Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#21
''మనవరాలు ఝాన్సీ తల్లి.. నా ముద్దుల మనవరాల.. అమ్మ.. తల్లి.. మన పెద్ద కుటుంబంలో నువ్వే ఆఖరి పెళ్లికూతురు. నేను ఒక మాట అడుగుతాను మొత్తం 50 మంది ఆడవాళ్లు చుట్టూరు ఉన్నారు కదా మన కుటుంబంలోని వాళ్ళు.. వీళ్ళందరూ ఎదురుగా మాత్రం సిగ్గుపడకుండా చెప్పాలి.. అదేరా.. అదే నీకు పెళ్ళికొడుకు నచ్చాడా.. '' అంటూ అడిగింది. 



అమ్మాయి ఏం సమాధానం చెబుతుందో అని అందరూ చుట్టూ చేరి ఆత్రుతగా వింటుండగా ఝాన్సీ రాణి అమ్మమ్మకు బాగా దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పకుండా చెయ్యి పైకి ఎత్తి బాగా లాగి ఒక చెంప కాయ కొట్టింది. 



''చంపేస్తుంది బాబోయ్ నా మనవరాలు చంపేస్తుంది రండి బాబోయ్ '' అంటూ గట్టిగా కేకలు పెట్టింది వరాలమ్మ. 



ఆకాశంలో సడన్గా కారు మేఘాలు కమ్ముకున్నట్టు ఆడవాళ్లు తాలూకా మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లోంచి వర్షాకాలంలో కప్పల వలె బిలబిల మంటూ వచ్చేసి ఝాన్సీరాణి చేసిన పనిని గ్రహించి వాళ్ళ వాళ్ళ పెళ్ళాం ఎక్కడ ఉన్నారో చూసుకుని వాళ్ళ వెనకాతలే వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి మరి నిలబడ్డారు.. అప్పుడు మండువా లోగిలి లో అక్కడ పెద్ద తిరునాళ్లు జరుగుతున్నట్టుగా ఉంది వాతావరణo. 



''నిండా 20 ఏళ్లు లేవు ఎంత పని చేసింది''



''వయసులో పెద్దది.. అమ్మమ్మ అని ఆలోచించాలి కదా. ముసలావిడ దవడ మీద లాగిపెట్టి లెంప కాయ కొడుతుందా?''



''అలా కొట్టడానికి కుర్ర పిల్లకు ఎన్ని గుండెలు?''



''ఇప్పుడు పోనీలే కదా అని ఊరుకున్నాం అనుకో రేపొద్దున మన ఆడవాళ్ళను కూడా ఇలాగే కొడు తుంది'''



''అందుకనే దీనిని మూల గదిలో పెట్టి మనందరం కలిసి చితగ్గొట్టేద్దాం''



''ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు ఎలాంటి వాళ్ళని బట్టే'''



ఇలా.. కన్న తండ్రి, బాబాయిలు, మావయ్యలు, పెద నాన్నలు సహా అక్కడ వచ్చి చేరిన మగరాయుళ్లందరూ ఎవరికి తోచిన కసిని వాళ్ళు వెళ్ళగక్కేస్తున్నారు. 



''ఏమ్మా, అమ్మమ్మను అసలు అలా దవడ మీద లెంపకాయ ఎందుకు కొట్టావు చెప్పు. అందరూ కోప పడుతున్నారు కదా ఎందుకు కొట్టాలనిపించింది నీకు చెప్పు'' అంటూ ముందుకు వచ్చి కూతుర్ని నిలదీసింది ఝాన్సీరాణి తల్లి. 



ఝాన్సీరాణి తలదించుకోకుండా తలపైకెత్తి వీరనారిలా ఇలా చెప్పింది.. 



''ఊరుకుంటానా.. చెప్తా వివరంగా.. చెప్తా వినండి. నా మీద కేకలు పెట్టిన ఇక్కడ ఉన్న మగాళ్ళ అందరి నోళ్లు మూయిస్తా. ఆడవాళ్ళ నోళ్లు కూడా మూయిస్తా.. ఇక్కడ పెళ్లయిన నాకు పిన్ని వరస అమ్మలు, వాళ్ల కూతుర్లు, పెళ్లి అయిన పెద్దమ్మలు పెద్దమ్మ కూతుళ్లు 25 మంది వరకు ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కరైనా వాళ్ల పెళ్లి చూపుల సమయంలో కాబోయే మొగుడిని తల పైకెత్తి ముందుగా చూశారా లేదా చెప్పండి. 



ముందుగా పెళ్లి అయిపోయినవాళ్ళు తర్వాత పెళ్లి కావలసిన వాళ్లను నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చోపెడుతూ ఏమనేవారు.. వచ్చిన సంబంధం బాగానే ఉంది.. బాగానే ఉంది పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు.. బాగానే ఉన్నాడు.. అని మీలో మీరే అనేసుకుంటూ నిర్ణయాలు మీరే తీసేసుకుంటూ పెళ్లికా బోతున్న ఆడపిల్ల మనసును ఏమాత్రం తెలుసుకో కుండా పెళ్లిళ్లు చేసి పడేశారు. 



మన ఖర్మ కాలి మన మొగుళ్ళు ఇలాంటి వాళ్ళు దొరికారు అని మీలో మీరే అప్పుడప్పుడు అనుకుంటుంటే నేను చాటుకుంటా చాలాసార్లు విన్నాను. అలా మీరు మొగుళ్లను పెళ్లి చూపుల్లో చూడకపోయినా పెద్దలను ఎదిరించలేక ముసలావిడకు భయపడి, సిగ్గుపడుతూ తిరిగి మాట చెప్పలేక ఎలాగోలా పెళ్లిళ్లు చేసుకుని తగలడ్డారు. మీకు నిజంగా పెళ్లి అయిన వాడు నచ్చకపోయినా కొన్నాళ్లు బాధలు పడి కర్మలు అనుభవించి అయి ష్టంగా ఎలాగో మొగుళ్ళతో సెట్ అయిపోతున్నారు. పైగా వెధవ బోడి నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ అచ్చొచ్చిందట. 



ఇన్నాళ్లు అలా జరిగాక.. పిచ్చి సాంప్రదాయం అలాగే నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెళ్లి చూపుల్లో నాకు కాబోయే మొగుడుని తల పైకెత్తి చూస్తానని ముసలిది ఎలా అనుకుంది. నీకు మొగుడు నచ్చాడా.. అని.. ఎలా ప్రశ్నించిందీ అంట. అందుకే ఒళ్ళు మండి కోపం వచ్చి అమ్మమ్మ అని చూడకుండా దాని దవడ మీద లాగి లెంపకాయ కొట్టాను.. తప్పా. మా అమ్మమ్మ కదా నా ఇష్టం. '' అంది ఝాన్సీరాణి వీరనారిలాగున. 



ధనాధన్ అంతే.. ఇంచుమించు అక్కడ ఉన్న ఆడం గులు అంతా అదే బాధకు లోనయి తమ తమ మొగు ళ్ళ అష్ట వంకరలని మననం చేసుకుంటూ.. తమతమ మొగుళ్ళ వంక చిరాకుగా, అసహ్యంగా చూస్తూ.. 



''అవును.. మన ఝాన్సీ రాణి చెప్పింది నిజమే. మొగుళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నామురా బాబు'' అని తమలో తమ గొనుక్కుంటూ.. సరైన మొగుళ్ళని సెలెక్ట్ చేసుకోలేకపోయామే అని నెత్తి బాదుకుంటూ గతం గుర్తుకు తెచ్చుకుంటున్నారు.. పాపం.. 



''లాగి పెట్టి కొడితే కొట్టింది కానీ మన ఆడజాతి హృదయ బాధను విప్పి చెప్పింది మన చిట్టి ఝాన్సీరాణి అనుకుంటూ మిగిలిన ఆడంగులు అంతా ఝాన్సీరాణి ని మనసారా అభినందించి ముద్దు పెట్టుకున్నారు. 



ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మగరాయుళ్లంతా తోక ముడుచుకుంటూ జారుకున్నారు. 



*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - బామ్మ వైరల్ అయ్యిందొచ్(బుడుగు) - by k3vv3 - 06-08-2025, 05:48 PM



Users browsing this thread: 1 Guest(s)