Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#24
అసలు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారి అల్లరి భరించలేని తల్లిదండ్రులును చూశాం. కానీ.. ! అంతమంది పిల్లలు ఉన్నా.. ఎంత అల్లరి చేసినా.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ఏం తెచ్చినా అందరికీ సమానంగా పంచిపెట్టి, ఇంటిని ప్రశాంతంగా, ఆనందంగా నడపటం అంటే మాటలు కాదుకదా. అమ్మమ్మ ఊరిలో అమ్మమ్మకు తాతయ్యకు ఉండే గౌరవమే వేరు. 




అలాంటిది వారి మనమలుగా అమ్మమ్మ విలువ వాళ్ళకి చిన్నప్పుడు తెలియకపోయినా.. ఒక వయసు వచ్చాక తెలియదా... ? అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు, మేనమామలు తిడతారు, తాతయ్య కోప్పడతాడు.



 ఎవరు ఎలాంటి భావోద్వేగాలు చూపించినా అమ్మమ్మ మాత్రం ప్రేమ అనే ఒకే ఒక్క ఆయుధం మనమలపై ఉపయోగిస్తుంది. 



అలాంటి అమ్మమ్మకు, ఊరికి.. వయస్సు వచ్చాక దూరం అవ్వల్సి వచ్చింది రాజుకి. కుటుంబం, పిల్లల కారణంగా దుబాయ్ లో పన్నిండేళ్ళగా పని చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో సొంత ఊరిలో బిజినెస్ చేసుకుందామని అమ్మమ్మను పదే పదే చూడ్డానికి కూడా వెళ్ళొచ్ఛని, చిన్నప్పుడు తమకు ఏది కావాలంటే అది కొనిపెట్టే అమ్మమ్మకు ఏది కావాలంటే అది కొనవచ్చని అనుకున్నాడు. 



ఎప్పుడో శుభకార్యం జరిగితే తప్ప అమ్మమ్మ ఊరు ఎరుగని వ్యక్తిలా మారాడు రాజు. ఏడాది కాలంగా అతడి ఫోన్ కూడా పని చేయని పరిస్థితి. అదృష్టం కొద్దీ అమ్మమ్మ పోయిన నాలుగు రోజుల తర్వాత ఫోన్ పని చేయటంతో హుటాహుటిన రమ్మన్న మేనమామ పిలుపుమేరకు వచ్చాడు. 



ఎప్పుడూ మేటర్ చెప్పకుండా పిలిచి ఆనందంలో ముంచ్ఛెత్తే మేనమామ ఇప్పుడు కూడా ఏదో శుభకార్యం కోసం పిలిచాడని ఉత్సాహంతో వచ్చిన రాజుకి తమను ప్రాణం కన్న ఎక్కువగా చూసే అమ్మమ్మ లేకపోవడంతో రోదించాడు. అది కూడా బతికుండగా ఒక్కసారి కూడా ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు. 



అమ్మమ్మ దగ్గర ఉంటే సున్నపుకాయలో చిల్లర పైసలు తీసుకుని కొనుక్కునే తాము ఈరోజు డబ్బులు సంపాదించే స్థానంలో ఉండి కూడా ఏనాడూ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మమ్మ లేని ఊరు రాజుకు ఎందుకో ఎడారిలా కనిపిస్తుంది. మిగతా మనుమలంతా తనవితీర ఏడ్చి అమ్మమ్మకు కన్నీటి వీడ్కోలు పలికి ఉంటారు. రాజు మాత్రం అమ్మమ్మ చివరి చూపునకు కూడా నోచుకోలేదు. 



మనుషులు దూరమయితే తప్ప కొందరు దగ్గరకు రాలేరు. వాళ్ళ పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. అమ్మమ్మ, అమ్మమ్మ ఊరంటే అందరికీ మక్కువే. అమ్మమ్మే లేకపోతే ఊరుకి విలువే ఉండదు మనుమల మనసులో. 



**** **** **** **** **** ****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - అమ్మమ్మ దవడ వాచిపోయింది నాయనోయ్ - by k3vv3 - 26-08-2025, 05:45 PM



Users browsing this thread: 1 Guest(s)