Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
ఆన్లైన్ లో పెళ్లి సంబంధాలు చూసే నెపంతో శకుంతల నీ ల్యాప్ టాప్ లో నేను కూడా కొంచెం ఏదైనా రాసుకునేట్టు, ఈజీ గా జమా, ఖర్చులు వేసుకునేట్లు  నేర్పించరా.”  



సఖీ.. నీ ఫోన్ లో అన్నీ సదుపాయాలు వున్నై, ఓపిగ్గా చూడు.



రోజంతా ఖాళీగా వుండే నీ ల్యాప్ టాప్ ను నేను వాడొద్దా? నాకు నువ్వే నేర్పించాలి.. అంతే. పట్టుదలకు మారుపేరు నాయనమ్మ అనుకొని వర్డ్, ఎక్సెల్ నేర్పించాడు. 



శకుంతలకు సోషల్ మీడియా ఎంతో లాభదాయకంగా వుంది. జీమెల్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో చురుకుగా వుంటూ ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరో తో సంప్రదించి  రుద్ర ప్రొఫైల్ పెట్టింది.  వారంలో ఎక్సెల్ షీట్లో తనకు అన్ని విధాల నచ్చిన అమ్మాయిల డాటా తయారు చేసింది. 
నువ్వు ఏదో గొప్ప పని చేస్తావని అనుకున్నా సఖీ, మొత్తానికి అమ్మాయిల డేటానా!? అంటూ కొంత సంతోషం, మరికొంత ఆశ్చర్యం వ్యక్తపరిచాడు మనవడు. 
ఇది గొప్పను మించిన పని, లేకుంటే నీకు పెళ్లీడు వచ్చిన సంగతి నీకు తెలియక పోయినా నాకు తెల్సు, ఎందుకంటే నాకు ముచ్చటైన మనవరాలు కావాలి.
అయితే ఒప్పుకుంటున్నవా, నువ్వు సీనియర్ సిటిజన్ అని. బుజాలు కుదుపుతూ అడిగాడు. 
ఆఫ్ కోర్స్! నువ్వు కూడా నా మనోబలాన్ని కాదనలేవు.
దగ్గరుండి అమ్మాయిల డేటాను రుద్ర చేత షార్ట్ లిస్ట్  చేయించింది. అంత పెద్ద జాబితాలో ఓకే అనుకున్న ఐదుగురికి ఇంట్రెస్ట్ పంపించింది. తిరుగుటపాలో జవాబులతో పాటు వీడియో కాల్ చేశారు.  అందరూ బాగానే ఉన్నట్టు తోచింది. కొడుకు విడాకుల సంగతి  విషయం చెప్పక, ఫారిన్ లో సెటిల్ అయ్యారని అబద్ధం చెప్పింది.  
చాలా సంతోషం, మరి పెళ్లి కుదిరితే మా అమ్మాయి మీ మనవడు కూడా ఫారిన్ లో సెటిల్ అయ్యేట్టు ప్లాన్ ఉంటే; అర్జెంట్ గా పెళ్లి జరిపిద్దాం, కట్నం కూడా మీ రేంజ్ లో ఇచ్చేందుకు మేము రెఢీ! అన్న ముగ్గుర్ని డిలీట్ చేయగా ఇద్దరు మిగిలారు. 
మన దేశంలో ఏం తక్కువైంది? మనుషులకు ఫారిన్ పిచ్చి పోదా?? 
ఉన్నది సరిపోదు! లేనిది కావాలి!! 
***
నేను మా మనవడు వచ్చి అమ్మాయిని చూస్తాము, మీ అనుకూలమైన డేట్, టైమ్ చెప్పండి? అని ఫోన్ చేసినా, జవాబు రాలేదు. ఎదురు చూస్తున్నాం. అని వాట్సప్ రిమైండర్ పెట్టింది.  మిగిలిని ఇద్దరిలో రుద్రకు అంత్యంత నచ్చిన అమ్మాయి చెంగల్వ’  తల్లి జవాబు మెయిల్ చేసింది. 
శకుంతల గార్కి నమస్కారం, మీరు అబ్బాయిని అన్నీ అయి; అంటే ఏకచత్రాధిపత్యం వహిస్తూ పెంచారు, బాగానే వుంది. కానీ శుభమా అని మీరు మా అమ్మాయిని చూడడానికి వస్తే ముత్తైదువలతో రాగలరు. మీరు పెద్దవారు అర్థం చేసుకొని ఉంటారు. ఇది మన పద్దతుల భాగమని తెలియ చేస్తున్నాం. అంతే, పొరపాటుగా అనుకోకండి. 
చదివిన శకుంతల నిట్టూర్చింది. కానీ రుద్ర రౌద్ర రూపం దాల్చి, ముత్తైదువ కావాలా? మా సఖి అందమైన మనసు మూర్ఖులకు తెలియదు. అంటూ తాండవం చేశాడు.   
మిగిలిన అమ్మాయి సన్నిహిత పెద్దలకు రాబోయే ఆదివారం మేము వస్తున్నాం అంటూ రుద్ర దుర్ముహూర్తం, యమగండం మొదలగు వాటిని ఖాతరుచేయక  చెప్పేశాడు. 
మనుషులు ఎంత పురోగమనం వైపు నడిచినా, నమ్మకాలకు దూరంగా; మూఢనమ్మకాలకు దగ్గరగానే ఉంటారు, కానీ మారాలి అని ప్రయత్నించరు.   
శకుంతల కొడుకును గూగుల్, ఫేస్ బుక్ లో వెతికి చాటింగ్ చేసి ఫోన్, ఈమెయిల్ ఐడి వివరాలు తెలుసుకొని తానిచ్చిన టెస్టింగ్ మెయిల్ సమాధానం భద్రపరచుకుంది. చిక్కుముడి చివర్లు పట్టుకుంది.
***
సిటీ ఎంత మార్పు చెందినా, ఇరుకు సందులు విశాలం కాలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రజలు. అక్కడ నివాసమున్న వారు అలవాటు పడ్డారేమో కానీ కొత్తగా ప్రవేశించిన వారికి తిప్పలు తప్పవు. అవస్థ పడుతూ, ఇరుకైన మెట్లు ఎక్కి సన్నిహిత ఇల్లు చేరుకున్నారు.  వీధులే కావు, ఇల్లు కూడా చాలా ఇరుగ్గా వుంది. 
పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని వెనకటికి వర్ణించిన అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చుంది. సన్నిహితను చూసి పరస్పరం బావుందని కళ్ళ భావనలతో ప్రకటించుకున్నారు.  అదే పనిగా గమనిస్తున్న సన్నిహిత తమ్ముడు వీరి కళ్ళ భాషను పసిగట్టి, ఫలహారాలు, జూస్ తెచ్చాడు. 
అమ్మాయి ముఖంలో అనిర్వచనీయమైన నాజూకుతనం, చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే కళ గల అందం!  
ఏమైనా మాట్లాడమ్మా. అంది శకుంతల. సన్నిహిత రెండోసారి రుద్ర వంక చూసింది.  రుద్ర చూపు మరల్చు కున్నాడు.  
నాకు వంట రాదు. సన్నిహిత ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పింది, కాదు, అబద్ధం చెప్పింది. 
తెల్లటి శరీరఛాయతో, ఖరీదైన బట్టల్లో ఆరోగ్యంగా కన్పిస్తున్న రుద్రను సంబోధిస్తూ బాబు, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు. అమ్మాయి తల్లి భగవతి అంది.
నాకు మీ అమ్మాయి నచ్చింది, నేను నచ్చానో లేదో తెలుస్కోవచ్చా?
జవాబు రాలేదు. నోరు తీపి చేసుకోండి. అంటూ భగవతి స్వీట్ అందించింది. 
సన్నిహిత  గబుక్కున ప్లీజ్.. తినకండి, అమ్మ అలాగే అంటుంది. అతికితే గతక దంటారు, అందుకని మీరు ఏమీ తినొద్దు.”  చెప్పకనే తన సమ్మతిని తెలియజేసింది.
మూఢాచారాలకు నేను దూరం. అని రుద్ర స్వీట్, ఖారా తిన్నాడు.  శకుంతల జూస్ తీసుకుంది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:20 PM



Users browsing this thread: 1 Guest(s)