28-08-2025, 02:24 PM
ఎత్తైన ప్రదేశంలో ఒక ఆశ్రమంలా ఉంది. ఒక రకమైన ప్రశాంతతతో పాటూ సువాసనతో కూడిన గాలి శరీరం మీద నుండి మెల్లగా తాకుతుంటే కొత్త ఉత్సాహం శరీరంలో ప్రవేశిస్తున్నట్టు ఉంది. రాతితో చేసిన మెట్లమార్గంలో పైకి వెళ్తున్నారు. త్రోవలో అనేక ఆయుర్వేదమొక్కలు లోనికి ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి, పట్టణాలలో కనిపించే కాగితప్పూలచెట్టు మొదలు అశ్వగంధ,గలిజేరు,శతావరి,భృంగరాజ్, అనేక ఆయుర్వేద మొక్కలు కనిపించాయి, ఎంత అనుభవం ఉన్నా కొన్ని మొక్కలు మాత్రం గుర్తించలేక పోయాడు రాజగోపాల్.
బయటకు పెద్ద పర్ణశాలలా ఉంది, లోపల విశాలంగా.. మట్టితో అలికిన నేల కొంత మంది గ్రామ ప్రజలు, క్రిందనే కూర్చున్నారు. బహుశా వాళ్ళు పేషెంట్లు కావచ్చు.
ఎదురుగా ఆజాను బాహుడు “కన్నప్ప” కోయదొర ఆహార్యంలో ఉన్నాడు,ముఖంలో తేజస్సు ఉట్టి పడుతుంది,వయసు సుమారు యాబైఅయిదు పైన ఉంటుంది అయినా, కండలు తిరిగిన శరీరం, ఒక్క చేత్తో పులిని చంపగల వీరుడిలా ఉన్నాడు. అలికిడికి తమ వైపు చూశాడు.. రండి .. సాదరంగా ఆహ్వానించాడు, కూర్చోమని చాప చూపించాడు. సింహం మాటాడితే ఎలా ఉంటుందో అలా ఉంది అతని గొంతు.
రాజగోపాల్కి అర్ధం కాలేదు తనని చూడగానే అందరూ గౌరవిస్తారు, కానీ ఇతను కిందని కూర్చో మన్నాడు. వీళ్ళ పద్దతులు వేరు అంటే తనని కూడా ఒక పేషెంట్ అనుకొని ఉండవచ్చు, సరే అని కిందని కూర్చోడానికి ప్రయత్నించాడు.. కానీ కాలేదు.
కన్నప్ప నవ్వుతూ ఫర్వాలేదు నిల్చ్చోవ్డి అన్నాడు.
ఇంతలో ఒక రోగి ఏదో చెప్తున్నాడు.. నాడి పట్టుకొని పరీక్షిస్తున్నాడు కన్నప్ప .
ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజగోపాల్.
“ఎండుచేపలు తింటున్నావా ” అడిగాడు.
అవునన్నట్టు నసిగాడు
“అవి మానమని ఎన్ని సార్లు చెప్పాను.. నీకిదే ఆఖరి మందు, మరివ్వను ” అంటూ మూడు మూలికలను దంచి అతనికి ఇచ్చి “ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకో ” చిరుకోపంతో అన్నాడు.
పరీక్షగా చూస్తునాడు రాజగోపాల్, రెండు మూలికలు తనకు తెలుసు.. అశ్వగంధ,అర్జున మూడవది తెలియదు. గదంతా పరిశీలిస్తునాడు, విచిత్రమైన మూలికలు ఉన్నాయి ఒక దగ్గర ఎండిపోయిన పుట్టగొడులు కొన్ని ఉన్నాయి. కానీ కొంచం నీలంగా ఉన్నాయి. ఎందుకు ఉపయోగిస్తారో తనకు తెలియదు, అవి విషపూరితం అని తెలుసు.
“చెప్పండి దొరా ”
ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. తాను వచ్చిన విషయం చెప్పాడు.
“చూడు దొర మీకు చెప్పేంత గొప్పోడిని కాను.. కానీ ఇక్కడ వనమూలికల గురించి తెలుసుకోవాలంటే మన జీవితమంతా చాలదు అన్ని రకాలు ఉన్నాయి, అయినా నాకు తెలిసినంత వరకూ.. మీరు ఇక్కడున్నంత వరకూ చెప్తాను ” ఈరోజు రోగులు ఎక్కువ ఉన్నారు రేపటినుండి రండి. అన్నాడు.
“అలాగే కానీ నాకు చిన్న అనుమానం.. అక్కడ ఉన్నది పుట్టగొడుగులే కదా వాటిని గురించి కొంచెం చెప్తారా ” ఉత్సాహంగా అడిగాడు.
“అవి నీలిరంగు పుట్టగొడుగులు అడవిలో రాత్రి పూట చీకట్లో మాత్రమే కనిపిస్తాయి. తినడానికి పనికిరావు కొన్ని మందులలో వాడతారు మీరేమంటారో నాకు తెలియదు మా భాషలో “కర్కరోగం”. నేను ఒక పద్దతిలో మందు తయారు చేసి ఒకరికి ఇచ్చాను, మంచి గుణం కనిపించింది. మాకు అన్ని రకాలపరీక్షలు తెలియవు దొరా కేవలం లక్షణాలు తెలుసుకొని మందిస్తాను.
“రేపటి నుండి ఓ గంట సేపు మీదగ్గరకు వస్తాను ” బయటకు నడిచారు ఇద్దరూ.
అప్పుడు గమనించాడు సుమారు పన్నెండు సంవత్సరాలు వయసున్న పిల్లలు కొన్ని మూలికలను కవ్వం లో నూరుతున్నారు.ఆయన శిష్యులేమో అనుకున్నాడు. కానీ ద్వారం ప్రక్కనున్న లాండ్ లైన్ ఫోన్ గమనించలేదు.
* * *
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్.
“ సార్ నల్లమలకు నన్నే పంపిస్తారని ఎదురుచూశాను, కానీ చివర్లో రాజగోపాల్ని పంపారు “ వైస్ ఛాన్సలర్తో నిష్టూరంగా అంది ప్రొఫెసర్ బృందా.
“ అది కాదమ్మా పది రోజులూ అడవిలో ఉండాలి, తిరగాలి, నీకవన్నీ కష్టం అని అతన్ని పంపించాను. ఆమె నమ్మదని తెలుసు. అయినా నీకెందుకమ్మా అడవంటే అంత ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్ కాదు సార్, ఇష్టం. నేను కూడా అదే ప్రాంతానికి చెందిన దాన్ని, నా చిన్నతనంలో అమ్మతో కలిసి అడవిలో కోవెలకు వెళ్తుంటే.. ఆమె కళ్లలో నీళ్ళు చూసి వైస్ ఛాన్సలర్ చలించిపోయాడు.
“ఎక్కడ నుండి వచ్చిందో ఓచిరుత, అమ్మపై దాడి చేసింది. దూరం నుండి చూసిన కొంత మంది కేకలు వేయడంతో చిరుత పారిపోయింది.. కొన ఊపిరితో ఉన్న అమ్మ .. బాగా చదువుకో,ఊరికి చేతనైనంత మేలు చేయమని చెప్పి చచ్చి పోయింది. తరువాత మా నాన్న కూడ బెంగతో, చనిపోతే ఆ ఊరిలో ఉన్న ఒక దొర నన్ను పెంచి ఇంత దాన్ని చేశాడు. అందుకే నాకు అవకాశం ఉన్న అన్ని మార్గాలలో కూడా ఆ అడవికి సహాయం చేస్తుంటాను.
అడవి తల్లినే నా తల్లిగా భావించాను. ఇప్పుడు కూడా ఆ ఊరి గురించి, అక్కడ వసతుల గురించి, నివేదిక మీ ద్వారా ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఎదురు చూశాను సార్. ఆమె మాటలో నిస్వార్ధం కన్పించింది.
“సారీ అమ్మా.. నీ వెనుక ఇంత కధ ఉందని నాకు తెలియదు.అతనిలానే సరదాగా టూర్ ప్లాన్ చేశావు, అని భావించాను.త్వరలోనే నిన్నక్కడికి నా స్పెషల్ రైట్స తో తప్పకుండా పంపిస్తాను, ”
“అతను మాత్రం సరదాగా టూర్ ప్లాన్ చేయలేదు , ఒక ప్లాన్ మీద వెళ్ళాడు సార్ ”
* * *
నాలుగు రోజులూ గడిచాయి. వీర్రాజు, రాజగోపాల్ అడవిలో చాలా వరకూ తిరిగారు, పురాతన రహస్య దేవాలయాల గురించి, అటవీ సంపదను దోచుకొనే దొంగల గురించి, చాలా తెలుసుకున్నాడు, మధ్యలో కన్నప్ప దగ్గర చాలా విషయాలు గ్రహించాడు.
“వీర్రాజూ .. ఈరోజు రాత్రి అడవిలోకి నన్ను తీసుకొని వెళ్లాలి ”
“సార్ ఎందుకు ”ఆశ్చర్యంగా అడిగాడు.
“నీలిరంగు పుట్టగొడుగులకోసం ”
“చాలా ప్రమాదం సార్, నాకు రేంజర్ గారు అనుమతివ్వరు ”
“అందుకే నిన్న డుగుతున్నాను. దయచేసి సీక్రెట్గా అక్కడకు తీసుకెళ్లు”
చాలా సేపు బ్రతిమలాడిన తరువాత వస్తాను, గానీ.. జీపు మాత్రం దిగనని చెప్పాడు వీర్రాజు.
* * *
రాత్రి సుమారు 2 గంటలు ..
చాలా పవర్ఫుల్ టార్చ్ లైట్ పట్టుకొని బయల్దేరారు.
వీర్రాజుకి అడవిలో రాత్రి వెళ్ళడం కొత్త కాదు , కానీ చాలా భయంగా ఉంది, అనధికారికంగా ఒకరిని అడవిలోకి తీసుకెళ్లడం.. అందులో రాత్రి. ఏదో జరగబోతుందనుకున్నాడు.
“సార్ ఈ విషయం బయట పడితే నా ఉద్యోగం ఊడిపోతుంది ”
“మనిద్దరికీ కాక ఇంకెవరికి తెలుస్తుంది” నోరు తెరవగానే ఆల్కహాల్ వాసన గుప్పుమంది. “ఇంత రాత్రిలో అడవిలో ప్రయాణం అంటే నాకు కూడా భయమే ” కావాలంటే నువ్వు కూడా కొంచెం మాన్షన్ హౌస్ తీసుకో”
“నేనుతాగనుసార్ .. జీవితంలో మళ్ళీ మందు ముట్టనని బాలెమ్మ తల్లి మీద ప్రమాణం చేశాను.
గిద్దలూరు వైపు జీపు వెళ్తుంది.
“నువ్వు నాకు సహాయం చేస్తే జీవితంలో నువ్వు చూడనంత డబ్బు నీకిస్తాను ” ఆశపెట్టాడు రాజగోపాల్. మత్తులో ఏవేవో మాట్లాడుతున్నాడు.
చిన్న గాలితిమ్మెర కొట్టింది. వీర్రాజు ముఖంలో మార్పు అతను గమనించలేదు. వాతావరణం చాలా చల్లగా ఉంది జీపు హెడ్లైట్ వెలుతురులో రోడ్డు తప్ప ఎదురుగా ఏం కనిపించడం లేదు, పగలు అందంగా ఉన్న అడవి రాత్రి భయంకరంగా ఉంది. చాలా సేపు ఇద్దరిలో మాటలు లేవు, గంట ప్రయాణం తరువాత అడవిలో ఒక కంకర దారిలోకి జీప్ ప్రవేశించింది.
ఎక్కడ నుండి వచ్చిందో ఒక గుడ్లగూబ జీప్ బానెట్ మీద వచ్చి కూర్చుంది. ఉలిక్కి పడ్డాడు.
“సార్ ఇదేదో అపశకునంలా ఉంది, వెనక్కు వెల్లిపోదాం ”
దానికి దారి తెలియక మనతో వస్తుంటే . .అపశకునం అంటావేన్టీ..
ఇప్పుడు చూడు దాన్నెలా పంపిస్తానో,
టార్చ్ పట్టుకొని కిటికీలో నుండి చెయ్యి బయటకు పెట్టి .. దాని మీద ఒక్క సారిగా ఫ్లాష్ చేశాడు. గట్టిగా అరుచుకుంటూ ఎటో ఎగిరిపోయింది.
జీప్ ఆగింది, “సార్ దిగండి ఎదురుగా ఉన్న రావి చెట్టు క్రింద అవి దొరకొచ్చు , కానీ టార్చ్ వెళుతురులో అవి కనిపించవు, మధ్యలో ఒక సారి ఆఫ్ చేయండి కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే ఎక్కువ సమయం ఎదురు చూడకండి, మరి దొరకనట్టే ”
అలాగే అంటూ వెనక్కు తిరక్కుండా, టార్చ్ వేసుకొని బయల్దేరాడు.
చుట్టూ చిన్న చిన్న మొక్కలు, పొదలు ఉన్నాయి, ప్రత్యేకంగా దారంటూ లేదు, రావి చెట్టు వైపు వెళ్తున్నాడు, పెద్ద దూరం లేదు రెండు నిముషాల్లో చేరుకున్నాడు, చెట్టు దగ్గరకు రాగానే లైట్ అపాడు. అడుగు దూరంలో.. చిమ్మ చీకట్లో ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి.. గుత్తులు గుత్తులుగా “నీలిరంగు పుట్టగొడుగులు”, అతనికి ఇంకేమీ కనిపించడంలేదు, ఆత్రంగా వాటిని తీయడానికి ముందుకు ఒంగొని చేయి చాచాడు, కాలు క్రింద ఏదో మెత్తగా తగిలింది .. అంతే ఒకే ఒక్క సెకన్లో వాటిని చుట్టుకున్న విషయ సర్పం బుసకొడుతూ.. వేలు మీద కాటేసింది. చురుక్కు మన్న నొప్పికి టార్చ్ వేశాడు.. ఎదురుగా “రక్తపింజర” మెలికలు తిరుగుతూ రెండు సెకెన్లలో మాయమయ్యింది.
వీర్రాజు.. అతను వేసిన కేక అప్పుడే ఉరిమిన శబ్ధంలో కలిసిపోయింది. రాజగోపాల్ పరిగెట్టడం ప్రాయంభించాడు, దూరంగా జీపలో ఉన్న వీర్రాజు స్టీరింగ్ పై తలపెట్టుకుని కునుకుతున్నాడు. పరిగెత్తుకుని వచ్చిన రాజగోపాల్ జీప్ తట్టిన శబ్దానికి. మెల్లగా చూశాడు. “సార్ ఏం జరిగింది”
“వీర్రాజు ..పాముకర్చింది.. అర్జంటుగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పదా ”
“సార్ ఇంకా గిద్దలూరు వెళ్ళడానికి గంట పడుతుంది”

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ