Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
ఇరువురూ చేతులు బేసిన్‍లో కడుక్కున్నారు.
గౌతమి ఇరువురికీ కాఫీ గ్లాసులను అందించింది. బావామరుదులు కాఫీ త్రాగి, గౌతమికి చెప్పి, చేల వైపుకు బయలుదేరారు.
  *
అరగంటలో వారిరువురూ రంగయ్య పది ఎకరాల పంటభూమిని సమీపించారు. పదిఎకరాలు రెండుకార్లు పండుతాయి. మంచినీటి వసతి కల ప్రాంతం. భూమి మధ్యలో ఒక వేపచెట్టు, దాని చుట్టూ గుండ్రటి ఆకారంలో అరుగు, అరుగు పై నిలబడితే వారి భూమి నాలుగు వైపులా చూచుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం ఐదుగంటలకు అక్కడికి వచ్చి తన భూమి చుట్టూ ఒక ప్రదిక్షణం చేసి, అరుగుమీద కూర్చొని, ఒక గంటసేపు దైవాన్ని ధ్యానించడం రంగయ్య అలవాటు. ఒకవైపు నుంచి నేరుగా అడుగువరకూ రోడ్డు ఉంది. హద్దులమీద వారి తండ్రి బసవయ్యగారు నాటిన తాటిముట్టెలు ఇప్పుడు తాటి చెట్లుగా బాగా ఎదిగి, ఋతుధర్మ ప్రకారం ఆడచెట్లు తాటికాయలను కాస్తాయి. ఇప్పుడు ఆడచెట్లు కాయలతో వున్నాయి. చేలల్లో నీరు పెడుతున్న పాలేరు పాండు వీరిని చూచి పరుగున వారిని సమీపించాడు.



నారాయణకు తాటికాయలను చూడగానే ముంజెలు తినాలని నోరూరింది. తన బాల్యం గుర్తుకొచ్చింది.
"దండాలు బాబుగారూ!...." చేతులు జోడించాడు పాండు.



"పాండూ బాగున్నావా!... నేను గుర్తున్నానా!..." చిరునవ్వుతో అడిగాడు నారాయణమూర్తి.



"అయ్యగారూ!.... మిమ్మల్ని నేను ఎట్టా మరిచిపోయానండే. మీరు మా అయ్యగారి బామ్మర్ది కదా!..." నవ్వుతూ చెప్పాడు పాండు.
"రేయ్!..... పాండూ!...."
"బామ్మరది గారి చూపు ఎక్కడుందో నీకు తెలుసా!...." అడిగాడు రంగయ్య.



"వారి మనసులో ఏముందో నాకేం తెలుసయ్యా!..." విచారంగా చెప్పాడు పాండు.
రంగయ్య వేలితో తాటిచెట్లను చూపించాడు.
".... తాటికాయలా!...." నవ్వుతూ అన్నాడు పాండు.



"అవును పాండూ! ముంజలను తినాలని వుంది!...." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు నారాయణమూర్తి.






"ఓస్ అంతేకదా!... మీరు అరుగుమీద కూసోండి సామీ... నేను చెట్టు ఎక్కి ఒక గెలను తీసుకొస్తా..." వేగంగా పాండు తాటిచెట్ల వైపుకు నడిచాడు.
అరగంట లోపల ఒక తాటి గెలతో అరుగున సమీపించాడు
దాదాపు ఇరవై కాయలున్నాయి గెలలో. 
కత్తితో కోసి తాటికాయలను నారాయణకు, రంగయ్యకు అందించాడు పాండు.



ఇరువురూ తలా ఐదు కాయలలోని ముంజలను బొటనవేలితో తీసుకొన్నారు. పాండూ మిగతా కాయలను చివ్వి ముంజలను తీసి తాటి ఆకు మూగంలో వేసి కట్టాడు.
"అయ్యా!.... ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మగారికి ఇవ్వండి" ప్రీతిగా చెప్పాడు.



"అలాగే పాండూ!..." అన్నాడు రంగయ్య.
పాండూ తన పనికి వెళ్ళిపోయాడు.



"బావా!.... ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం పైరుగాలి అమెరికాలో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా దొరకదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్వగా ఉంది బావా!.... నీవు చాలా అదృష్టవంతుడివి." అభిమానపూర్వక అభినందనలను తెలియజేశాడు నారాయణమూర్తి.



"..... నారాయణా!... ప్రాప్తాప్రాప్తాలు దైవాదీనం. మన తల వ్రాతను వ్రాసి సర్వేశ్వరుడు మనలను భూమి మీదకు పంపాడు. మన జీవితం, మనలలాట లిఖిత ప్రకారమే సాగుతుంది. నీకు సర్వేశ్వరులు నిర్దేశించింది అమెరికా. నాకు ఏర్పరచింది పల్లెటూరు. ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకొనవలసింది, మనకు వున్నా దానితో సంతృప్తి చెందడం. అత్యాసకు దూరంగా వుండటం. నారాయణా!... ఏదో కాలంలో బియ్యేదాకా చదివించాడు మా నాన్నగారు. వారు నాకు నేర్పిన విషయాలను నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. మనకు లేనిదాన్ని గురించి ఎప్పుడూ విచారపడకూడదు. వున్నాదాంతో తృప్తి చెందాలి. మన చుట్టూ వున్నవారిని అభిమానించాలి. నేను నా జీవితగమనంలో పాటించేవి ఆరు సూత్రాలు.



ఒకటి:- దైవం మీద నమ్మకం. ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక అరగంట దైవాన్ని ధ్యానించడం నాకు నచ్చిన పేరుతో, జగత్ రక్షకులను శతకోటి నామాలు. అది నీకూ తెలిసిన విషయమే!....



రెండు:- సదా సత్యాన్ని పలకడం. అబద్ధాన్ని నీ మాటల్లో దరికి చేరనీయకుండా వుండడం. అటువంటి వారి సాంగత్యాన్ని (అబద్ధాలు చెప్పేవారి) వదలడం. ధర్మాన్ని ద్వేషించకూడదు పాటించడం (కర్తవ్యాన్ని) గిట్టని వారిని అభిమానించడం. 



మూడు :- క్రమం తప్పకుండా ఉదయాన్నే ఐదుగంటలకు లేచి వ్యాయామం చేయడం, జాగింగ్, ఆసనాలు, ప్రాణాయామం, క్రమబద్ధంగా చేయడం.



నాలుగు :- ఆహార విషయంలో మితం అన్నది చాలా ముఖ్యం. రుచిగా వుందని అతిగా భోజనం చేయడం అనారోగ్యానికి దారి తీస్తుంది. శరీరంలోని రకరకాల వ్యాధుల మూలం మన ఆహారపు అలవాట్లు. ఉత్తమమైనది శాకాహారం.






ఐదు :- నీకు వున్నంతలో పేదవారికి నీ ఆశ్రయితులకు దానం చేస్తూ సర్వేశ్వరార్పణమస్తు, అనుకొంటూ చిరునవ్వుతో హృదయపూర్వకంగా చేయడం. మనం చేసే దానం, ప్రతిఫలాపేక్షారహితంగా వుండాలి.



ఆరు:- మనకంటే పెద్దలను, పసిపిల్లలను, గురువులను, బంధుమిత్రులను, ప్రేమతో అభిమానించడం, గౌరవించడం. మనకు కీడు చేసినవారికి మనం చేయగలిగిన మేలు చేయడం.... సుమతీ శతకకర్త యోగి వేమన వ్రాశారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి (గొప్పవాడు) సుమతీ!.... 
దీన్ని నీవు నీ బాల్యంలో చదివి వుంటావు." 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మనవ(వా)డు - by k3vv3 - 19-08-2025, 04:21 PM



Users browsing this thread: 1 Guest(s)