Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#20
అమ్మమ్మ దవడ వాచిపోయింది నాయనోయ్
[Image: image-2025-08-06-131440482.png]
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు



వరాలమ్మకు 90 ఏళ్ళు. బుగ్గలు ఏమాత్రం ఒడిలి పోలేదు. శరీరం ముడతలు పడలేదు. తలలో వెంట్రుకలు కూడా అక్కడక్కడ మాత్రమే తెల్లగా ఉన్నాయి. నడుము నొప్పి అసలే తెలియదు ఆవిడకు. కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చెప్పాలంటే జాంపండులాగా ఉంది. 



వాళ్ళ ఆయన రంగనాథం అయితే దబ్బపండు లాగే ఉంటాడు. వాళ్లది చాలా పెద్ద కుటుంబం. వరాలమ్మ కు చెల్లెళ్ళు ముగ్గురు. వాళ్లు ఒక్కొక్కళ్ళకి ఇద్దరేసి కూతుళ్ళు. కూతుర్లకు కూడా పెళ్లిళ్లు అయి పోయాయి. అంతా పనసపండులా బంగిడిపల్లి మామిడి పండ్లు లా ఉంటారు. 



వరాలమ్మకు కూతుర్లు నలుగురు. వీళ్ళందరికీ కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్ల పిల్లలు అంటే వరాలమ్మ మనవరాళ్ళు పదిమంది. ఆడపిల్లలకు అందరకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి కానీ చివరి నాలుగో కూతురు కూతురు ఒక్కతే మిగిలిపోయింది పెళ్లికి.. వరాలమ్మ రంగనాథం దంపతుల మండుగా లోగిలి ఇంట్లో. 



పెళ్ళికాని పిల్ల పేరు ఝాన్సీరాణి. పేరు ఇదేదో అదేదో లాగా ఉంది వద్దు అనుకున్నారు కానీ అదేదో ఇదేదో గొప్పగా ఉంది అన్నట్టు చివరికి ఆపేరే పెట్టేశారు. అమ్మాయికి ఈరోజు ఉదయమే పెళ్లి సంబంధం వస్తుంది. జొన్నాడ ఉంగరాల వారు సంబంధం అది. బాగా డబ్బున్న వాళ్ళు. అబ్బాయి రావులపాలెం అరటి పళ్ళ గెలల హోల్సేల్ బిజినెస్. 



సరే.. రెండు గంటలకు రెండు కార్ల మీద వచ్చారు వాళ్ళందరూ. వచ్చిన వెంటనే వాళ్లకు స్వాగతం పలికి మండువా లోగిలి లోపలకి తీసుకువచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టి మంచి చెడ్డలు అన్ని మాట్లాడుతూ ఫలహారాలు కూడా పెట్టారు. వాళ్లు కోరిన మీదట తన గది లో పెళ్లికూతురు అలంకరణ చేసుకుని కూర్చుని ఉన్న ఝాన్సీరాణిని తీసుకొచ్చి పాతకాలం నాటి నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చో బెట్టారు. అందుకు కారణం లేకపోలేదు మండువా లోగిలిలో ఆకుర్చీ మీద పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతి అమ్మాయికి మొదటి పెళ్లి చూపుల సంబంధమే కుదిరిపోయేది. అదిగదన్నమాట అసలు విషయం. 



ఝాన్సీ రాణి తలదించుకుని ఉంది సిగ్గుపడుతూ.. అమ్మాయికి తన వాళ్ళందరూ నిన్న ఇచ్చిన ట్రైనింగ్ గుర్తుకు వస్తుంది.. అలాఅలా. 



''ఇదిగో తల ఎత్తి చూసి ఎవరిని తల తిక్కగా ప్రశ్నలు వేయమాకు. మగవాళ్లు కనక వాళ్లు సవాలక్ష ప్రశ్నలు వేయవచ్చు. నువ్వు తలవంచుకునే సమాధానం చెప్పాలి. అప్పుడు నిన్ను సాంప్రదాయానికి చెందిన అమ్మాయి అంటారు. లేదంటే నీ మొఖాన మా అందరి ముఖాన ఇంత ఉమ్మి వేసి వెళ్ళి పోతారు. మేము మళ్లీ ఇంకొక సంబంధం చూడాలి అది కాకపోతే ఇంకొకటి.. ఇంకొకటి. అన్ని బాధలు పడలేము. 



మన ఇంట్లో మొత్తం 25 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు మండువా లోగిలిలోనే టేకు చెక్క కుర్చీ తోనే పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేశాము. అందరికీ కూడా మొదటి సంబంధం మొదటి సిట్టింగ్ లోనే కుదిరిపోయింది. నీకు కూడా తెలుసు కదా. విధానం మనకు వార్షికంగా వస్తూ ఉంది. 



ఏదో కాస్తంత చదువుకున్నావని ఎక్కువ చేసావ్ అనుకో నీకు జన్మకు పెళ్లి అవ్వదు.. మేము మరో సంబంధం చూసి వాళ్లు వచ్చినప్పుడు వాళ్ళను గౌరవించడం మళ్ళీ అక్కడికి వెళ్లి వాళ్ళ స్థితిగతులు చూడడం ఇలా రకరకాల సంబంధాల కోసం ప్రయత్నిస్తూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఈరోజుల్లో అసలే కష్టం. వయసు పైబడి ఉన్నామేమో మాకు ఓపికలు ఏమీ లేవు. ''



అంటూ నిన్న ఉదయం నుండి ఇంట్లో ఉన్న మధ్య తలకాయలు చిన్న తలకాయలు బుల్లి తల తల కాయలు ఝాన్సీరాణి కి ఈరోజు మగ పెళ్లివారు వచ్చే వరకు నూరి పోస్తూనే ఉన్నారు.. అదంతా నోటితో కాకుండా బుర్రతో నెమరు వేసుకుంటూ అలా కూర్చునే ఉంది తలవంచుకొని ఝాన్సీరాణి మగపెళ్లి వారి ముందు. 



మాటలు అన్నీ గుర్తుకు వచ్చి తల పైకి ఎత్తితే ఏం జరుగుతుందో అని భయపడి తల పైకి ఎత్తకుండా అలాగే ఉండిపోయింది. 



వచ్చిన మగపెళ్లి వాళ్లు అందరూ స్వీట్లు హాట్లు శుభ్రం గా తిని అమ్మాయిని మాట వరసకు నీ పేరు ఏమిట మ్మా అని ఒక ప్రశ్న అడిగి సంబంధం నచ్చిందని చెప్పే శారు. 



పెద్ద తలకాయ అతను శుభస్య శీఘ్రం అన్నాడు. 



ఇంకేముంది వెంటనే ఝాన్సీరాణి ని లోపలకు వెళ్ళి పోమన్నారు. పక్షంవాళ్ళు పక్షం వాళ్లు చాలాసేపు విషయాలు అన్నీ మాట్లాడేసుకుని పంతులు గారిని రప్పించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. 



కార్తీక మాసం మూడో సోమవారం పెళ్లి ముహూర్తం అని వచ్చిన ఎర్రయ్య సిద్ధాంతి గారి అబ్బాయి చెప్పి చక్క తన తాంబూలం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. 



విరగకాసిన మామిడి పూతలా అంతా బాగానే ఉంది కానీ అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది.. టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. 



మగ పెళ్లివాళ్ళు అందరూ వెళ్ళిపోయాక రాత్రి వరాలమ్మ నగిషి వర్కు టేకుచెక్క కుర్చీ మీద కూర్చుని తన చెల్లెలు వాళ్ళ ఆడపిల్లలు తన కూతుళ్లు వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు అందరూ చుట్టూ ఉంటుండగా తన గదిలో వ్రాసుకుంటున్న ఝాన్సీరాణి ని పిలిచింది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - బామ్మ వైరల్ అయ్యిందొచ్(బుడుగు) - by k3vv3 - 06-08-2025, 05:46 PM



Users browsing this thread: