28-08-2025, 02:23 PM
కన్నప్ప - పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
![[Image: k.jpg]](https://i.ibb.co/4nKGqJJc/k.jpg)
నల్లమల ఫారెస్ట్, సమయం మధ్యాహ్నం మూడు గంటలు,
జీప్ మెల్లగాఆత్మకూర్ వైపు వెల్లసాగింది .
ఫారెస్ట్ గార్డ్ దృష్టాంతా రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నాడు. “అంత సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నావేంటి, తెలిసిన రోడ్డే కదా” అడిగాడు ప్రొఫెసర్ రాజగోపాల్.
“సార్ ఎంత తెలిసిన రోడ్డయినా చాలా ప్రమాదకరమైంది, అప్పుడప్పుడు రోడ్డు మీదకి ఏవో జంతువులు అడ్డంగా వస్తుంటాయి. బండికికూడా చిన్న ప్రాబ్లం ఉంది ”
ప్రొఫెసర్ రాజగోపాల్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న అడవి అందాలని చూస్తున్నాడు . ఆకుపచ్చ చీర కట్టిన అందమైన యువతిలా మనోహరంగా ఉంది నల్లమల, చుట్టూ ఎత్తైన కొండలు, మహావృక్షాలు, జలపాతాలు మధ్యన ఈ దారి ఆహా అధ్బుతం. ఎప్పుడూ వినడమే గానీ చూడలేదు.
నల్లమలలో దొరికే వనమూలికలు,ఔషదమొక్కలు, చెంచుల జీవన విధానం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, పరిశీలించడానికి ఆంధ్రాయూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడకు పంపించారు. ఈ అవకాశం కోసం ఎందరో ఎదురు చూశారు, కానీ తనకి వచ్చింది. తన కన్నా ఎక్కువ అర్హతలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వయసు కొంచం ఎక్కువ, ఆ కారణంగా తనని ఎంచుకున్నారు. నిజం చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ తో ఉండే స్నేహం ఒక కారణం. లేక పోతే ఈ అవకాశం రావాల్సింది లేడీ ప్రొఫెసర్ బృందాకి.
“సార్ ” అన్న పిలుపుతో ఏమిటన్నట్టు ప్రక్కకు చూశాడు. “విశాఖపట్నం నుండి ఇక్కడకు వస్తున్నారని మా ఫారెస్ట్ రేంజర్ గారు చెప్పారు ఎందుకో తెలుసుకోవచ్చా ”
“నేను ఆంధ్రాయూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను, నల్లమల ఫారెస్ట్ లో ప్రజలను, ఇక్కడ వాతావరణాన్ని పరిశీలించడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు పది రోజులకి ఇక్కడకు పంపారు,
గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది. అందుకే నిన్ను నాతో పంపారు. నువ్వే నాకు ఈ అడవిని పరిచయం చేయాలి.
సార్ ఇంతకు ముందు చాలా మంది వచ్చి, అనేక పరిశోధనలు చేశారు నివేదికలు ఇచ్చారు కానీ, ఇక్కడ ప్రజలలో పెద్ద మార్పేమీ లేదు సార్.
విచిత్రమైన శబ్ధంతో జీప్ ఆగింది. ఎదురుగా ఒక నిండు గర్భిణీని డోలీ లో మోసుకుంటూ రోడ్డు దాటుతున్నారు కొంతమంది చెంచులు.
“ ఆమెను ఆత్మకూరు హెల్త్ సెంటర్ కి తీసుకు వెళ్తున్నట్టున్నారు మనం వెళ్ళేది అదే త్రోవ కదా జీప్ లో తీసుకు వెళ్దాం ”
“ కాదు సార్ ఇక్కడి వాళ్ళు ఇంగ్లీష్ వైధ్యాన్ని నమ్మరు,
“మరేలా”
వాళ్ళ వైద్యుడు వేరేఉన్నాడు. ఎటువంటి జబ్బుకైనా వైద్యంచేస్తాడు.
అతని దగ్గరే పురుడు పోయాడానికి మహిళలు కూడా ఉన్నారు, పట్నంలోలా ప్రతీ చిన్న దానికి ఆపరేషన్లు, డబ్బులు, మోసాలు ఉండవు ”
“కడుపుమీద ఏదో పసరు పూస్తారు అంతే..
“నాటు వైద్యం చాలా ప్రమాదం, కొన్ని సార్లు ప్రాణాలు పోతాయ్ కూడా ” ఆవేదనగా అన్నాడు.
ఇంతవరకూ ఏ ప్రమాదమూ జరగలేదు, నేను కూడా అతని దగ్గరకు వెళ్లాన్శార్.
ఎందుకన్నట్టు చూశాడు.
“ కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉండేది సంవత్సరం, ఇంగ్లీష్ మందులు వాడా లాభం లేదు, సిర్రోసిస్ ఆఫ్ లివర్ అన్నారు, అప్పుడు కలిశాను.” ఏవో మూడు చూర్ణాలు ఇచ్చాడు, ఆరునెలలు వాడమన్నాడు రెండునెలలలోనే గుణం కన్పించింది, పథ్యం మాత్రం గట్టిగా ఉంటుంది సార్. అప్పటి నుండి ఇంట్లో తప్పా బయట ఎక్కడా తినను, జీవితాంతం వేపుడు వంటలు తినకూడదని చెప్పాడు.” చక చకా చెప్పుకు పోతున్నాడు.
“తాగుడు అలవాటుందా ”
“ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు లేదు సార్”
“అదే పథ్యం తీసుకొని ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గేది కదా, ఇంగ్లీష్ మందులంటే పథ్యం పాటించరు అదే సమస్య.” అతన్ని పరిశీలనగా చూశాడు, వయసు సుమారు యాబై ఉంటుంది, తలపై డెబ్బై శాతం రాలిపోయింది, బాణపొట్ట చూస్తుంటే, జబ్బు తగ్గినట్టు లేదు, పథ్యం వలన రిలీఫ్ ఇచ్చింది అంతే.
“ నేనే కాదు సిటీ నుండి కూడా చాలా మంది వస్తుంటారు”. అతను మామమూలు మనిషి కాదు సార్ అందరూ అతన్ని అడవి దేవుడంటారు.
“అతని పేరు”
“కన్నప్ప”
* * *
సమయం సాయంత్రం 4 గంటలు
వాతావరణం చల్లగా ఉంది, ఇంకా ఆత్మకూరు 10 కిలో మీటర్లు ఉందనగా జీప్ చిన్న మలుపు తిరిగింది, అక్కడ రోడ్డు ప్రక్కన ఒక టీ బడ్డీ ఉంది.
“ఆపండి టీ తాగుదాం ”
“మీరు తాగండి సార్, నేను తాగను, మెల్లగా జీప్ ఆపాడు ”
రాజగోపాల్ వళ్లు విరుచుకుంటూ దిగాడు. ఇలాంటి ప్రాంతంలో టీ తాగడం ఒక మంచి అనుభూతిలా ఉందతనికి. ఫిబ్రవరి నెల కావడంతో బాగా చలిగా ఉంది. ముఖం మీద నీరెండ పడసాగింది.
టీబడ్డీ చిన్నదే కానీ, చాలా నీట్ గా ఉంది, చెక్కబెంచ్ మీద ముగ్గురు టీ తాగుతున్నారు .
“ సార్ టీ కావాలా ? అన్నాడతను. అవునన్నట్టు తలూపాడు.
గాజు గ్లాసులో టీ డికాక్షన్ వేసి ఇచ్చాడు అతను.
ఇదేమిటన్నట్టు చూశాడు. పాలు దొరకవు సార్ అన్నాడు.
చల్లటి వాతావరణయంలో ఏదో ఒకటి వేడిగా .. అనుకున్నాడు.
ఇంతలో నలుగురు వ్యక్తులు పొడవాటి కర్రలు పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నారు.
“ఈ మధ్యన కొంతమంది పై చిరుత దాడి చేసింది, అప్పటి నుండి సాయంత్రం అయితే సింగిల్గా ఎవరూ వెళ్లరు.” ఆశ్చర్యంగా చూశాడు రాజగోపాల్.
జీపెక్కారు.
చీకటి పడకుండా చేరుకోవడం మంచిది, గొణుక్కున్నాడు.
ఊరుచేరేవరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
సార్ గెస్ట్ హౌస్ వచ్చింది మీరు ఇక్కడే ఉండాలి. రేపు ఉదయం 10 గంటలకు వస్తాను. “థాంక్స్ బండి బాలేదన్నావు కానీ కరెక్ట్ గా తీసుకొచ్చావు ఇంతకీ నీ పేరు చెప్పలేదు ”
“వీర్రాజు ”
* **
మరునాడు ఉదయం పదిగంటలకు, గెస్ట్ హౌస్ ముందు రెడీ గా ఉన్నాడు వీర్రాజు .
హడావుడిగా రెడీ అయ్యి వస్తున్నాడు రాజా గోపాల్. అతని వయసు సుమారు ముప్పై అయిదు ఉంటుంది. చామనచాయ రంగయినా చూడ్డానికి బానే ఉంటాడు. మంచిగా కనిపిస్తాడు, ఎటువంటి వాడో తెలియదు.
“వెళ్దామా వీర్రాజు ” అంటూ జీపెక్కాడు రాజగోపాల్. ఆలోచన నుండి బయటపడ్డాడు.
“దగ్గరలో మంచి హోటల్కి పదా, నిన్నటిలాంటి బడ్డీ కొట్టు వద్దు సుమా”
“ఇక్కడ దగ్గరలో రాజుగారి కాలనీ ఉంది సార్, అక్కడ మంచి హోటల్ ఉంది,అన్నీ దొరుకుతాయి.
వీర్రాజు హోటల్ బయటే ఉన్నాడు, హోటల్ లో ఏమీ తినడు. బయట ఫుడ్ మానేసి చాలా కాలం అయింది.
టిఫెన్ చాలా బాగుందంటూ బయటకు వచ్చాడు రాజగోపాల్.
“మధ్యాహ్నం అయితే బొంగులో చికెన్ కూడా దొరుకుతుంది.”
” అయితే మధ్యాహ్నం ఇక్కడకే వద్దాం, ఇప్పుడు మాత్రం కన్నప్పను కలవాలి అక్కడకు పదా ”
గిద్దలూరు వైపు బయల్దేరారు, రోడ్డు కిరువైపులా పెద్ద పెద్ద చెట్లు దగ్గర దగ్గరగా ఉండడం వలన ఎండ పెద్దగా పడడం లేదు. చుట్టూ పరిశీలిస్తున్నాడు రాజగోపాల్.
“ రాత్రి గెస్ట్ హౌస్ లో బాగా నిద్ర పట్టిందా సార్ ”
“రాత్రంతా ఒకటే గొడవగా ఉంది, వెనుక రూంలో ఎవరో కుర్ర బ్యాచ్ ఉన్నట్టున్నారు, వాళ్ళతో ఎందుకని ఊరుకున్నాను”
“సార్ ఇక్కడది మామూలే దగ్గరలో టూరిజం ప్లేస్లు, పవిత్ర దేవాలయాలు ఉండడం వలన చాలా మంది, బ్యాచ్లుగా వస్తుంటారు. ఆగాడు.
అంతే కాదు, కాకతీయ రాజులు ఇక్కడ నిధులు దాచారని కొంత మంది నమ్మకం.
“అయితే నిధులు దొరుకుతాయా ?” ఆత్రంగా అడిగాడు.
లేదు సార్, కానీ కొంత మంది దొంగ స్వామీజీలు అంజనం వేసి ఫలానా ప్రాంతాలలో గుప్తనిధులు ఉన్నాయని చెపుతారు, అది నమ్మి కొంత మంది రాత్రి పూట త్రవ్వకాలు జరిపి ఏమీ దొరక్క నిరాశతో తెల్లమొకం వేస్తారు, కొంతమన్దైతే చచ్చిపోతారు . ” ఆపాడు.
“ఎలా చచ్చిపోతారు ” అడిగాడు రాజగోపాల్.
“పాము కాటుకి” ఇక్కడ అనేక క్రూర జంతువులతోపాటూ చాలా విషసర్పాలు కూడా ఉన్నాయి, కొంత మంది స్వార్ధపరులు అడవిలో చేసే కార్యకలాపాల వలన అవి తరచుగా మనుషుల మధ్యకు వస్తుంటాయి.
మాటల్లోనే కన్నప్ప ఉన్న తండాకు చేరుకున్నారు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ