Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
 "అమ్మా సుశ్రవస.. నీ ఆలోచన దివ్యంగా ఉంది. అవాచీనుని పెళ్ళి విషయంలో నేనే పెళ్ళి పెద్దను అవుతాను సుశ్రవసతో అన్నాడు వశిష్ట మహర్షి. 



 సుశ్రవస జయత్సేనుని వద్ద సెలవు తీసుకున్న వశిష్ట మహర్షి విదర్భ రాజ్యానికి వెళ్లాడు. రాజ్యం లోని ప్రజలందరూ వశిష్ట మహర్షి ని సాదరంగా ఆహ్వానించారు. వారికి సద్గుణం మర్యాద వలన వచ్చిందని పదుగురు చెప్పగా వశిష్ట మహర్షి విన్నాడు. విదర్భ రాజు వశిష్ట మహర్షి ని ఉచిత ఆసనం ఇచ్చి తగిన విధంగా సత్కరించాడు. 



 అనంతరం విదర్భ రాజు తన సోదరి సుశ్రవస యోగ క్షేమాల గురించి వశిష్ట మహర్షి ని అడిగి తెలుసుకున్నాడు. తన కుమార్తె మర్యాద యాగశాల ల్లో మహర్షులకు చేస్తున్న సేవలను రాజు వశిష్ట మహర్షి కి ప్రత్యక్షంగా చూపించాడు. 



 మహర్షులకు మర్యాద చేసే మర్యాదలు వశిష్ట మహర్షి ని బాగా ఆకర్షించాయి. అవాచీనునికి తగిన భార్య మర్యాద యే అని వశిష్ట మహర్షి మనసులో అనుకున్నాడు. తను వచ్చిన విషయాన్ని వశిష్ట మహర్షి విదర్భ రాజు కు చెప్పాడు. తన మనసులోని కోరిక అదే అవ్వడంతో విదర్భ రాజు మిక్కిలి సంతోషించాడు. 



 తన తండ్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్న మర్యాద వశిష్ట మహర్షి ని తగిన విధంగా సత్కరించింది. అనంతరం "మహర్షోత్తమ! రాజ్యం లో రాజూ, రాణీ అలాగే ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. రాజ్యాభివృద్ధికి సిరిసంపదలు ఎంత ముఖ్యమో మంచి మర్యాద తెలిసిన రాజు రాణి ప్రజలకు అంత ముఖ్యం. కొండంత బంగారం కన్నా కూసింత మర్యాద మిన్న. ప్రజలు ఉన్నవాడిని ముఖం ముందు పొగిడితే మంచి మర్యాద తెలిసిన వాడిని అన్నిచోట్ల పొగుడుతారు. 



అలాగని పరుల పొగడ్తల నిమిత్తం మంచి మర్యాదలు ఉన్నట్లు నటించ రాదు. మంచి మర్యాదలు అనేవి మనసు నుంచి పుట్టాలి కానీ ఆడంబరం నుంచి పుట్ట రాదు. ఇది నాకు అలవడిన గుణం" అని మర్యాద వశిష్ట మహర్షి తో అంది. 



 మర్యాద మనస్తత్వం తెలుసుకున్న వశిష్ట మహర్షి పెద్దలందరితో సంప్రదింపులు జరిపి మర్యాద అవాచీనుల వివాహం జరిపించాడు. 



 మర్యాద తన భర్త అవాచీనుని మనస్తత్వం గ్రహించింది. ప్రజల దగ్గర, సామంత రాజుల దగ్గర, అధికారుల దగ్గర, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో మర్యాద తన భర్త అవాచీనునికి దగ్గర ఉండి నేర్పించింది. 



 తన భార్య మర్యాద ఆచరించి చూపించే సమస్త కార్యక్రమాలు అవాచీనునికి బాగా నచ్చాయి. మర్యాద ప్రజలను ఆదరించే తీరు అవాచీనునికి బాగా నచ్చింది. 
ఒకసారి రాజ్యంలోని అధిక శాతం మంది మనుషులకు అంటు వ్యాధులు సోకాయి. అప్పుడు మర్యాద ప్రజల అంటు వ్యాధులను రూపుమాపేందుకు ముందడుగు వేసింది. 



అప్పుడు ఆమెకు హిమాలయ పర్వతాలలో ఉన్న సురదళాలు అవసరమయ్యాయి. అదే విషయాన్ని మర్యాద తన భర్త అవాచీనునికి చెప్పింది. అవాచీనుడు గాలి కంటే వేగంగా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడి సుర దళాలను తీసుకుని వచ్చి మర్యాదకు ఇచ్చాడు. మర్యాద సురదళాలతో ప్రజల అంటు వ్యాధులను నయం చేసింది. ప్రజలందరూ మర్యాద అవాచీనులను దైవాలకన్నా మిన్నగా చూసారు. 
 సుశ్రవస, జయత్సేనుడు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న అవాచీనునికి పట్టాభిషేకం చేసారు. 
 మర్యాద అవాచీనుల సంతానం అరిహుడు.
[font="var(--ricos-font-family,unset)", serif] [/font]
 సర్వే జనాః సుఖినోభవంతు 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - సప్త చిరంజీవులు - by k3vv3 - 10-08-2025, 02:11 AM



Users browsing this thread: 1 Guest(s)