Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - శిఖండి
ఆంగి
[Image: a.jpg]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



మర్యాద అవాచీనుల సుపుత్రుడు అరిహుడు. తన తలిదండ్రుల ప్రేమాభిమానాలను అరిహుడు అమితంగా పొందాడు. అంతేగాక వారి గుణగణాలను సహితం పుణికి పుచ్చుకున్నాడు. కుల గురువు వశిష్ట మహర్షి వద్ద సమస్త విద్యలను అభ్యసించాడు. తలిదండ్రుల మాటలను అనుసరించి అభ్యసించిన విద్యల ఫలాన్ని ప్రజలకు పంచాడు. కుల గురువు వశిష్ట మహర్షి మాటలను అనుసరించి తన తపో సామర్థ్యాన్ని కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నాడు. తన తపోశక్తి తో దేవ లోకాలన్నిటిని సందర్శించి వచ్చాడు. 



తన తలిదండ్రుల మంచితనాన్ని అలుసు తీసుకుని కొందరు సామంత రాజులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని అరిహుడు గమనించాడు. 



కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం అరిహుడు విచ్చలవిడిగా ప్రవర్తించే సామంత రాజులను, అధికార మదంతో విర్రవీగేవారిని ముందుగా సున్నితంగా హెచ్చరించాడు. అతని సున్నిత హెచ్చరిక ఆంతర్యం అర్దం చేసుకుని కొందరు సామంత రాజులు, అధికారులు తమ ప్రవర్తనను మార్చుకున్నారు. మరికొందరు సామంత రాజులు, అధికారులు అరిహుని ఆగ్రహోదగ్ర హెచ్చరికను చూసి మారారు. 



 పదుల సంఖ్యలో సామంత రాజులు, అధికారులు అరిహుని సున్నిత హెచ్చరికను, ఆగ్రహోదగ్ర హెచ్చరికను అసలు పట్టించుకోలేదు. వారు అరిహుని పై యుద్దాన్ని ప్రకటించడానికి సిద్దమయ్యారు. అది తెలుసుకున్న అరిహుడు శత్రువుల కంటే ముందుగానే తను యుద్దాన్ని ప్రకటించాడు. 



యుద్దంలో అరిహుడు తండసిరి, బండనాథ, గుండుగండి వంటి రాజులను ఓడించాడు. వారిని తన దారికి తెచ్చుకున్నాడు. మహా పరాక్రమ వంతులైన తండసిరి, బండనాథ, గుండుగండిలను అరిహుడు ఓడించాడని తెలియగానే మిగతా రాజులందరూ భయంతో అరిహునికి బానిసలయ్యారు. 



అరిహుడు చుట్టుపక్కల రాజ్యాల రాజులందరిని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. యుద్దంలో తనకు తగిలిన గాయాలకు అరిహుడు రాజ వైద్యుల దగ్గర తగిన లేపనాలను తీసుకున్నాడు. సమయంలో అరిహుని తో ధన్వి అనే రాజ వైద్యుడు, ' మహారాజ! సమరంలో శత్రువుకు ఎదురుగా మహా ధైర్యం తో నిలిచిన వారి తనువుకు గాయాలు అవ్వడం సహజం. 



అలాగే సమరానంతరం చికిత్స పొందడం సహజం. అయితే ఆంగి అనే రాజ కుమార్తె తనువుకు పూసే లేపనము వలన సమరమున కరవాల దెబ్బలు తగిలిన తనువుకు గాయములు కావు. అలాంటి దివ్య ఔషదం ను తయారు చేసే విద్య ఆంగి కి ఉంది. నేను ఆమెను ఒకసారి కలిసాను. ఆమె తయారు చేసిన లేపనం చూసాను. లేపన ప్రభావం అద్భుతమనే చెప్పాలి. నేనెంత ప్రయత్నం చేసిన లేపనం తయారు చేయలేక పోయాను " అని అన్నాడు. 
 ధన్వి మాటలను విన్న అరిహుడు ఆంగి యొక్క పూర్తి సమాచారం సేకరించాడు. అలాగే ఆంగి చిత్రకి పటమును తెప్పించాడు. ఆంగి చిత్ర పటమును అరిహుడు తలిదండ్రులకు చూపించాడు. 



మర్యాద అవాచీనులు అరిహునికి పట్టాభిషేకం జరిపించారు. పట్టాభిషేక మహోత్సవానికి ఆంగి కూడ వచ్చింది. మర్యాద ఆంగి విశ్రాంతి తీసకోవడానికి ప్రత్యేక అంతఃపుర మందిరాన్ని ఏర్పాటు చేసింది. 



అరిహుని పట్టాభిషేక మహోత్సవం ముగిసిన పిమ్మట మర్యాద ఆంగిని తన కుమారుడు అరిహుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ఉద్యానవనం నకు తీసుకు వెళ్ళింది. 
 ఆంగి సువాసనలు విరజిమ్మే అరిహుని ఉద్యానవనం ను చూసింది. అక్కడి పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసి మైమరసిపోయింది. అక్కడ అనేక రకాల దేవతా వృక్షాలు ఉన్నట్లు గ్రహించింది. అక్కడి దేవతా వృక్షాల చరిత్ర గురించి ఆంగి మర్యాదను అడిగింది. 



మర్యాద ఆంగికి అక్కడి దేవతా వృక్షాలను చూపిస్తూ, తన కుమారుడు అరిహుడు వైకుంఠం లో ఏయే దేవతా వృక్షాలను తీసుకువచ్చాడో, కైలాసం లో ఏయే దేవతా వృక్షాలను తీసుకువచ్చాడో, బ్రహ్మ లోకం లో ఏయే దేవతా వృక్షాలను తీసుకువచ్చాడో వివరించి చెప్పింది. అక్కడి దేవతా వృక్షాలను చూసిన ఆంగి వాటిని ఉపయోగించి జీవాల తనూ తేజం ఎలా పెంచుకోవచ్చునో మర్యాదకు వివరించి చెప్పింది. 



మర్యాద అవాచీనులు ఆంగి తలిదండ్రులను సంప్రదించి ఆంగిని తమ కోడలిగ చేసుకోవడానికి తమ సుముఖతను చూపించారు. ఆంగి కూడ అరిహుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. 



ఆంగి అరిహుల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఆంగి అరిహులు కొంత కాలం పాటు ప్రముఖ పుణ్య క్షేత్రాలను అన్నిటిని సందర్శించి వచ్చారు. అనంతరం అరిహుడు ఆంగికి తన ఉద్యానవనం లో ప్రత్యేక మందిరాన్ని కట్టి ఇచ్చాడు. 



ఆంగి ఉద్యానవనం లోని సుర తరు దళాలను ఉపయోగించి అనేక రకాల ఔషదాలను తయారు చేసింది. ఔషదాల ప్రభావం తో తమ రాజ్యం లోని సైనికులందరు ధృడమైన శరీరం కలవారయ్యారు. కరవాల దెబ్బలను కూడా తట్టుకోగల శరీరం కలవారయ్యారు. 



 ఆంగి అరిహులకు పండంటి మగ శిశువు జన్మించాడు. అతని పేరు మహా భౌముడు. 
 
 సర్వే జనాః సుఖినోభవంతు 


 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - మర్యాద - by k3vv3 - 22-08-2025, 01:47 AM



Users browsing this thread: