Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
మనవ(వా)డు
రచనసురేఖ పులి

సఖీ అని ముద్దుగా శకుంతల ముద్దుల మనవడు పిలుస్తాడు.  పిలుపు ఇద్దరికీ సఖ్యతగా వుంది. 



రూపేష్, రక్షిత ప్రేమించి, పెద్దలను ఎదిరించి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు.  సంవత్సరంలోపే బాబు పుట్టాడు. అంతే,  పసివాడ్ని చూడగానే స్వర్గాన్ని భూమ్మీద చూశారు. పెళ్లికి అభ్యంతరాలు చెప్పిన పెద్దలందరి సంతోషాలకు హద్దుల్లేవు. బుజ్జి బాబును దేవుడితో పోల్చాలి? వీరుడితో సమానం? హు.. ఎవ్వరూ సరిపోరు!  



రుద్ర పేరుతో నామకరణ జరిగింది. మెటర్నిటీ సెలవు అయిపోయిందని,  యదావిధిగా ఆఫీసు పనిలో నిమగ్నమైన జంటకు తంటాలు మొదలైనాయి.



తన్నుకోవడం ఒక్కటే  తక్కువైంది. శకుంతల కొడుక్కి-కోడల్కి ఎంతో నచ్చ చెప్పింది. మొండి పట్టుదల! ఈగో!!  గోనో.. విదేశాల ఆకర్షణో.. విడాకులతో చెరో చోటుకు గో అయ్యారు.  



రుద్రుడ్ని హృదయానికి హత్తుకుంది శకుంతల.  



***



కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ సంపాదించి, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ గా వున్న శకుంతలకు అన్ని హంగులతో పెళ్లి చేశారు పెద్దలు.  రూపేష్ కడుపులో ప్రాణం పోసుకుంటున్న సమయంలో తండ్రి ఆయువు పూర్తి అయింది.    



పరమశివుడే కాదు, ఎందరో శకుంతల వంటి అభాగినుల కంఠంలో విషాన్ని ఇముడ్చుకొని జీవితాలు సాగిస్తున్నారు.  



ఒంటరి అయినా రుద్రుడి పెంకం ఒక మహత్తర మలుపు, అదొక అదృష్టంగా ఆమోదించుకున్న స్త్రీకి మానసిక, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు గోరంతలు. 



ఉద్యోగంలో స్థిరపడిన ఆనందంలో సఖీ, ఇప్పుడంతా కాష్ లెస్ షాపింగ్, అందుకే నీకో గిఫ్ట్ అని ఖరీదైన ఆండ్రాయిడ్  ఫోన్ ఇచ్చాడు.”  వద్దు-కద్దు అనక, వాడుక అలవాటు చేసుకున్నది.    



ఇప్పుడు సర్దు బాటుగా వుంది కదా, పనిమనిషిని పెట్టుకుందామా సఖీ?” 



ఓటరైడి, ఆధార్ కార్డు లెక్కల్లోనే సీనియర్ సిటిజన్ను, నేనింకా పడుచు సఖీనే రా! అని కొట్టి పారేసింది.  



నీ శక్తికి కారణం ఏంటి, చవన్ ప్రాస్, బూస్ట్  ఆర్ ఎనీ అదర్ సీక్రెట్? రుద్ర నవ్వుతూ అన్నాడు. 



నిన్ను క్రమశిక్షణతో పెంచే క్రమంలో నన్ను నేను మరచి పోవడం. వాస్తవాన్ని చెప్పింది. 



అడగకూడని మాట అడుగుతున్నా.. జవాబు దాటేయోద్దూ..



నువ్వు అడగబోయే విషయం నాకు తెల్సు.. అయినా అడుగు.. మనవడి తలకు గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేస్తూ అంది.



ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నా,  అన్ని విషయాల్లో నీకు నా పెంపకంలో విసుగు లేదు. మరి నీ కొడుకు, కోడలు నా పట్ల ఎందుకింత బాధ్యతారహితంగా వున్నారు.



రుద్రా.. ఇప్పటికే ప్రశ్న వంద సార్లు అడిగావు, ఇదే చివరి సారి చెపుతున్నా  నా కొడుకు, కోడలు అంటున్నావే కానీ, నా తల్లిదండ్రులు అనలేక పోతున్నావు, ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తల గానే కాదు  అసమర్థ తల్లిదండ్రులు కూడా! బాధ్యతలను ఎదుర్కోలేని పిరికివాళ్ళు. ఇప్పుడు మనం బాగానే వున్నాం కదా, వాళ్ళ టాపిక్ ఎందుకు?



మారు మాట్లాడలేదు, నాయనమ్మకు చిరాకు తెప్పించే మాటలు ఇక మానేశాడు. 



***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆత్మవిశ్వాసం - by k3vv3 - 07-08-2025, 04:18 PM



Users browsing this thread: 1 Guest(s)