినా పశ్చాత్తాపం లేదు, ఎందుకంటే తనేమ్ చేసినా క్షమించే మనుషులు తన చుట్టూ ఉన్నారు.
వర్షం ప్రారంభం అయింది...పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకు గొడుగు పట్టాడు వీర్రాజు.
తనని దోచుకున్నట్టు ప్రకృతి ని దోచుకోలేవు.ఆమె కళ్ళలో భావం అర్ధం అయింది. ఆమె గతంలో అన్న మాట గుర్తొచ్చింది. విషం చిమ్మే పామునైనా విషం నిండిన మనిషినయినా చంపకూడదు.. జాగ్రతగా విడిచిపెట్టాలి. . మళ్ళీ దగ్గరకు రాకుండా ....

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ